Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
నా గుండె వేగంగా కొట్టుకోవడంతో నా దేవత - బుజ్జి ఏంజెల్ కోసం కళ్ళు ఆతృతతో వెతకసాగాయి - అదిగో నా బుజ్జి ఏంజెల్ ....... బుజ్జి బుజ్జి పిల్లలతో చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిబుజ్జిపరుగుతో ఆడుకోవడం చూసి మనసు శాంతించింది .
అంతలో వెనుక పెద్దయ్య ప్రక్కన కూర్చున్న కృష్ణ ..... క్యాబ్ దిగగానే నేనూ దిగాను పెద్దయ్యను పట్టుకోవడానికి .......
బయట బుజ్జిబుజ్జి పిల్లలతో ఆడుకుంటున్న బుజ్జి ఏంజెల్ చూసి మమ్మీ - అమ్మమ్మా ....... తాతయ్య వచ్చారు అంటూ సంతోషంతో పరుగునవస్తూ , తన తాతయ్య వొళ్ళంతా కట్లను చూసి మమ్మీ - అమ్మమ్మా ...... అంటూ ఏడుస్తూ కేకలువేసింది .

ఆ పాటికే పెళ్ళికొడుకు శాస్త్రం కోసం వచ్చిన ఊరిజనం చూసి కంగారుపడుతూ అయ్యా - పెద్దయ్యా - అన్నా ....... ఏమైంది అంటూ తలా ఒకచెయ్యివేసి లోపలికి నడిపించుకుపోతుంటే ........ 
పెద్దయ్య ఆపి నాకేమీ కాలేదులే ఇప్పటికే పెళ్లి పనులు ఆలస్యం అయ్యాయి బయటే కూర్చోబెట్టమన్నారు .
నిమిషంలో చెక్క మంచం మెత్తగా రెడీ చేసి కూర్చోబెట్టి , ఏమైంది ఏమైంది చాలా దెబ్బలు తగిలాయి అంటూ బాధపడుతూ చుట్టూ చేరారు .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ...... ఏడుస్తున్న బుజ్జితల్లిని పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకోబోతుంటే .......
బుజ్జితల్లి : వద్దు తాతయ్యా ....... మీకు నొప్పివేస్తుంది .
పెద్దయ్య : నా బంగారం తాతయ్య అంటే ప్రాణం అంటూ ప్రక్కన కూర్చోబెట్టుకుని కన్నీళ్లు తుడిచారు .
బుజ్జితల్లి : తాతయ్యా ....... ఏమైంది అంటూ బుజ్జి కన్నీళ్ళతో అడిగింది .
అంతలో దేవత - దేవత అమ్మగారు వచ్చి చూసి కన్నీళ్ళతో ప్రక్కన చేరారు .
పెద్దయ్య : బుజ్జితల్లీ - తల్లీ - శ్రీమతిగారూ ....... ఏమీకాదు చూడండి నవ్వుతున్నాను .
దేవత : కన్నీళ్ళతో తమ్ముడూ ఏమైందిరా ...... ? .
జనాలు : కృష్ణా ఏమైంది ఏమైంది .........
కృష్ణ : తెల్లవారుఘామున బస్ స్టాండ్ కు వెళుతూ ...... లారీ ......
అందరూ : లారీనా ....... అంటూ మరింత కంగారుపడిపోతున్నారు .
కృష్ణ : లేదు లేదు మన రోడ్ టర్నింగ్ లో లారీ లైట్స్ సడెన్ గా పడటంతో పట్టుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న గడ్డిలో పడ్డారు .
పెద్దయ్య : అంతే అంతే పొదల్లోకి వెళ్లిపోవడం వలన చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే ........
కృష్ణ : నాన్నగారు స్పృహకోల్పోయి పడి ఉండటం , బస్సులో వెళుతున్న ఈ అన్నయ్య చూసి సమయానికి హాస్పిటల్ కు తీసుకెళ్లి బ్లడ్ ఇచ్చి కాపాడారు .

బుజ్జితల్లి : అంకుల్ ....... అంటూ పరుగునవచ్చి హత్తుకుంది .
కీర్తీ తల్లీ ...... అంటూ ప్రాణంలా ఎత్తుకోగానే , థాంక్యూ థాంక్యూ అంకుల్ అంటూ ముద్దులుపెడుతూనే ఉంది .
కృష్ణ చెప్పినట్లుగానే దేవత అమ్మగారు - చుట్టూ జనమంతా థాంక్యూ థాంక్యూ బాబూ - తమ్ముడూ ....... అంటూ దండాలు పెడుతున్నారు .
దేవత అయితే నావైపు ఆరాధనతో చూస్తున్నారు - కన్నీళ్ళతో రెండు చేతులు జోడించి నమస్కరించారు .
పెద్దయ్య ....... దేవత నుదుటిపై ముద్దుపెట్టి , చూస్తున్నావుగా బాబూ ...... మేము చెప్పినదే నిజమైంది కదూ అంటూ నవ్వుతూ చెప్పారు .
వీరి ఆప్యాయతలలో మీ మంచితనం తెలుస్తోంది పెద్దయ్యా ...... , వీరంతా మీ చుట్టూ ఉండగా మీకేమీ కాదు .

సర్ సర్ ...... క్యాబ్ ఫేర్ ఇస్తే వెళతాను అని డ్రైవర్ అడగలేక అడిగాడు .
Sorry sorry బ్రదర్ ...... అంటూ బుజ్జితల్లిని ఎత్తుకునే పర్సు తీసేంతలో - కృష్ణ లోపలికివెళ్లి డబ్బు తీసుకొచ్చేన్తలో ....... 
ఎంత బాబూ ఎంత అంటూ ఊరిజనం పోటీపడుతూ ఇచ్చి పంపించారు . బాబూ ....... ఎంతసేపని నిలబడతారు కూర్చో ...... - మా పెద్దయ్యను కాపాడిన మీరు , మాకు దేవుడితో సమానం అంటూ కుర్చీలు వేశారు . 
పర్లేదు అండీ ఇక నేను వెళతాను అని దేవత రియాక్షన్ కోసం చూసాను .
అంకుల్ అంటూ బుజ్జితల్లి బుజ్జిచేతులతో నా నోటిని మూసింది - దేవత కళ్ళల్లో రెండు భావాలు ( వెళ్లిపో - ఉండిపో ) - బాబూ ...... పెళ్లి చూసుకుని వెళ్లు అని ఊరిజనం - అవును బాబూ ....... పెళ్లి చూసుకుని మా ఆతిథ్యం స్వీకరించి మీకిష్టమైనన్ని రోజులు ఉండండి , మిమ్మల్ని సేవించుకుని కాస్తయినా రుణం తీర్చుకునే అవకాశం కల్పించు బాబూ అంటూ పెద్దయ్య వారి శ్రీమతి కోరారు .
కృష్ణ : నాన్నగారూ ...... ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం .......
పెద్దయ్య : నాన్నా ...... కృష్ణా ....... పెళ్లి అంటే మనవైపు నిర్ణయం మాత్రమే కాదు - ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్న ఆ అమ్మాయిని బాధపెట్టకూడదు . ఇప్పటికిప్పుడు లేచి పెళ్ళిపనులు చెయ్యడానికి నేను రెడీగా ఉన్నాను . 
కృష్ణా ...... సహాయం చేయడానికి మేమూ ఉన్నాము కదా .......
పెద్దయ్య : ఇంకేమిటి కృష్ణా ........ , ఇంతమందికి ఆదర్శప్రాయమైన మనమే ఇలా చెయ్యకూడదు .
కృష్ణ : అయితే మీ ఇష్టం నాన్నగారూ .......
పెద్దయ్య : శ్రీమతి గారూ - తల్లీ ....... పెళ్ళికొడుకుని చెయ్యడానికి అన్నీ సిద్ధమేకదా .........
దేవత కన్నీళ్లను తుడుచుకుని , రెడీ చేసాము నాన్నగారూ ........
పెద్దయ్య : ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకండి , గుడికి వెళ్లి పెళ్లి పందిరి కోసం ఉంచిన వాటికి పూజచేసి తీసుకొచ్చి నీ తమ్ముడిని పెళ్ళికొడుకుని చెయ్యి తల్లీ ......
కృష్ణ : అన్నయ్యా ....... మీరెక్కడకూ వెళ్ళడానికి వీలులేదు , నాన్నగారు చెప్పినట్లు పెళ్లి - ఆతిథ్యం స్వీకరించాల్సిందే ........
బుజ్జితల్లీ ...... వెళ్ళిపొమ్మన్నావు కదా .......
బుజ్జితల్లి : మళ్లీ నోటిని మూసేసి ప్రాణంలా ముద్దుపెట్టి sorry అంకుల్ అంటూ గట్టిగా హత్తుకుంది .
దేవత ....... నాదగ్గరికివచ్చి , ఉండండి మహేష్ గారూ అనిచెప్పి లోపలికి వెళ్లిపోయారు . 
యాహూ ....... అంటూ లోలోపలే సంతోషంతో కేకలువేసి , బుజ్జితల్లిని ఎత్తుకుని పెద్దయ్య దగ్గరకువెళ్లి , పెద్దయ్యా ...... కంఫర్ట్ గా ఉందా అని నొప్పిలేకుండా కూర్చునేలా చేసాను .
థాంక్యూ అంకుల్ అంటూ బుజ్జితల్లి సంతోషంతో పదేపదే ముద్దులుపెడుతోంది - ప్రాణంలా హత్తుకుంటోంది .

బుజ్జితల్లి అమ్మమ్మ గారు వచ్చి , బాబూ ..... రాత్రంతా ప్రయాణం - ఉదయం నుండీ హాస్పిటల్లోనే ఉన్నావట కదా లోపలికివచ్చి స్నానం చెయ్యి బాబూ ....... 
పెద్దమ్మా ...... ఎవరు చెప్పారు ? .
పెద్దమ్మ : నా కూతురు చెప్పింది బాబూ ...... నా కూతురిని జాగ్రత్తగాతీసుకొచ్చావు - నా భర్తను కాపాడి పెళ్లి జరుగుతోంది అంటే నీవల్లనే - మా దేవుడితో సమానం , ముందు లోపలికి రా బాబూ నీ ఇల్లే అనుకో , పై గదికి వెళ్లు ఎవ్వరూ ఉండరు అంటూ బుజ్జితల్లిని అందుకోబోయారు .
బుజ్జితల్లి : ఊహూ ...... అంకుల్ తోనే ఉంటాను - పైకి నేను తీసుకెళతాను అని ముద్దుముద్దుగా ముద్దులుపెట్టి గట్టిగా హత్తుకుని చెప్పింది . అంకుల్ స్నానం చేసేవరకూ బెడ్ పైననే బుద్ధిగా కూర్చుంటాను .
బుజ్జితల్లి నా బుజ్జితల్లి మాటలకు ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేను .
పెద్దమ్మ : మా బుజ్జితల్లి ఒక్కసారి ఇష్టపడితే ఇంతే వదలనే వదలదు - బంగారుకొండ అని చేతితో ముద్దుపెట్టి సరే నువ్వే తీసుకెళ్లు మీ అంకుల్ ను - బాబూ ...... ఏమనుకోకు కాస్త తొందరగా వస్తావు కదూ , ఎందుకంటే నువ్వు వస్తేనేకానీ పెళ్ళికొడుకు కదలడు - మా బుజ్జితల్లి అమ్మ గుడికి కదలడు - బుజ్జితల్లి తాతయ్య ...... ఇక సరే సరి .
పెద్దమ్మా ...... నాకోసం .......
పెద్దమ్మ : ఆ దేవుడే వచ్చి చెప్పినా ఇప్పుడు విననే వినరు - నువ్వంటే అంత ఇష్టం అయిపోయావు - స్టార్ట్ చేస్తే నేనూ ఊరుకోను .
పెద్దమ్మా ....... నా అదృష్టం , సరే వెంటనే వచ్చేస్తాను - బుజ్జితల్లీ ఎటువైపు అని అడిగి పైకివెళ్ళాను .

కీర్తీ తల్లీ ...... కింద ఉద్వేగ వాతావరణంలో నీ బుజ్జి బార్బీ డ్రెస్ సరిగ్గా చూడలేదు , sooooo క్యూట్ అంటూ బెడ్ పై కూర్చోబెట్టాను . చుట్టూ చూసి ఇల్లు కూడా బాగుంది - మినిట్స్ లో ఫ్రెష్ అయ్యివచ్చేస్తాను అంటూ హైఫై చూయించాను .
బుజ్జితల్లి బుజ్జిచేతితో హైఫై కొట్టి అంతేనా అంకుల్ అని బుంగమూతితో అడిగింది .
మా బుజ్జితల్లి బుంగమూటలో కూడా ముద్దొచ్చేస్తోంది .
బుజ్జితల్లి : ఆ ఆ ముద్దులే అడుగుతున్నాను - ముద్దొస్తోంది అంటున్నారు కానీ వచ్చినప్పటి నుండీ ఎంతో ఆశతో చూస్తున్నాను ఒక్క ముద్దైనా పెట్టారా ...... ? - మా మంచి అంకుల్ కు నేనెన్ని ముద్దులుపెట్టాను .
ఓ ఓ ...... ఆదా సంగతి , sorry sorry బుజ్జితల్లీ ...... ఒక్క ముద్దుతో తనివితీరదు - తెల్లవారుఘామున 5 గంటలకు నా బుజ్జితల్లిని వదిలి వెళ్లిపోయానా 6 గంటలు 7 గంటలు 8 గంటలు 9 10 .... 11 గంటలు అంటే దాదాపు 6 గంటల తరువాత నా ప్రాణాన్ని చూశాక గానీ నా ప్రాణం నిలబడలేదు - నిన్ను చూశాకనే ఈ గుండె నార్మల్ గా కొట్టుకుంది - నీకు దూరంగా ఉన్న ఆ 6 గంటలు నేను నేనులా లేను - అంకుల్ అంటూ పరుగునవచ్చి హత్తుకోగానే ఆ 6 గంటల్లోని ప్రతీ నిమిషం కాదు కాదు ప్రతీ క్షణానికొక ముద్దుపెట్టాలని ఉన్నా ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా ........ ? , ఇప్పటికి కూడా .......
బుజ్జితల్లి : అంకుల్ అంటూ లేచి నామీదకు జంప్ చేసి బుగ్గలపై ముద్దుపెట్టి , అడ్డు ఎవరు అంకుల్ మీకు కానివ్వండి .
నా బుజ్జితల్లీ ..... నా కీర్తీ తల్లీ ...... నా బుజ్జి ఏంజెల్ ...... నిన్ను మనసారా గుండెలపై హత్తుకున్నాకే నేను శ్వాసిస్తున్నానని తెలిసింది అంటూ నిమిషం పాటు ముద్దులవర్షం కురిపించి , రోజంతా ముద్దులుపెడుతూనే ఉండాలని ఉంది .
బుజ్జితల్లి : నేను రెడీ అంకుల్ .......
కానీ మనం కిందకు వెలితేనే కానీ పెళ్ళిపనులు మొదలుపెట్టరట అంటూ ప్రాణం లా హత్తుకున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ....... నిన్నటివరకూ మమ్మీ వస్తేనే కానీ అమ్మమ్మా - తాతయ్య వాళ్ళు పెళ్ళిపనులు మొదలెట్టము అన్నారు - ఇప్పుడు మీరు వెలితేనే ....... , అంటే మమ్మీ కంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం అందరికీ - మిమ్మల్ని దేవుడు అన్నారుకదా ...... , ఇప్పుడు నేనూ చెబుతున్నాను మా అంకుల్ నిజంగా దేవుడే ........ లవ్ యు అంకుల్ .......
లవ్ యు అన్నావా బుజ్జితల్లీ నా బుజ్జితల్లీ ....... లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ అంటూ మళ్లీ ముద్దులు కురిపిస్తున్నాను .
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులు చిందిస్తూనే , అంకుల్ ....... కిందకు వెళ్లాలన్నారు అని గుర్తుచేసే నవ్వుతోంది .
నా ముద్దుల కీర్తీ తల్లి మాయలో పడి మరిచేపోయాను అంటూ ముద్దులుపెడుతూనే వదల్లేక వదల్లేక బెడ్ పై కూర్చోబెట్టి , గేమ్ ఆడుతూ ఉండు ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని మొబైల్ ఇచ్చి , బ్యాగుతోపాటు బాత్రూమ్లోకి వెళ్ళాను .

బ్యాగులోనుండి బ్రష్ పేస్ట్ తీసుకుని కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ గా తలంటు స్నానం చేసి బ్యాగులోని డ్రెస్ వేసుకుని బయటకువచ్చాను .
బుజ్జితల్లి : నో నో నో అంకుల్ ...... , మమ్మీ ...... అమ్మమ్మ చేత మావయ్యకోసం కొన్న కొత్త డ్రెస్ మీకోసం పంపించారు .
మావయ్య పెళ్ళికోసం కొన్న డ్రెస్ కదా ....... , ఇష్టంతో తీసుకుని ఉంటాడు కృష్ణ పర్లేదులే .......
బుజ్జితల్లి : ఈ కొత్త డ్రెస్ వేసుకోకపోతే మొదట మమ్మీ ఆ వెంటనే అమ్మమ్మ - మావయ్య చివరగా కాదు కాదు ముఖ్యంగా నేను ఏడుస్తాను .
అమ్మో అమ్మో ....... న బుజ్జితల్లి కంట కన్నీళ్లు చూస్తే ఈ అంకుల్ తట్టుకోగలడా వెంటనే మార్చేసుకుంటాను . 
బుజ్జితల్లి : గుడ్ బాయ్ అంటూ అందించి అటువైపుకు తిరిగింది .
హ హ హ ...... ఉమ్మా ఉమ్మా ...... అంటూ డ్రెస్ మార్చుకుని బుజ్జితల్లిని రెండుచేతులతో అమాంతం ఎత్తుకుని ముద్దుచేస్తూ కిందకువచ్చాను - దేవత కనిపించగానే ముద్దులు ఆపేసాను .
బుజ్జితల్లి : మమ్మీ అంటే అంత భయమా అంకుల్ .......
చాలా అంటే చాలా అంటూ చిలిపినవ్వులతో తలదించుకుని బయటకు నడిచాను .
బుజ్జితల్లి : వెనుకకు చూసి అంకుల్ ...... మమ్మీ కూడా మీలానే నవ్వుతోంది - డ్రెస్ సూపర్ అంటున్నారు .
వెంటనే వెనక్కు తిరిగిచూస్తే నవ్వడం ఆపేసి కోపంతో చూస్తున్నారు .
ప్చ్ .........
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 06-11-2021, 12:10 PM



Users browsing this thread: 6 Guest(s)