Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మత్తెక్కించే పదాల అర్థాలు
#11
మహిళ ఘన జఘనానికే పురుషుల ఓటు

Read more at: https://telugu.oneindia.com/gbangvine/20...ml?story=1

తీరైన ఆకృతిగల జఘన భాగం ఉన్న మహిళలు పురుషులను ఎక్కువగా ఆకర్షిస్తారని అంటారు. తెలుగు కవులు మహిళల జఘనాన్ని తీరొక్క రీతుల వర్ణించారు. కానీ, ఆ ఆకర్షణకు గల కారణమేమిటో ఇప్పటి వరకూ తెలియదు. దీంతో యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు ఈ అంశంపై ఇటీవలే ఒక సైకాలజీ అధ్యయనాన్ని నిర్వహించి, ఈ ఆకర్షణ మూలాలు మానవుడి పరిణామ క్రమంలో ఉన్నాయని తేల్చారు. వెన్ను భాగానికి, జఘన భాగానికి నడుమ 45.5 డిగ్రీల వంపు ఉన్న మహిళలనే పురుషులు తమ భాగస్వామిగా చేసుకోవడానికి ఇష్టపడతారని వీరి అధ్యయనంలో తేలింది. పురుషులు ఇలా పెద్ద జఘన భాగం ఉన్న మహిళలవైపు ఆకర్షితులవడంలో లైంగిక కోణం కనిపించినప్పటికీ, నిజానికి దీని వెనుక శాస్త్రీల కోణం ఉందని వారు చెబుతున్నారు. వెనుక భాగం భారీగా ఉండే మహిళలు గర్భం దాల్చినప్పుడు వారి శరీరంలోని ముందు, వెనుక భాగాలకు నడుమ సమతౌల్యం ఉంటుందని, తద్వారా వారికి ఎక్కువసార్లు గర్భం దాల్చగలిగే శక్తి కలిగి ఉంటుందని పరిశోధకులు వివరించారు. సృష్టిలో ఏ జీవి అయినా తన సంతతిని పెంచుకోవాలనుకుంటుంది. ఇది ప్రకృతి సహజం. మనిషి కూడా అంతే.

ఈ నేపథ్యంలోనే ప్రాచీన కాలం నుంచి పురుషులు ఘనమైన జఘన భాగం ఉన్న మహిళలను ఇష్టపడుతున్నారని పరిశోధకులు తేల్చారు. ఈ అధ్యయనంలో భాగంగా వారు రెండు అంశాలపై దృష్టి సారించారు. మొదటిది - వెన్నుపూసకు, పిరుదులకు నడుమ సహజంగా ఉండే వంపుపై పరిశోధన. ఇందులో భాగంగా 100 మంది పురుషులకు పలువురు మహిళల చిత్రాలు చూపించారు. వాటిలో కొందరు మహిళల జఘన భాగాలను ఫొటోషాప్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ సహాయంతో తీర్చిదిద్ది, 45.5 డిగ్రీల కోణం తెచ్చి చూపి వారు ఎంత ఆకర్షణీయంగా ఉన్నారో చెప్పాలని కోరారు. ఆ వందమంది పురుషులూ వెన్ను భాగానికీ, పిరుదుల భాగానికీ 45.5 డిగ్రీల తేడా ఉన్న మహిళలే ఆకర్షణీయంగా ఉన్నట్టు చెప్పడం గమనార్హం. రెండో పరిశోధనలో వెన్ను-జఘన భాగాల వంపు సహజంగానే 45.5 డిగ్రీలున్న మహిళల చిత్రాలను, ఆ వంపు 45.5 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నా భారీ జఘనం ఉన్న మహిళల చిత్రాలను చూపారు. ఈ పరీక్షలోనూ ఆకర్షణీయమైన, భారీ జఘన సౌందర్యంగల మహిళలను కాదని, పురుషులంతా వెన్ను-జఘన భాగాల వంపు సహజంగా 45.5 డిగ్రీలు ఉన్నవారికే ఓటేశారు. మహిళల పట్ల పురుషులు ఆకర్షితులవడం వెనుక తర్కం ఉంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన సైకాలజీ ప్రొఫెసర్‌ డేవిడ్‌ బస్‌ అన్నారు.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: మత్తెక్కించే పదాల అర్థాలు - by sarit11 - 23-10-2021, 05:09 PM



Users browsing this thread: 1 Guest(s)