Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అంతలో ముహూర్తానికి సమయం దగ్గరపడుతోంది పెళ్లికూతురు - పెళ్ళికొడుకుని ప్రవేశపెట్టాల్సినదిగా పెద్దలకు మనవి అంటూ పంతులుగారి మాటలు వినిపించాయి .
అంకుల్ : ఊహ తెలిసినప్పటి నుండీ " అన్నయ్య - తమ్ముడి " చేతులమీదుగా నా బంగారుతల్లికి కాదు కాదు నీ చెల్లికి ఒక్క సెలెబ్రేషన్ జరగలేదని బాధపడుతూనే ఉండేది - తోబుట్టవులా ప్రాణాలకు తెగించి తీసుకొచ్చి జరిపిస్తున్న ఈ శుభకార్యంతో తనతోపాటు మాకోరికనూ తీర్చబోతున్నావు - నువ్వు ఈ ఊరికే కాదు మా ఇంటికికూడా దేవుడివే .......
అంకుల్ ....... ఇది అన్నయ్యగా నా బాధ్యత ప్రాణాలకు తెగించయినా కాదు ప్రాణాలు .........
అంతే చెల్లెమ్మ - దేవత ఇద్దరూ నా నోటిని చేతులతో మూసేసారు , అన్నయ్యా - మహేష్ గారూ అలా అన్నారో మీ బుజ్జితల్లి నుండి దెబ్బలే .......
Ok ok ok ....... , అంకుల్ ...... మీరుకూడా ఆపండి మీరు మొదలెడితే చుట్టూ చూడండి ఎలా రెడీగా ఉన్నారో .........
అంకుల్ : అవునవును ........
పెద్దయ్యా ....... మీరు పెళ్ళికొడుకుని - అంకుల్ ...... మీరు చెల్లెమ్మ పెళ్లికూతురుని ...... , తమ్ముళ్లూ ....... వీడియో గ్రాఫర్ - కెమెరామెన్స్ ఎక్కడ ? .
తమ్ముళ్లు : At పొజిషన్స్ అన్నయ్యా ........

అంకుల్ : మాకంటే అన్నయ్యగా నువ్వు ...... మన బంగారుతల్లిని పిలుచుకువస్తేనే మాకు మరింత ఆనందం .
చెల్లెమ్మ : లవ్ యు నాన్నగారూ ....... అంటూ అంకుల్ - అంటీలను కౌగిలించుకునివచ్చి అన్నయ్యా - బుజ్జితల్లీ ....... అంటూ ఒక చేతితో నా చేతిని చుట్టేసి , మరొకచేతితో బుజ్జితల్లి చేతిని అందుకుంది . మావయ్యగారూ ...... ఆయనను , అక్కయ్య తీసుకొస్తే .......
పెద్దయ్య : అంతకంటే ఆనందమా తల్లీ ....... , తల్లీ మహీ .......
లవ్ యు చెల్లీ ...... అంటూ దేవత , కృష్ణను - చెల్లెమ్మను ..... నేను - బుజ్జితల్లి పిలుచుకుని పెళ్లిపీఠల దగ్గరికి తీసుకెళ్లాము .

పంతులుగారు : సమయం చూసి శుభం ...... , బాబూ మహేష్ - తల్లీ మహీ ........ముహూర్త సమయం 11:55 సరిగ్గా తీసుకొచ్చారు , ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు . 
చాలా చాలా సంతోషమైన మాట చెప్పారు పంతులుగారూ అంటూ సంతోషించి బుజ్జితల్లి బుజ్జిచేతిపై ముద్దుపెట్టాను .
చెల్లెమ్మ : మన బుజ్జితల్లికి మాత్రమేనన్నమాట ........
నో నో నో చెల్లెమ్మ ఇక్కడ ఓన్లీ హ్యాపీనెస్ నో అలక - బుంగమూతి అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
చెల్లెమ్మ అంతులేని ఆనందంతో కౌగిలించుకుని పంతులుగారు చెప్పడంతో పీఠలపై కూర్చున్నారు . 
పెద్దయ్య - అంకుల్ ....... కుటుంబం ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి .
ముత్తైదువులకు స్థానం వదిలి కిందకువచ్చి పెద్దలతోపాటు నించుకుని వేడుకను కనులారా వీక్షిస్తున్నాను - చెల్లెమ్మ కోరిక మేరకు బుజ్జితల్లిని ...... చెల్లెమ్మ ప్రక్కనే ఉండేలా చేసాను . అందుకుగానూ తియ్యనికోపంతో నావైపు చూస్తూనే చెల్లెమ్మకు ముద్దులుపెడుతూ - చెల్లెమ్మ నుండి ముద్దులుస్వీకరిస్తూ ఉండటం చూసి ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ఎంజాయ్ చేస్తున్నాను , దేవత - దేవత ఫ్రెండ్స్ ....... చుట్టూ ఉండి మండపానికే అందాన్ని తీసుకొస్తూ పంతులుగారు ఆడిగినవన్నీ అందిస్తూ చిరునవ్వులు చిందిస్తుండటం చూసి నా హృదయం పరవసించిపోతోంది .
ఒక ముహూర్తం ఆగినా పంతులుగారు ....... సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపిస్తున్నారు . పెళ్లికి వచ్చిన ప్రతీ ఒక్కరూ వీక్షించేలా చుట్టూ - వంట శాలలో చాలా స్క్రీన్స్ ఏర్పాటుచేయడం జరిగింది - కాలేజ్ పిల్లలు మాత్రం ముందువరుసలలోని VVIP ఛైర్స్ లో దర్జాగా కూర్చోవడం చూసి మరింత ఆనందం కలిగింది - ఆవిషయమై తమ్ముళ్లనూ అభినందించాను . 11:55 - 12:55 ముహూర్తంలోని మంచి ఘడియాలో పెద్దల ఆశీర్వాదంతో పంతులుగారి దగ్గరికి చేరిన తాళిని అందుకుని భాజాభజంత్రీల సమక్షంలో కృష్ణ లేచి సిగ్గుపడుతూనే yes yes yes థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా అంటూ అందరికీ చూయించి అంతే ఆనందిస్తున్న చెల్లెమ్మ మెడలో మూడుముళ్ళూ వేసాడు .
చెల్లెమ్మ : లవ్ యు శ్రీవారూ ....... , బుజ్జితల్లీ - అక్కయ్యా ....... అంటూ సంతోషంతో కౌగిలించుకుంది - మాఅన్నయ్య వల్లనే అంటూ ముగ్గురూ నావైపు ప్రాణంలా చూస్తున్నారు .
నో నో నో ఓన్లీ హ్యాపీనెస్ అంటూ అందరితోపాటు అక్షింతలు చల్లి గుండెలపై చేతినివేసుకుని ఆనందిస్తున్నాను .

మరొక గంటపాటు రెండు ఊళ్ల కుటుంబాలు ఒక్కొక్కరుగా స్టేజీపైకివెళ్లి అక్షింతలతో మరియు పెళ్లితో ఒక్కటయినట్లు పట్టుకున్న పూజ టెంకాయపై పాలు పోసి ఆశీర్వదించారు . 
సమయం అవ్వడంతో ఆశీర్వదించినవారిని భోజనాలవైపుకు పంపిస్తున్నారు తమ్ముళ్లు - అదేసమయంలో పంతులుగారు  పెళ్ళికొడుకు - పెళ్లికూతురితో పెళ్ళితరువాత జరిగే చిలిపి ఆటలను మొదలుపెట్టించారు .
దేవత : మహేష్ గారూ ....... ఎక్కడికి వెళుతున్నారు , భోజన ఏర్పాట్లు నాన్నవాళ్ళు - మీ భక్తులు చూసుకుంటారులే కానీ మీరు ఇక్కడే ఉండి వీక్షించండి ...... మీచెల్లి కోరిక ........
తమ్ముళ్లు : అన్నయ్యా ....... ఎవ్వరికీ ఏలోటూ లేకుండా చూసుకుంటాము మీరు ఉండండి - అయినా అరటిపండు వొలిచిమరీ ఇచ్చేసారు ఇక మేము చెయ్యడానికి ఏముంది అని గుసగుసలాడుతూ వెళ్లడం చూసి నవ్వుకున్నాను . చెల్లెమ్మ కోరిక - మరియు ఏర్పాట్లూ ....... రెండింటినీ బ్యాలన్స్ చేస్తూ ప్రతిఒక్కరూ అత్యద్భుతం అని మాట్లాడుకునేలా - పెద్దయ్య అంకుల్ వాళ్ళకు సూపర్ అని చెబుతుంటే చాలా చాలా ఆనందం వేస్తోంది .

మొదటి పంక్తి భోజనాలు పూర్తిచేసుకున్న అతిథులు బంధువులు ...... బయటకురావడంతో కృష్ణ - చెల్లెమ్మ ...... రిసెప్షన్ సూట్ - చీరలోకి మారి రాయల్ సోఫాలో చిరునవ్వులు చిందిస్తూ కూర్చోవడంతో ........ , కుటుంబంగా అతిథులు వచ్చి విషెస్ చెప్పి - గిఫ్ట్స్ ఇచ్చి ఫోటోలు తీసుకుని పెద్దయ్య - అంకుల్ వాళ్లకు వెళ్ళొస్తామని చెప్పి బయటకు నడుస్తున్నారు . 
లేచి పెద్దమ్మ - అంటీ మరియు దేవత - దేవత సిస్టర్స్ ను అతిథులు exit వైపుకు వెళ్లే మార్గం దగ్గరకు పిలుచుకునివెళ్లి అడ్డుగా వేసిన కర్టెన్ ను లాగాను - శిఖరంలా ఉన్న గిఫ్ట్స్ ను మీ బంధువులు ఊరిలోని ముత్తైదువులందరికీ ప్రేమతో ఇవ్వండి అనిచెప్పాను .
దేవత ఫ్రెండ్స్ : Wow ...... మహేష్ సర్ సూపర్ అంటూ పెద్దమ్మా వాళ్లకు సంతోషం అనిచెప్పి వెళుతున్న వారికి గిఫ్ట్ బాక్సస్ ఇచ్చి మురిసిపోతున్నారు .
గిఫ్ట్స్ అందుకున్న వాళ్ళందరూ గిఫ్ట్స్ లో ఏముందో చూడకుండా ఉండలేనట్లు exit దగ్గరే ఓపెన్ చేసి విలువైన పట్టుచీరలు ఉండటం చూసి ఒక్కొక్కరి ముఖాలను చూసుకుని షాక్ లో ఉండిపోయారు . Exit వరకూ వెళ్లినవారు పట్టుచీరలతోపాటు వెనక్కువచ్చి అమ్మా - పెద్దమ్మా - మహీ తల్లీ - మహీ ...... అంటూ బంధువులంతా సంతోషంతో థాంక్స్ చెప్పి , ఫంక్షన్ పూర్తయ్యేంతవరకూ బయటకు వెల్లమంటే వెళ్ళము అంటూ లోపలికివచ్చి కూర్చుని ఇక మొదలెట్టారు చీరల గురించి ముచ్చట్లు ....... వాళ్ళ వాళ్ళ భర్తలు ఇక ఇప్పట్లో పూర్తవదు అని ఫిక్స్ అయిపోయారు .

దేవత - దేవత ఫ్రెండ్స్ చూసి నవ్వుకున్నారు . ఒసేయ్ మహీ ....... పెళ్లికూతురు కట్టుకునే పట్టుచీరలే గిఫ్ట్ గా ఇస్తున్నాము ఎంత ఆనందం వేస్తోంది - మాకే ఇంత ఆనందం వేస్తోందంటే ఇక అందుకున్న మన వాళ్ళ ఆనందం వర్ణనాతీతం .......
దేవత : మీ మహేష్ సర్ గిఫ్ట్స్ ...... మై డియర్ ఫ్రెండ్స్ అంటూ గిఫ్ట్స్ ఇస్తూనే నాకోసం చూస్తోంది .
ఎవరికోసం చూస్తున్నారు మహిగారూ అంటూ ఎదురుగా వచ్చి నిలబడ్డాను .
దేవత ఫ్రెండ్స్ : మీకోసమే మహేష్ సర్ ........
నాకోసమా ...... ఆర్డర్ వెయ్యండి మహిగారూ , గిఫ్ట్స్ ఏమైనా తక్కువపడుతున్నాయా ? , చెప్పండి కాల్ చేశామంటే కంటైనర్ గిఫ్ట్స్ దిగిపోతాయి.
దేవత : నో నో నో ....... సరిపోతాయి , infact మిగులుతాయి , ఎక్కడికి వెళ్లిపోయారు అని చూస్తున్నాను .
ఓహ్ ఆదా ...... , అదిగో అక్కడ స్టేజీపై మీ బుజ్జితల్లి - చెల్లెమ్మ - కృష్ణ వాళ్లకు ఆకలివేస్తోందేమోనని ప్లేట్ లో రుచికరమైనవి వడ్డించుకునివచ్చాను , వాళ్ళు ఫోటోలు దిగే పనిలో ఉంటారు మీరు వెళ్లి తినిపిస్తే హ్యాపీ .........
దేవత : నా బుజ్జితల్లి అని ఆ బుజ్జిదెయ్యం ముందు అనలేదు అయిపోయేదానిని అంటూ నవ్వుకున్నారు - కన్న తల్లికి అనిపించలేదు so స్వీట్ ఆఫ్ యు మహేష్ గారు అంటూ ప్లేట్ అందుకుని వడివడిగా వెళ్లారు .
సిస్టర్స్ - పెద్దమ్మా - అంటీ ....... మీకు కూడా తీసుకొచ్చాను ఇద్దరిద్దరూ తింటూ గిఫ్ట్స్ పంచండి .
దేవత : అందుకే మీరు దేవుడయ్యారు అని తమ్ముళ్లు తీసుకొచ్చిన ప్లేట్స్ అందుకున్నారు .

అన్నయ్యా ....... మీకు తీసుకొస్తాము అని నో అనేలోపు వెళ్లిపోయారు . వెళ్లి చెల్లెమ్మ ఎదురుగా కింద ఉన్న సోఫాలో కూర్చుని చూసి ఆనందిస్తున్నాను .
దేవత వెనుక నిలబడి ఫొటోస్ గ్యాప్ లో ముగ్గురికీ తినిపిస్తోంది - అక్కయ్యా ...... మీరు అంటూ తినేదాకా వదలలేదు చెల్లెమ్మ .
చెల్లెమ్మా ....... లవ్ యు అంటూ హృదయం పై చేతినివేసుకున్నాను .
అంతలో తమ్ముళ్లు తమతోపాటు నాకూ వడ్డించుకునివచ్చారు - తమ్ముళ్లూ ....... మీ అక్కయ్యకు ఇచ్చిరావాలి ప్లేట్ లో అయిపోయిందేమో అని లేవబోతే నా ప్లేట్ అందుకునివెళ్లి ఇచ్చివచ్చి మరొక ప్లేట్ వడ్డించుకునివచ్చారు .

బుజ్జితల్లి : అత్తయ్యా ....... డా ..... అంకుల్ తోపాటు తింటాను అని చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టి పరుగునవచ్చి , మామూలుగా నా ఒడిలో కాకుండా ప్రక్కన సోఫాలో కూర్చుంది .
ప్చ్ ....... అంతా ఈ గాయమే చేసింది - ఒసేయ్ గాయమా త్వరగా నయమైపోయి , నా బుజ్జితల్లిని నా గుండెలపైకి చేర్చు లేకపోతే ........
ఉమ్మా డాడీ అంటూ నాబుగ్గపై ముద్దుపెట్టి బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుతోంది నా బుజ్జితల్లి - డాడీ ...... ఆకలేస్తోంది , అదిగో మమ్మీ ....... పదే పదే వాళ్ళ చెల్లికి - తమ్ముడికి తినిపిస్తోంది తప్ప నాకు తినిపించనేలేదు .
దేవత : పోవే బుజ్జిదెయ్యం ...... , మీ అంకుల్ తినిపిస్తారు కదా బాగా తిను అని చెల్లెమ్మ - కృష్ణతోపాటు నవ్వుకున్నారు .
సంతోషంతో నవ్వుకుని , బుజ్జితల్లికి తినిపించి నేనూ తిన్నాను .
బుజ్జితల్లి : మా డాడీకి గాయం అయ్యింది కాబట్టి నేనే తినిపిస్తాను అని పరుగునవెళ్లి చేతులు కడుక్కునివచ్చి నాకు తినిపించి తను తింది .
చెల్లెమ్మ : బుజ్జితల్లీ ....... లవ్ యు - రాత్రికి ఆ అదృష్టం నాది నేను తినిపిస్తాను .
( వెనుక దేవత అయితే మరి ఆ అదృష్టం నాకులేదా అని ఆశగా చూస్తుండటం చూసి , అక్కయ్యా ....... భోజనమే కాదు తియ్యనైనవి - మధురమైనవి చాలానే రుచి చూసేలా ప్లాన్ ఉందిలే అంటూ ముద్దుపెట్టింది చెల్లి .......
దేవత : లవ్ యు చెల్లీ ....... అంటూ సిగ్గుపడ్డారు .
చెల్లెమ్మ : మావయ్యగారు చెప్పినట్లు రుణం తీర్చుకోవడం కోసం ఎంత తహతహలాడిపోతున్నారో నాకు తెలుసులే అక్కయ్యా ....... , మీ రుణం తీరేలా చూసే బాధ్యత నాదీ ........ ) .

మొబైల్ రింగ్ అవ్వడంతో తీసాను .
బుజ్జితల్లి : డాడీ ....... స్క్రీన్ పై వేరే ఫ్లాగ్ ఉంది .
కాల్ అమెరికా నుండి వచ్చింది బుజ్జితల్లీ , ఇది అమెరికన్ ఫ్లాగ్ , my బాస్ కం ఫ్రెండ్ from అమెరికా - మంత్లీ ఒకసారి వెళుతుంటాడు వెళ్ళినప్పుడు ఈ నెంబర్ నుండి చేస్తాడు అని కట్ చేసాను .
వినయ్ : అన్నయ్యా ...... అమెరికా నుండి అంటే ముఖ్యమైనది అయి ఉంటుందేమో .........
మనకు ఇప్పుడు చెల్లెమ్మ ఫంక్షన్ - మనబుజ్జితల్లి సంతోషం తప్ప ఏదీ ముఖ్యమైనది కాదు అంటూ మళ్లీ రింగ్ అయినా కట్ చేసాను .
బుజ్జితల్లి : లవ్ యు లవ్ యు sooooo మచ్ డాడీ ........
లవ్ యు మై లిటిల్ ఏంజెల్ ఉమ్మా ...... , మళ్లీ రింగ్ అవ్వడంతో కట్ చేయబోతే ....... 
బుజ్జితల్లి ఆపి ఊ అంది .
నా బుజ్జితల్లి ఆజ్ఞ అంటూ ఎత్తాను .

" హలో మహేష్ మహేష్ ........ "
హలో ఏంటి బాస్ ...... కట్ చేస్తుంటే బిజీగా ఉన్నట్లు అని తెలుసుకదా .......
" sorry sorry మై ఫ్రెండ్ ...... ఒక్క నిమిషం ఓకేఒక్కనిమిషం " 
చెప్పండి బాస్ .......
" వైజాగ్ వెళ్లి 3-4 డేస్ అయ్యాయి , మన న్యూ ఆఫీస్ దగ్గరికి ఒక్కసారైనా వెళ్లలేదని తెలిసింది , అక్కడ అందరూ నీకోసమే ఎదురుచూస్తున్నారు , ఎల్లుండి నైట్ న్యూ బ్రాంచ్ ప్రారంభోత్సవం కదా నీకు ఎప్పుడు వీలౌతుందో చెబితే ...... అదే ఫైనల్ ఇన్స్పెక్షన్ కోసం " 
నో నో నో బాస్ ....... sorry to say this నేను జాబ్ మానేస్తున్నాను - నా డెస్టినీ ఏమిటో ఆ దుర్గమ్మ తల్లి చూయించింది - అమెరికాలో ఉన్న బడా వ్యక్తులను మరింత ఎత్తుకు తీసుకువెళ్లడం కోసం మనం పనిచెయ్యడం నాకిష్టం లేదు - ఇక్కడ మన గ్రామాలలోని రైతులకు నావంతు సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను - ఈ నిర్ణయం మీకు నచ్చదు కానీ తప్పదు ఇక నాకు కాల్ చెయ్యకండి - మీరిచ్చిన డబ్బుతోనే ఇక్కడివారి పెదాలపై చిరునవ్వులు పూయిస్తున్నాను మీకు థాంక్స్- ఆడబ్బు అయిపోయాక నేనూ శ్రమిస్తాను - ప్రతీ రైతు కళ్ళల్లో చిరునవ్వు చూడాలి అంతకంటే నాకు మరొక ఆశ లేదు - గుడ్ బై సర్ అంటూ కట్ చేసాను . బుజ్జితల్లి గోరుముద్దలు తింటూ మరొక రెండుసార్లు రింగ్ అయినా కట్ చెయ్యడంతో మళ్లీ చెయ్యలేదు .
తమ్ముళ్లు : అన్నయ్యా ....... మాకోసం .
నా బుజ్జితల్లి నుదుటిపై ముద్దుపెట్టి , మనందరికోసం తమ్ముళ్లూ ....... మీరు దండాలు స్టార్ట్ చెయ్యకండి అంటూ అందరమూ నవ్వుకుని తృప్తిగా భోజనం చేసాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 16-12-2021, 09:42 AM



Users browsing this thread: 195 Guest(s)