25-04-2019, 10:36 PM
లాలస ఏమీ చేయలేని దానిలా గోళ్లు గిల్లుకొంటూ కూచొంది.
సుచేత్ కు అమ్మ మనసు పూర్తిగా అర్థం అయిపోయింది.జీవితాన్ని అనుభవించి భవిశ్యతు మీద చేసుకొన్న అవగాహన, ఖచ్చితత్వం పరిస్థితులను అంచనా వేయడంలో ఆమె నేర్పరితనం అబ్బుర పరిచాయి.సహిత ,తన్మయి విశయంలోనూ ల్యాన్సీ విశయంలోనూ. . .అలాగే తను రహస్యంగా వీడియో తీసిన విశయంలోనూ ఆమె అంచనా ఎంత ఖచ్చితంగా ఉందో కళ్లకు కట్టినట్లు తెలుస్తోంది.
ఆమె అలోచనలు తలచుకొని ఒక రకంగా గగుర్పాటుకు గురయ్యాడు.
అమ్మ చెప్పిందే నిజమైతే ల్యాన్సీ ని తన దారినుండి ఎలా తప్పించాలో ఆలోచించుకోవాలి. ఆమె నమ్మకంగా ఉంటూనే వెనుకనే గోతులు తవ్వుతోంది. ఎప్పుడైతె తను తన బిజినెస్ ల మీద పడ్డాడో బహుశా అప్పటి నుండే ఆమె ఈ ప్రయత్నాలు మొదలు పెట్టి ఉంటుంది.
ముబల తన దారి తను చూసుకొందే కాక తన స్టాఫ్ ని కూడా లాగేసుకొంటొంది.
ఓఫియా ఎక్కడుందో తెలియదు.
అమ్మను చూస్తే ఆమెది రాటుదేలిపోయిన మనస్తత్వం. . .ఆమె దారికి తాను వెళ్లాల్సిందే కాని ఆమె ఎవరినీ నమ్మే పరిస్థితుల్లో లేదు.
పిన్ని సరే సరి అమ్మ ఆడించినట్టు ఆదే బొమ్మ. . .అంటే ఒకరకంగా తను ఒంటరి. . .ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఒక్కొక్క దారినే మూసేస్తూ వచ్చారందరూ. . . ఇప్పుడు తను ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది.అన్నీ మూసుకొని మళ్ళీ వ్యాపారాలు మొదలు పెట్టాలంటే మళ్ళీ స్టాఫ్ కావాలి.
తల దిమ్మెక్కి పోతుండగా లేచి పోయాడు.
మరునాడుదయాన్నే సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషనుకెళ్ళి ల్యాన్సీ మీద అనుమానమున్నట్టుగా స్టేట్ మెంట్ ఇచ్చి. . .వస్తూ వస్తూ అమ్మకు ప్రామిస్ చేసినట్టుగా కొంత నగదును డ్రా చేసుకొని మిగాతాది ఆమె అకౌంటులోనికి ట్రాన్స్ఫర్ చేసాడు.
ఇంటికెళ్ళి ఏదో పరాయి వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడి మాన్విత చేతికి తన దగ్గరున్న నగదును పాస్ బుక్ ను చేతికిచ్చాడు.
ఆమె కూడా ఎటువంటీ భావమూ కనపరచకుండా తీసుకొని. . .మరో రెండు రోజుల తరువాత లాలసను తీసుకొని వెళ్ళిపోయింది.
అరస్ట్ అయిన ల్యాన్సీ బెయిల్ మీద బయటకొచ్చిన తరువాత ,ఆమె అడగకుండానే ఫ్లాట్ కీ వెనక్కిచ్చేసాడు.
కొన్నిరోజుల తరువాత ల్యాన్సీ ద్వారా వచ్చిన రికవరీ అమౌంట్ ను తీసుకొని తనే ఆఫీసు వ్యవహారాలు చూసుకో సాగాడు. భూగర్భ విశయాలు , పురావస్తు సంగతులు పూర్తిగా మానేసాడు.
ఎవరినీ పట్టించుకోకుండా పూర్తిగ ఫైనాన్స్ విశయాలను చూస్తూ అందరి విశయాలు పూర్తిగా మరచిపోయాడు. అలా తన వ్యాపారాల్లో పడి నిలదొక్కోవటానికి ఒంటరిగా మూడు నాలుగేళ్ళు శ్రమ పడ్డాడు.
ఎంతగా శ్రమ పడుతున్నాడో అంత ఒంతరి తనంతో ఉంటూ వచ్చాడు. కాని ఎవరినీ దగ్గర చేర్చలేదు. తాగుడికి పూర్తిగా బానిసైపోయాడు. ఎప్పటికైనా ఓఫియా తనను వెదుక్కొంతూ వస్తుందనే ఆశ . . .సుమేర తో పెళ్ళి చేసుకొని హాయిగా స్థిరపడదామని అనుకొంటూ . . .ఆ రోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.
తానొక్కటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టుగా అర్థికంగ నిలదొక్కుకొన్న ఖాసీం రహస్యంగా ఇండియాకొచ్చి ల్యాన్సీ ని కలిసాడు.
అప్పటికే సుచేత్ మీద పగబట్టి ఉన్న ల్యాన్సీ వీడు దొరక గానే అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొంది.
ఎవరికీ అనుమానం రాకుండా కొంత మంది ఆడ రౌడీలను మరికొంత మంది గూండాలను కలిపి ఫైనాన్స్ వసూళ్ళల్లో మోసం చేసారంటూ గొడవకు దిగి దొమ్మీ కేసుకింద సుచేత్ ను లేపేయమని సుపారి ఇప్పించేసింది తన చేతికి మట్టి అంటకుండా.
* * * *
ఆ రోజెందుకో సుచేత్ మనస్సు కీడు శంకిస్తూ ఉంది. ఇంటిలో అందరూ గుర్తుకొస్తున్నారు. ఎవెరెవరు ఎక్కడున్నారో అస్సలు గుర్తుకు రావడం లేదు.
మనసు బాగోలేక అఫీసుకు రాలేనని చెప్పి మందు తాగుతూ కూచొన్నాడు. ఈలోగా కొంత మంది ఆడవారూ మగవారూ గలిబిలిగా ఫ్లాట్ లోనికి దూసుకొచ్చి మందు తాగుతున్న సుచేత్ మీద పడిపోయారు. ఏం జరిగిందో. . ఎందుకు తనను కొడుతున్నారో తెలిసేంతలోనే తనను రోడ్డు మీదకు లాగేసారు. తనకు గట్టిగా మాటాడే అవకాశం ఇవ్వకుండా తమను మోసం చేసారంటూ. . . అరుపులూ, కేకలతో కుమ్మేస్తున్నారు. పారిపోవడానికి ఆస్కారం లేదు. గుంపులో ఎవరు దుడ్డు కర్రలతో కొడుతున్నరో, ఎవరు. బ్లేడులతో కోస్తున్నారో తెలుసుకొనేంతలోనే వీపు మీద కత్తిపోట్లు పడిపోయాయి.
సెక్యూరిటీ ఆఫీసర్లొచ్చే సమయానికి తన ప్రాణం దాదాపుగా వెళ్ళిపోయింది.
కళ్ళు తెరచి చూసేతప్పటికి ఓఫియా తనకు సేవ చేస్తూ కనిపించింది. జరిగిందంతా చెప్పి తనను ఊరడిస్తూ తన ప్రాణాలను నిలబెట్టదానికి ప్రయత్నిస్తోంది.
అలా అంతా గుర్తుకు తెచ్చుకొన్న సుచేత్ కు ఓఫియా వల్ల శరీరమైతే కొద్దిగా కోలుకొంటోంది గాని మనస్సు ఎంతో అలసిపోయి నట్టుగా అనిపిస్తోంది.
మనస్సంతా బ్లాంక్ గా అయిపోయి పదే పదే నిదుర పోవాలనిపిస్తోంది.
ఇక తను ఎవరినీ ఉద్దరించే అవసరం గాని అవకాశం గాని కనిపించదం లేదు.
ఆ రోజు ఉదయాన్నే తాను కొద్దిగా నోరు తెరచి మాటాడుతుంటే ఓఫియా చిన్న పిల్లల సంబర పడిపోయి సుమేరను పిలిపించింది.
అప్పటివరకూ మనస్సు ఉగ్గబెట్టుకొని ఉన్న సుమేర రమ్మనగానే కళ్ళెంబడి నీళ్ళు ధారాపాతంగా కారిపోతూ ఉంటే ఉరుకుల పరుగుల మీద వచ్చేసింది.
దూరం నుండి ఆమెను చూడగానే సుచేత్ కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయ్యి లేవడానికి ప్రయత్నించాడు.
నడుం ప్రక్కన ఏదో గుచ్చుకొన్నట్లుగా కలుక్కుమని అలానే వెనక్కు జారిపోయాడు.
ఓఫియా వచ్చి పట్టుకొని లేపడానికి ప్రయత్నించేసరికే సుచేత్ కళ్ళెంబడి నీళ్ళు బయటకొచ్చి కళ్ళు మూతలు పడిపోయాయి.
సమాప్తం.
ముగింపు.
బ్రతుకు పోరాటం ఎంతో తెలివిగా ప్రయాణాన్ని మొదలు పెట్టి ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా, పరిస్థితులకు లొంగి పోయి చివరకు ఒక మూర్ఖుడిగా మిగిలిపోయి జీవితాన్ని చాలించిన సుచేత్ లాంటి ఎంతో మంది దుర్భల మనస్కులకు అంకితం.
బావా శేశాద్రీ బెరూడ్ ( A friend from Norddorf , Germany) నీవడిగిన కథకు న్యాయం చేసాననే భావిస్తూ శెలవు.

కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.