26-04-2019, 01:37 PM
మరో మూదు రోజుల తరువాత పేపరులో ఆ ఆఫీసరు దుర్మరణం గురించి చదివింది.ప్రమాదంలో చనిపోయినట్టుగా అందులో రాసి ఉంది, అంటే వాడిని ఎవరు చంపారో అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యిందన్న మాట అని నిర్ధారించుకొని గుండె రాయి చేసుకొంది. తమను భందించి ఉన్న బంగళాను ఎప్పుడో ఖాళీ చేయడం వల్ల బుడత కీచుల రహస్య సైనిక స్థావరాలెక్కువ గా ఉన్న దీవుల గురించి సమాచారాన్ని,జనరల్ హాల్దియా ఎక్కడెక్కడ ఉంటుందో రహస్యంగా తెలుసుకోసాగింది.
అలా తను రహస్యంగా ప్రయత్నాలను మొదలు పెట్టిన సుకృతకు ఆరోజు వార్తా పేపరులోని ఒక వార్త అమితంగా అకర్షించింది.భారత్ సైన్యాలు పోర్చుగీసు సైన్యాలతో పోరాడుతూ వారి యుద్ధ నౌకలను ముంచివేయడం జరిగిందనీ అందువల్ల ఇప్పటికిప్పుడు యుద్ధ సామాగ్రిని సమకూర్చవడంలో విఫలమైన పోర్చుగీసు వారు తాత్కాలింగా వెనక్కి తగ్గి నాటో దళాల సహాయం కోరిందని తెల్సింది.
సుకృత మెదడు చాలా చురుగా పని చేసింది. తన చ్గుట్టూ జరుగుతున్న పరిణామాలను ఒక్క సారి మననం చేసుకొంది. పోర్చుగీసువారి పాలనలో ఉన్న అన్ని సముద్ర తీర ప్రాంతాల్లో కూడా స్థానికంగా తిరుగుబాటులు పెరుగుతున్నాయి. అక్కడున్న బుడత కీచు వారు తమ దుకాణాలను హోటెళ్ళను అందిన కాడికి అమ్ముకొని తమ దేశం తిరిగి వెళ్ళిపోతున్నారు.కొంత మంది తమకు నమ్మకస్తులకు దానంగా ఇచ్చి వెళ్ళిపోయారు.మరి కొంత మంది శాశ్వత భారత పౌరసత్వాన్ని కోరుతూ దరఖాస్తు చేసుకొంటున్నారు. ఇదంతా చూస్తుంటే తొందరలోనే బుదత కీచులు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం ఖాయం.
తాను ఇప్పుడు గనక తొందరపడకపోతే శాశ్వతంగా తన వారిని చేరుకోలేదు.. . .అని నిర్ణయించుకొని,హిప్పీల మాదిరిగా డ్రెస్సింగ్ చేసుకొని దగ్గరలోని పబ్లిక్ రిలేషన్ ఆఫీసు దగ్గరికెళ్ళింది.ఆఫీసు దాదాపు ఖాళీగా కనిపిస్తోంది. ఫ్రంట్ ఆఫీసులో ఒకామె ఏదో పుస్తకం చదువుతూ కూచొంది.
అలా హిప్పీ డ్రస్సులో ఉన్న ఈమెను చూడగానె ఆమె దేవుడా అని తల పట్టుకొంది. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు ఈ హిప్పీల వల్ల పెద్ద తలనెప్పి, రాత్రంతా వావివరుసలు లేకుండా తాగితందనాలాట్టం, ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం విడిపోవడం. మళ్ళీ రెండు మూడు రోజులకుఇలా ఆఫీసులకు రావడం తమ వారి గురించి వాకబు చేయడం మామూలే. కాకపోతే ఎవరు ఎవరికి పుట్టి ఏ విధమైన సంబంధం కలిగి ఉంటారో వారికే తెలియదు.అలా తలాతోక లేకుండా వారి వివరాలు ఏ విధంగా నోట్ చేసుకోవాలో పెద్ద తల నెప్పి.అందుకే ఆమె ఈమె రాంగానే వచ్చేసరికి,ఈమెను ఎప్పుడెప్పుడు పంపంచేయాలా అనే తొందరలో ఆమె అడిగిన దానికి టక టకా సమాధానలిచ్చేసింది. ఆమెను అలా మాటల్లో బెట్టి ప్రస్తుతం ఏయే ప్రాంతాల్లో సరుకులు లోడింగ్ అన్లోడింగ్ అవుతున్నాయో తెలుసుకొని వెళ్ళిపోయింది.
ఇతర దీవులకు కావాల్సిన సరుకుల రవాణాకు ప్రైవేట్ గా కొన్ని ప్రాంతాల నుండి ఓడలు బయలు దేరుతూ ఉంటాయి. ఆలాంటి చోట్లలో ఒకరిన్రి గురించిన సమచారం ఠక్కున తెలిసిపోతుంది.అందుకే సుకృత హిప్పీల మాదిరిగా వేశం మార్చుకొని ఆ చోటుకెళ్ళింది. ఈమె రాంగానే చాలా మంది విజిల్స్ వేస్తూ సైగ చేయసాగారు.కొంత మంది తమ చిన్న పదవలను చూపుతూ బోటులో షికారు కెళదాం రమ్మని బిగ్గరగా అరవసాగారు.అక్కడున్న ఆడవారు కూదా ఈమెను చూసి రమ్మని పిలవసాగారు. హిప్పీల సంస్కృతి అలాoటిదని ముందే ఊహించిన సుకృత చిరునవ్వుతో అందరినీ సుతారంగా కాదంటూ దూరంగా ఉన్న ఒక బోటు దగ్గరకెళ్లి నిలబడి చుట్టౌ చూసింది. అందులో పని చేస్తున్న ఒక ముసలి వ్యక్తి పైనుండి వికిల్ వేసి పైకి రమ్మన్నాడు.
ఆమె బోటు పైకి ఎక్కదం మొదలవగానే ఎవరికి వారు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే హిప్పీలు ఎవరిని ఎంచుకొంటారో వారితోనే ఆ రాత్రంతా ఉండిపోతారు. వారిచ్చిన డబ్బూ తీసుకొని వెళ్ళిపోతారు.కాదూ కూడదని జబర్దస్తీ చేయబోతే దండు దండే వచ్చి అంతా చెల్ల చెదురు చేసి పోతారు. ఆ విశయం అక్కడున్న వారందరికీ తెలుసు కాబట్టి గమ్మనుండి పోయారు.
ఆ వ్యక్తి ఈమెను దగ్గరికి తెసుకోవడంతోనే నీరుగారిపోయాడు.అతడి ద్వారా తమ వారి గురించి అడుగుతూ తమ దండులోని ధీర్గత్ అనే ఒక ఇండియన్ ను సైన్యం పట్టుకెళ్ళిందని వాడి గురించి ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వమని అడిగింది. అతను అనుమానంగా చూస్తుంటే అతడి గడ్డం పట్టుకొని అతడు తన పర్మనెంట్ మేట్ అని చెప్పి కన్వినెన్స్ చేసింది.అతను చాలా సేపు తల గోక్కుంటూ ఆలోచించి ఒక వ్యక్తిని పోర్చుగీసు సైన్యం చిన్న బోటులో మైక్రోనేషియా ఐల్యాండ్స్ వైపు తీసుకెళ్ళదం చూసానని చెప్పాడు.అతడి గరుకు గడ్డాన్ని ముద్దుపెట్టుకొని తనను అక్కడకు తీసుకెళ్ళగలవా అని అభర్థించింది.
డంగ్ అయిపోయిన ఆ ముసలాయన ఆ రాత్రికి రహస్యంగా రాగలిగితే తీసుకెళ్ళగలనని మాటిచ్చాడు.
అలా సుకృత మైక్రోనేషియాలో కాలు పెట్టింది.
కాలు పెట్టీ పెట్టగానే పిచ్చివాడిలా తిరుగుతున్న ధీర్గత్ ను చూసింది. ఎవరికీ అనుమానం రాకుండా వాడినే గమనిస్తూ దగ్గర్లో ఉన్న ఒక ఒపెన్ కాటేజీని అద్దెకు తీసుకొని అందులో దిగిపోయింది.ఇలా ట్రావెలర్స్ రావడం వచ్చి కొన్నాళ్ళు ఎంజాయ్ చేసి పోవడం అక్కడి దీవి ప్రజలకు మామూలే అందుకే పెద్దగా ఈమె గురించిన వివరాలు అడగలేదు.
తన మీద నిఘా కొద్దిగా తగ్గిన తరువాత ఈమె మళ్ళీ వీధుల్లో పడి ధీర్గత్ ను కనుక్కోగలిగింది. రెండు రోజుల నుండి తిండీ తీర్థం ఏమీ లేక అల్లాడిపోతున్న ధీర్గత్ ఈమను చూడ గానే ముందు గుర్తుపట్తలేదు. హిప్పీల లాగా తల కట్టు ఒళ్ళు కనీకనిపించకుండా వేశధారన, చేతులనిండా పూసల దందలు టాట్టూలు ,ఒంటి నుండి వస్తున్న ఆల్కహాల్ వాసన చుట్టల కంపు ఈమెను అస్సలు పోల్చుకోకుండా చేస్తున్నాయి. సారీ మేం అంటూ ముందుకెళ్లబోయాడు. అన్నయ్యా అంది చిన్న గా వాడికి వినిపించేలా
ఆమె గొంతు చటుక్కున గుర్తుపట్టేసాడు.
సుక్కూ అంటూ పెద్దగా అరిచేసాడు.
వాడిని ఆ ఉద్వేగాన్నుండి కూల్ చేస్తూ తనతో తీసుకెళ్ళింది.
కాటేజ్ లోనికి రాంగానే వాడిని తేరిపారా చూస్తే ,పెదాలు ఎండి వాడి పోయి ఉన్నాయి. వొంటిమీద కనీ కనిపంచకుందా వాతలు దేరి ఉన్నాయి. ఏడ్చి ఏడ్చి కళ్ళకిరింద చారలు కట్టి ఉన్నాయి.
గదిలోనికి రాంగనే ఆమెను కావలించుకొని బిగ్గరగా ఏడ్చేసాడు.సుకృతకూ దుఖఁ ఆగలేదు. ఇద్దరూ ఒకైనొకరు చూసుకొని ఏడ్చేసారు.

కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.