Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#23
సిగ్మున్డ్ ఫ్రాయ్‌డ్ వ్యాఖ్యానం


తెలుగు సినిమా కథలా ఉన్న ఈ కథని ఆధారంగా చేసుకుని ప్రాచీనకాలంలోనే గ్రీకు భాషలో సొఫొక్లీస్, ఈడిపస్ రెక్స్ అనే నాటకం రచించేడు. జెర్మనీ, ఫ్రాన్స్ దేశాలలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ నాటకాన్ని సా. శ. 1880లలో మానసిక శాస్త్రవేత్త సిగ్మున్డ్ ఫ్రాయ్‌డ్ (Sigmund Freud) చూసి ప్రభావితుడయ్యాడు. ‘మూడు నుండి ఏడు సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న పిల్లల మానసిక వికాసపు సమయంలో ఆడపిల్లలు తండ్రిని, మగపిల్లలు తల్లిని లైంగిక దృష్టితో చూసి వారిని తమ జీవిత భాగస్వాములుగా చేసుకోవాలని కోరుకుంటారు’ అనే విప్లవాత్మకమైన వాదాన్ని ప్రవేశపెట్టేడు. ‘అమ్మే అందరిలోకీ అందమైనది, మంచిది, ఉన్నతమైనది అనే భావం కొడుకుకి ఉండడం సహజం. కాని పిన్న వయస్సులో ఆ భావం ప్రేమగా మారినప్పుడు కొడుకుకి, తండ్రికీ మధ్య ఒక రకం వైరభావం ఏర్పడుతుంది’ అంటాడు ఫ్రాయ్‌డ్. అప్పుడు ఆ తండ్రి ‘ఈమె నాది. నువ్వు నీ ఈడుకి సరిపోయే జోడీని మరొకరిని చూసుకో’ అనే పరిష్కార మార్గం చూపిస్తాడు. ఈ రకం మానసిక సంక్షోభానికే ఫ్రాయ్‌డ్ ఈడిపస్ కాంప్లెక్స్ అని పేరు పెట్టేడు. ఈ రకం మానసిక సంక్షోభం మగ పిల్లలు తమ ఆడ టీచర్ల యెడల ప్రదర్శించడం మనం చూస్తూనే ఉంటాం.

అమెరికాలో ఈ విషయాన్ని కథాంశంగా తీసుకుని ఏన్డీ గ్రిఫిత్ (Andy Griffith) తన పేరుమీదే ఉన్న టి.వి. కార్యక్రమంలో ఒక మనోహరమైన సన్నివేశం చూపిస్తాడు. )

ఇదే రకం మానసిక సంక్షోభం ఆడపిల్లలు తమ తండ్రి యెడల, మగ గురువుల యెడల కూడ చూపిస్తూ ఉంటారు అంటారు ఫ్రాయ్‌డ్. అప్పుడు దానిని ఎలక్ట్రా కాంప్లెక్స్ (Electra Complex) అంటారు.

[+] 1 user Likes WriterX's post
Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 11:41 PM



Users browsing this thread: 4 Guest(s)