Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
ఆపరేషన్ లైట్ వెలుగగానే దేవతతోపాటు పెద్దమ్మను ప్రార్థించాను అక్కయ్యకు ఏమాత్రం నొప్పి తెలియకూడదు అని ....... , ఈ విషయం తెలిస్తే బామ్మ కూడా సంతోషిస్తారని ఇక్కడున్న బామ్మకు ధైర్యం చెప్పి ప్రక్కనే కుర్చీలో కూర్చోబెట్టాను . దేవత ప్రక్కనే కూర్చుని చేతిని అందుకుని ధైర్యం చెబుతున్నారు . డోర్ కు ఉన్న చిన్నపాటి మిర్రర్లో ఆపరేషన్ జరుగుతుండటం చూసి , కాస్త ముందుకువెళ్లి బామ్మకు కాల్ చేసి విషయం చెప్పాను - మీరు ఉంటే మీ చిట్టి బుజ్జితల్లి మరింత సంతోషిస్తారు .
బామ్మ : చాలా సంతోషం బుజ్జిహీరో ....... , ఏ హాస్పిటల్ అన్నావు ? .
Govt హాస్పిటల్ బామ్మా ...... , అంతే కాల్ కట్ అయ్యింది . ఆపరేషన్ రూంలోకి మరొక డాక్టర్ మేడం వెళ్లడం చూసి బామ్మకు మళ్లీ కాల్ చెయ్యడం మరిచిపోయాను .

అర గంటలో బామ్మనే ఆపరేషన్ రూమ్ దగ్గరికి వచ్చారు . 
బామ్మా - బుజ్జిహీరో ....... అంటూ ఒకరినొకరం చూసుకుని కేకలువెయ్యబోయి దేవత గుర్తుకువచ్చి ఆగిపోయి ముసిముసినవ్వులు నవ్వుకున్నాము .
బామ్మా ....... అంటూ దేవత వెళ్లి సంతోషంతో కౌగిలించుకున్నారు . బామ్మా ....... మరికొన్నిగంటల్లో చెల్లికి చూపు రాబోతోంది అనితీసుకెళ్లి చూయించారు .
అంతా సవ్యంగా జరగాలి అని బామ్మ మొక్కుకున్నారు .
దేవత : బామ్మా ....... చెల్లెలి బామ్మ అంటూ పరిచయం చేసారు .
బామ్మ : చెల్లీ ...... ఏమీ కంగారుపడకు , చిరునవ్వులు చిందిస్తూ బుజ్జితల్లి మనందరినీ చూస్తుంది , మనవైపు దైవం ఉన్నారు అంటూ నావైపు కన్నుకొట్టారు .
దేవత : బామ్మా ....... మీరు ? ఇక్కడికి ? .
బామ్మ : బుజ్జిహీరో కాల్ చేసాడు ? .
దేవత : నా స్టూడెంట్ మీకు కాల్ చెయ్యడం ఏమిటి ? .
బామ్మ :  అదీ అదీ ...... , నీ స్టూడెంట్ బుజ్జిహీరో కాదు బుజ్జితల్లీ ...... , నా బంగారుకొండ బుజ్జిహీరో కాల్ చేసాడు . మిమ్మల్ని సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకెళ్లడం చూసి ఫాలో అయ్యి ఇక్కడి నుండే కాల్ చేసాడు - నేను రాగానే బై చెప్పేసి వెళ్ళిపోయాడు . అయినా నీ స్టూడెంట్ బుజ్జిహీరో కాల్ చేసినా తప్పేంటి - మేము రెండుమూడుసార్లు ఫోనులో మాట్లాడుకున్నాము - నిన్న ఆలస్యమైనా నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చాడు , ఆటోలో కలిశాను - hi బుజ్జిహీరో .......
హలో బామ్మా ....... అంటూ ప్రక్కనవెళ్లి నిలబడ్డాను . దేవత చూడకుండా హైఫై కొట్టుకుని నవ్వుకున్నాము .
**********

లంచ్ సమయానికి ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తయినట్లు డాక్టర్స్ సంతోషంగా బయటకువచ్చి విషయం తెలిపారు - రెండు మూడు గంటల తరువాత బ్యాండేజస్ తొలగిస్తాము - అంతవరకూ మత్తులో ఉంటుంది - మత్తు ఇచ్చినా తమ్ముడూ , అక్కయ్యా , పెద్దమ్మా ...... అని నిరంతరంగా కలవరిస్తూనే ఉన్నారు - మామూలుగా అయితే ఆపరేషన్ అయిన వెంటనే ఎవ్వరినీ పేషెంట్ దగ్గరకు పంపించము కానీ మీ స్పర్శ కోసం ఆరాటపడుతోంది వెళ్ళండి - మీరెంత జాగ్రత్తగా చూసుకుంటారో మాకర్థమైపోయింది వెళ్ళండి వెళ్ళండి .
చాలా చాలా థాంక్స్ డాక్టర్ మేడమ్స్ - అతిపెద్ద గుడ్ న్యూస్ చెప్పారు అని అందరమూ సంతోషంతో చెప్పాము .
డాక్టర్స్ : మా డ్యూటీ మేము చేసాము . గంట తరువాత వచ్చి చూస్తాను - బ్యాండేజస్ మాత్రం టచ్ చెయ్యకండి .
లేదు లేదు డాక్టర్ మేడమ్స్ .......
డాక్టర్స్ : Ok అయితే వెళ్ళండి వెళ్ళండి , నర్స్ ఉంటుందిలే ...... , SI గారూ ...... అంటూ సంతోషంతో మాట్లాడుకుంటూ వెళ్లారు .

సంతోషం వేస్తున్నా సౌండ్స్ చెయ్యకుండా లోపలకు వెళ్ళాము .
బామ్మలు : బుజ్జితల్లీ - బుజ్జిహీరో ....... మిమ్మల్నే కలవరిస్తోంది మా చిట్టి తల్లి , ప్రక్కనే కూర్చుని ........ ఏమిచెయ్యాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదులే .......
పెదాలపై చిరునవ్వులతో ఒకరొకరం చూసుకుని రెండువైపులా స్థూల్స్ వేసుకుని కూర్చున్నాము . అతి సున్నితంగా ప్రాణంలా చేతి వేళ్ళలో వేళ్ళను పెనవేశాము .
అక్కయ్య పెదాలపై సంతోషం , తమ్ముడూ - అక్కయ్యా ....... ఎక్కడ కూర్చున్నారు , నా ప్రక్కనే బెడ్ పై కూర్చోండి please please ........
నర్స్ వైపు చూసాము .......
నర్స్ : పర్లేదు కూర్చోండి - తను ఎంత సంతోషంగా ఉంటే కొత్తగా అమర్చిన కళ్ళు అంతగా తనతో బాండింగ్ అవుతాయి .
థాంక్స్ నర్స్ ....... అంటూ లేచి బెడ్ పై కూర్చుని అక్కయ్య చేతులపై ముద్దులుపెట్టాము .
అక్కయ్య : ఆఅహ్హ్ ...... హాయిగా ఉంది . తమ్ముడూ ...... నువ్వు చెప్పినట్లే మన దైవం పెద్దమ్మను తలుచుకున్నాను , అసలు చీమ చిటుక్కుమన్నంత నొప్పి కూడా కలగలేదు , లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ .......
దేవత : లవ్ యు లన్నీ నీ తమ్ముడికి మాత్రమే అన్నమాట .......
అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని , నా తమ్ముడికంటే మా అక్కయ్యకు ఒక లవ్ యు ఎక్కువ - అదే నా తమ్ముడికి కూడా ఇష్టం ........
అవును అవును అక్కయ్యా ...... అంటూ సిగ్గుపడుతున్నాను .
దేవత : అక్కాతమ్ముళ్ళు ఒక్కటైపోయారన్నమాట ...... , చెల్లీ ...... మరొక రెండు గంటల్లో మమ్మల్ని చూడబోతున్నావని డాక్టర్స్ చెప్పారు .
అక్కయ్య : యాహూ ........
దేవత : నీ తమ్ముడు కూడా ఇంతే సంతోషం కలిగితే టాప్ లేచిపోయేలా కేకవేస్తాడు అని అందరమూ నవ్వుకున్నాము .

అక్కయ్య బామ్మ : ఇలాంటి రోజు వస్తుందని ఊహించనేలేదు , నా బుజ్జితల్లి ఆనందాలను చూస్తుంటే ...... , ఇక ఈ జీవితానికి ఇది చాలు , ఇదంతా మీ వల్లనే బాబూ - తల్లీ ........
ఇక అక్కయ్య చిరునవ్వులే చిరునవ్వులు బామ్మా ........ 
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ మా చేతిపై ముద్దుపెట్టి , గుండెలపై హత్తుకుని పులకించిపోతున్నారు .

కొద్దిసేపటికి లేడీ సెక్యూరిటీ అధికారి వచ్చి , SI సర్ స్వయంగా వారి ఇంటి నుంచి మీకోసం లంచ్ తెప్పించారు తినండి అని అందించి వెళ్లిపోయారు .
నర్స్ అక్కయ్యా ...... , అక్కయ్యకు తినిపించవచ్చా ..... ? .
డాక్టర్స్ వచ్చి చెప్పేంతవరకూ ఏమీ తినిపించరాదు - తనకు ఆకలి కూడా వెయ్యదు ఎందుకంటే రెండు గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించారు .
అక్కయ్య : అవును తమ్ముడూ - అక్కయ్యా ...... నాకు ఆకలి వెయ్యడంలేదు మీరు తినండి , మీరు తింటే నేను తిన్నట్లే ........
అయితే ok అక్కయ్యా ....... , అక్కయ్యా ....... బామ్మను కాసేపు కూర్చోబెట్టనా ........ ? .
అక్కయ్య బామ్మ : వద్దు బాబూ ....... , చూడు అప్పుడే పెదాలు బుంగమూతి పెట్టుకుంది . ఇకనుండీ నేను అవసరమే లేదు తనకు ....... , చూసారా ...... చిరునవ్వు .
అందరమూ నవ్వుకున్నాము - అక్కయ్య ...... మా చేతులను మరింత గట్టిగా పట్టుకున్నారు . అక్కయ్యా ....... మీకోసం అక్కయ్య బామ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చారు .
అక్కయ్య : బామ్మ మాటలేనా వినిపిస్తోంది ? , హలో బామ్మా .......
బామ్మ : అవును చిట్టి తల్లీ ....... కాసేపు హాయిగా రెస్ట్ తీసుకో .......
అక్కయ్య : తమ్ముడూ - అక్కయ్యా ...... మీ మీ ఎడమచేతులు నాకు ఇచ్చి మీరు కడుపునిండా భోజనం చెయ్యండి అని అందుకుని ముద్దులుపెట్టి ప్రాణంలా హత్తుకున్నారు . 
బామ్మలు వడ్డించడమే కాదు , ప్లేట్స్ పట్టుకోవడానికి వీలు లేదు కదూ అంటూ తినిపించారు . 
అక్కయ్యా ....... , మీరు మా చేతులను పట్టుకున్నందువలన బామ్మలే తినిపిస్తున్నారు , బామ్మల చేతిముద్దలు సో టేస్టీ .......
అక్కయ్య : Wow ....... అంటూ మళ్లీ ముద్దులుపెట్టి ఆనందిస్తోంది .

2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి డాక్టర్ మేడమ్స్ వచ్చారు .
డాక్టర్స్ వచ్చారని లేవబోతే అక్కయ్య ...... మరింత గట్టిగా పట్టుకోవడం చూసి , డాక్టర్స్ నవ్వుకుని పర్లేదు పర్లేదు తను ఎంత హ్యాపీ అయితే అంత మేలు అని చెక్ చేసి పర్ఫెక్ట్ , గంట తరువాత వచ్చి బ్యాండేజస్ వేరుచేస్తాము ఆ తరువాత సంబరాలు చేసుకోండి అనిచెప్పి వెళ్లారు .
థాంక్యూ soooo మచ్ డాక్టర్స్ ...... , అక్కయ్యా ...... ఇక గంటలో అంటూ సంతోషం పట్టలేక అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టాము .
అక్కయ్య : ప్చ్ ...... నా తమ్ముడిని - అక్కయ్యను చూడటానికి ఇంకా గంట వేచి చూడాలా ....... ? , టైం ట్రావెల్ ఉంటే బాగుండేది - క్షణంలో .......
లవ్ టు అక్కయ్యా - లవ్ టు చెల్లీ ........ అని ఆనందించాము .
అక్కయ్య : తమ్ముడు - అక్కయ్య ...... నాకిరువైపులా ఉండగా గంట గడిచిపోవడం ఎంతసేపు .......
అక్కయ్య బామ్మ : నా బంగారుతల్లికి చూపు అంటూ ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు .

బామ్మ : చిట్టితల్లీ ...... రాత్రంతా బుజ్జి హీ ...... మీ అక్కయ్య మీ అక్కయ్య నిద్రలోకూడా నా చెల్లికి చూపు రావాలి అని కలవరిస్తూనే ఉంది .
దేవత : నేను మాత్రమేనా ...... , మన బుజ్జిహీరో ఇంకెంత ప్రార్థించి ఉంటాడో - అక్కయ్య అంటే ఎంత ప్రాణమో కళ్ళల్లోనే తెలుస్తోంది .
లవ్ ....... థాంక్యూ మేడం ......
అక్కయ్య : తమ్ముడు - అక్కయ్య ....... నాకు దైవం పెద్దమ్మ ఇచ్చిన ప్రాణమైన వాళ్ళు , మీప్రార్థనల వల్లనే ఒక్క రోజులో చూడబోతున్నాను . 
అక్కయ్యా ...... సెక్యూరిటీ అధికారి సర్ చెప్పారు , రాత్రే ఆపరేషన్ రెడీ అని ఎందుకు .......
ఆక్కయ్యలు : నా తమ్ముడు - అక్కయ్య ఇలా ప్రక్కన లేని చూపు ఎప్పటికీ నాకవసరం లేదు .
అదికాదు అక్కయ్యా .......
అక్కయ్య : ఇప్పుడేమైంది కొన్నిగంటలు ఆలస్యం అంతే , అప్పుడు చేయించుకుని ఉంటే డాక్టర్స్ - నర్స్ చెప్పినట్లు ఇంత ఆనందం కలిగేదా ...... ? .
బామ్మలు : నిజమే నిజమే బుజ్జితల్లీ - చిట్టితల్లీ .......
అక్కయ్య : తమ్ముడూ ...... నీకు బాధ కలిగించి ఉంటే .......
లేదు లేదు అక్కయ్యా ....... , మీ సంతోషమే మా సంతోషం - చూపు రాగానే మమ్మల్ని చూడాలి అన్నారు - ఇక్కడ ఇక్కడ ఎంత ఆనందం కలిగిందో అంటూ అక్కయ్య నుదుటిపై - బుగ్గపై - చేతిపై ముద్దులుపెట్టాను .
హవ్వా ....... లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ ...... అంటూ నవ్వుతూనే ఉన్నారు .
దేవత : బుజ్జిహీరో ....... , చెల్లికి ముద్దులుపెట్టే అవకాశమే ఇవ్వడం లేదు నువ్వు అంటూ నా చేతిని గిల్లేసారు .
స్స్స్ ........
అందరితోపాటు అక్కయ్య నవ్వుతోంది . నేను కిస్ చేస్తాను అక్కయ్యా అంటూ దేవత చేతిపై ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు . 
అలా సంతోషమైన మాటల్లోనే గంట గడిచిపోయింది - డాక్టర్స్ కూడా వచ్చారు .

వెనుకే SI సర్ వచ్చారు .
దేవత : లంచ్ పంపించినందుకు థాంక్యూ సర్ .......
SI సర్ : కనీసం పరిచయం లేని అమ్మాయికోసం నిన్నటి నుండీ మీరు చేసినదానితో పోలిస్తే ....... , ఏదైనా జరగకముందే మీరు ప్రతిస్పందించిన తీరుకు నేను ఫిదా అయిపోయాను - బుజ్జిహీరో ...... నిజంగానే హీరో నువ్వు - తరువాత ఎప్పుడైనా మనం కలుద్దాము .
పరిచయం లేకపోవడం ఏమిటి సర్ , అక్కయ్య - బామ్మ ....... అంటూ అక్కయ్య చేతిని ప్రాణంలా హత్తుకున్నాను , అక్కయ్య కన్నీళ్లు చూడగానే నా హృదయం తల్లడిల్లిపోయింది .
SI సర్ : కొట్టేలా ఉన్నావు బుజ్జిహీరో ....... , sorry sorry .......
అందరూ డాక్టర్ మేడం కూడా నవ్వుకున్నారు . 
అక్కయ్య : తమ్ముడూ ....... , నాకు వెంటనే నిన్ను - అక్కయ్యను చూడాలని ఉంది , డాక్టర్స్ ఆలస్యం చేస్తే నేనే బ్యాండేజస్ తీసేస్తాను .

డాక్టర్ మేడం : నో నో నో , అంతపని మాత్రం చెయ్యకు కావ్యా ...... , ఇంతసేపు ఆగావు మరొక్క 5 నిమిషాలు ఆగలేవా ...... ? .
అక్కయ్యా ...... 5 నిమిషాలే అంటూ లేవబోయాను .
డాక్టర్ మేడం : నో నో నో బుజ్జిహీరో గారూ ...... , నన్ను కొట్టేస్తుందేమో అలానే పట్టుకుని కూర్చో అని నవ్వుతూనే నర్స్ సహాయంతో కట్లు విప్పుతున్నారు నెమ్మదిగా ...... , కావ్యా ...... ప్లీజ్ ప్లీజ్ అతినెమ్మదిగా తెరవాలి , బుజ్జిహీరో - అవాంతికా ...... మీరు చెబితేనే వినేది .
అక్కయ్యా - చెల్లీ ...... మేమెక్కడికీ వెళ్లము , నెమ్మదిగా తెరవండి అని చేతులపై ముద్దులుపెట్టాము .
డాక్టర్ మేడం బ్యాండేజీ మొత్తం వేరుచేసి , ఒక లిక్విడ్ తో కనురెప్పలపై అతి జాగ్రత్తగా శుభ్రం చేసి , now కావ్యా ...... slowly open your eyes , నీకు ఇరువైపులా ...... నీ ప్రాణమైన ఇద్దరే ఉన్నారు - నీకు మొదటగా కనిపించేది వారే ........
అవును అక్కయ్యా - చెల్లీ ....... , నెమ్మదిగా నెమ్మదిగా ....... , చూడగానే ఉద్వేగానికి లోనై కన్నీళ్లు - ఆనందబాస్పాలు రప్పించకండి కళ్ళు నొప్పివేస్తాయి .
డాక్టర్ : బుజ్జిహీరో నువ్వు డాక్టర్ ఈ కూడా , నాకు రాని ఐడియా నీకు వచ్చింది , అవును కావ్యా ....... కొద్దిసేపు ఎలాంటి బావోద్వేగాలకూ లోను కాకూడదు ప్రమాదం - ఎంతైనా సంతోషపడు కానీ బాస్పాలు మాత్రం నో , బుజ్జిహీరో కూడా చెప్పాడు కదా వింటావులే ...... రెడీ 3 2 1 .......

స్లోలీ స్లోలీ ..... అక్కయ్యా - చెల్లీ .......
అక్కయ్య : నా తమ్ముడు - అక్కయ్య చెబితే వింటాను అని అతినెమ్మదిగా కళ్ళుతెరిచి చూసి , అంతులేని ఆనందంతో తమ్ముడూ - అక్కయ్యా ...... అంటూ ఇద్దరినీ హత్తుకున్నారు . తమ్ముడూ - అక్కయ్యా ...... చూసాను , నాకు బాగా కనిపిస్తోంది అంటూ మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , కొన్ని క్షణాలపాటు మనసారా చూస్తున్నారు .
అక్కయ్యా ....... సో సో sooooo హ్యాపీ - బామ్మలను చూడండి .
అక్కయ్య : తరువాత చూస్తానులే అంటూ ఇద్దరినే చూస్తున్నారు .
బామ్మలిద్దరూ సంతోషంతో నవ్వుతున్నారు . 
డాక్టర్ మేడం : బామ్మలనే తరువాత చూస్తాను అన్నది , ఇక మనల్ని చూడదులే SI గారూ , తరువాత వద్దాము పదండి .
డాక్టర్ మేడం - సెక్యూరిటీ అధికారి సర్ ...... 
డాక్టర్ మేడం : పర్లేదు పర్లేదు మీరు ఎంజాయ్ అంటూ నవ్వుతూ బయటకు వెళ్లారు .

అక్కయ్య : ఆఅహ్హ్హ్ ....... ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేను తమ్ముడూ - అక్కయ్యా ...... లవ్ యు లవ్ యు సో మచ్ అంటూ మా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
పెద్దమ్మా ...... అక్కయ్యను ఎలా చూడాలో అలా చూసేలా చేశారు - బామ్మగారు కూడా చాలా చాలా హ్యాపీ , థాంక్యూ థాంక్యూ sooooo మచ్ .
అక్కయ్య - దేవత : థాంక్యూ పెద్దమ్మా .......
అక్కయ్యా ...... బామ్మలు , మిమ్మల్ని కౌగిలించుకుని ఆనందించాలని తెగ ఆరాటపడిపోతున్నారు - ఆ తరువాత మీఇష్టం ......
అక్కయ్య : మీరిక్కడే ఉండాలి .......అలా అయితేనేనే ......
లవ్ యు అక్కయ్యా - చెల్లీ అంటూ ఒకేసారి ముద్దులుపెట్టాము .
అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని , బామ్మలూ ...... నాకు కనిపిస్తున్నారు అంటూ ప్రాణంలా హత్తుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 23-10-2021, 09:38 AM



Users browsing this thread: 47 Guest(s)