25-04-2019, 07:45 PM
నగరం నడిబొడ్డునుండే ఫ్లాట్లోనుండి హిగ్గాముగ్గా చావ బాదుతూ ఓ ఐదారు ఆడవారు ఓ పదిమంది దాకా మగవారున్న గుంపొకటి సుచేత్ కుమార్ అనే అతన్ని రోడ్డుమీదకు లాగి కాళ్ళతో తన్నుతూ చేతికందిన దానితో చావబాదుతున్నారు. పక్కనున్న ఇద్దరు ముగ్గురు ఆడవారు కొంతమంది మగవారు ఆపడానికి ప్రయత్నిస్తున్నా అది ఇంకా గందరగోళానికి దారి తీస్తోంది. సుచేత్ వొంటిమీదున్న బట్టలన్నీ చీలికపీలికలైపోయి ముక్కూ మొహం అంతా ఒకటైపోయింది.ఇంత లావున మొహం వాచి కళ్ళు ముందుకు ఉబ్బి వచ్చేస్తున్నాయి.ఓ కాలు విరిచేసారు. చేతివ్రేళ్ళు రెండూ విరిగిపోయాయి . . వీపంతా రక్తంతో తడిసిపోతోంది. అరవడానికి కూడా వకాశం లేకుండ పళ్ళు ఓ పక్కకి తిరిగిపోయి ఉన్నాయి. .జనం ఇంకా చావబాదుతూ ఉంటే రోడ్డుకు అడ్దం పడిపోయి కళ్ళు తేలవేసేసాడు సుచేత్ కుమార్. . సెక్యూరిటీ ఆఫీసర్లు రంగం లోదిగి జనాన్ని చెదరగొట్టి కొన ఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్ళా రు. ఆరోజు మొత్తం అన్ని చానెళ్ళనిండా ఒకటే చర్చ , రచ్చ. . ఫైనాన్సియర్ సుచేత్ కుమార్ ను ఎందుకలా తరాటకు తీసుకోవాల్సి వచ్చింది?అతడు చేసిన తప్పేమిటీ?ఎవరి వల్ల అతడు టార్గెట్ చేయబడ్డాడు? ఇలా రక రకాలుగా ఎవరికి తోచింది వారు చెబుతూ అతడిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇలా వెనుకా ముందూ ఎవరూ లేని సుచేత్ కుమార్ దాదాపు పదిరోజుల దాకా స్పృహలోనికి రాలేదు.సెక్యూరిటీ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఉన్న ఆడిని చూడడానికి ఎవరూ రాలేదు.సెక్యూరిటీ ఆఫీసర్లు రంగం లోనికి దిగారు.దక్షత గలకొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లు కూపీ లాగడానికి నియమింపబడ్డారు.
స్పృహలోనికొచ్చిన సుచేత్ కుమార్ ను చూడడానికి ముబల అనే ఆమె వచ్చిందని తెలిసి అక్కడున్న పోలీసధికారి హుటాహుటిన పై అధికారులకు విశయం చేరవేసాడు.
ముబలను సెక్యూరిటీ ఆఫీసర్లాధీనంలోనికి తీసుకొని ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. ముబల సుచేత్ కుమార్ కు స్వయానా చెల్లెలు.డిల్లీలో ఉంటుంది. అతడు స్పృహలోనికొచ్చాడని తెలిసి వచ్చానని లేకపోతే అసలు వచ్చేదాన్ని కాదని నిర్మొహమాటంగా చెప్పింది.సెక్యూరిటీ ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు ఆమె సమాధానానికి, చావుబదుకుల్లో ఉన్న అన్నను చస్తే బావుంటదని, ,ఇప్పుడు కూడ స్పృహలోనికొచ్చాడు కాబట్టే వచ్చానని అంటుందేమిటీ అనుకొని వివరాలు లాగడానికి సిద్దపడ్డారు. . . కాని ఆ వివరాలు అవసరం లేదని అతడి పై కేసుల విశయమై మాత్రమే వచ్చానని అంతవరకూ మాత్రమే తాను సహాయపడగలనని చెప్పివెళ్ళిపోయింది.

కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.