Thread Rating:
  • 9 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తెలివైన మూర్ఖుడు
#12
పొగ ఎక్కువగా ఉంటంతో ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకొని నిలుచున్నారు.ఇందాకా వచ్చిన సబ్దాలు అలానే రావడం పొగ ఎక్కువై ఉక్కిరి బిక్కిరి కాసాగారు. అక్కడనుండి బయటకు రవడానికి ప్రయత్నిస్తుంటే దబ్బున ఏదో తగిలింది ఇద్దరికీ. . . అంతే కళ్ళకు చుక్కలు కనిపిస్తుంతే ఇద్దరూ పట్టుతప్పి పడిపోయారు.
కళ్ళు తెరచి చూసేసరికి ఎదురుగా బుర్ర మీసాలు వేసుకొని ఒకతను ఆత్రంగా తన మొహంలోనికి చూస్తున్నాడు.ఏయ్ అంటూ బిగ్గరగా అరుస్తూ లేచి కూచొన్నాడు సుచేత్.
సుచేత్ అరచిన అరుపుకు అతను రెండడగులు వెనక్కి వేసి వెనక్కి తగ్గాడు. ఒంటినిండా ఏవో ఆకు పసర్లు వేసి కట్లు కట్టి ఉన్నాయి. వాతావరణం అంతా అదోరకమైన పచ్చివాసన వస్తోంది. ఎక్కడున్నాడు తను అని లేచి కూచొన్నాడు. తనను పడుకోబెట్టిన మంచం మీదంతా ఆకూ పరచి ఉన్నాయి. చేతులూ కాళ్ళూ జివ్వున లాగేస్తున్నాయి.
చుట్టుప్రక్కల అంతా గుడెసెలు కనిపిస్తున్నాయి.మగవారంతా బలిస్టంగా కండలు తిరిగి దాదాపు అందరూ తలపాగాలు కట్టుకొని ఉన్నారు.అందరూ బాగా పొడగరులే. . . కాని వారి రంగే నల్లగా ఇనుమును పోతపోసినట్టుగా ఉంది.అక్కడక్కడా కనిపిస్తున్న ఆడవారు కూడా మిశ్రమ వర్ణంలో ఉన్నారు. అంత నలుపూ ఎరుపూ కాకుండా రాగి రంగులో ఒకరిని మించిన ఒకరు మంచి అందగత్తెల్లా కనిపిస్తున్నారు. ఒక్క ఆడదానికీ జాకెట్ అన్నదే లేదు. చీరనే ఎదమీద చుట్టి కట్టుకొని ఉన్నారు. ఈ కాలంలో కూడా ఇటువంటి వారున్నారా . . .ఇది అస్సాంలో ఏ పల్లెనో ల్యాన్సీ రెండో భర్తను అడిగి తెలుసుకోవాలి. . . . అనుకొంటూ కిందకు దిగబోయాడు. బొర్చి . . .బొర్చి. . . మారెర్రే . . .అంటూ ఇందాకా తనను గమనిస్తున్న అతను దగ్గరకొచ్చాడు.
సుచేత్ కు అతను అన్నదేమిటో అర్థం కాలేదు. . .కాని తాను దిగవద్దని చెబుతున్నాడని అర్థం చేసుకొన్నాడు.
లేవబోయిన వాడు అలానే కూచొని తనతో ఉన్నామె ఎక్కడని అడిగాడు.
అతను ఎగాదిగా చూసి దాదా అన్నాడు.
సుచేత్ సైగలు చేసి చూపెట్టాడు.
అతను నవ్వి దూరంగా ఓ గుడెసెను చూపెట్టాడు.
ఓహొ ఓఫియాను అందులో ఉంచారా అనుకొంటూ. . తాగడానికి నీళ్ళడిగాడు సైగలతో. .
కొర్పె. . . కొర్పె. . . వణసు తింపేరా అని అడిగాడతను.
ఇదెక్కడి గోలరా బాబూ వీడు తిడుతున్నాడా లేక ఏదైనా అడుగుతున్నాడా అనుకొని నీళ్ళు అడిగాడు.
ఇంతలో దాదాపు ఏడు అడుగుల పొడవున్న ఒకతను పెద్ద పెద్ద అంగలతో సుచేత్ దగ్గరకొచ్చాడు.
పల్లెల్లో ఇప్పటికీ అంత ఎత్తు మనుషులుంటారని సుచేత్ కు జీర్ణించుకోవడం కష్టంగా తోచింది. ఈ పల్లెలో అందరూ ఆరోగ్యంగా అందంగా ఉన్నరే అనుకొంటూ ఆయనకు నమస్కారం పెట్టాడు. ఆయనా ప్రతి నమస్కారం చేసి సౌఖ్యమా. .ఇత్త్ ఎంచ ఉల్లార్ అంటూ ఏదో అడిగాడు.
సుచేత్ కు ఆయన అడిగినేమిటో అర్థం కాలేదు. . .ఇది ఏమి భాషో అనుకొని అయ్యా తెలుగు హిందీ ఇంగ్లిష్ అంతే అన్నాడు.
ఆయన మొహం చిట్లించుకొని తెలుగు. . .హిన్న్ ఇంగ్గ్ అని . . .ఏదో ఆలొచించి ఓ తెలుంగులా. . . అన్నాడు.
హమ్మాయ్య ఇప్పటికి తెలుగొచ్చిన వారు ఒకరైనా దొరికారనుకొని అవనవును అన్నాడు.
కృష్నా తీరంబు వారు కడు చంతకారం బనియున్నాం. . పూటు ఇడు జేస్తున్నా ఆన్నాడు నవ్వుతూ. .
సుచేత్ హతాషుడయిపోయాడు. ఆయన తెలుగుకు,తల గోక్కుంటూ ఇది ఏ ఊరు ఇక్కడ నుండి సిటీకి ఎంత దూరం అవుతుందని అడిగాడు.
ఆయన కాస్త ఆలోచించి మంగళావు అన్నాడు.
ఊరుపేరడిగితే ఇంత సేపు ఆలొచిస్తాడేమిటీ అనుకొని అయ్యా ఇక్కడేదైనా అంగడి లాంటిది ఏదైనా ఉందా అని అడిగాడు.
ఆయన అర్థం కానట్టు మొహం పెట్టాడు.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 2 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: తెలివైన మూర్ఖుడు - by Monica Sunny - 25-04-2019, 08:13 PM



Users browsing this thread: 15 Guest(s)