Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అన్నయ్యా మహేష్ అన్నయ్యా ....... 
కళ్ళుతెరిచి నా గుండెలపై హాయిగా నిద్రపోతున్న బుజ్జితల్లిని చూస్తూ పెదాలపై తియ్యదనంతో లేచికూర్చున్నాను - ప్రక్కనే పెద్దయ్య కూర్చునే నిద్రపోతున్నారు .
తమ్ముళ్లు : అన్నయ్యా అన్నయ్యా ....... రోడ్డు పూర్తయిపోయింది అంటూ సంతోషాలతో చూయించారు .
పూర్తయిపోయిందా అంటూ సమయం చూస్తే ఉదయం 6 గంటలు ....... , తమ్ముళ్లు సంతోషంతో చూస్తున్నవైపు చూసాను - అప్పుడే పడుతున్న తొలి సూర్యకిరణాల వెలుతురులో అనకొండలా వంపులు తిరిగినరోడ్డు గ్రామం వరకూ మరియు మరొకవైపు కనుచూపు మేరవరకూ ఉండటం చూసి ఆనందంతో బుజ్జితల్లిని గుండెలపై ఎత్తుకుని దిగబోతూ ....... పెద్దయ్య సీట్ బటన్ ప్రెస్ చెయ్యడంతో నెమ్మదిగా బెడ్ లా మారింది . 
కాంట్రాక్టర్ గారు మాటిచ్చినట్లుగానే రాత్రికిరాత్రి రోడ్డు నిర్మాణం పూర్తిచేసేశారు అంటూ కారుదిగి రోడ్డు దగ్గరికి చేరుకున్నాను . 

సర్పంచ్ గారు ...... కాంట్రాక్టర్ గారితోపాటు వచ్చి , బాబూ ...... నిజంగా మీరు దేవుడు అంటూ నా చేతిని నుదుటిపై తాకించుకున్నారు .
సర్పంచ్ గారూ ....... ఉదయం ఉదయమే ........
బుజ్జితల్లి : మళ్లీ మొదలెట్టేసారన్నమాట అంటూ బుజ్జిబుజ్జిగా నవ్వుతోంది . 
అంతే అందరమూ నవ్వేసాము .
బుజ్జితల్లి : గుడ్ మార్నింగ్ అంకుల్ ...... , wow wow రోడ్డు సూపర్ అంటూ నా ముఖమంతా ముద్దులవర్షం కురిపిస్తోంది .
నా బుజ్జితల్లిని బుజ్జి గుడ్ మార్నింగ్ , నిద్రపట్టిందా బుజ్జితల్లీ ...... sorry కారులోనే పడుకోబెట్టుకున్నాను .
బుజ్జితల్లి : హాయిగా వెచ్చగా అంకుల్ ఉమ్మా ....... , మీరు ఆర్డర్ వేసినట్లుగా తెల్లవారేలోపు రోడ్డు రెడీ అయిపోయింది అంటూ రెండువైపులా చూసి ఆనందిస్తోంది .
కాంట్రాక్టర్ గారూ ...... ఈ ఆనందాలకు కారణం మీరే , రాత్రంతా కష్టపడిన కూలీలు సంతోషంతో ఇంటికి వెళ్లేలా కూలీ ఇవ్వండి . 
కాంట్రాక్టర్ గారు : ఒక్కొక్కరికి ఐదింతల కూలీ ఇచ్చాము మహేష్ ....... , ఎంత హ్యాపీగా వెళ్లి ఉంటారో నువ్వే ఊహించుకో , డైరెక్ట్ గా మాకు - ఇన్డైరెక్ట్ గా నీకు థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్లారు . ఖర్చులు పోనూ ...... మిగతా అమౌంట్ సర్పంచ్ కు అప్పచెప్పాను - ఇంటికివెళ్లి కాసేపురెస్టు తీసుకుని వచ్చేస్తాను కాలేజ్ బిల్డింగ్ పనులు మొదలెట్టాలికదా ........
గోవర్ధన్ : అన్నయ్యా ...... రాత్రికి రాత్రి శిథిలావస్థలో ఉన్న కాలేజ్ గోడలన్నీ నేలమట్టం చేసేసి , శంకుస్థాపనకు కూడా రెడీ చేసేసారు .
థాంక్యూ so మచ్ కాంట్రాక్టర్ గారూ .........
కాంట్రాక్టర్ : దేవుడిలా మీరు ముందుకు రావడం వల్లనే కదా ..... ఇంత మార్పు జరుగుతోంది .
కాంట్రాక్టర్ గారూ ...... మీరుకూడానా అంటూ బుజ్జితల్లితోపాటు నవ్వుకున్నాను .
కాంట్రాక్టర్ గారు : మహేష్ ....... 10 గంటలకు శంకుస్థాపన పూజకు మంచి ముహూర్తం ఉంది , ఆసమయానికి వచ్చేస్తాను అని చేతులుకలిపి వెళ్లిపోయారు .

బుజ్జితల్లి : అంకుల్ ....... మనం రాత్రి మెయిన్ రోడ్డు దగ్గర కదా ఉన్నది , ఇక్కడికెలా వచ్చాము . 
అలా రోడ్డు నిర్మాణం జరుగుతుంటే మనం ప్రక్కనే ఫాలో అవుతూ ఇక్కడివరకూ వచ్చేసాము బుజ్జితల్లీ ........
వినయ్ : కీర్తీ ....... ఈ రోడ్డు నిర్మాణం జరిగినది అంటే అది నీవల్లనే - నిన్ను పడేసిన రోడ్డుపై తొలిఅడుగులు నువ్వే నడవాలన్నది మాకోరిక ........
వాళ్ళ కోరిక తీర్చేద్దామా బుజ్జితల్లీ .......
బుజ్జితల్లి : ఇంకా గట్టిపడినట్లు లేదుకదా అంకుల్ ....... 
సర్పంచ్ గారు : నీ బుజ్జిపాదాల అడుగులు పడాలి - అవి ఈ రోడ్డు ఉన్నంతవరకూ ఉండి , నీవల్లనే అంటూ అందరూ మాట్లాడుకోవాలి .
బుజ్జితల్లి : అంకుల్ ........
స్వచ్ఛమైన కోరిక , తీర్చాల్సిందే బుజ్జితల్లీ ....... అంటూ పాదాలను నా షర్ట్ పై తుడిచాను .
బుజ్జితల్లి : అంకుల్ ....... , నేనంటే ఇంత ప్రాణమా అంకుల్ అంటూ బుజ్జి ఆనందబాస్పాలతో గట్టిగా హత్తుకుంది .
వినయ్ : ప్రాణం కంటే ఎక్కువ కీర్తీ ....... , మాకు కూడా తెలిసిపోయింది .

తమ్ముళ్లూ ...... బుజ్జిపాదాలను కడగటానికి .......
తమ్ముళ్లు : స్వచ్ఛమైన మంచినీళ్లు తీసుకొస్తాము అన్నయ్యా ...... అంటూ పరుగుతీసారు .
సర్పంచ్ గారితోపాటు వెనుకే ఫాలో అవుతున్న కారుతో , బుజ్జితల్లికి ముద్దులుపెడుతూ గ్రామం మొదలువరకూ వెళ్లి , బుజ్జితల్లీ ...... రోడ్డుమధ్యలోకివెళ్లి గ్రామంలోకి తొలి అడుగులు పడేలా పదే పది అడుగులువేసి వచ్చెయ్యి .......
బుజ్జితల్లి : మీరురావడం లేదా ...... ? , అయితే నేనూ .......
బుజ్జితల్లీ నా బంగారూ ....... , నీ బుజ్జి అడుగులు పడితే నా అడుగులు పడ్డట్లే - మమ్మీ అడుగులు పడ్డట్లే - అమ్మమ్మా తాతయ్య మావయ్య అడుగులు పడ్డట్లే .....
సర్పంచ్ గారు : అలానే ఊరందరి అడుగులు పడ్డట్లే ..... 
బుజ్జితల్లి : అయితే ok అంకుల్ అంటూ నా బుగ్గపై ముద్దులుపెట్టింది .
లవ్ యు బంగారూ అంటూ ముద్దులుపెట్టి రోడ్డుమీదకు దించాను . నా బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ రోడ్డు మధ్యలోకివెళ్లి నావైపు చూస్తోంది . 
వెంటనే నేను - నాతోపాటు తమ్ముళ్లూ ...... మొబైల్స్ తీసి వీడియో తీస్తున్నాము .
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులతో 1 2 3 4 5 6 7 8 9 10 అడుగులువేసి , అంకుల్ అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరింది . షర్ట్ పై సిమెంట్ మరకలు చూసి వెంటనే దిగబోతే ........
I love them బుజ్జితల్లీ ....... , నా ప్రాణమైన బుజ్జితల్లి బుజ్జిపాదాల అడుగులు ఉమ్మా ఉమ్మా ....... , తమ్ముళ్లూ ...... 
రెడి అన్నయ్యా ...... అంటూ నీళ్లు పొయ్యడంతో ఎత్తుకునే కడిగి , మమ్మీ - అమ్మమ్మ దగ్గరికి వెళదామా ....... ? .
బుజ్జితల్లి : అప్పుడేనా ....... ? .
ఆ ఒక్కమాటకు ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేను - అదికాదు బుజ్జితల్లీ ....... చూసి 9 గంటలు అవుతోంది కదా ........
బుజ్జితల్లి : మా అంకుల్ ఉంటే నాకు ...... మమ్మీ అవసరం లేదు అమ్మమ్మా అవసరం లేదు - నాకు అన్నీ మా అంకులే .......
తమ్ముళ్లు : సరిగ్గా చెప్పావు కీర్తీ ...... 
కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగడం లేదు . ఇంటికివెళ్లి రెడీ అయ్యి పెళ్ళిపనులు పూర్తిచేద్దాము ok నా అంటూ హైఫై కొట్టుకుని లోలోపలే పరవసించిపోతున్నాను .

సర్పంచ్ గారు : బాబూ ...... నేనూ స్నానం చేసివస్తాను అని కాలువవైపు వెళ్లారు .
అటెక్కడికి తమ్ముళ్లూ ....... 
తమ్ముళ్లు : రోజూ కాలువలోనే స్నానం చేస్తారు అన్నయ్యా ...... - అదిగో ఎదురుగా కనిపించే పెద్ద బిల్డింగే అన్నయ్యా ...... సర్పంచ్ గారిది , గ్రామంలో రెండు పెద్ద ఇల్లులు పెద్దయ్యా మరియు సర్పంచి గారివే ...... కానీ అవి ఒకప్పుడు , ఇప్పుడు రెండూ ...... అంటూ బాధపడుతూ చెప్పారు .
తమ్ముళ్లూ ....... ఈ బిల్డింగ్స్ కొన్నవారు ఎక్కడ ఉన్నారు - ఎక్కడ ఉన్నా సరే వారు కోరినంత అమౌంట్ ఇచ్చేసి రేపటిలోపు పెద్దయ్య - సర్పంచ్ గారి పేర్లపై రిజిస్టర్ అయిపోవాలి , ఏమిచేస్తారో నాకు తెలియదు - పని పూర్తిచేసి కాల్ చెయ్యండి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను - అలానే బ్యాంకుకువెళ్లి 10 కోట్లు తీసుకొచ్చెయ్యండి అవసరాలకు ఉంటాయి అంటూ చెక్ రాసిచ్చాను .
తమ్ముళ్లు : ఇంత సంతోషమైన విషయం చెప్పారు - రేపటివరకూ ఎందుకు అన్నయ్యా ..... మధ్యాహ్నం లోపు పత్రాలు తీసుకొచ్చేయ్యమూ ...... , పెళ్ళిపనుల్లో సహాయం చెయ్యాలికదా ........
టచ్ చేశారు తమ్ముళ్లూ ....... 

బుజ్జితల్లి : అంకుల్ ....... అంటూ ప్రాణంలా చుట్టేసింది .
నా బుజ్జితల్లికి ఈ విషయాలుకూడా అర్థమయ్యాయి అంటే టూ టూ toooooo ఇంటెలిజెంట్ అన్నమాట , మమ్మీ ....... కంగారుపడుతూ ఉంటుంది అంటూ ఇంటికి చేరుకున్నాము .

పెళ్ళికొడుకు అప్పుడే కొత్తబట్టలలో రెడీ అయినట్లు గుడ్ మార్నింగ్ అన్నయ్యా - గుడ్ మార్నింగ్ బుజ్జితల్లీ అని విష్ చేసాడు .
గుడ్ మార్నింగ్ తమ్ముడూ - గుడ్ మార్నింగ్ మావయ్యా ....... , తమ్ముడూ ...... సూపర్ .
తమ్ముడు : మీరు తీసుకొచ్చినవే కదా అన్నయ్యా ...... , థాంక్స్ ........
థాంక్స్ దేనికి , నువ్వు డబ్బులు ఇచ్చావు - నేను తీసుకొచ్చాను అంతే ...... , ఇచ్చిన డబ్బంతా ఖర్చు చేశానని బాధగా ఉంటేనూ ......
తమ్ముడు షాక్ లో నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు .

మా మాటలు విన్నట్లు నా దేవత - పెద్దమ్మ ..... బుజ్జితల్లిపై ఏమాత్రం కంగారు లేనట్లు బయటకు వచ్చారు . దేవత ..... నన్నే ఆరాధనతో చూస్తున్నట్లు అనిపించింది .
అందరూ ఎప్పుడో రెడీ అయినట్లు నా దేవత దివినుండి దిగివచ్చిన దేవతలా నేను సెలెక్ట్ చేసిన పట్టుచీరలో ఉండటం కన్నార్పకుండా చూస్తుండిపోయాను .
దేవత అందంగా కళ్ళెగరేసి సిగ్గుపడటం చూసి తెరుకున్నాను . బుజ్జితల్లీ ....... మీ మమ్మీ - అమ్మమ్మ ..... నన్ను కొట్టడానికే వచ్చినట్లున్నారు , చూడు ఎలా కోప్పడుతున్నారో ........
దేవత : నాపై ఎంత కోపం ఉంటే మాత్రం అలా చాడీలు చెప్పొచ్చా మహేష్ గారూ ........ , మీబుజ్జితల్లి చూడండి ఎంత కోపంతో చూస్తోందో - మీతోనే స్నానం చేయడానికి కూడా రెడీ అన్నట్లు ......
బుజ్జితల్లి నవ్వేసింది .

బాబూ కృష్ణా ....... పెద్దయ్య మాటలు వినిపించడంతో , నాన్నగారూ ...... జాగ్రత్త అంటూ పరుగునవెళ్లాడు .
బుజ్జితల్లీ ...... మమ్మీ - అమ్మమ్మ దగ్గరకువెళ్లు , తాతయ్యను లోపలికి తీసుకొస్తాము అని ముద్దుపెట్టి కిందకు దించాను .
బుజ్జితల్లి : పర్లేదులే అంకుల్ ఇక్కడే ఉంటాను .
దేవత : విన్నావా అమ్మా ...... , ఇక దానికి మనం అవసరం లేదని చెప్పానా ...... , అదే నిజం అయ్యింది .
బుజ్జితల్లి బుజ్జిబుజ్జినవ్వులు నవ్వడం చూసి నవ్వుతూనే దేవతవైపు చూసాను . అంతే నవ్వు ఆపేసి తలదించుకున్నాను .
దేవత నవ్వుతున్నట్లు అనిపించింది . పెద్దయ్య దగ్గరికివెళ్లి ఎలా ఉంది పెద్దయ్యా ....... డాక్టర్ ను పిలిపించమంటారా ? .
పెద్దయ్య కిందకుదిగగానే బాబూ ...... అంటూ కళ్ళల్లో సంతోషపు చెమ్మతో కౌగిలించుకున్నారు - నువ్వు ..... మాకోసమే వచ్చిన దేవుడివి , నువ్వు పంచిన ఈ ఆనందాలకు - ప్రేమకు ఎప్పుడో ఈ దెబ్బలన్నీ మటుమాయమైపోయాయి - ఇక డాక్టర్ అవసరమే లేదు బాబూ - జీవితాంతం నీకు ఋణపడిపోయాను - కృష్ణా ...... నేను ఉన్నా లేకున్నా ఇకనుండీ మన ఇంటి దైవం వీరే గుర్తుపెట్టుకో .......
తమ్ముడు : అలాగే నాన్నగారూ .......
పెద్దయ్య : చిన్నవాడివైపోయావు బాబూ లేకపోతే పాదాలకు ......
పెద్దయ్యా ...... ఏదో కలగన్నట్లున్నారు , రాత్రంతా నిద్రపోలేదుకదా అందుకే ఇలా మాట్లాడుతున్నట్లున్నారు , ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటే ఆల్రైట్ అయిపోతారు .
పెద్దయ్య : ఇంత మంచితనం ఎలా బాబూ ....... , దేవుళ్లకే ఇంత మంచితనం ఉంటుంది , అందుకే మా దేవుడయ్యారు బాబూ .......
పెద్దయ్యా ....... 
పెద్దయ్య : ఇప్పుడే నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను బాబూ ....... , నువ్విచ్చిన సంతోషం ....... నా జీవితాంతం గుర్తుండిపోతుంది , బాబూ కృష్ణా - శ్రీమతీ - తల్లీ మహీ ...... ఈ దేవుడి రుణం తీర్చుకునే అవకాశం లభించాలని ప్రార్థించండి , అది ఎలాంటిదైనా అదే అదృష్టము , మనలో మన బుజ్జితల్లి అప్పుడే కొద్దికొద్దిగా రుణం తీర్చుకుంటోంది అదే చిరు సంతోషం - బుజ్జితల్లి ...... అమ్మ అమ్మమ్మ తాతయ్య మావయ్య కంటే మీతోనే ఉంటాను అంకుల్ అంటూ ముద్దులుపెడుతూ కాస్తయినా రుణం తీర్చుకుంటోంది - బుజ్జితల్లీ ...... థాంక్యూ రా ......
బుజ్జితల్లి : Welcome తాతయ్యా ...... అంటూ పరుగునవచ్చి జంప్ చేస్తూ నా గుండెలపైకి చేరింది .
బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకునే పెద్దయ్యను లోపల గదిలోకి వదిలివచ్చాము . అడ్డుగా నిలబడిన దేవతను చూసి తలదించుకుని sorry మహిగారూ ...... అంటూ బుజ్జితల్లిని అందించాను .
దేవత : చేసిందంతా చేసి , బుజ్జితల్లిని బుట్టలో వేసుకుని ఇప్పుడు ఏమీ తెలియనట్లు ....... , అదిగో చూడు నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు ఇప్పుడు ఏకంగా ఒక్క క్షణం కూడా నాదగ్గరకు రావడం లేదు , ఏ మంత్రం వేశారో ఏమి మాయ చేశారో అంటూ నా చేతిపై గిల్లేసారు .
స్స్స్ ...... sorry మహిగారూ , నేనైతే ఏ మంత్రం మాయ చెయ్యలేదండీ ప్రామిస్ ప్రామిస్ ........
దేవత నవ్వుతున్నట్లు అనిపించి చూస్తే , వెంటనే కోపంతో మళ్లీ గిల్లేసారు . వెళ్ళండి పైకివెళ్లి మీ బుజ్జితల్లిని రెడీ చెయ్యండి .
నా వల్ల ఎలా అవుతుంది మేడం గారూ .......
బుజ్జితల్లి : దేవతతోపాటు బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకుని , అంకుల్ ...... స్నానం చేయించండి - మీరు కొన్న డ్రెస్ వెయ్యండి అంతే ....
అదికాదు బుజ్జితల్లీ ....... , నా బుజ్జితల్లి ...... తన మమ్మీ అందం కంటే ......
దేవత : వాట్ ..... ? .
అదే అదే మీ అందం - మీ అమ్మగారి అందం - మీ తమ్ముడి అందం కంటే అందంగా రెడీ అయితే చూడాలని ఆశ , అలా మీరైతేనే అలంకరిస్తారు అందుకని .......
బుజ్జితల్లి : మా అంకుల్ రుణం తీర్చుకునే అవకాశం ఏదీ వదులుకోకూడదు అని తాతయ్య ఆర్డర్ - మీ కోరికను తీరుస్తాము - మమ్మీ ....... మీకంటే అందంగా రెడీ చెయ్యాలి అదికూడా అంకుల్ రెడీ అయ్యి వచ్చేన్తలో .......
దేవత : నేనా ...... , లేదు లేదు ఈ పట్టుచీరను చూడగానే ఎంతో నచ్చేసింది , తడిసిపోతుంది రా .......
బుజ్జితల్లి : అంకుల్ ....... నీకోసం ఎంతో ఇష్టంతో సెలెక్ట్ చేసిన ఫస్ట్ సారీ ఇదే మమ్మీ , కదా అంకుల్ ....... కాస్ట్ ఎంతో తెలుసా ..... ? .
నేనా ...... లేదు లేదు లేదు అంటూ తడబడుతున్నాను - వెంటనే బుజ్జితల్లి బుజ్జి నోటిని సున్నితంగా మూసేసాను. 
బుజ్జితల్లి : అంకుల్ కోరికను తీర్చడం కోసం ఏదైనా చేయాల్సిందే , ఇంకా బోలెడు పట్టుచీరలు ఉన్నాయి కదా మమ్మీ .......
దేవత : అయితే ok పదా అంటూ ఎత్తుకోబోతూ నా చేతులను టచ్ చేశారు .
కరెంట్ షాక్ కొట్టినట్లు వెంటనే వెనక్కు లాగేసుకుని sorry sorry sorry అంటూ తలదించుకుని వణుకుతున్నాను .
బుజ్జితల్లితోపాటు దేవతకూడా నవ్వుతున్నట్లు అనిపించింది - చూసే ధైర్యం లేక అలాగే ఉండిపోయాను .
దేవత : నవ్వుతూనే పైకి రండి మా ఇంటి దేవుడు గారూ ...... , మీ గదిలోని బెడ్ పై మీ కొత్త డ్రెస్ ఉంచాను అంటూ పైకివెళ్లి వారి గదిలోకివెళ్లారు .

పెద్దమ్మ : బాబూ ...... కాఫీ ......
వద్దు వద్దు పెద్దమ్మా ...... , బ్రష్ కూడా చేయలేదు - ఫ్రెష్ అయ్యాక తాగుతాను . 
పెద్దమ్మ : సరే బాబూ ...... , స్నానం అయ్యాక అడుగు అనిచెప్పి వంట గదిలోకివెళ్లారు .
పైకి వెళ్ళిచూస్తే బెడ్ పై డ్రెస్ ఉంది - దేవత ...... నాకోసం అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను . ( రేయ్ అంతలా ఫీల్ అవ్వకు గెస్ట్ కాబట్టి ok నా తగ్గు తగ్గు ) నవ్వుకుని సిగ్గుపడుతూ వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని దేవత ఉంచిన డ్రెస్ వేసుకుని బయటకువచ్చి , దేవత గదివైపు చూస్తూనే కిందకువచ్చాను .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 04-12-2021, 05:38 PM



Users browsing this thread: 198 Guest(s)