01-10-2021, 11:11 PM
(28-09-2021, 12:41 AM)Vikatakavi02 Wrote:సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి పుస్తకాలు
ఒంటరినన్ను పట్టి పీడించే ఒక జీవితకాలపు వేదన ఈ నవల.
డోజర్లతో పొదలన్నిట్నీ కుళ్లగించి, బరకల్నీ, బీడునేలల్నీ సాగుభూములుగా మార్చే క్రమంలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తోన్న దుర్మార్గం ఒకవైపు పల్లెల్ని కమ్ముకొస్తూవుంటే, మరోవైపు పాతకాలపు వృక్షాల ఫలసాయంతో తృప్తిపడాల్సిందిపోయి, ఆ చెట్లనే నరికి సొమ్ము చేసుకోవాలని చూసే మూర్ఖత్వం, స్వార్ధం చుట్టుముడుతూవుంటే, ఇంకోవైపు బహుళజాతి కంపెనీల వంగడాలతో సాంప్రదాయక విత్తనాలు, తృణధాన్యాలను మట్టిలో పాతిపెట్టే అత్యాశ ఒక దయ్యంలా వెంటాడుతోంటే పల్లె తన స్వరూపం కోల్పోతున్న పరిస్థితి నా హయాంలోనే చూస్తూ వున్నాను.
ఈ విధ్వంసదృశ్యాలన్నిటికీ సాక్షీభూతంగా నిల్చున్న దయనీయ స్థితిలోంచి ఈ నవల పుట్టింది. పర్యావరణాన్ని మాత్రమే కాదు, తన్ను తాను కాల్చి బూడిద చేసుకునే దిశగా మనిషి గమనం చూస్తున్నాను కాబట్టే ఈ నవల రాయాల్సివచ్చింది. రోడ్డుకు దూరంగా, మారుమూల పల్లెల్లో బతుకుతూ వున్న పాత కాలపు వ్యవసాయదారుల జీవన మూలాల్ని అంటుగట్టి తెచ్చి, నగరీకరణ దిశగా అడుగులేస్తోన్న పల్లెవీధి కూడళ్లలో నాటగలిగితే ఈ రోగానికి కొంతైనా ఉపశమనపు మందు తయారవుతుందేమోనన్న ఆశతో ఈ నవల రాశాను.
ప్రకృతిని అర్థం చేసుకున్నవాడెవడూ దాన్ని విధ్వంసం చేయడు.జంతువుల అరుపుల్ని వాటి భాషగా అర్ధం చేసుకోలేక, మొక్కల స్పర్శని వాటి పలుకులుగా అనువదించుకోలేక, పక్షుల కిలకిలారావాల్ని వాటి మాటలుగా గ్రహించలేక, వాటితో చెలిమి చేయలేక, వాటిని దూరంగా తరిమి నేలను సొంతం చేసుకోవాలని ప్రయత్నించే మనిషికి మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కొంతైనా అధ్యయనం చేయించే ఒక చిన్న ప్రయత్నమే ఈ ‘ఒంటరి’ సవల.
మాయమవుతున్న పల్లెజీవితంపై పట్టణ ప్రభావం నేపథ్యంతో సాగిన నవల ఇది. ఇందులో రెండు భాగాలున్నాయి. ఒకటి - పేరు ప్రఖ్యాతలు గడించిన ఒక డాక్టర్ అంతరించిపోతున్న ధాన్యపు జాతి కోసం ఆరు నెలల అన్వేషణ. రెండవది తన ప్రాణవాయువుతో పొలాన్ని బుజ్జగించి, సమస్త జీవకోటితో అత్యంత సహజంగా మమేకమైపోయిన మరో అంతరిస్తున్న జాతి - రైతు జీవితం.- సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
>>>డౌన్లోడ్<<<
కొండపొలం
పల్లె పరిసరాలలో బతుకు వనరులు లభ్యం కానప్పుడు దగ్గర్లోని కొండల మీద ఆధారపడటం సహజం. ఉదయం వెళ్లి సాయంత్రం లోపల అటవీ ఉత్పత్తులను సేకరించుకుని వచ్చేవాళ్లు కొందరైతే , వారం పది రోజులపాటు అక్కడే కొండపోలం చేసి బతుకుతెరువు సాధించుకునేవాళ్లు మరి కొందరు. కరువు తాండ విస్తున్నపుడు గొర్రెలను నీళ్లు మేపు వెతుక్కొంటూ ఎక్కడో కొండల్లో నాలుగు చినుకులు రాలి గడ్డి పచ్చబడిన తావులు చేరుకుని క్రూరమృగాల దాడులు తప్పించుకుంటూ ఏడెనిమిది బత్తెల కాలం జీవించిన దుర్భరమైన జీవితం ఈ కొండపోలం నవల.
>>>డౌన్లోడ్<<<
Thanks for the book. I was searching all over the Google for this.