02-11-2021, 08:13 PM
కిషోర్ శ్రీధర్ ఇద్దరు ఫ్యాక్టరీ కి చేరుకొని, ఇద్దరు కలిసి అడ్మిన్స్ సెక్షన్ కి వెళ్ళేటప్పటికి శ్రీకాంత్ పెద్దాయన రూమ్ లోంచి విసురుగా బయటకి వస్తూ కిషోర్ శ్రీధర్ లవైపు కోపంగా చూసుకుంటూ రుసరుసలాడుతూ బయటకి వెళ్ళిపోయాడు. శ్రీధర్ కిషోర్ వైపు చూసి ఏమైంది, వాడు ఆలా కోపంగా వెళ్తున్నాడు అన్నాడు. ఏముంది పెద్దాయన కోటింగ్ ఇచ్చింటాడు. సరే విషయమెంటో కనుక్కుందాం పద అంటూ తన రూమ్ లోకి వెళ్లి బ్యాగ్ పెట్టేసి ఇద్దరు కలిసి పెద్దాయన రూమ్ లోకి వెళ్లారు. రూమ్ లో కేశవరావు అలియాస్ మన పెద్దయన, ఆకాష్ ఇద్దరు ఉన్నారు. కిషోర్ లోపలికి వెళ్తూ హాయ్ అంకుల్ ఎలాఉన్నారు అని పలకరిస్తూ ఆకాష్ పక్కన కూర్చుంటూ, ఏమయిందిరా అని చిన్నగా ఆకాష్ ని అడిగాడు కిషోర్. శ్రీధర్ పక్కనే నుంచొని చూస్తున్నాడు. వెంటనే కేశవరావు కలగచేసుకుని రేయ్ కిషోర్ ఆ శ్రీకాంత్ గాడి షేర్ వాల్యూస్ సెటిల్ చెయ్యి ఇమిడియట్ గ, మంత్ ఎండింగ్ కల్లా వాడి షేర్ 10% మనం వెనక్కి తీసేసుకుంటున్నాం. వాడికి ఇయర్ ఎండింగ్ కల్లా షేర్ అమౌంట్ రెండు టర్మ్స్ లో రిటర్న్ చేసెయ్యాలి. పేపర్స్ రెడీ చేయించు అన్నాడు కోపంగా. ఓకే అంకుల్ అసలు ఏంజరిగింది అన్నాడు కిషోర్. అవన్నీ ఆకాష్ తో మాట్లాడుకో... అన్నట్టు ఇంకోవిషయం, నువ్వు చాల కాలంగా అడుగుతున్నావుగా శ్రీధర్ కి పార్ట్నర్షిప్ ఇచ్చి బోర్డమేమ్బెర్ ని చేద్దాం అని. సో ఆ షేర్స్ శ్రీధర్ పేరుమీదకి ట్రాన్స్ఫర్ చేసి వాడిని బోర్డుమెంబర్ని చేస్తున్నట్టు పేపర్స్ రెడీ చెయ్యి అన్నాడు కేశవరావు. పక్కనే నుంచొని వింటున్న శ్రీధర్ కి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఉదయాన్నే రెండో షాక్ శ్రీధర్ కి. శ్రీధర్ కంగారుపడుతూ కిషోర్ వైపు చూసాడు. కిషోర్ శ్రీధర్ వైపు చూసి కంగారుపడకు అని కళ్ళతోనే సైగ చేసి కేశవరావు వైపు చూసి, అంకుల్ ఇంత ఇమిడియట్ గ అంత పేమెంట్ అంటే... అన్నాడు కిషోర్.
రేయ్ మీరందరు ఫ్రెండ్స్ అని నేను ఈ ప్రపోసల్ కి ఒప్పుకోలేదు. బిజినెస్ పరంగా నాకు నమ్మకమైన మనుషులు కావాలి, శ్రీధర్ ని పది సంవత్సరాలుగా చూస్తున్నాను, నీలాగే వీడు కూడా నమ్మకమైనవాడు. ఏపని చేసిన సొంతపనిలాగా కష్టపడతాడు. పైగా మీ ఫ్రెండ్షిప్ గురుంచి తెలిసినవాడిగా ఈ నిర్ణయం తీసుకున్నాను. అండ్ మీరు ఏమి చేస్తారో ఎలా చేస్తారో తెలియదు మంత్ ఎండింగ్ కాళ్ళ వాడి షేర్ వేల్యూ లో 50% పేమెంట్ జరిగిపోవాలి. అప్పటివరకు హానరరీ మెంబర్షిప్ లో ఉంటాడు శ్రీధర్, ఇట్స్ ఫైనల్ అంటూ టేబుల్ మీద ఉన్న బెల్ కొట్టాడు. వెంటనే సెక్రటరీ సుమిత్ర లోపలికివచ్చింది. పెద్దాయన సుమిత్ర వైపు చూసి, వెంటనే శ్రీధర్ కి ఫ్యాక్టరీలో ఉన్న అల్ సెక్షన్స్ కి యాక్సిస్ క్రియేట్ చేసి అందరికి పరిచయం చెయ్యి, ఆల్ సెక్షన్స్ కి సంబంధించి ఈ మంత్ ఎండింగ్ లోపల నాలెడ్జి ట్రాన్స్ఫర్ అండ్ ట్రైనింగ్ షెడ్యూల్ చెయ్యి, అన్నాడు. సుమిత్ర ఒకే సర్ సర్క్యూలర్ రెడీ చేశాను మీరు ఒక సైన్ చెయ్యాలి అంటూ తనతో తెచ్చిన ఫైల్ లోంచి లెటర్ హాడ్ మీద ప్రింట్ చేసిన సర్కులర్ ని కేశవరావు కి ఇచ్చింది సుమిత్ర. శ్రీధర్ కి షాక్ లు మీద షాక్ లు తగులుతుండటంతో అలాగే నిలబడి చూస్తున్నాడు. కేశవరావు పేపర్ అందుకొని సంతకం చెయ్యబోతూ శ్రీధర్ ని పిలిచాడు. శ్రీధర్ తత్తరపడుతూ కేశవరావు వైపు చూసాడు. మీరు ఇప్పుడు ఎంప్లొయ్ మాత్రమే కాదు, ఈ కంపెనీ కి కాబోయే పార్టనర్, ఇకమీదట ఇలా నుంచోవాల్సిన పనిలేదు ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు. శ్రీధర్ ఇంకా బెదురు బెదురుగా చూస్తుంటే... పక్కనే ఉన్న ఆకాష్ శ్రీధర్ చెయ్యి పట్టుకొని లాగి తన పక్కన కుర్చోపెట్టుకున్నాడు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండటంని అదృష్టంరా శ్రీధర్ అంటూ సర్క్యూలర్ మీద సైన్ చేసి సుమిత్ర కి ఇచ్చాడు కేశవరావు. కిషోర్ పైకి లేచి కేశవరావు చెయ్యి పట్టుకొని తాంక్స్ అంకుల్ అన్నాడు. తాంక్స్ చెప్పుకోవటానికి ఇది ఫ్రెండ్షిప్ మాత్రమేకాదు, బిసినెస్, వన్ మంత్ లో ఫస్ట్ టర్మ్ పేమెంట్ తరువాత సెకండ్ క్వార్టర్ ఎడింగ్ కాళ్ళ ఫైనల్ పేమెంట్, ఇవి రెండు కంప్లీట్ చెయ్యాలి అప్పుడే నేను హ్యాపీ అన్నాడు కేశవరావు. కచ్చితంగా అంకుల్ డెఫినెట్ గ విల్ రీచ్ ది గోల్ అన్నాడు కిషోర్. థట్స్ ఫైన్ ఇంక పోండి పోయి పనులు చూస్కోండి, మిగతా విషయాలు ఆకాష్ తో డిస్కస్ చేసుకోండి పోండి... గెట్ అవుట్... అన్నాడు కేశవరావు.
ముగ్గురు ఫాస్ట్ గ పెద్దాయన ఛాంబర్ లోంచి బయటకి వచ్చి ఛాంబర్ తలుపేసి, కిషోర్ రూమ్ లోకి వచ్చారు. ముగ్గురు ఒకరినొకరు చూసుకొని ఒక్కసారిగా హుర్రే అని అరుస్తూ ముగ్గురు ఒకనికరి వాటేసుకొని గుండ్రంగా తిరుగుతూ గెంతుతూ వెళ్లి సోఫాలో ఒకళ్ళమీద ఒకళ్ళు పడ్డారు. హమ్మా ఒరేయ్ పెద్దాయన ఉరుములు మెరుపులు పుంట్టించి చివర్లో మాత్రం చల్లగా ప్రేమ వర్షం కురిపిస్తాడురా అన్నాడు కిషోర్. అరేయ్ అసలు నాకేం అర్థం కావటంలేదు కొంచెం మొదటినించి చెప్పండ్రా అన్నాడు శ్రీధర్. సార్ శ్రీధర్ సార్ మీరు ఇప్పుడు మన ఫుడ్ ప్రొడక్ట్స్ లో పార్ట్నర్ సర్, మీ రేంజ్ కి తగ్గట్టు సాయంత్రం పార్టీ ఆరంజ్ చెయ్యండి మొత్తం అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు ఆకాష్.
అంతలో సుమిత్ర సడన్గా లోపలి వచ్చి, సోఫాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఉన్న ముగ్గురుని చూసి టక్కుమని వెనక్కి తిరిగి నుంచుంది. సుమిత్ర ఇక్కడేమి బూతు జరగటంలేదులే ఇటు తిరుగు అంటూ ముగ్గురు లేచి సోఫాలో కూర్చున్నారు. సర్ ప్లాంట్ కి వెళ్ళాలి, శ్రీధర్ సర్ కి ఈరోజునుంచే ట్రైనింగ్ అని చెప్పింది. వెంటనే కిషోర్ లేచి శ్రీధర్ ని పైకి లేపి తన రూమ్ లో కప్బోర్డు లో ఉన్న బ్లెజెర్ తీసి శ్రీధర్ కి ఇచ్చి అల్ ది బెస్ట్ ర వేళ్ళు ఇంక సుమిత్ర ని తాట తీస్తది ఈ నెలరోజులు అన్నాడు. అంతలో ఆకాష్ కూడా శ్రీధర్ కి అల్ ది బెస్ట్ చెప్పి, సుమిత్ర వైపు తిరిగి, కొంచెం సున్నితంగా నేర్పించమ్మ మావాడు అసలే కొత్త అన్నాడు డబల్ మీనింగ్ తో. సుమిత్ర చిన్నగా నవ్వుకుంటూ సర్ రండి వెళదాం అంది. కిషోర్ కి శ్రీధర్ కి బాయ్ చెప్పి సుమిత్ర వెనకాలే వెళ్ళాడు శ్రీధర్. తాను రోజు చూసే ప్లాంట్, తాను రోజు చూసే ఫ్యాక్టరీ తాను రోజు తిరిగే ప్రదేశాలు ఈరోజు చాలా కొత్తగా కనిపించాయి శ్రీధర్ కి.