Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
 పెద్దయ్యా పెద్దయ్యా ...... కళ్ళు మూసుకోకండి నన్ను చూడండి నన్ను చూడండి మీకేమీ కాదు మీకేమీ కాదు హాస్పిటల్ కు వెళుతున్నాము అంటూ బుగ్గలను స్పృశిస్తూ కళ్ళు మూతలుపడకుండా ప్రయత్నిస్తున్నాను .
పెద్దయ్య : తల్లి నా తల్లి తల్లి బాబూ ...... నా తల్లి అంటూ కలవరిస్తున్నారు .
ఏమిటో అర్థం కాక పెద్దయ్యా ...... ఇలానే స్పృహలో ఉండండి అంటూ అరచేతిలో చేతినివేసి ధైర్యాన్ని ఇస్తున్నాను .
చెప్పినట్లుగానే నిమిషానికొక కిలోమీటర్ దాటినట్లు 15 నిమిషాలలో హాస్పిటల్ చేరుకుని నేరుగా తీసుకెళ్లి బస్సుని అత్యవసర విభాగం దగ్గర ఆపాడు .
ప్రయాణీకులు సహాయం చెయ్యడంతో జాగ్రత్తగా ఎత్తుకుని కిందకుదిగి స్ట్రెచర్ పై పడుకోబెట్టాము .
హాస్పిటల్ స్టాఫ్ ...... వేగంగా ICU కు తీసుకెళ్లారు . వెనుకే వెళ్ళాను - కొంతమంది తోడుగా వచ్చారు .
కండక్టర్ వచ్చి నా బ్యాగు అందించి ప్రయాణీకులంతా వేచిచూస్తున్నారు వెళ్లక తప్పదు బాబూ , పెద్దాయనకు ఏమీకాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని వెళ్లారు - తోడుగా వచ్చిన ప్రయాణీకులు కూడా భుజం తట్టి వెళ్లిపోయారు . 

డాక్టర్ బయటకువచ్చి ఆక్సిడెంట్ అయ్యి చాలాసేపు అయ్యింది రక్తం చాలా పోయింది హాస్పిటల్లో *** గ్రూప్ బ్లడ్ ఒక్కటే ఉంది మరొక ప్యాకెట్ అయినా అవసరమౌతుంది లేకపోతే ప్రాణాలకే ప్రమాదం .
డాక్టర్ గారూ ....... నాదీ అదే బ్లడ్ తీసుకోండి .
డాక్టర్ : please come in అంటూ లోపలికి పిలుచుకునివెళ్లి ఖాళీగా ఉన్న బెడ్ చూయించి బ్లడ్ తీసుకున్నారు . ప్రక్కనే తల్లీ తల్లీ ...... అంటూ కలవరిస్తున్న పెద్దాయనకు ఒకవైపు బ్లడ్ ఎక్కిస్తూనే తగిలిన గాయాలను శుభ్రం చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు . 
" ( వీడెవడండీ బాబూ ....... ప్రతీ స్టోరీలో లీటర్ల లీటర్ల బ్లడ్ ఇచ్చేస్తున్నాడు అని కోప్పడకండి - మనం బ్లడ్ ఇవ్వడం వలన ఒక ప్రాణం నిలబడుతుంది . ఇలా ప్రతీసారీ గుర్తుచేయ్యడం వలన xossipy ఫ్రెండ్స్ రక్తదానం చేస్తారని చిరు ఆశ - నేను ఇప్పటికే రెండుసార్లు ఇచ్చాను , వాళ్ళు థాంక్స్ చెప్పిన క్షణం కలిగిన ఫీలింగ్ అలాంటిది మరి , లవ్ యు గయ్స్ ........ మీ మహేష్ ) " .
బ్లడ్ ఇచ్చి బయటకువచ్చి కూర్చున్నాను . 
గంట తరువాత డాక్టర్ బయటకువచ్చి సరైన సమయానికి తీసుకొచ్చారు - సరైన సమయానికి బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణం కాపాడావు - కాసేపట్లో స్పృహలోకి వస్తారు వెళ్లి చూడవచ్చు .
థాంక్ గాడ్ ....... థాంక్యూ డాక్టర్ .......
డాక్టర్ : ఇంతకీ నీకు ....... పెద్దాయనకు ఏమౌతారు .
నో డాక్టర్ ...... బస్సులో వెళుతుంటే అంటూ జరిగింది వివరించాను .
డాక్టర్ : గుడ్ అంటూ చేతులు కలిపారు . ఎవరోకూడా తెలియని పెద్దాయన ప్రాణాలు కాపాడావు .
ఆ క్షణం కలిగిన ఫీలింగ్ ......., డాక్టర్ గారూ ....... పెద్దాయన దగ్గర మొబైల్ ఏమైనా ........
డాక్టర్ : నర్స్ ...... చూసుకోండి , sorry రౌండ్స్ కు వెళ్ళాలి .
నో నో నో , మీరు sorry చెప్పడం ఏమిటి ...... క్యారి ఆన్ డాక్టర్ ....... 
పెదాలపై చిరునవ్వులతో వెళ్లారు డాక్టర్ గారు .

నర్స్ వచ్చి విషయం తెలుసుకుని , నో సర్ ...... వారి దగ్గర ఎటువంటి మొబైల్ లేదు . 
అవునా ...... , బహుశా అక్కడే పొదల్లో పడిపోయి ఉంటుంది - ఇప్పుడెలా ........
నర్స్ : సర్ ...... లోపల తల్లీ తల్లీ ...... అంటూ కలవరిస్తూనే ఉన్నారు అని పిలుచుకునివెళ్లారు .
తలకు - చేతులకు - కాళ్లకు ....... కట్లు కట్టి ఉండటం చూసి చాలా దెబ్బలు తగిలాయని బాధవేసింది . ప్రక్కనే వెళ్లి నిలబడ్డాను .
సగం కళ్ళతోనే నన్ను గుర్తుపట్టి బాబూ ...... అంటూ కన్నీళ్ళతో చేతిని అందుకోబోయారు .
పెద్దయ్యా పెద్దయ్యా ........ కదలకండి అంటూ చేతిని అందుకుని అరచేతిలో చేతినివేసి బెడ్ పై ఉంచాను .
పెద్దయ్య : నా ప్రాణాలు కాపాడావు , నీ రుణం .......
పెద్దయ్యా ....... కాసేపు మాట్లాడకుండా రెస్ట్ తీసుకోండి అని కన్నీళ్లను తుడిచాను . పెద్దయ్యా ...... మీవాళ్ళు ఎక్కడ ఉంటారు .
పెద్దయ్య : మొబైల్ మొబైల్ ....... అంటూ తలెత్తి స్స్స్ స్స్స్ .......
కదలకండి పెద్దయ్యా నొప్పివేస్తుంది . చూసాము మీ మొబైల్ లేదు ఆక్సిడెంట్ అయినప్పుడు అక్కడే పడిపోయిందేమో .........
పెద్దయ్య : నెంబర్ నెంబర్ ....... నా కొడుకుది **********
ఇదిచాలు పెద్దయ్యా ....... ఇక మీరు ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి అని కాల్ చేసాను . బ్రదర్ కంగారుపడకండి మీ నాన్నగారికి చిన్న ఆక్సిడెంట్ అయ్యింది - కంగారుపడకండి సరైన సమయానికి హాస్పిటల్ కు తీసుకెళ్లడం వలన సేఫ్ గా ఉన్నారు . 
ఏ హాస్పిటల్ ఏ హాస్పిటల్ సర్ .......
వైజాగ్ ******** హాస్పిటల్ - కంగారుపడకండి బ్రదర్ ....... సేఫ్ అని డాక్టర్స్ చెప్పారు .
సర్ ....... వెంటనే వచ్చేస్తాను - అప్పటివరకూ నాన్నగారు జాగ్రత్త please please సర్ ........
ప్రక్కనే ఉన్నాను బ్రదర్ .......
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ , ఇప్పుడే వచ్చేస్తాను .
నర్స్ : సర్ ...... బ్లడ్ ఇచ్చారుకదా నీరసంగా ఉంటుంది , మీరుకూడా కూర్చోండి అని బెడ్ ప్రక్కనే ఛైర్ వేసింది - ఆపిల్ కూడా ఇచ్చారు .
థాంక్స్ చెప్పాను .

అర గంటలో ఒక తమ్ముడు ICU లోపలికివచ్చి పెద్దయ్యను చూసి , నాన్నగారూ నాన్నగారూ అంటూ కన్నీళ్ళతో ప్రక్కన చేరారు . 
అప్పటికే పెద్దయ్య కొద్దికొద్దిగా మాట్లాడుతున్నారు . కృష్ణా ...... నాకేమీ కాలేదు కంగారుపడకు - ఈ బాబు వల్లనే నేను ప్రాణాలతో ఉన్నాను .
తమ్ముడు కన్నీళ్లను తుడుచుకుని థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ అంటూ రెండు చేతులతో నమస్కరించాడు .
నాకు చేతనైనది చేసాను - అంతదానికి .......
పెద్దయ్య : దేవుడిలా వచ్చావు బాబూ ....... 
పెద్దయ్యా ...... థాంక్స్ చెప్పారు కదా చాలు పెద్దయ్యా ....... , మీరు సేఫ్ గా ఉన్నారు అంతకంటే సంతోషం ఇంకేమి కావాలి .
పెద్దయ్య : మంచి మనసు బాబూ నీది , కృష్ణా ....... అక్కయ్య ? .
తమ్ముడు : నిన్న సంతకు వెళ్లిన పిన్నీ వాళ్ళతోపాటు ఆటోలో వచ్చారు నాన్నగారూ ........ 
( సంతకు వెళ్లిన పిన్ని వాళ్ళతోపాటు ...... దేవత అయి ఉండరులే ) 
పెద్దయ్య : హమ్మయ్యా ...... , కృష్ణా ...... ఆక్సిడెంట్ విషయం తల్లికి చెప్పలేదు కదా ........
కృష్ణ : కంగారుపడతారని అక్కయ్యకు - అమ్మకు చెప్పలేదు నాన్నగారూ ...... - బుజ్జితల్లికి తెలిస్తే ఏడ్చేస్తుంది .
( బుజ్జితల్లి ....... నా బుజ్జితల్లి అయి ఉండదులే ) 
పెద్దయ్య : అవునవును తాతయ్య అంటే ప్రాణం నా బుజ్జితల్లికి - నన్ను ఇలా చూస్తే ఏడ్చేస్తుంది . కానీ బుజ్జితల్లిని వెంటనే చూడాలనిపిస్తోంది కృష్ణా .......
( ప్రయాణమంతా తాతయ్య తాతయ్య ..... అంటూ కలవరిస్తూనే ఉంది - నా బుజ్జితల్లినేనా ...... ) 
కృష్ణ : నాన్నగారూ ....... ఒకరోజైనా రెస్ట్ తీసుకోవాలి .
పెద్దయ్య : ఒకరోజంతానా ...... ? , మన బుజ్జితల్లిని చూడకుండా ఉండటం నావల్లకాదు - కృష్ణా ...... తనను తన బుజ్జినవ్వులను చూశానంటే వెంటనే కోలుకుంటాను .
నిజమే పెద్దయ్యా ...... ప్రాణమైనవాళ్ళతో ఉంటే హాస్పిటల్స్ - మందులు అవసరం లేదు కానీ ట్రీట్మెంట్ కోసం మీకిచ్చిన మత్తు ఇంజక్షన్ పవర్ తగ్గేవరకైనా ఇక్కడే ఉండాలి లేకపోతే కదులలేరు .
పెద్దయ్య : నువ్వు చెబుతున్నావు కాబట్టి సరే బాబూ ........

హాస్పిటల్ స్టాఫ్ ఒకరు లోపలికివచ్చి ట్రీట్మెంట్ బిల్ సర్ అంటూ రిసిప్ట్ ఇచ్చి కౌంటర్ లో పే చెయ్యండి అనిచెప్పి వెళ్ళిపోయాడు .
తమ్ముడు జేబులన్నీ వెతికి కంగారులో డబ్బు మరిచిపోయాను అంటూ మెడలో ఉన్న చైన్ తియ్యబోయాడు .
తమ్ముడూ ...... ఆగు నేను పే చేస్తాను .
కృష్ణ : సర్ ...... ఇప్పటికే మీరు ......
పర్లేదు తమ్ముడూ , నువ్వు ...... నాన్నగారి దగ్గర ఉండు పే చేసి వస్తాను కావాలంటే ఇంటికివెళ్లాక ఇవ్వు ( ఆ బుజ్జితల్లి ...... నా బుజ్జితల్లి ఏమో చూడాలికదా - చూసి ఇప్పటికే గంట పైనే అయ్యింది , ఈ హృదయం ఎలా తట్టుకొంటోందో ఏమిటో ) అని లేచాను .
పెద్దయ్య ..... చేతులకు కట్లు ఉన్నా దండం పెట్టడానికి ప్రయత్నించారు . పెద్దయ్యా ....... మీరు పెద్దవారు , మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలా చెయ్యకూడదు అని ఆపి వెళ్లి కౌంటర్ లో పే చేసివచ్చి ICU బయటే కూర్చున్నాను .
10 నిమిషాల తరువాత కృష్ణ బయటకువచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు సర్ అని ప్రక్కన కూర్చున్నాడు . సర్ ....... ఆక్సిడెంట్ ఎలా జరిగింది .
జరిగింది వివరించాను . 
కృష్ణ : సర్ ....... మీరు నిజంగా దేవుడు - మీరు చూడకపోయుంటే మరింత ఆలస్యం అయ్యేది - నాన్నగారికి ఏమైనా జరిగిఉంటే అమ్మ - అక్కయ్య - బుజ్జితల్లి అంటూ కన్నీళ్లు కారుస్తున్నాడు .
అంతా దైవేచ్చ కృష్ణా ....... , బాధపడకు త్వరలోనే కోలుకుంటారు అని ధైర్యం చెప్పాను .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 06-11-2021, 12:08 PM



Users browsing this thread: 178 Guest(s)