12-09-2021, 12:50 PM
(This post was last modified: 12-09-2021, 12:51 PM by anothersidefor. Edited 1 time in total. Edited 1 time in total.)
మిత్రులారా ఎలా ఉన్నారు అందరు క్షేమమేనా
అది సంగతి.
ఇతి వార్తస్సుయంతః బలదేవానంద సాగర
నండ్రి వణక్కం
ఇప్పుడే నా సిస్టం రిపేర్ చేయించుకొని వచ్చాను. రెండు నెలలు గ్యాప్ వచ్చింది. ఈ రోజు కొంత నా సొంత సోది చెపుతాను జస్ట్ టైం పాస్ కి చదవండి. గత జనవరిలో నా జాబ్ కాంట్రక్టు అయిపోయింది అప్పటినుంచి ఇంట్లో జాబ్ లెస్ ఓన్లీ స్టే హోమ్. ఈ ఆరు నెలలు మన సైట్ లోనే ఎక్కువ సమయం గడపటం వలన నిరుత్సాహానికి గురికాకుండా ఉండగలిగాను. ఎంతలా ఆంటే నేను కూడా కథ రాయగలిగేంత ఉత్సాహం. ఈలోపు మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు ఈ సిస్టం రిపేర్ అయ్యింది. సరే అని మొబైల్ లో కామెంట్స్ చూసుకుంటూ గడిపాను.
ఇంతలో లాస్ట్ మంత్ లో కాలిగా ఉన్న నా గోల్డెన్ డేస్ అయిపోయి కొత్త జాబ్ వచ్చింది. అరు నెలల తరువాత బయటకెళ్లిన నన్ను చూసి ఎక్కడ కాపు కాసిందో తెలియదుకాని, వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా, ఎవ్వరిని వదల్లేదు నువ్వు మాత్రం తప్పించుకుంటావా అని జాబ్ లో జాయిన్ ఐన రెండో రోజే కరోనా కాటేసింది. ఆ దెబ్బతో జాబ్ గోవిందా అనుకున్న కాని గుడ్డిలో మెల్ల అని ఆఫీస్ వాళ్ళు జాలి తలిచి కరోనా లీవ్ ఇచ్చారు. దాంతో 15 రోజులు హోమ్ క్వారంటైన్. మీ ఇళ్లల్లో ఉన్న చిన్న పిల్లలని మాత్రం జాగ్రత్తగా కాపాడండి. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా అది నిజంగా మహమ్మారి. ఎవరో మన లోపల కూర్చొని మనల్ని తింటున్నట్టే ఉంది ఆ 15 రోజులు. ఎంత ఎక్కువ ఫుడ్ తినగలిగితే అంత బలమైన ఆహారం తినిపించండి.
15రోజుల తరువాత నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. వెంటనే ఆఫీస్ వాళ్ళు వర్క్ ఫ్రొం హోమ్ ఇచ్చారు. పోనిలే కధ సుకాంతం అయ్యింది అనుకునేలోపు ఈ నెల నుంచు మల్లి ఆఫీస్ కి రమ్మన్నారు. సో రోజు ఆఫీస్ కి వెళ్తున్నాను ఇప్పుడు విత్ అల్ సేఫ్టీ మెసర్స్ తో. ఈ మధ్యలో వాక్సిన్ రెండు డోస్ లు కంప్లీట్ అయ్యాయి. హమ్మయ్య మొత్తం చెప్పేసాను.
ఇంక ఈరోజు సిస్టం రిపేర్ చేయించుకొని వచ్చాను. ఇంక మన కథ కి సంబంధించి అప్డేట్ రాస్తాను. కానీ ఇంతకు ముందులాగ ఫాస్ట్ అప్డేట్ లు ఇవ్వలేకపోవచ్చు కనీసం వారానికి ఒక అప్డేట్ ఐన ట్రై చేస్తాను. ఎందుకంటె కొత్త జాబ్ కదా ఒక టు , త్రి మంత్స్ ఆఫీస్ వాళ్ళని సుఖపెడితే తరువాత మన సుఖానికి వదిలేస్తారు. అప్పుడు కొంచెం ఫ్రీ అవ్వొచ్చు. ఈరోజు కథ రాయటం మొదలుపెడుతున్నాను ఈ వారం లో అప్డేట్ చేస్తాను.
అది సంగతి.
ఇతి వార్తస్సుయంతః బలదేవానంద సాగర
నండ్రి వణక్కం