Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#16
ఉదయం కళ్ళు తెరచేసరికి ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసి ఉంది.మొవ్వాడి ఇంకో ఇద్దరు మాత్రం ఎదురుగా కూచొని ఏదో మాటాడుకొంటూ ఉన్నారు.
సుచేత్ లేవగానే పెద్దాయన వచ్చాడని ఆ గుహ ప్రాంతం నుండి లోలొపలకు తీసుకెళ్ళి ఓ చీకటి ప్రాంతం దగ్గర ఆగి గట్టిగా ఈల వేసాడు. ఈల ఆగిన కొంత సేపటికి ఎదురుగా ఉన్న బండ ఒకటి పక్కకి జరిగి కళ్ళు చెదరే వెలుగు కళ్ళ మీద పడింది. అటువైపు సమాన వయస్కులు కొంత మంది అడవారు మగవారు అటూ ఇటూ తిరుగుతూ ఏదో హడావుడి పడుతున్నారు. ఇదో విచిత్ర లోకం అనుకొంటూ ముందుకెళ్ళాడు. మొవ్వాడి అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎదురుగా ఉన్న గుంపులో నుండి ఒకామె వచ్చి సుచేత్ ను కొద్ది దూరం వరకూ తీసుకెళ్ళి మట్టొతో కట్టిన ఓ గదిలాంటి చోటులో వదిలి వెళ్ళిపోయింది. అక్కడ ఓ పెద్ద మనిషి తెల్లటి శరీరంతో నెరిసిన వెంట్రుకలు తెల్లటి గడ్దం తో ఎదురుగా బాసింపట్టు వేసుకొని ఉన్నాడు.ఆయన వయసు ఇంత అని ఇదమిత్తంగా తెలుసుకోవడం సుచేత్ అంచనాకు అందలేదు.
సుచేత్ వచ్చిన సవ్వడి వినగానే కళ్ళు తెరచి రా సుచేత్ . .ఎలా ఉన్నావు అని అడిగాడు.
సుచేత్ కు ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది. ఆయన స్పష్టంగా తెలుగులోనే మాటాడు తున్నాడు.ఆయనకు నమస్కారం పెట్టి అయ్యా ఇన్నాళ్ళకు మీరొక్కరు నాకు అర్థమయ్యేలాగా మాటాడుతున్నారు. నాకేం అయ్యింది? ఇది ఏవూరు? ఏ రాష్ట్రానికి చెందింది? ఇక్కడినుండి నేనున్న చోటుకెళ్లలంటే ఎలా వెళ్లాలి?అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
ఆయన మందహాసం చేసి నాయనా నీవడిగిన ప్రశ్నలకు సమాధానం అంత సులభం కాదు.ఇంతకూ మీరెక్కడున్నారని నీ అనుమానం. . .?
అస్సాం రాష్ట్రంలో ఏదో పల్లె అని అనుకొంటున్నాను.అన్నాడు సుచేత్ అయోమయ పడుతూ. .
ఆయన చిరునవ్వునవ్వి నీవు భూమి లోపల అంటే మీరు బయలు దేరిన ప్రాంతం నుండి దాదాపు 15 మైళ్ల దూరంలో భూ గర్భంలో ఉన్నారు.
సుచేత్ అయనేదో జోక్ చేస్తున్నాడని పరీక్షగా చూసాడు.అటువంటిదేమీ కనిపించలేదు.అర్థం కాక తల గోక్కున్నాడు.
ఆయనగడ్దం సవరించుకొని నాయనా సుచేత్, భూగర్భ నగరాలని మీరు ఆప్పుడప్పుడూ వినే ఉంటరు. పురావస్తు శాఖవారు కూడా అప్పుడప్పుడూ కొన్ని నగరాల ఆనవాళ్ళు ఇస్తుంటారు వినే వుంటావు.. . .నేను చెప్పేది జాగ్రత్తగా విను, నీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.. . .అంటూ గొంతు సవరించుకొన్నాడు.
సుచేత్ కు అస్సలు నమ్మ బుద్ది కావడం లేదు తామిద్దరూ ఆ విగ్రహం దగ్గర స్పృహ కోల్పోతే భూమిలోపలకు రమారమి 15 మైళ్ల దూరానికి ఎలావచ్చాం . . .? ఏంటి ఈయన చెప్పేది పిచ్చోళ్ల మాదిరిగా కనిపిస్తున్నామా . . .అనుకొంటూ పిచ్చి చూపులుచూసాడు.
ఆయన సుచేత్ హావభావాలతో పనిలేకుండా ఇలా చెప్పుకొంటూ పోయాడు. భూ గ్రహం మొత్తం నాలుగు పొరలుగా మీరు చదివి ఉంటారు.మీరు భూమి ఉపరితలం మీద నివసిస్తూ అదే ప్రపంచమని నమ్ముతూ ఉంటారు. భూమిలోపల కొంత దూరం వరకూ పాములూ చీమలూ ఇంక కొన్ని ప్రాణులూ ఉంటాయని తెల్సుకొని ఉంటారు.అయితే భూమి ఉపరి తలానికి చెందిన ఆ ప్రాణులన్నీ కొంత వరకూ మాత్రమే పరిమితం. . . కాని భూ పొరలలో మా లాగ ఎన్నో ప్రపంచాలుంటాయని ఊహించలేరు. పూర్వం మీ పురాణాల కాలానికి భూమి పైనున్న వారంతా మాతో సత్సంభందాలు పెట్టుకొన్నవారే. . . కేవలం భూ గర్భనంలో ఉన్న మాతోనే కాదు. భూమికి ఆవల పైనున్న లోకాల వాళ్ళతోనూ సత్సంభందాలు కలిగి ఉన్నవారు. . .మీ మానవులు.కాకపోతే రాను రాను మీ ఉపరితల ప్రాణులలో మార్పు అనేది సహజమైన ప్రక్రియ. . .అందువల్ల ఆ మార్పు పరిశీలన తర్కం వైపు కాకుండా కేవలం ఎలా బ్రతకాలన్నదానిపైనే కేంద్రీకరించడం వల్ల స్వార్థం పెరిగిపోయి మీ మూలాలను మీరు మరిచిపోతున్నారు.
మధ్యకాలంలో మా గురించిన కొంత పరిశీలన జరిగింది.మా సహాయ సహకారాలను తీసుకొని భూ ఉపరితలంపై చాలా అద్భుతాలు చేసిన వారున్నారు. వాటిలో పురాతన కట్టడాలు దేవాలయాలు. . .ఇంకా శాస్త్రాలు.. . .అందుకు కృతఘ్నతగా మా గురించిన వివరాలు శిల్పాల రూపంలో చెక్కి ఉన్నారు. బాగా గమనిస్తే ప్రతీ శిల్పం కూడా మూల విగ్రహం కాస్త ఎత్తుగా పెద్దదిగ ఉండి దాని ప్రక్కన కొన్ని వింత జీవులూ నాగాలూ అర్ద మానవశరీరం కలవారూ. . .ఇంకా జరిగిన సంఘటనలు తెలిపే విధంగా ఇలా ప్రతీ ఒక్కటీ మీ పురాతనమైన శిల్పాలలో పొందుపరిచి ఉంటారు. అది బహుశా ఇప్పటి తరం వారికి అర్థం కాకపోవచ్చును. ఇప్పటికీ కొన్ని దేవాలయాలలో కొన్ని ప్రాంతాలలో అర్థం కాని ఎన్నో రంధ్రాలు భూగర్భానికి ఉన్నాయి. దాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా దేవుని పేరుతో మూఢనమ్మకాలను పెంచుకొంటున్నారు భూ ఉపరితలం వారు.
ప్రతీ విగ్రహం కూడ ఒక సందేశాన్ని ఇచ్చేదే. . .ప్రతీ దానికి ఒక శక్తి అంటే ఒక పవర్ ఉంటుంది. దాన్ని సాధించకుండా మీకు మీరే ఏవేవో సృష్టించుకొని అంధ విశ్వాసంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రస్తుతం నీవున్న లోకలో మాతృస్వామిక విధానం బహు భర్తుత్వం ఉంది. అలా అని మగవారు బానిసలు కాదు. అందరూ సమానమే. . . కాకపోతే పిల్లలను ఉమ్మడిగా పోసిస్తారు. అందువల్ల వయసుకొచ్చిన వారు ఎవరితోనైనా స్వేచ్చగా ఉండే అవకాశం ఉంది. ఆడా మగా అంతే తేడా . . .మిగతావన్నీ చాలా చిన్న విశయాలు.. . అంటూ ఆపాడు.
సుచేత్ నోరెళ్ళబెట్టుకొని చూస్తూ ఉండిపోయాడు.భూమి లోపల ఇంత జరుగుతూ ఉందా. . .? అదీ ఇంత అడ్వాన్స్డ్ గా అని.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 1 user Likes Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 08:18 PM



Users browsing this thread: 2 Guest(s)