25-04-2019, 07:45 PM
ఓ పదిరోజుల తరువాత పరిసరాలను గుర్తుపట్టే స్థితిలో ఉన్న సుచేత్ ను చూట్టానికి ఓఫియా అనే నడివయస్కురాలొచ్చింది.ఓఫియా రాకతో సెక్యూరిటీ ఆఫీసర్లకు చిక్కుముడివిప్పడానికి కొంత అవకాశం దొరికినట్లయ్యింది.సుచేత్ కొద్దిగా గుర్తుపడుతున్నాడు కాబట్టి అతడి మీద ఎవరు దాడి చేసారో తెలుసుకోవడానికి ఓఫియా తప్పకుండా సహయపడగలనని చెప్పి అతడిని హాస్పిటల్ నుండి డిస్ చార్జ్ చేయించుకొని తన ఇంటికి తీసుకెళ్ళింది.ఒక వైపూ సెక్యూరిటీ ఆఫీసర్లూ ఓ వైపు జర్నలిస్టులూ మీడియా వాళ్ళూ అడిగిన వాటికి ఓపిగ్గా సమాధానాలు చెబుతూ సుచేత్ ను కనిపెట్టుకొని ఉంది ఓఫియా. . ఆమె ప్రయత్నమంతా గుర్తిస్తూనే ఉన్నాడు కని మాట్లాడలేని స్థితిలో ఉన్న సుచేత్ కు తన గతము గుర్తు చేసుకొని ఎవరికి ఏవిధంగా న్యాయం చేయాలా అని ఆలోచిస్తూ వెనక్కు వాలాడు.
తాను ఆంధ్ర తమిళనాడు గడిప్రాంతంలో ఉన్న మారుమూల పల్లెలో పుట్టినవాడు.తనకు ఊహ తెలిసే నాటికి ఇంటి నిండా పేదరికం తాండవిస్తోంది. ఉమ్మడి కుటుంబం అమ్మా నాన్న బాబాయిలూ వారి కుటుంబాలూ పిల్లలూ అందరినీ తన నాన్నే పోశిస్తూ ఉన్నాడు. అందరూ ఉమ్మడిగా వ్యవసాయం చేస్తూ బ్రతికే వారే ఎవరికి వారు విడిపోతే వచ్చే తిండి గింజలకు కూడా కరువైపోతుందని నాన్న పెద్దరికంలో అందరూ ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ఉన్నారు. పొలంలోనే ఇల్లు కట్టుకొన్నారు గనుక ఇల్లంతా ఎప్పుడూ సందడి సందడిగాఉండేది. నాన్నకు తనతో కలుపుకొని నలుగురు సంతానం తను మూడవవాడు.అన్న తరువాత తను తరువాత ముబల,ఇంకో చెల్లయ్. .తాము గాక ఇద్దరు బాబాయిల పిల్లలు మొత్తం ఆరు మంది. అందరూ కాలేజీకు వెళుతున్నవారే. . .అన్నయ్య . .పట్నంలో ఏదో ఫాక్టరీలో పని చేస్తూ ఇంటికి అంతో ఇంతో పంపుతున్నాడు. ముబల కాస్త చదువుకొంది కాబట్టి ఉద్యోగప్రయత్నాలు చేస్తోంది.
చచ్చీ చెడీ తాను డిగ్ర్రీ చేరేనాటికి ఊళ్ళో కరువు తాండవిస్తోంది. బాబాయిలిద్దరూ పట్నానికి కూలిపనులకెళ్ళారు. నాన్న ఒక్కడే ఇంటిని చూసుకొంటూ వాళ్ళు పంపేదాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ. . కూరగాయలను పండించుకొని అమ్ముకొస్తూ ఉన్నాడు. ఇలా ఉన్న సంధర్భంలో . . ఆ పేదరికాన్ని భరించలేక సంపాదనకు మార్గాలు వెదక సాగాడు తను.

కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.