Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
నెక్స్ట్ ఒక బాక్స్ నిండా ఇయర్ వైస్ డైరీలు ఉన్నాయి . పర్సనల్ ..... చూడకూడదు .
బామ్మ : పర్సనల్ ..... నిజమే అది వేరేవాళ్లకు - నాకు , దేవతను ప్రేమిస్తున్న నా బుజ్జిహీరోకు కాదు . నా బుజ్జిహీరో - నా బుజ్జితల్లి ...... వేరు వేరు కాదన్నది నా అభిప్రాయం . నేను హాల్లోకి వెళతాను నువ్వు చదువు అని పైకి లేవబోతే .......
ఆపి , నా దేవత - మా బామ్మ ...... ఇద్దరితో ఉండటానికి వచ్చాను అని కూర్చోబెట్టుకున్నాను , ఈ డైరీలు నేను చదవటం మీకు సంతోషం కదా నేనొక్కడినే ఉన్నప్పుడు చదువుతాను .
బామ్మ : అలా అయితే మరింత హ్యాపీ ....... - డైరీలో చిలిపి సంగతులేవైనా ఉండవచ్చు కాబట్టి నా బుజ్జిహీరో ఒంటరిగానే చదువుకోవాలి .
మీ ప్రేమకు చాలా చాలా అదృష్టవంతుడిని బామ్మా ...... , లవ్ యు sooooo మచ్ .......

డైరీలను 1 2 3 4 ...... అంటూ కౌంట్ చేసి బాక్స్ లో ఉంచుతూ చివరన స్పెషల్ గా ఉన్న బుక్ నన్ను ఆకర్షించింది - ఉత్సుకతను కలిగించింది . Wow బ్యూటిఫుల్ బామ్మా ....... స్పెషల్ గా ఉంది అని అందుకుఞ్జ రెండువైపులా చూస్తున్నాను .
బామ్మ : అవును నిజమే , నీ దేవతకు అత్యంత స్పెషల్ బుక్ - " నావెల్ " . గత నాలుగు సంవత్సరాలుగా పూర్తిచేయడానికి కృషి చేస్తోంది కానీ సగం కంటే పూర్తవ్వడం లేదు - ఎలాగైనా నవల పూర్తిచెయ్యాలన్నదే నీ దేవత కోరిక కానీ ముందుకు సాగడం లేదని ఫీల్ అవుతూనే ఉంటుంది . మనసులో " plot - ఐడియాస్ " ఉన్నప్పటికీ బెస్ట్ వే వైపు చేరుకోలేకపోతున్నానని బాధపడుతోంది - ఈ నవల పూర్తయినరోజు బుజ్జితల్లి ఆనందం ఎలా ఉంటుందో చూడాలని ఉంది . నాకున్న రెండే రెండు కోరికలలో రెండవ కోరిక ఇది ........ ఎప్పటికి తీరినో .......
Wow wow దేవత చేతి నవల అంటూ గుండెలపై హత్తుకున్నాను - చిన్నప్పుడు అవ్వ నవలల ద్వారానే మంచితనం నేర్పించారు , అవ్వతోపాటు నేనూ బోలెడన్ని నవలలు చదివేవాడిని - ఇక నా దేవత మొదలెట్టిన నవల చదవకుండా వదిలిపెడతానా ....... ? .
బామ్మ సంతోషించి ముద్దుపెట్టారు .

తొలిపేజీ తెరిచాను - నాలుగేళ్ళ కిందట మొదలుపెట్టినట్లు " డేట్ " మరియు నవల పేరు " LIFE & TIME " ...... , " LIFE & TIME " ...... ఇంట్రెస్టింగ్ బామ్మా అంటూ పెదాలపై చిరునవ్వులతో నెక్స్ట్ పేజీ తెరిచాను .
నవల ఇంగ్లీష్ లో ఉండటం చూసి కళ్ళు బైర్లు కమ్మాయి - అవునురా నీ దేవత ఇంగ్లీష్ టీచర్ ...... నవల ఇంగ్లీష్ లో కాకుండా మలయాళం లో ఉంటుందా అని గుటకలు మింగాను . బామ్మా ...... మీరు చదివారా ? , నాకు explain చేస్తారా ? .
బామ్మ : ఇంగ్లీష్ నవల నేనా ...... ? , అప్పట్లో నేను చదువుకున్నది అంటూ సిగ్గుపడుతూ చేతివేళ్ళను చూయించారు .
అప్పటికే మా బామ్మ అంతవరకూ చదివారంటే గ్రేట్ ....... , wow 2nd క్లాస్ 2nd క్లాస్ .......
బామ్మ : బుజ్జిహీరో ...... నిన్నూ ...... అంటూ కొట్టబోయి కౌగిలించుకున్నారు .
ప్చ్ ....... ఇప్పుడైనా కొడతారనుకున్నాను - నో లక్ ....... - సమయం 11 గంటలు అవ్వడం చూసి , బామ్మా ...... చాలా ఆలస్యం అయ్యింది మీరు పడుకోండి .
బామ్మ : నా బుజ్జిహీరో ఎలా అయితే తన దేవతను చూస్తూనే ఉండాలని ఆశపడుతున్నాడో అలానే నేనుకూడా నా బుజ్జిహీరోను చూస్తూనే ఉండాలని ఆశపడుతున్నాను , అలాంటప్పుడు నేనెలా పడుకుంటాను - ఒకరోజు పడుకోవడం ఆలస్యం అయితే ఏమీకాదు , నా బుజ్జిహీరో ఉత్సాహం చూస్తుంటే నాకు నిద్రనే రావడం లేదు కమాన్ కమాన్ చదువు మరి ........

అయినా నా దేవత ఇంగ్లీష్ టీచర్ అయ్యుండి , నేను ...... వారి ప్రియమైన స్టూడెంట్ అయ్యుండి ఇంగ్లీష్ లో ఉన్న ఈ నావెల్ చదవకపోతే , నాదేవతకే అవమానం .
కళ్ళుమూసుకుని పెద్దమ్మను - దేవతను తలుచుకుని నావెల్ మెయిన్ థీమ్ చదివాను . సులభంగా అర్థమైపోయింది - బామ్మకు కూడా explain చేసాను .
ఇద్దరమూ ఒకేసారి " సూపర్ " అని నవ్వుకున్నాము . థీమ్ చదివిన ఏ ఒక్కరైనా ఎలా వర్ణించారు అని చదవకుండా ఉండలేనంత ఆసక్తిని కలిగించింది .
బామ్మా ....... మీ , నా మరియు ప్రతీ వ్యక్తి జీవితప్రయాణం - కాలం గురించి రాస్తున్నారు అంటూ కంటిన్యూ చేసాను . పేజీలు అలా అలా టర్న్ అవుతున్నకొద్దీ ఆసక్తి మరింత పెరుగుతూనే ఉంది - మా ఇద్దరి ఆనందాలకు అవధులు లేకపోయింది - గంట సమయం చిటికెలో గడిచిపోయినంత బ్యూటిఫుల్ నావెల్ ....... నెక్స్ట్ పేజీ తెరిచిచూస్తే అక్కడితో ఆగిపోవడం చూసి , నెక్స్ట్ ఏమిటి నెక్స్ట్ ఏమిటి అంటూ పిచ్చెక్కిపోయింది .
బామ్మ ...... కళ్ళుమూసుకుని నా భుజంపై తలవాల్చి ఊ కొడుతూ నెక్స్ట్ నెక్స్ట్ ....... అని ఆతృతతో అడిగారు .
Sorry బామ్మా ....... ఇక్కడితో ఆగిపోయింది .
బామ్మ : ఆగిపోయిందా ...... , ఇంత అద్భుతమైన నవలను ఎందుకు ఆపింది అంటూ తియ్యనికోపంతో వెళ్లి దేవత బుగ్గపై గిల్లేసారు .
దేవత : స్స్స్ ...... అంటూ రుద్దుకుని ముడుచుకుని పడుకున్నారు .
పెదాలపై చిరునవ్వులతో ....... , గాడెస్ ...... ఇంత అద్భుతమైన నవలను ఎందుకు ఆపారు - plot & ఐడియాస్ ఉన్నాయని చెప్పారట కదా ........ 

బామ్మ : బుజ్జిహీరో ....... పూర్తిగా తెలుసుకోకుండా నేనాగలేకపోతున్నాను . నీ దేవతను కొట్టి లేపైనా సరే , గన్ ఎక్కుపెట్టైనా సరే .........
నో నో నో ష్ ష్ ష్ బామ్మా ....... అంటూ లేచివెళ్లి బామ్మను లాక్కునివచ్చి సోఫాలో కూర్చోబెట్టాను . దేవత దగ్గరకువెళ్లి sorry sorry ...... హాయిగా నిద్రపోండి - బామ్మను ఎలా సంతృప్తి పరుస్తానో చూడండి . బామ్మా ...... పెద్దమ్మ ఉండగా కంగారు ఎందుకుపడతారు ముందు కూల్ అవ్వండి - మీ బుజ్జితల్లి " కంటెంట్ ఐడియాస్ " ద్వారానే నవల పూర్తవుతుంది . 
బామ్మ : అలా అయితే ok , ఎందుకంటే నీ దేవత నవల పూర్తయ్యేవరకూ నాకు నిద్రపట్టేలా లేదు please please ....... కాస్త తొందరగా తొందరగా .......
లవ్ టు లవ్ టు బామ్మా ....... , ఇప్పుడు మనం చెయ్యాల్సినదల్లా భక్తితో కళ్ళుమూసుకుని పెద్దమ్మను ప్రార్థించాలి - బామ్మా ...... ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి ప్రార్థన ఎలా ఉండాలంటే పెద్దమ్మకు ఆర్డర్ వేసినట్లుగా ఉండాలి , రిక్వెస్ట్ చేస్తే పెద్దమ్మకు చాలా చాలాకోపం .

మెసేజ్ సౌండ్ - బామ్మా బామ్మా ...... పెద్దమ్మ నుండి రిప్లై వచ్చింది .
" చెప్పానుకదా బుజ్జిహీరో ....... సర్ప్రైజస్ బోలెడన్ని ఉన్నాయని - నీ దేవత మా బంగారుతల్లి మొదలెట్టిన " లైఫ్ & టైం " నవలను మా ప్రాణమైన బుజ్జిహీరోతో పూర్తిచేయిస్తాను , అవును నీ దేవత ఎక్కడ ఆపేసిందో అక్కడి నుండే నువ్వు మొదలెట్టి పూర్తిచేయబోతున్నావు " .
మీ ఆశీర్వాదం ఉంటే కొండనైనా ఎత్తేస్తాను అందులో డౌట్ ఏమీ లేదు కానీ పెద్దమ్మా ........ 
మెసేజ్ - " అర్థమైంది అర్థమైంది బుజ్జిహీరో ....... నీ దేవత మనసులోని కంటెంట్ ద్వారానే - నీ చేతుల ద్వారానే పూర్తవ్వబోతోంది , అప్పుడే కదా నీ దేవత హ్యాపీ - మీరు డబల్ హ్యాపీ " .
Yes yes yes పెద్దమ్మా ....... కానీ ఎలా ? దేవత నిద్రపోతున్నారు కదా - బామ్మ అయితే ఉదయం వరకూ ఆగేలా లేరు .
మెసేజ్ - " వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్ - నీ దేవత మనసు ...... నీ మనసుతో ఏకీభవిస్తే చాలు , తన ఐడియాస్ అన్నీ నీకు తెలిసిపోతాయి అప్పుడు నా - బామ్మ ఆశీర్వాదంతో చకచకా పూర్తిచెయ్యవచ్చు " .
" మనసు - మనసు " ఎలా ఏకీభవిస్తాయి పెద్దమ్మా ...... ? .
మెసేజ్ - " సింపుల్ బుజ్జిహీరో ....... నీ దేవతకు ముద్దుపెడితే చాలు ఇద్దరి మనసులూ ఏకమైపోతాయి " 
బామ్మ : ( యాహూ యాహూ ...... ష్ ష్ ష్ ..... మన దైవం వలన నాకోరిక తీరబోతోంది థాంక్యూ థాంక్యూ sooooo మచ్ పెద్దమ్మా ........)
దేవతకు ముద్దు ...... వేరే మార్గం లేదా పెద్దమ్మా ...... ? .
మెసేజ్ - " లేనేలేదు - వన్ అండ్ ఓన్లీ వే , ఆ తరువాత నీ ఇష్టం " .

వేరే మార్గం లేదా , దైవం చెప్పాక ఇక తప్పదు . బా ..... మ్మా బా ..... మ్మా తడబడుతూ ము ..... ము ..... ముద్దు పెట్టొచ్చా ...... ? .
బామ్మ : నా సంతోషం - నా కేకలు చూశాక కూడా ఇంకా అనుమతి అడుగుతున్నావా ..... ? , కొట్టేస్తాను నిన్ను ....... , నా రెండే రెండు కోరికలలో రెండవది నవల పూర్తవ్వడం అయితే మొదటిది నీ దేవతకు ...... నా బుజ్జిహీరో ముద్దుపెట్టడం ఆ తరువాత ....... ok ok అంటూ ఆనందబాస్పాలతో చెప్పారు - ఇంతకీ ముద్దు పెదాలపైనే కదా .......
నో నో నో పెద్దమ్మా తప్పు తప్పు , పెద్దమ్మ ముద్దు అన్నారు అంతేకానీ ఎక్కడని చెప్పలేదు .
మెసేజ్ : " ప్చ్ ...... బుజ్జిహీరో నిన్నూ ...... నీ సంగతి తరువాత చెబుతాను ,ప్రస్తుతానికి ఎలాగోలా కానివ్వు " 
పెద్దమ్మ మాటల మర్మం అర్థం అవ్వలేదు - తడబడుతూ పైకిలేచి వణుకుతూ దేవత దగ్గరికి చేరుకున్నాను . నా ప్రియాతిప్రియమైన దేవతా ....... కొన్ని అత్యవసర పరిస్థితుల వలన మీ పర్మిషన్ లేకుండానే ముద్దు ముద్దు పెట్టబోతున్నాను - This is the best moment అంటూ ఆనందిస్తూ దేవత వదులుతున్న శ్వాసను పీలుస్తూ - సౌందర్యానికి ముగ్ధుడినై మత్తుగా మూతలుపడుతున్న బుగ్గపై తొలిముద్దుపెట్టాను .
Thats it స్వీటెస్ట్ కరెంట్ షాక్ కొట్టినట్లు నుదుటి దగ్గర నుండి కాలి బొటన వేలి వరకూ జలదరిచింది - గిర్రున తిరుగుతూ వెళ్లి సోఫాలో కూర్చున్నాను . బామ్మ చేతిలోని దేవత నావెల్ - జేబులోని పెన్ అందుకుని బుల్లెట్ ట్రైన్ లా రాసుకుంటూ వెళ్లిపోతున్నాను బామ్మకు explain చేస్తూ ........
నిమిషాలలో పూర్తయినట్లు " LIFE & TIME --- THE END " .
బామ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో అత్యద్భుతమైన ఎండింగ్ - అందరినీ ఆలోచింపచేసే మెసేజ్ ...... సూపర్ సూపర్ అంటూ ముద్దులవర్షం కురిపించి కౌగిలించుకున్నారు .
బామ్మా బామ్మా బామ్మా ....... మీ పొగడ్తలు - ముద్దులు - కౌగిలింత అన్నీ అన్నీ మీ బుజ్జితల్లికే చెందాలి . వారి మనసు ........
బామ్మ : నా ప్రాణమైన బుజ్జితల్లి సగం - నా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిహీరో సగం ....... , అయినా పెద్దమ్మ చెప్పినట్లు మీ ఇద్దరి మనసులు ఏకమయ్యాయి కాబట్టి నీకు ముద్దులుపెడితే నీ దేవతకు పెట్టినట్లే - నీ దేవతకు ముద్దుపెడితే నీకు పెట్టినట్లే కదా అంటూ మళ్లీ ఒక రౌండ్ సంతోషాన్ని పంచుకున్నారు .

సంతోషంతో నా దేవత దగ్గరకువెళ్లి , గాడెస్ ...... మన దైవమైన పెద్దమ్మ అనుగ్రహంతో మీరు మొదలుపెట్టి సగంలో ఇబ్బందిపడిన నవలను మీ మనసులో అనుకున్నట్లుగానే పూర్తిచేసాము - ఈ నవలకు నేనూ చిరు సహాయం అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను - చివరగా మీరు బామ్మకు బోలెడన్ని ముద్దులు ఇవ్వాలి ఎందుకంటే బామ్మ ప్రెజర్ చెయ్యకపోతే ఈ నవల రాత్రికి రాత్రి నిమిషాలలోనే పూర్తయ్యేది కాదు అని నవలను దేవత గుండెలపై ఉన్న ఒకచేతి కింద ఉంచి , దేవత చప్పరిస్తున్న బొటన వేలిని అతినెమ్మదిగా బయటకు లాగాను .
దేవత : బామ్మా ....... అంటూ మళ్లీ నోటిలోకి తీసుకుని , నవలను గుండెలపై హత్తుకున్నారు .

ముసిముసినవ్వులతో వెళ్లి అంతే సంతోషంతో నవ్వుతున్న బామ్మ గుండెలపై వాలాను . బామ్మా ...... ఇంత అద్భుతమైన plot ను మనసులో ఉంచుకుని , నా దేవత ....... నవలను ఎందుకు పూర్తిచేయ్యలేకపోయారు .
బామ్మ : నాకు తెలిసి ఇందుకోసమే - ఈ క్షణాన నా బుజ్జిహీరో చేతులతో పూర్తవ్వాలని పెద్దమ్మ ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు అని నా నుదుటిపై ముద్దుపెట్టారు.
అవునా బామ్మా ....... చాలా చాలా ఆనందం వేస్తోంది అని దేవతవైపు ప్రేమతో చూస్తున్నాను - బామ్మా ...... కాసేపు మీ ఒడిలో నిద్రపోవాలని ఉంది - గడియారం కనిపించడంతో చూస్తే అర్ధరాత్రి దాటడంతో వద్దులే బామ్మా ...... సమయం మించిపోయింది - మీరు వెళ్లి దేవతతోపాటు పడుకోండి , నేను హాల్లోకి వెళ్లి పడుకుంటాను .
బామ్మ : నా బుజ్జిహీరోను ఒడిలో పడుకోబెట్టుకోవడం కోసం పాతికేళ్ళు పట్టింది - ఈ అదృష్టాన్ని వదులుకుంటానా చెప్పు - నువ్వు హాయిగా పడుకో బుజ్జిహీరో ...... నువ్వు పడుకున్నాక వెళ్ళిపడుకుంటాను కదా అని లైట్స్ ఆఫ్ చేసి కేవలం నైట్ బల్బ్ మాత్రమే ఉంచివచ్చి నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని ప్రాణంలా జోకొడుతున్నారు .
దేవతను చూస్తూ బామ్మ ఒడిలో పడుకోవడం ఎంత హాయిగా ఉందో మాటల్లో చెప్పలేను - లవ్ యు sooooo మచ్ బామ్మా అని కళ్ళుమూసుకోగానే ఘాడంగా నిద్రపట్టేసింది .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 02-10-2021, 10:48 AM



Users browsing this thread: 44 Guest(s)