Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery యుద్ధ నీతి
#15
పాణి చేతులు కడుక్కొంటూ చూడండి జనరల్ మీకు ఇందాకే చెప్పాను. నా నుండి ఎటువంటి సమాచారాన్నీ మీరు పొందలేరు.
హాల్దియా నిశా తలకెక్కుతూ ఉంటే నువ్వు భీష్మించుకూచొన్నంత మాత్రాన వదిలేస్తానని అనుకోవద్దు పాణీ . . .నేను ఎంత మంచి దాన్నో అంత చెడ్డదాన్ని. ఇప్పటికే నీ పిల్లలు అపరాధ భావనతో కుమిలిపోతూ ఉంటారు. నీవు మాకు సహకరించని పక్షంలో వారిని జీవితాతం కుమిలిపోయేలా చేస్తాను. ఓ భారతీయుడిగా ఓ మంచి తండ్రిగా నీకు అది పెద్ద శిక్షే అవుతుంది. నేనేం చెబుతున్నానో నీకు అర్థం అవుతోంది కదా
పాణి :- ఆహా . . .బేషుగా అర్థం అవుతోంది.నీ ఇష్టం వచ్చింది చేసుకో . . .నేను ముందే చెప్పాను. కేవలం నా ఇద్దరి పిల్లల భవిష్యత్తు కోసం, నా దేశాన్ని తాకట్టు పెట్టలేను.
సరే . . .సరే. . . కూల్ డవున్ పాణి ,అంత ఆవేశం పనికి రాదు. ఇదిగో ఈ డ్రింక్ తీసుకోండి ఆర్డర్స్ వచ్చేతవరకూ మిమ్మల్ని ఏమీ చేయవాదని మాకు అర్డర్స్ ఉన్నాయి. అంటూ మందు సీసను గ్లాసును చేతికిచ్చింది.
అనుమాంగా చూస్తూ డ్రింక్ చేతికి తీసుకొని ఓ రెండు పెగ్గులేసాడు.
హాల్దియా అతడు మధ్యాన్ని తీసుకొని తీరిగ్గా కూచోవడం చూసి మనసులోనే అచ్చెరువయ్యింది. వారం రోజులుగా హింసిస్తున్నా బాడీ లో స్టామినా తగ్గలేదు. మనిషి నీరసపడలేదు. లోలోపలే అతడి ట్రైనింగ్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకొంది.
పాణిని మాటల్లోకి దించుతూ ఏం పాణి గారు, మీ భార్య గుర్తుకు రావడం లేదా అంది కోరగా చూస్తూ. .
పాణి ఆమెను ధీర్గంగా చూసి మీరు చేసిన నిర్వాకం వల్ల వారు ఎక్కడున్నరో తెలియలేదు. మీకు బందీగా ఉన్నానన్న ఒక్క కారణం తప్పితే నాకు నాకుటుంబానికి చేసిన అపకారానికి మిమ్మల్ని ఎటువంటి అవకాశం దొరికినా మీ అందరికీ నరకం చూపించగలను. ఇది ష్యూర్.
హాల్దియా నీవు అంతటి ఘనుడవే పాణి , ఇదిగో ఇంకో పెగ్ తీసుకో అంటూ బాటల్ ను చేతికి అందించి నేను మాత్రం ఏం చేయగలను పాణి నాకు నా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే నడుచుకోవాల్సి వస్తుంది కదా. . .
పాణి మౌనంగా మందు తాగుతూ కూచొన్నాడు.
ధీర్గత్ సుకృతలిద్దరికీ ఆమె పోకడ ఆశ్చర్యం కలిగిస్తోంది.
పాణి కిక్ తలకెక్కుతున్నట్లుగా తూలుతూ లోపల మైండ్ ను బాగా షార్ప్ చేసుకొంటూ హాల్దియా ను అంచనా వేస్తున్నాడు.
హాల్దియా అతడినే గమనిస్తూ కొద్దిగా తూలుతున్నట్లుగా కనిపించగానే ఆడవారిద్దరికీ సైగ చేసి టేబల్ దగ్గర కూచోబెట్టి ఎదురుగా కొన్ని పేపర్లను పెట్టి చక చకా కొన్ని ఫోటోలను తీయించింది.
ఆమె అలా ఎందుకు పోటోలను తీయిస్తోందో అర్థం చేసుకోలేంత మూర్కుడేమీ కాదు. అదీ ఒకందుకు మంచిదేలే అన్నట్టుగా టేబల్ పై తలవల్చుకొని ఉండిపోయాడు.
వాటిని నేరుగా భారత ప్రభుత్వానికి పంపి తను వాళ్లకు లొంగిపోయినట్టుగా చెప్పి బెదిరించడానికి ఇంత నాటకం ఆడుతోందీ ఈవిడ, ఇప్పుడేం చేయబోతోందో అనుకొని అలానే ఉండి ఎదురు చూస్తున్నాడు.
Haaldiyaa పిల్లలిద్దరినీ దగ్గరకు పిలిపించి చూడండి పిల్లలూ మీ నాన్నను ఇలా ఫోటోలు తీసి పంపడం వెనుక మా ఇంటెన్షను ఏముంటుందో మీకర్థం కాదు. అర్థమయినా మీ నాన్న ఏమీ చేయలేడు.కాని మీ ఇద్దరిలో ఒకరిని బయటకు పంపుతాను. మీ నాన్న ఆఫీసులో ఉన్న అత్యంత ముఖ్యమైన ఫైళ్ళను తెచ్చి అందించగలిగితే మిగతా ఇద్దరినీ విడుదల చేయిస్తాను. ఏమంటారు.

ఇద్దరూ మొహాలు చూసుకొన్నారు.ఆమె ఏం చెబుతోందో అర్థం కాలేదు.
సుకృతకు చప్పున పట్టేసింది.అన్నయ్యా ఈమె మాటలు పట్టించుకోవద్దు.ఆమె అడిగినదానికి ఒప్పుకొన్నామో రెంటికీ చెడి ఏ దేశంలోనూ మనకు బ్రతక నివ్వరు. అందుకే నాన్నకు మందు తాపించి పడుకో బెట్టింది.ఇందాకా నాన్న ఇదేగా చెప్పాడు.
ధీర్గత్ ఆమె మాతలు పట్టించోకుండా ఆమె వైపే చూస్తుంటే హాల్దియా కు తన ప్రయత్నం ఫలించినట్టేననిపించింది.
మత్తుతో తూలుతున్నట్టు నాటకం ఆడుతున్న పాణి ఆమె అసలు ప్లాన్ అర్థ అయ్యి సుకృత ఇచ్చిన జవాబుకు తీరుకు గర్వంగా ఫీల్ అవుతూ పక్కనే ఉన్న బాటలును చప్పున అందుకొని లేచి నిలబడ్డాడు.హాల్దియా అయోమయంగా చూస్తూ ఏదో చెప్పడనికి నోరు తెరవ బోతుంటే భళ్ళున బాటలు పగుల గొట్టి అదే ఊపులో ఎగిరి హాల్దియా గొంతుపైన గుచ్చి ఆమెను ఒడిసిపట్టుకొన్నాడు.
ప్రక్కనున్న ఆడవారు కెవ్వున కేక వేసి దూరంగా జరిగారు.
పాణి గట్టిగా అరుస్తూ గది బయట ఉన్న గార్డ్స్ ను పిలిచి తలుపులు తీయ మని బెదిరిస్తూ హాల్దియాను తోసుకొంటూ ముందుకెళ్ళాడు. పాణి అంత పెదా ఆఫీసరైనా మత్తులో ఆమె ప్లాన్ అర్థం చేసుకోలేకపోయాడు.
అతడికి లొంగినట్టే ముందుకెళుతూ ఉంతే ఇందాకాఫోటోలు తీసినతను చకా చకా ఫోటోలు తీసేసాడు.
తలుపు దగారగా వస్తుంటే లోపలున్న ఆడవారిలో ఒకామె, పిస్టల్ తో పాణి పిక్కల మీద షూట్ చేసింది.
కాలికి బుల్లెట్ తగలగానే భాధతో అరుస్తూ కిందకు పడిపోయాడు. పాణి. ప్రతీదీ తన కెమెరాతో ఫోటోలను తీస్తూనే ఉన్నాడా ఫోటొ గ్రాఫర్.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 12:13 PM
RE: యుద్ధ నీతి - by Monica Sunny - 26-04-2019, 01:11 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:18 PM
RE: యుద్ధ నీతి - by Milf rider - 26-04-2019, 06:43 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:22 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:24 PM
RE: యుద్ధ నీతి - by dippadu - 13-08-2019, 12:28 PM
RE: యుద్ధ నీతి - by will - 01-05-2019, 06:14 PM
RE: యుద్ధ నీతి - by sri7869 - 01-02-2024, 12:22 PM



Users browsing this thread: 2 Guest(s)