25-04-2019, 08:19 PM
ఆయన మళ్ళీ చెబుతూ. . .భూమిపైన గాలివెలుతురు రావడానికి ఏదైతే ఏర్పాట్లున్నాయో భూమిలోపల ఉన్న మాకు కూడా గాలీ వెలుతురూ అన్నింటికీ ఆయా ఏర్పాట్లున్నాయి.ఇప్పటి మీ తరం వారు పాకులాడుతున్నటువంటి మంత్ర తత్ర శాస్త్రాలన్నీ కేవలం డబ్బుకోసమే లేదా ఏదో ఆశించే అంతే కాని ప్రతీ ఒక్కటీ సైన్స్ అని తెలుసుకోవడం లేదు.
సుచేత్ అన్నీ సైన్సేనా. . .యోగాలూ సాధనలూ పూజలూ కర్మలూ వేదాలూ అన్నీ ?
అవును ప్రతీ ఒక్కటీ సైన్సే . . .కాని దాన్ని అర్థం చేసుకొనే స్థాయినుండి భూ ఉపరితలం వారు ఎప్పుడో దాటిపోయారు. పురోగతి అంటూ వెనక్కు ప్రయాణం చేస్తోంది. . .మానవ లోకం. . .అందుకే మిగతా లోకాల సంపర్కం తెగిపోతోంది. ఎక్కడో ఒకచోట మాత్రమే కొంత మంది సాధన ద్వారా మా గురించి అలాగే తమను గురించి తాము తెలుసుకొంటున్నారు. మిగతా అంతా గుల్లలే. . .మభ్య పెట్టి బ్రతుకుతున్న వారే. . .
ఇవన్నీ మీకెలా తెలుసు స్వామీ అన్నాడు. . .సుచేత్
ఇందాకే చెప్పను కదా మీ వారు మాతో మంచి సత్సంభందాలు కలిగిఉండేవారని. . .
మరి మీ తెలుగు భాష . . .?
ఆయన నవ్వి అంతా మన మెదడులో ఉన్నది.. . .తెలుగని నీవనుకొంటున్నావు.నీవే మా భాష మాటాడుతున్నావు. . .అది నీవు గుర్తించే స్థితిలో లేవు. . .
సుచేత్ ఉలిక్కిపడ్డాడు. అంటే. . .
అతని సందేహాన్ని ఆయన అర్థం చేసుకొన్నట్లుగా. . .నాయనా సుచేత్ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే నీలోని జన్యు నిర్మాణాన్ని పరిశీలించి ఇక్కడి వాతావరణానికి తగ్గట్టుగా మార్పులు చేసాం. . .
ఓఫియాకు. . .
ఆ తనకు కూడా. . .
సుచేత్ ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా సేపు గమ్మునుండిపోయాడు.
మీరిద్దరూ స్పృహ లేని సమయంలో మా ఈ ప్రదేశానికి గల చోటులో భూ ఉపరి తల మార్గం ఉంది . . .అక్కడి నుండే మిమ్మల్ని తీసుకొని వచ్చాము. మీరు కావాలనుకొంటే ఇక్కడే ఉండిపోవచ్చు. . .లేదా మీ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. . .కానీ మీ ఇద్దరిలో చేసిన మార్పుల వల్ల మీ ప్రవర్థన కొంచెం వేరేగా ఉంటుంది. ఇక్కడి పద్దతులు అక్కడ వేరేగా ఉంటాయి కాబట్టి మీకు కొన్ని కష్టాలు కలగవచ్చు. . . .ఆలోచించుకో. . .
సుచేత్ మరో ఆలొచన లేకుండా వెళ్ళిపోతాం స్వామీ మాఖర్మన మమ్మల్ని బ్రతుకనీయండి. . .స్వచ్చంగా ఉన్న మీ లోకాన్ని మా కుతంత్రాలతో ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు.మీరనట్టుగా. . .ప్రతీదీ సైన్సే కాబట్టి ఆ స్థాయి కి చేరుకోడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నా కృషిఫలితంగా సాధించదానివల్లే నాకు తృప్తి కలుగుతుంది.. . .ఒకవేళ ఎటువంటీ మార్పురాలేదనుకోండి. . .భవిశ్యత్తులో ముందు తరాలు ఎలా బ్రతకాలో తెల్సుకొని జాగ్రత్త పడతాను. . .అంటూ చేతులు జోడించాడు.
ఆయన ఆశీర్వదించి రెండు మూడు రోజుల్లో మొవ్వాడి నీకు దిశా నిర్దేశం చేస్తాడు.ఆపైన నీ ఇష్టం.అంటూ కళ్ళు మూసుకొన్నాడు.
సుచత్ వెనక్కు వచ్చేసాడు. నేరుగా ఓఫియా దగ్గరకొచ్చి జరిగిందంతా చెప్పాడు.
ఆమెలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.ఆమెకి ఆ వాతావరణం ప్రజలు వాళ్ళ పండుగలూ ఆహారం అంతా నచ్చాయి. అందువల్ల ససేమిరా రానంది.
ఆమె రాకపోతే ఖాసీం నుంచి వచ్చే ఇబ్బందులను గూర్చి చెప్పాడు. . . .
ఏది ఏమైనా తను రానటే రానని మొండికేసింది.
ఎన్ని రకాలుగా చెప్పినా ఆమె తన మాట పెడచెవిన పెడుతోంది.
ఇలా కాదను కొని మొవ్వాడి సహాయంతో. . .మళ్ళీ పెద్దయన దగ్గరికెళ్ళారు.
అప్పటికే ఆయన విశయాన్ని మొత్తం గ్రహించి ఉన్నాడు. వీరు చెప్పే అవసరం లేకుండా. . .ఓఫియాకు తను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడకొచ్చే అవకాశం ఇస్తునట్లు చెప్పి అందుకు కావాల్సిన మార్గం గురించి చెప్పాడు.
ఆయన చెప్పిన మార్గం గురించి తెలుసుకొని ఓఫియా సుచేత్ లిద్దరూ నోరెళ్ళబెట్టారు. పురాతన కట్టడాల్లో దేవాలయాల్లో ఉన్న గుర్తులను పరిశీలిస్తే తమను ఎలా చేరుకోవచ్చో తెలిపాడాయన.
మరో రెండు రోజుల్లో మొవ్వాడి అంతర్వాహినిగా ఉన్న ఒకనది దగ్గరికొచ్చి అక్కడున్న ఓ చెట్టు మొదట్లో ఉన్న ఒక వేరును చూపి దీని గుండా మూడు రోజులు ప్రయాణం చేస్తే భూ పైకి చేరుకొంటారని చెప్పి వారికి కావల్సినవన్నీ మూట గట్టి ఇచ్చాడు. ఓఫియ సుచేత్ లిద్దరూ ఆయన దగ్గర వీడ్కోలు తీసుకొని బయలు దేరారు.
చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే ఎటువంటీ ఆటంకం లేకుండా సరిగ్గా మూడవ రోజు తెల్లవారు ఝామున బయటొకొచ్చారిద్దరూ. . . తామున్న సిటీకి దగ్గరనే అతవీ ప్రాంతాంలో బయటపడ్డరిద్దరూ. . .వడి వడిగా తామున్న హోటెల్ కు చేరుకొన్నారు.
అప్పటికి సుమారు ఇరవై రోజులనుండీ వీరు కనపడేపోయేసరికి ల్యాన్సీ ఖాసీం అందరూ కంగారు పడుతున్నారు.
చిన్న యాక్సిడెంట్ వల్ల ఎవరినీ కాంటాక్ట్ చేయలేకపోయామని చెప్పి అందరినీ కన్వెన్స్ చేసేసారిద్దరూ. . . రెండు మూడు రోజులు వాతావరణానికి అడ్జస్ట్ కావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇద్దరికీ. . .ఆ రోజు రాత్రి ల్యాన్సీ ని మాట్లాడి. . .
మరునాడుదయాన్నే . . .ఖాసీం ను పంపేసి ల్యాన్సీ భర్త దగ్గరకొచ్చి ఆ విగ్రహ గురించి అడిగాడు.
ఆయన నిరాశగా లేదు మిస్టర్. . .ఎంత డీకోడింగ్ చేసినా ఆ విగ్రహం తాలూకు వివరాలు కనుక్కోలేకపోయానని తెలిపాడు.
సుచేత్ తాను సహాయం చేస్తానని ఆ విగ్రహం డీకోడింగ్ వల్ల దొరికే నిధి గురించి చెప్పి తనకు వాటా అడిగాడు.
ఆయన చిత్రంగా కనుబొమలు ముడేసి కాసేపు ఆలోచించి ఓకె . . .నీ వాటా 25 శాతం ఇస్తానని లీగల్ గా ఎటువంటీ ప్రాబ్లం రాకుండా చూస్తానని మాటిచ్చి తీసుకెళ్లాడు ఆ విగ్రహం దగ్గ్గరకు.
తాము కిందకుపడిన చోట మట్టిగడ్డలూ రాళ్ళూ రప్పలూ పడి ఉన్నాయి. దాన్ని చూసి సుచేత్ నవ్వుకొన్నాడు.
ఆ విగ్రహం కింద నున్న అక్షరాలను గుర్తులను పెద్దయన ఆశీర్వాదం వల్ల ఈజీగానే చదవగలిగాడు. అందులో ఇంతకు మునుపు తాము కిందపడిన చోటులో బిల మార్గానికి కావాల్సిన గుర్తులు సూచనలూ ఉన్నాయి. అంతే కాకుండా విగ్రహ దాతలు విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంలో పూర్వం ఈ చోటు తాత్రిక సాధనా స్థలంగా రహస్యంగా ఉండేదని ప్రజల కోరిక మేరకు అందరికీ అందుబాటులో వామాచారన్ని ప్రవేశపెట్టినట్లు అందుకు నాగులు సహాయం చేసినట్టు ఆ క్రింది లోకాల వారికి కృతఘ్నతగా ఇచ్చుకొన్న సంపద గురించిన వివరాలున్నాయి.
ఎంతవరకూ అవసరమో అంత వరకే ఈయనకు తెలియజేయాలను కొని . ..సార్ ఇక్కడున్న సమాచారాన్ని బట్టి ఇక్కడ ఓ 70-80 కోట్ల విలువైన సంపద లభించవచ్చు. . .ఏమంటారు. . . ?
ఆయన మరో ఆలోచన లేకుండా చూడు సుచేత్. . మీరు చెప్పినది దొరకాలే గాని 25 కాదు 50 శాతం ఇస్తా. . .ప్రభుత్వానికి ఏం చెప్పాలో నేను చూసుకొంటా. . .మీరు ముందు నిధిని కనుక్కోండి. ఈ దెబ్బతో నేను రెటైర్మెంట్ ఇచ్చేసి విదేశాలకు వెళ్ళిపోతా. . అన్నడు.
సుచేత్ సరే నంటూ మరునాడుదయన్నే కలుస్తానని చెప్పి వచ్చేసాడు.
రాంగానే ల్యాన్సీని కాంటాక్ట్ చేసి ఆయన ఆలోచన మొత్తం చెప్పాడు.

కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.