26-04-2019, 01:41 PM
రెండు మూడు రోజుల దాకా ధీర్గత్ మనిషి కాలేక పోయాడు. వొళ్ళంతా గాజు పెంకులతోనూ ముళ్ళతోనూ చీరేసినట్టుగా గాట్లు పడున్నాయి. తొడల మీదా ,గజ్జెల్లోనూ చాలా హింసలకు గురి చేసినట్లుగా గాయాలు వాడిని సరిగ్గా పడుకొనిచ్చేవి కాదు.నిద్దురలో అమ్మా అంటూ ఉలిక్కిపడి లేచి వణికి పోతూ ఉండ వాడు.
సుకృత తింతానికి ఏదైనా ఇస్తే దిగాలుగా పిచ్చి చూపులు చూస్తూ గబా గబా మింగేసే వాడు.
వాడు సహజ స్థ్తికి వచ్చేంత వరకూ వాడినే కనిపెట్టుకొని ఉంది సుకృత.
వాడు కోలుకొని తను అడక్కుండానే అన్నీ చెప్పేసాడు. ఎవిడెన్స్ దొరక కుండా నాన్న శవాన్ని ముక్కలు ముక్కలు చేసి సముద్రంలో విసిరేసారని, తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి అంగీకరించిన తనను భారత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయాలని చెప్పి, ఇంతలో ప్రభుత్వ ప్రకటన రావడంతో వారే తనను ఇక్కడ వదిలేసి వెళ్లారని చెప్పాడు.
పెదవి చాటున దుఖాన్ని అదిమిపెట్టుకొని వాడికి సపర్యలు చేసింది.
వారం పది రోజుల తరువాత ధీర్గత్ మామూలు మనిషైయ్యాడు.వాడు పూర్తిగా కోలుకొన్న తరువాత ఏం చేయాలో మాట్లాడు కొంటూ. .
ధీరూ జరిగి పోయిన దంతా మరచిపోదాం.ఇప్పుడు మనం చేయవలసింది ముందుగా అమ్మ, హవ్యక్ ల గురించి తెలుసుకోవడం, ఆ తరువాత నాన్న కు ఈ గతి పట్టించిన వారి మీద పగ తీర్చుకోవడం. దానికి ఏం చేయాలో చెప్పు.
ధీర్గత్ వెన్నులో నుండి వణుకు బయలు దేరింది. వాళ్ళకు అనుకూలంగా ఉంటానికి ఒప్పుకొన్న తననే చిత్ర హింసలు పెట్టి దాదాపు చంపినంత పని చేసారు.ఇప్పుడు వారిని వెదకి పగ తీర్చుకొవడానికి వెళితే నాన్నకు పట్టిన గతే తనకూ పడుతుందేమోనని భయపడిపోయాడు.
వాడి మౌనాన్ని గమనించి ఏరా భయపడుతున్నావా?
అవునే నువ్వూ చూసావుగా . . వాళ్ళు ఎంత క్రూరంగా ఉండేవారో ఇప్పుడు వాళ్ళని వెదకి పట్టుకోవడమే పెద్ద పని అలాంటప్పుడు వాళ్ళని వెదకి పట్టుకొని కక్ష సాధిణాలంటే మాటలా
..సరే ఆ పని తాత్కాలికంగా వాయిదా వేద్దాం. వారి సైనిక స్థావరాలకు కావాల్సిన సరుకులను ఈ దీవుల నుండే రవాణా చేస్తారని విన్నాను. అమ్మా వాళ్ళు కూడా ఇటువైపే పారిపోయి వచ్చారని విన్నాను. కాబట్టి ఆ దిశగా ప్రయత్నిస్తే రెండు పనులూ ఒకే సారి పూర్తి చెయవచ్చు. ఈలోగా ఇండియాలో గవర్నమ్నెట్ ఇచ్చే ప్రకటన్ చూసి మనం ఏం చేయాలో నిర్ణ్యించుకోవచ్చు.
ఈ ఆలోచన ధీర్గత్ కు కొద్దిగా సేఫ్ అనిపించింది. సరేనని ఓడరేవు వైపు వెళ్లారిద్దరూ. .
వారు ఓడరేవు దగ్గరికెళ్ళేసరికి అక్కడున్న ఇండియన్స్ అంతా ఏకమై తమను ఇండియా పంపెయ్యమని ధర్నా చేస్తున్నారు.వారంతా పనుల మీద ఇక్కడికొచ్చినవారే కొంత మంది ఇక్కడే శాశ్వతంగా నిలిచిపోతే ఇంకొంత మంది ఓడల్లో పని చేస్తూ అంతో ఇంతో సంపాదించుకొని తమ వూళ్లకు పోవాలని చూస్తున్నవారు.
ఐతే యూరోప్ దేసాలు ఆయా దీవులను తమ సైనిక స్థావరాలుగా తమ గుప్పెట్లో ఉంచుకోవడం వల్లా అక్కడున్న వారు అక్కడే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు కొత్తగా స్వాతంత్ర్యం సాధించుకొన్న దేశాలు తమ ప్రజలను వెనక్కి పిలిపించుకొంటున్నాయి. అందులో ఈ ఇండియన్స్ కూడా ఆవిధంగా ప్రేరేపణ పొందిన వారే.
సుకృత వాళ్లందరినీ గమనిస్తూ ఓడరేవు వెనుక భాగానికి పోయారు. వాళ్లకు కొద్ది దూరం లో ఒకతను సైనికులకు చిక్కి పోవడం తో అతనిని దారుణంగా కొడుతూ ఈడ్చుకుపోతున్నారు.
అతను హృదయ విదారకంగా అరుస్తూ ఉన్నా కూడా కనికరం లేకుండా చితక బాదుతూ ఉన్నారు.
ఎవరికంటా పడకుండా నక్కి నక్కి వెళ్ళి ఆ సైనికుల గదిలోనికి చూసారు. ఆ వ్యక్తిని ఓ చోట కుదేసి ఉన్నారు. ఆ వ్యక్తి భాదగా మూలుగుతూ ఉంటే , బూటు కాళ్లతో తన్నుతున్నాడో సిపాయి. అతడి ప్రక్కన ఇంకో కమాండర్ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. అతడి మాటలు బట్టి ఆ వ్యక్తిని ఇంకాసేపటిలో ఏదో రహస్య స్థలానికి తీసుకెడుతున్నట్లుగా అర్థం అయ్యింది.
సుకృత,ధీర్గత్ లిద్దరూ చప్పుడు కాకుండా వెనక్కి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండ అక్కడే హాల్ట్ చేసి ఉన్న ఓడలోనికెళ్ళి అంతా గమనించసాగారు.
సుమారు ఓ గంట తరువాత ఆ వ్యక్తిని ఇసుక మూటలా ఈడ్చుకొంటూ వచ్చి వీళ్ళున్న ఓడ వైపే రాసాగారు. ధీర్గత్ భయంతో కొయ్యబారిపోతూ పారిపోబోయాడు.
సుకృత వాడిని బలవంతంగా పట్టుకొని ఆపి , లాక్కొని ఓడ బాల్కనీలోనికె తీసుకెళ్ళింది. వర్షాకాలం కాబట్టి ఓడ బాల్కనీలోనికి అంతగా ఎవరూ రారు.
అది ఊహించింది కాబట్టే ఆమె అనుకొన్నట్టుగా ఎవరూ రాలేదు. కాని వర్షం ఈడ్చి ఈడ్చి కొట్టసాగింది. సముద్రంలో ఓడ కొంత దూరం వెళ్ళిన తరువాత అలలు తగ్గి నిండుగా తొణుకుతున్న ప్రాంతంలో నిలిచింది. అలలు తగ్గి పోయిన తరువాత సముద్రం నిండుగా ఉండి చిన్నగా పైకి లేస్తూ గుండెలు అవిసిపోయేలా చేస్తోంది.ఆ నిండుదనానికి ఓడ అటూ ఇటూ ఊగుతోంది. కొంత సేపటికి దూరం నుండి కొంత మంది సైనికులతో ఉన్న ఒక లైఫ్ బోటులో హాల్దియా రావడం కనిపించింది.

కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.