Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
లోపలి కంపార్టుమెంట్స్ అన్నీ భక్తులతో నిండిపోయినప్పటికీ చక చకా కదిలించడంతో గంటలో స్వామి దర్శనానికి చేరుకున్నాము . క్యూస్ అన్నీ గోవిందనామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి . దేవత రెండుచేతులతో మొక్కుతూ ముందుకు వెళుతున్నారు - బుజ్జితల్లిని భుజాలపై ఎత్తుకోవడం వలన అందరికంటే ముందే దేవుడిని చూసినట్లు బుజ్జి కళ్ళు విద్యుత్ కాంతుల్లా వెలిగిపోతున్నాయి . 
బుజ్జితల్లి : మమ్మీ - అంకుల్ ...... అక్కడ అక్కడ అంటూ సంతోషంతో చెబుతూ బుజ్జిచేతులతో ప్రార్థించడం చూసి , దేవత ఆనందంతో బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టింది చేతితో .......
రెండు నిమిషాల తరువాత మాకూ దర్శనం లభించింది . దేవుడిని చూడగానే సుమారు మూడుగంటలపాటు ఎక్కడం వలన కలిగిన అలసట ఆయాసం మొత్తం మాయమైపోయింది .
సమయం తక్కువ అని ముందే తెలిసినట్లు పూజారిగారికి పెళ్ళిపత్రికను అందించి భక్తితో మొక్కుకుంది దేవత - బుజ్జితల్లికి మాటిచ్చినట్లు ఇన్నాళ్లకు మొక్కు తీర్చుకున్నాను మన్నించండి స్వామీ అంటూ గుంజీలు కూడా తీశారు .
స్వామీ ....... నాకున్న ఏకైక కోరిక మీకు తెలిసే ఉంటుంది . దేవత - బుజ్జి ఏంజెల్ ...... ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి , ఇంకా ఇంకా ....... ఇలా కోరుకోవడం తప్పే కదా అయితే వొద్దులేండి , ఏది మంచో అదే చెయ్యండి అని మొక్కుకుని బయటకువచ్చాము .

దర్శనం చేసుకున్న తరువాత - మొక్కు తీర్చుకున్న తరువాత బయటకువచ్చిన దేవత కళ్ళల్లో సంతోషం - వెలుగు ....... వర్ణించడానికి మాటలు రానట్లు బుజ్జితల్లిని ఎత్తుకుని ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
బుజ్జితల్లి : లవ్ యు మమ్మీ ....... , అంకుల్ ....... మమ్మీ హ్యాపీ కు కారణం మీరే ........
దేవత : అవును , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ గారూ ....... - మీరుణం ........
అనుకున్నాను ఇంకా రుణం దాకా వెళ్లలేదే అని , సగం వరకు వచ్చాము ఇంకా చాలాదూరం వెళ్ళాలి . మీరు హ్యాపీ కదా ..... - చిన్నప్పటి నుండీ మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకున్నట్లేకదా ......
దేవత : మొక్కులతోపాటు మా కుటుంబం ఆశించినట్లుగా పెళ్ళిపత్రికను దేవుడికి అందించాము - ఈ విషయం తెలిస్తే అమ్మ నాన్న తమ్ముడు చాలా చాలా ఆనందిస్తారు అని పులకించిపోతూ బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకున్నారు - ఈ సంతోషం కేవలం మీ వల్లనే ...... - మీ దేవత , బుజ్జి ఏంజెల్ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి .
ఉన్నారండీ - ఉండటం నా కళ్లారా చూస్తున్నానుగా .........
దేవత : ఏమిటీ ? .
అదే అదే దేవుడి దర్శనం చేసుకున్నాక స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటున్నారు ఇద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు - నా ప్రాణాలు ఉన్నంతవరకూ ఉంచుతాను అని గోపురం వైపు మొక్కుకున్నాను .

లడ్డూ ప్రసాదం తీసుకుని బయటకువచ్చాము . బుజ్జితల్లికి ఇష్టమన్నట్లు సగం లడ్డూ తినడం చూసి నవ్వుకున్నాము . 10:30pm అయినా బ్రహ్మోత్సవాల వలన తిరువీధులన్నీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి . 
దేవత : మామూలు రోజుల్లో కాకుండా ఇంతటి అద్భుతమైన బ్రహ్మోత్సవాల్లో దర్శనభాగ్యం కలిగింది అని ఆనందానుభూతులకు లోనౌతున్నారు - ఉదయం వరకూ ఇక్కడే ఉండిపోవాలని ఉంది కానీ సూర్యోదయం లోపు ఊరిలో ఉండాలనీ ఉంది - స్వామీ ....... మేము వెలితేకానీ పెళ్ళిపనులు మొదలుపెట్టరు వెళ్లక తప్పని పరిస్థితి అని కళ్ళుమూసుకుని ప్రార్థిస్తున్నారు . ఆఫీస్ కు వెళ్లి మా లాగేజస్ తీసుకున్నాము .

బుజ్జితల్లిని ఎత్తుకుని ప్రైవేట్ వెహికల్ ను పిలవబోతే ........
క్యాబ్ వద్దు , బస్ లోనే వెళదాము అన్నారు దేవత .
మేడం గారికి నాపై ఇప్పటికీ నమ్మకం కుదిరినట్లు లేదు ప్చ్ ....... ఏమిచేస్తాం .
దేవత చిరునవ్వే సమాధానం అయ్యింది . బస్ స్టాండ్ కు వెళ్లి బయలుదేరాడానికి రెడీగా ఉన్న బస్సు ఎక్కాము . 
దేవత విండో ప్రక్కన కూర్చుని , బుజ్జితల్లితోపాటు వెనకున్న ఖాళీ సీట్లో కూర్చోబోతున్న నన్ను ప్రక్కనే కూర్చోమని పిలిచారు .
పెదాలపై చిరునవ్వులతో కూర్చున్నాను . ఏంటి మేడం ...... ఎవరైనా భయంకరమైన వ్యక్తి వచ్చి కూర్చుంటాడేమోనని భయమా ....... ? .
దేవత : నాకు భయమా ...... ? , అవును భయమే మీతో బిల్డప్ ఎందుకు అంటూ ముసిముసినవ్వులతో బుజ్జితల్లిని ఎత్తుకుని సిగ్గుపడుతున్నారు . 
బస్సు కదిలింది - విండో నుండి వీస్తున్న చల్లని గాలులకు దేవత కురులు అలల్లా ఎగిరిపడుతుంటే దేవత అందం మరింత పెరిగిందేమో అనిపిస్తోంది . ఎంతసేపు చూస్తున్నానో బుజ్జితల్లి బుజ్జివేలితో నో నో అంటూ వారిని గ్ ఇవ్వడం చూసి నవ్వుకున్నాను . అయ్యో ....... టికెట్ బుక్ చెయ్యడమే మరిచిపోయాను - వైజాగ్ కు నెక్స్ట్ ఫ్లైట్ ఎన్ని గంటలకు ఉందో , దేవతకేమో సూర్యోదయం లోపు తీసుకెళతాను అని మాటిచ్చాను - మొబైల్ తీసి చూస్తే సరిగ్గా 12 గంటలకు నెక్స్ట్ ఫ్లైట్ ఉంది - పర్ఫెక్ట్ అనుకుని బుక్ చేసేంతలో ఒక కన్నింగ్ ఐడియా తట్టింది . 12 గంటలకు ఫ్లైట్ అంటే గంటలో వైజాగ్ చేరిపోతాము - కనీసం సూర్యోదయం వరకైనా దేవతతో కలిసి ప్రయాణం చెయ్యాలి లేకపోతే ఈ మనసు తట్టుకోలేదు ఇప్పుడెలా ........ yes yes విజయవాడ వరకూ ఫ్లైట్ లో అటునుండి బై రోడ్ వెళితే ఎలా ఉంటుంది - సూపర్ రా మహేష్ ....... కాస్త కన్నింగ్ ప్లానే కానీ దేవత - బుజ్జి ఏంజెల్ తో ప్రయాణం కాబట్టి తప్పదు అని లోలోపలే కన్నింగ్ స్మైల్ తో విజయవాడకు నెక్స్ట్ ఫ్లైట్ 15 నిమిషాలు ముందుగానే అంటే 11:45pm కే ఉండటంతో డబల్ పర్ఫెక్ట్ అని మనసులో అనుకుని టికెట్స్ బుక్ చేసాను . 11:15pm కల్లా కిందకు చేరుకుని మెయిన్ రోడ్డులోనే బస్ దిగాము . క్యాబ్ ...... ఆపబోయి దేవతవైపు చూసి ఆటోను పిలిచాను .
దేవత : గుడ్ మహేష్ గారూ ....... , అయినా ఈ బస్ నేరుగా బస్ స్టాండ్ కే వెళ్ళేది కదా , ఇక్కడ దిగి ఆటోలో ఎందుకు వెళుతున్నట్లు అని అడుగుతూనే ఆటోలో కూర్చున్నారు .
కోపంతో మూడోకన్ను తెరుస్తారేమో అని భయపడ్డాను , కేవలం అడిగారు సంతోషం అని ఆటో డ్రైవర్ ప్రక్కన కూర్చుని చివిలో చెప్పి పోనివ్వమన్నాను . ఎయిర్పోర్ట్ వచ్చేన్తవరకూ నిద్రపోతున్న బుజ్జితల్లిని హత్తుకుని ముసిముసినవ్వులు నవ్వుతూనే ఉన్నారు . కిందకుదిగి ఆటో డబ్బులు ఇచ్చేసి , నవ్వడం ఆగితే కిందకుదిగండి అని లగేజీ తీసుకున్నాను .
దేవత : బుజ్జితల్లిని గుండెలపై పడుకోబెట్టుకుని కిందకుదిగి ఎయిర్పోర్ట్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు . మహేష్ గారూ ....... ఎయిర్పోర్ట్ ? .
మనం ఫ్లైట్ లో వెళ్లబోతున్నాము మేడం ........
దేవత : నో నో నో ....... బస్సులోనో లేక ట్రైన్ లోనో వెళదామండీ ...... ఫ్లైట్ టికెట్ అమౌంట్ నేనివ్వలేను .
ఇవ్వలేనంటే ఎలా మేడం గారూ ...... సూర్యోదయం లోపు మీ నాన్నగారి ముందు ఉండాలని మాట తీసేసుకున్నారు - అలా జరగాలంటే ఇదొక్కటే మార్గం . జస్ట్ కిడ్డింగ్ మేడం గారూ ....... నేను మాటిచ్చాను కాబట్టి ఎంత ఖర్చైనా సరే సేఫ్ గా తీసుకెళతాను , మీరు బస్ అమౌంట్ ఇస్తే చాలు - నేనైతే అదీ ఆశించలేదు మీరే ఈగోకు వెళ్లి ఇస్తానన్నారు . ఫ్లైట్ కూడా విజయవాడ వరకే దొరికింది అక్కడి నుండి మీరు కోరుకున్నట్లుగానే బస్సులోనే వెళ్ళాలి - 15 నిమిషాలలో ఫ్లైట్ మీరు ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఉన్న చివరి ఫ్లైట్ కూడా మిస్ అయిపోతాము అని బయట ఉన్న బెంచ్ పై కూర్చున్నాను . స్స్స్ ...... ఆఅహ్హ్హ్ ...... చలి చలి అంటూ వణుకుతూ ........ , మేడం ఇక 10 నిమిషాలే లోపల వినిపిస్తున్న అనౌన్స్మెంట్ కూడా మన ఫ్లైట్ దే - పెళ్లి పనులు ........
దేవత : సరే ........
Thats good రండి అంటూ లోపలికివెళ్లి సెక్యూరిటీ ద్వారా చెక్ ఇన్ అయ్యి రన్ వే పై ఉన్న ఫ్లైట్ దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్నాము .
దేవత : ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాను అని ఫ్లైట్ వైపు చూస్తూ భయపడుతున్నట్లు దేవుణ్ణి మొక్కుకుంటున్నారు .
మేడం గారూ ...... ఏమిటీ ఫస్ట్ టైం - చాలా చాలా భయం వేస్తుందిలే అని మరింత భయపెట్టి నవ్వుకున్నాను .
దేవత : నిజమా మహేష్ గారూ ...... భయమేస్తుందా ? .
నవ్వుకుని , వణుకు వచ్చేస్తుందండీ - ఫ్లైట్ కదులగానే భయంకరమైన శబ్దం , ఫ్లైట్ వైబ్రేషన్స్ ..... ప్రక్కన కూర్చున్న వారిని గట్టిగా పట్టుకోకపోతే ఇక అంతే మీ ఇష్టం అని ఫ్లైట్ చేరుకుని లోలోపలే నవ్వుతూ పరుగున స్టెప్స్ ద్వారా ఫ్లైట్ ఎక్కి లోపలికివెళ్లి మా సీట్స్ లో విండో సీట్ వదిలి కూర్చుని దేవత భయాన్ని ఎంజాయ్ చెయ్యాలని డోర్ వైపు చూస్తున్నాను .

దేవత డోర్ దగ్గరకు రావడం రావడమే భయపడుతూ వచ్చారు - అంతటి చలిలోనూ నుదుటిపై చెమటలు పట్టడం చూసి ప్లాన్ సక్సెస్ - దేవత ఖచ్చితంగా నన్ను పట్టుకోబోతోంది అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
Please వెల్కమ్ మేడం అంటూ ఎయిర్ హోస్టెస్ స్వాగతం పలకడం కూడా నిట్టుపడి లోపలికి అడుగుపెట్టారు . నేను కనిపించకపోవడంతో అటూ ఇటూ చూసి కంగారుపడుతున్నారు .
ఇక చాలు అనుకుని పైకి లేచాను .
అంతే దేవత కోపంతో నా దగ్గరికి వడివడిగా వచ్చి కొడతారేమో అనుకున్నాను కానీ  అప్పటికి ఇంకా అంతటి అదృష్టం కలుగలేదు . భయపడుతున్నానని తెలిసి కూడా ఇలా వదిలి రావడం ........
Sorry sorry మేడం గారూ ....... , పల్లెటూరులో పుట్టి పెరిగిన తెలుగు వీరనారికి భయం అంటే నమ్మకం కుదరలేదు - నన్నేమైనా ఆటపట్టిస్తున్నారేమోనని ఇలా ......
దేవత : చాలా భయం వేసింది - వేస్తోంది కూడా ....... , ఇంతకీ మన సీట్స్ ఎక్కడ ?.
మీ సీట్ ఇక్కడ విండో వైపు - నా సీట్ అదిగో ఫ్లైట్ చివరన అని చేతితో చూయించాను .
దేవత : వేరువేరు సీట్లలోనా ....... , నో నో నో నేనూ వెనుకే కూర్చుంటాను పదండి అని భయపడుతూ చెప్పింది .
నవ్వుకుని లేదులేండి ఇద్దరి సీట్లూ ఇక్కడే ప్రక్కప్రక్కనే వెళ్లి కూర్చోండి .
దేవత : ఇప్పటికే భయం వేస్తోంది - అందునా ఆటపట్టిస్తున్నారు అని నా చేతిపై గిల్లేసారు .
కెవ్వుమని అరవడంతో నిద్రపోతున్న ప్రయాణీకులంతా ఉలిక్కిపడి లేచారు . Sorry sorry go to sleep go to sleep అని దేవతవైపు చూసాను .
ముసిముసినవ్వులు నవ్వుకుంటూ బుజ్జితల్లిని ఎత్తుకునే విండో ప్రక్కన సీట్లో కూర్చున్నారు దేవత .

నా కేకకు ప్రయాణీకులతోపాటు బుజ్జితల్లి కూడా లేచి మమ్మీ మమ్మీ ....... AC బస్సులోకి వచ్చామా అంటూ మరింత గట్టిగా హత్తుకుని బుజ్జికళ్ళు మూసుకుంది .
దేవత : లేదు బుజ్జితల్లీ ....... మనం AC బస్సులో కాదు AIR BUS అంటే ఫ్లైట్ లో ఉన్నాము .
బుజ్జితల్లి : కళ్ళుతెరిచి చుట్టూ చూసి మమ్మీ ఫ్లైట్ లో ఉన్నామా అంటూ సంతోషం పట్టలేక కేకలువేస్తోంది .
ప్రయాణీకులంతా మళ్లీ ఉలిక్కిపడటంతో మళ్లీ sorry చెప్పాను .
దేవత : నవ్వులు ఆగడం లేదు ష్ ష్ బుజ్జితల్లీ అంటూ బుజ్జితల్లి పెదాలను పెదాలతో మూసేసింది . బుజ్జితల్లి సంతోషానికి మరింత మురిసిపోతూ అవును బుజ్జితల్లీ ....... ఫ్లైట్ లో మన ఊరికి వెళ్లబోతున్నాము - మీ అంకుల్ .......
బుజ్జితల్లి : అంకుల్ ....... అంటూ బుజ్జిబుజ్జినవ్వులతో బుజ్జిచేతులను చాపింది ఎత్తుకోమని .........
స్స్స్ స్స్ ...... అంటూ గిల్లిన చోట రుద్దుకుంటూనే బుజ్జితల్లిని ఎత్తుకుని కూర్చున్నాను .
బుజ్జితల్లి : థాంక్యూ అంకుల్ ఫ్లైట్ లో తీసుకెళుతున్నందుకు - మా అపార్ట్మెంట్ పై రోజుకు చాలా విమానాలు వెళుతుండటం చూసి ఆశపడేదాన్ని , ఇంత తొందరగా ఫ్లైట్లో వెళతానని అనుకోలేదు అని బుగ్గపై ముద్దుపెట్టి ఆనందిస్తోంది . అంకుల్ ఏంటి చేతిపై రుద్దుకుంటున్నారు - అయ్యో ఎర్రగా అయిపోయిందే ఏమైంది .
ఇంకా నవ్వుతూనే ఉన్న దేవతవైపు దీనంగా చూస్తూ తేనెటీగ కొరికింది బుజ్జితల్లీ .......
బుజ్జితల్లి : ఫ్లైట్ లో కూడా ఉంటాయా ? అంకుల్ .......
అది ఆడ తేనెటీగ బుజ్జితల్లీ , నాకే కోపం తెప్పిస్తావా అని కొరికి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది .
దేవత : ఇంకా రెండు సార్లు కొరకే కోపం తెప్పించారు మహేష్ గారూ ...... , ఒక్కసారే కొరికిందని సంతోషించండి అని చేతిని అడ్డుపెట్టుకుని నవ్వుకుంటున్నారు .

అంతలో టేకాఫ్ అనౌన్స్మెంట్ జరగడంతో దేవత నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది - భయంతో సీట్ హ్యాండిల్స్ ను గట్టిగా పట్టుకోవడమే కాకుండా అంతటి AC లో నుదుటిపై చెమట బిందువులు .........
లోలోపలే నవ్వుకుని , బుజ్జితల్లీ ....... ఫస్ట్ టైం ఫ్లైట్ అని మీ మమ్మీ భయపడుతోంది చూడు .
బుజ్జితల్లి : మమ్మీ ......భయం వేస్తోందా అని బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుతోంది - మమ్మీ ....... నాకేమీ భయం లేదు అని బుజ్జిచేతులతో చెమటను తుడిచి బుగ్గపై ముద్దుపెట్టింది .
కీర్తీ ...... మీ మమ్మీ ఒడిలో కూర్చుని నువ్వైనా ధైర్యాన్ని ఇవ్వు .
దేవత : నో నో నో ఇప్పటికే భయం వేస్తోంది - బుజ్జితల్లి ఉంటే మరింత భయం వేస్తుంది - మీతో ఉంటే నాకేటువంటి భయం ఉండదు మహేష్ గారూ - please please మీతోనే ఉంచుకోండి . 
ఫ్లైట్ సౌండ్ రాగానే మరింత భయపడిపోతున్నారు . ఎయిర్ హోస్టెస్ సీట్ బెల్ట్స్ పెట్టుకోమని జాగ్రత్తలు చెబుతున్నారు . 
ఎలా ఎలా అంటూ మరింత కంగారుపడుతూ నన్ను అడిగారు . ఎంత చెప్పినా చూయించినా రాకపోవడంతో ....... మీరే పెట్టండి అన్నారు .
నో నో నో మేడం బెల్ట్ పెడుతూ అసంకల్పితంగా తాకినా మీరు మూడోకన్ను తెరిచేస్తారు - అంత ధైర్యం నేనైతే చెయ్యలేను . ఉండండి ఎయిర్ హోస్టెస్ ను పిలుస్తాను .
అంతటి భయంలోనూ దేవత నవ్వుకోవడం చూసి ముచ్చటేసింది . ఎయిర్ హోస్టెస్ ను పిలిచేంతలో అంకుల్ ....... మనం పెట్టుకోవడం చూసానుకదా నాకు వచ్చు ట్రై చేస్తాను అని అలా పెట్టేసింది .
దేవత ఆశ్చర్యపోయి , లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ అంటూ రెండు చేతులతో ఫ్లైయింగ్ కిస్సెస్ వర్షం కురిపించారు . సౌండ్ పెరుగుతూ ఫ్లైట్ కదులగానే దేవత సైలెంట్ అయిపోయి భయంతో కళ్ళుమూసుకుంది .
బుజ్జితల్లి : అంకుల్ అంకుల్ ....... మమ్మీ మళ్లీ భయపడుతోంది అని నవ్వుతూనే , దేవతకు ధైర్యం చెబుతోంది .
రన్ వే పై వేగం పెరుగగానే దేవుడా దేవుడా అంటూ సీట్ హ్యాండిల్ పై ఉన్న నా చేతిని నొప్పిపుట్టేలా గట్టిగా పట్టుకున్నారు - అయినా భయం తగ్గినట్లు ఏకంగా నా చేతిని రెండు చేతులతో చుట్టేసి గట్టిగా కళ్ళుమూసుకుని భుజం పై తలవాల్చి కంటిన్యూ గా దేవుణ్ణి తలుస్తున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 07-10-2021, 10:42 AM



Users browsing this thread: 1 Guest(s)