Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పెళ్లి ముందు.. పెళ్లి తరువాత..
#19
Episode 1
టైం పొద్దున మూడు అవుతుంది. గది అంతా నిశబ్దంగా ఉంది. కిటికీ లో నుండి గాలి చల్లగా వీస్తూ ఉంది. నా భార్య రూప నా తొడల మీద తల పెట్టి హాయిగా నిద్రపోతోంది. తనలా నిద్రపోతూ ఉంటే నేను అలాగే మేలుకుని తననే చూస్తూ ఉన్నా. ఎందుకో తెలీదు తనని ఎంత సేపు చూసినా అలాగే తనని చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. తన రూపం తన మాటలు తన నడవడిక నాకు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి.
తను నా తొడలపై పడుకుని ఇప్పటికి ఆరు గంటలు అయినా కూడా నేను తనని కదపకుండా అలాగే పడుకోబెట్టుకొని తననే చూస్తూ ఉన్నానంటే  అర్దం చేసుకోండి నాకు తన్ని చూస్తూ ఉండడం అంటే ఎంత ఇష్టమో. పెళ్ళై ఇన్నాల్లైనా, తనని రోజూ చూస్తూ ఉన్నా, నాకు ఇంకా ఎందుకో తనని ఇలాగే ఇలాగే చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది. తనంటే నాకు అంత ఇష్టం. ఒకవేళ ఇష్టపడక పోయినా తను ఇష్ట పడేలా ఆకర్షిస్తుంది. నన్నే కాదు తన చుట్టూ ఎవరు ఉన్నా కూడా వాళ్ళని ఇట్టే ఆకర్షిస్తుంది. అదే తనలో నాకు బాగా నచ్చిన విశయం. 
నిజానికి తను నా ఫ్రెండ్ చెల్లి. నా ఫ్రెండ్ కు ప్రేమ వివాహాలు అంటే అస్సలు నచ్చదు. కానీ నేను వాడి చెల్లి నే లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నిజానికి నేను చేసుకున్నా అని అనడం కంటే తనే నన్ను చేసుకుంది అనడం కరెక్ట్ ఏమో. ఏంటి నేను ఇలా అంటున్నా   అని అనుకుంటున్నారా ? పదండి నా గతం లోకి వెళ్దాం మీకే తెలుస్తుంది నేను ఎందుకు అలా అన్నానో అని..
నా పేరు వినయ్. మాది కొంచెం రిచ్ ఫ్యామిలీ అనే చెప్పాలి. నిజానికి చాలా రిచ్ ఫ్యామిలీనే కానీ మా నాన్నకు నమ్మకమైన బిజినెస్ పార్ట్ నర్స్  లేక చాలా ఆస్తినే కోల్పోయాడు. ఇప్పుడు కేవలం ఒక చిన్న పాటి కంపెనీని నడిపిస్తూ నన్ను కూడా అదే కంపెనీ లో వర్క్ చేయమని ప్రోస్తహిస్తు ఉన్నాడు. కానీ నాకేమో ఆ కంపెనీ లో వర్క్ చేయడం అంతగా ఇష్టం లేదు. అందుకే సొంతంగా నేనే పని నేర్చుకుని కొత్తగా ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా. మా నాన్నకు ఒక ప్రాణ మిత్రుడు ఉన్నాడు. అతనే దేవేంద్ర. అతను కూడా మా నాన్న లాగే చాలా బిజినెస్ లు చేసాడు. ఎన్నో అపజయాలను ఎదుర్కున్నాడు కానీ ఎప్పుడూ వెనక్కి అడుగు వేయలేదు. ఇప్పుడు అతనికి రెండు కంపెనీలు ఉన్నాయ్. సిటీ లో చాలా పేరు ఉంది అతనికి. అతనంటే మా నాన్నకు మా నాన్న అంటే అతనికి చాలా అంటే చాలా ఇష్టం. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మా రెండు కుటుంబాలు కచ్చితంగా కలవాల్సిందే. అదలా అలవాటు అయిపొయింది మాకు. ఆరోజు కూడా వాళ్ళ కంపెనీ ఆనువల్ టర్న్ ఓవర్ పెరగడం తో ఒక చిన్న పార్టీ ఆరెంజ్ చేశారు. ఎప్పటి లాగే మా ఫ్యామిలీ నే వాళ్లకు మొదటి గెస్ట్. కాబట్టి ఆరోజు మధ్యాహ్నం లోపు మా అమ్మా నాన్నా, మా అక్క బావ, నేను అందరం వాళ్ళ ఇంటికి చేరుకున్నాం.  అన్నట్లు చెప్పడం మరిచి పోయాను. మా అక్క పేరు భాను తనకి పెళ్లి అయ్యింది. మా నాన్న పట్టు పట్టి మరీ ఇల్లరికం వచ్చే అల్లుడిని చూసి పెళ్లి చేశారు. మా బావ బాగా ఇంటెలిజెంట్, తను వేరే కంపెనీ లో వర్క్ చేస్తూనే మా కంపెనీ వర్క్స్ కూడా చూసుకుంటూ ఉంటాడు. మా నాన్నకు అతనంటే గౌరవం. బాగా సిన్సియర్ అని. అందుకేనేమో కూతురిని కూడా ఇచ్చి చేసాడు. ఇక విశయానికి వస్తే, మేము దేవేంద్ర అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటి లోపలికి వెళ్తూ వుండగానే దేవేంద్ర అంకుల్ బార్య ఎదురొచ్చి మాకు ఆహ్వానం పలికింది. 
దేవేంద్ర బార్య : ఎంటే పొద్దున రమ్మంటే ఇప్పుడా వచ్చేది ?
మా అమ్మ : అదేం లేదే వీడే కాస్త లేట్ చేసాడు ఆ పని ఈ పని అనుకుంటూ అంటూ నా వంక చూసింది. 
ఆంటీ నా వైపు చూసి ఏరా ఇక్కడకు రావడం కంటే నీకు ముఖ్యమైన పని ఉందా అని అంది. నేను అమ్మ నా మీదకి చెప్పేసరికి తనని చూస్తూ ఆంటీ నన్ను అంటారేంటి, మా ఇల్లు పక్కనే కదా నేను లేట్ చేస్తే ఏమీ ? వాళ్ళు ముందే రావొచ్చుగా అన్నా. ఆ లాజిక్ కరెక్టే అని అనిపించడం తో ఆంటీ అమ్మ వైపు చూస్తూ నిజమే కదనే, వాడంటే లేట్ చేశాడు పక్కింట్లో ఉండి నీకు రావడానికి ఎంటే అడ్డం ? అంది. దానికి నేను నవ్వుతూ అలా అడగండి ఆంటీ అంటూ అమ్మ అక్క వంక చూసి కొంచెం వెక్కిరింపుగా రెండు గంటలు చేశారు ఆంటీ సింగారించడానికి మళ్ళీ ఇప్పుడు ఎదో నా మీద సాకులు చెప్తున్నారు అన్నా. ఆంటీ అమ్మ వంక చూసి అమ్మో ఏం దొంగవే నువ్వు వాడి మీదకి చెప్పి నువ్వు లేట్ చేసింది కప్పి పుచ్చుకుంటున్నావా అంది. అలా అంటూ ఉండగా అప్పుడే దేవేంద్ర అంకుల్ వచ్చాడు. నేను అంకుల్ ను చూసి వెంటనే సైలెంట్ అయిపోయా. (అంకుల్ అంటే కొంచెం భయం నాకు) హెలో వినయ్ అంటూ నా దగ్గరకు వచ్చాడు. నేను కొంచెం భయంగానే హెల్లో చెప్పా. అంకుల్ నా వంక సూటిగా చూస్తూ ఏంటి ఆల్రెడీ ఉన్న కంపెనీ ని వొదిలేసి వేరే ఎదో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నావ్ అంట నిజమేనా ? అన్నాడు కాస్త బేస్ వాయిస్ తో. మామూలుగానే నాకు అంకుల్ అంటే భయం, ఎందుకో తనని చూస్తేనే నాకు భయం వేస్తుంది. అలాంటిది అంకుల్ అలా నా దగ్గరికి వచ్చి అలా అడిగేసరికి నాకు చిన్నగా వొణుకు వచ్చింది. నా అవస్థ చూసి నవ్వి మా నాన్న వంక చూసి సమాధానం చెప్పడానికే భయపడుతున్నాడు వీడా కొత్త కంపెనీని పెట్టేది అని గట్టిగా నవ్వాడు. నవ్వి మా నాన్న దగ్గరికి వెళ్తూ పదరా వాడు ఎన్ని వేషాలు వేసినా చివరికి నువ్వనుకున్నట్లు గానే నీ కంపెనీనే చూసుకుంటాడు లే అని అంటూ మా నాన్నని పై రూం లోకి తీసుకు వెళ్ళాడు. అలా వాళ్ళు వెళ్తుంటే ఆంటీ వాళ్ళని చూసి నాతో నువ్వు ఆయన మాటలేం పట్టించుకోకు నీకు నచ్చింది చేయ్ ఆయన అలాగే అంటారు అని అంది. నేను స్మైల్ ఇస్తూ థాంక్స్ ఆంటీ అని అన్నా. తను కూడా స్మైల్ ఇస్తూ అవునూ చెప్పడం మరిచిపోయా, రమేష్ ఇందాక నీ కోసం చాలా సేపు వెయిట్ చేసాడు. వెయిట్ చేసి చేసి నీ ఫోన్ కూడా తగలక పోయే సరికి ఒక్కడే వెళ్ళిపోయాడు. నువ్వొస్తే వాడికి ఫోన్ చేయమని చెప్పాడు అని అంది.  నేను అవునా సరే నేను ఇప్పుడే చేస్తాలే అని అంటూ ఫోన్ తీసుకుని పక్కకి వస్తుంటే ఆంటీ అమ్మను అక్కని లోపలికి తీసుకు వెళ్ళింది. నేను ఫోన్ చేత్తో పట్టుకుని రమేష్ గాడికి ఫోన్ చేయబోయా. కానీ సిగ్నల్స్ వీక్ గా ఉండడం తో కాల్ వెళ్ళలేదు. ఛా చెత్త సిగ్నల్స్ అని అనుకుంటూ బావ ను అక్కడే కూర్చోమని చెప్పి పైన బాల్కనీ లో ఏమైనా సిగ్నల్స్ రావొచ్చేమో అని పైకి వెళ్ళా. అక్కడ టీవీ ఆడుతూ కనిపించింది. నేను దగ్గరకు వెళ్లి ఎవ్వరూ లేరు అయినా ఆడుతూనే ఉంది అని అనుకుంటూ టివీ బంద్ చేసి బాల్కనీ లోకి వెళ్ళాను. అలా అక్కడకు వెళ్ళే సరికి అక్కడ అటు వైపుకు తిరిగి నిల్చొని ఉన్న రూప కనిపించింది.
రూప గురించి చెప్పాలంటే తను నాకంటే మూడేళ్లు పెద్దది. చాలా అందంగా ఉంటుంది. అమాయకంగా కనిపించే ముఖం తో ఎప్పుడూ ఫ్రెష్ గా ఫ్రిడ్జ్ లో నుండి తీసిన ఆపిల్ పండులా నిగనిగ లాడుతూ ఉంటుంది. విశాలవంతమైన నుదురుతో, నెలవంకల్లాంటి కనులతో, గులాబీ రేకుల్లాంటి బుల్లి పెదాలతో, అందంగా చక్కగా ఉంటుంది. తనని చూసిన ఎవ్వరైనా సరే ఇంకోసారి తిరిగి చూడాలి అని అనుకుంటారు. అలా ఉంటుంది, ఆ అందానికి తోడు తన సంపదలు, ఏ మగాణ్ణి అయినా ఇట్టే ఆకర్షింప చేయగల మోతాదు లో చాలా పొందికగా ఉంటాయ్. ఎన్నో సార్లు నేనే తనని వేరే విధంగా చూసే వాడ్ని. ఇక అసలు విశయం చెప్పాలంటే నేను తను చాలా క్లోజ్. తనకి నేనంటే నాకు తనంటే చాలా ఇష్టం. ఏ విశయాన్ని అయినా తనకి నేను తను నాకు షేర్ చేసుకోనిది అస్సలు ఉండం. కానీ మొన్న రీసెంట్ గా జరిగిన గొడవ వళ్ళ ఇద్దరం మాట్లాడుకోవడం మానేసాం. దాదాపు అది పెద్ద గొడవే అని చెప్పాలి ఎందుకు అంటే అది మా ఇద్దరి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టగల అంశం. అందుకే ఇద్దరం మాట్లాడుకోవడం మానేశాం. నిజానికి ఇద్దరం అనే కంటే నేనే మాట్లాడడం మానేశా అనడం కరెక్ట్. అయినా ఇది మాకు మామూలే గొడవ పడడం మళ్ళీ కలవడం, కానీ ఈసారే కాస్త సీరియస్ గా ఉంది ఇష్యూ. 
ఇప్పుడే స్నానం చేసినట్లు ఉంది. టవల్ తో తల తుడుచుకుంటూ ఉంది. నేను వచ్చిన పని చూసుకోవడం మానేసి తనని అలాగే నిల్చొని చూస్తూ ఉన్నా. అంతలో తను క్యాసువల్ గా తల తుడుచుకుంటూ ఇటు వైపుకు తిరిగింది. అంతే నేను ఇక్కడ బొమ్మలా నిలబడి తననే చూస్తూ ఉండడం తనకి కనిపించింది. వెంటనే తల తుడుచుకోవడం ఆపేసి నా వంక సీరియస్ గా చూసింది. నేను వెంటనే నేనేం నీతో మాట్లాడడానికి రాలేదు సెల్ సిగ్నల్స్ రాక వచ్చా అన్నట్లుగా తనని చూసా నా సెల్ తనకి చూపిస్తూ. తను నా వంక ఒకసారి ఎగా దిగా చూసి విసుగ్గా తల తిప్పేసుకుని మళ్ళీ తుడుచుకోవడం మొదలు పెట్టింది. ఇక్కడ ఉండి అనోసరంగా తనతో ఎందుకు లే అని అనుకుంటూ అక్కడ నుండి కిందికి వచ్చేశా.
అలా వస్తుండగా రమేష్ బార్య ఎదురు వచ్చింది. నన్ను చూసి పలకరింపుగా నవ్వుతూ ఏంటి వినయ్ ఎలా ఉన్నావ్ అంది. నేను నవ్వి బాగున్నా అని అన్నా. తను అంతలో ఎదో గుర్తు వచ్చినదానిలా అవునూ ఇందాక రమేష్ నీకు కాల్ చేస్తున్నా తగలలేదు అంట కదా ఎక్కడ పెట్టుకున్నావ్ ఫోన్ ను అంది. నేను చేతిలో ఫోన్ ను చూపిస్తూ నెట్వర్క్ రావట్లేదు అన్నా. అంతలో చేతిలో ఉన్న ఫోన్ మోగింది. చూస్తే రమేష్ చేస్తున్నాడు. వెంటనే అది తనకి చూపిస్తూ  వాడే చేస్తున్నాడు అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేశా.  లిఫ్ట్ చేసి హెలో అంటూ హాల్ లోకి వచ్చా. అవతల నుండి రమేష్ గాడు..
రమేష్ : ఏరా ఏ లోకం లో ఉన్నావ్ నీ ఫోనే తగలడం లేదు..
నేను : ఏమోరా పొద్దున నుండి నెట్వర్క్ సరిగా రావట్లేదు, ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశా వెంటనే నీ ఫోన్ వచ్చింది
రమేష్ : అది సర్లే కానీ సాయంత్రం పార్టీ కి సూట్ కొంటా అన్నావ్ గా వస్తావా మరి ? 
నేను : ఇప్పుడా ? ఇప్పుడంత మూడ్ లేదు లేరా తరువాత చూద్దాం 
రమేష్ : సరే, నీ ఇష్టం 
నేను : ఇంతకీ ఎక్కడున్నావ్ ?
రమేష్ : గో డౌన్ రా
నేను : (అక్కడ ఉన్నాడంటే ఎవరినో కొడుతూ ఉంటాడు కచ్చితంగా) అక్కడేం చేస్తున్నావ్ రా 
రమేష్ : మన స్వప్న ఉంది కదరా (రమేష్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ కూతురు) 
నేను : హా
రమేష్ : ఆమెను ఒకడు లవ్ చేస్తే వాళ్ళ నాన్న వాడికి థంకి ఇవ్వమన్నాడు, అదే చేస్తున్నా
నేను : రేయ్ వాళ్ళు సిన్సియర్ లవర్స్ కదరా నీకు తెలీదా ?
రమేష్ : హా, తెలుసు తెలుసు ఈ ప్రేమ లు అన్నీ నాటకాలే అని బాగా తెలుసు.
నేను : రేయ్ నిజం రా నేను చెప్తుంది వాళ్ళు నిజంగా సిన్సియర్  లవర్సే. 
రమేష్ : బాగా చెప్పావ్ రా, నిజంగా అంత ప్రేమ ఉన్నొడే అయితే ఈ అందం ఆస్తి ఉన్న స్వప్న నే లవ్ చేయాలా ? ఇంకెవరు దొరకరా ?  అదే వీడి కంటే తక్కువ ఉన్న అమ్మాయిని వీడు లవ్ చేయమను అప్పుడు నమ్ముతా..
నేను : అప్పటికైనా నువ్వు నమ్ముతావ్ అని నాకు నమ్మకం లేదు లేరా, నీ గురించి నాకు తెలీదా ?
రమేష్ : మరి తెలుసుగా ఎందుకు ఈ అనోసరమైన చర్చలు
నేను : అనోసరం అనకు, ఒకటి చెప్తా విను, నీ సర్కిల్ లో రోజూ నీతో తిరుగుతూ, నీతో ఉంటూ అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్న వాళ్ళ మీద నీకు లవ్ పుడుతుందా ? లేక ఎవరో తెలీని వాళ్ళ మీద నీకు లవ్ పుడుతుందా చెప్పు ? నువ్వు రోజూ కలిసి తిరుగుతూ, అన్ని షేర్ చేసుకుంటూ ఉన్న వాళ్ళ మీద కలుగుతుంది అది సహజం. దీనిని పట్టుకుని వాడు అందం ఆస్తి ఉన్న స్వప్న నే ఎందుకు లవ్ చేసాడు వేరే ఎవరినో చేయొచ్చు గా అంటే ఎలా ? వాడికి ఉన్న సర్కిల్ లో తనే వాడికి బెస్ట్ ఫ్రెండ్ అదలా ముందుకు పోయి ప్రేమగా మారింది. దాన్ని పట్టుకుని నువ్వు అనోసరంగ అదీ ఇదీ అంటూ..
అయినా  ఒకవేళ వాడి కంటే తక్కువ  అమ్మాయిని వాడు రోజు వారీగా కలుస్తూ ఉంటే అప్పుడు వాడికి నిజంగా ఆమె మీదే ప్రేమ రావొచ్చు ఏమో ఎవరికి తెలుసు ?
రమేష్ : ఇప్పుడేంటి ? నేను పోయి వాడికి స్వప్న కు పెళ్లి చేయాలా ఎంటి ? 
నేను : నేను అలా అనట్లేదు అయినా నువ్వు అలా చేస్తే చాలా సంతోషిస్తా.
రమేష్ : ఆపుతావా, అయినా నీకు నా గురించి బాగా తెలుసు ఈవెన్ నువ్వు  ప్రేమించినా కూడా నేను ఇలాగే మాట్లాడతా ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని కూడా విడగొడతా అంతే కానీ లవ్ అంటే మాత్రం ఒప్పుకునేదే లేదు ఎవ్వరైనా సరే..
నేను : అబ్బో, ఒకటి అడుగుతా నిజం చెప్పురా, నీ పెళ్లాన్ని అయినా లవ్ చేస్తున్నావా లేక ఇలాగే తన ముందు కూడా మాట్లాడుతూ ఉన్నావా ?
రమేష్ : రేయ్ మాకు పెళ్లి అయ్యింది రా, ఇది వేరు అది వేరు
నేను : డ్రామాలు చేయకు రా, నీకు నిజంగా లవ్ అంటే ఎంటో తెలీదు, కానీ దాని గురించి మాట్లాడుతున్నావ్ ఒకసారి నువ్వు కూడా లవ్ లో పడింటే అప్పుడు తెలిసేది నీకు..
రమేష్ : (వెక్కిరింపుగా) అవును తెలిసేది, అయినా అది పక్కన పెట్టూ, నువ్వేంటి లవ్ గురించి అంత చెప్తున్నావ్, నువ్వేమైనా లవ్ లో పడ్డావా ఎంటి ? (అనుమానంగా)
నేను : నీకన్నీ అనుమానాలేనారా ? అలాంటిదేం లేదులే బాధ పడకు
రమేష్ : జాగ్రత్త, దానికి ఎంత దూరం ఉంటే అంత మంచింది. అయినా నువ్వు ఆ వూబిలో పడిపోయినా నేను ఉన్నాలే నిన్ను పైకి తీసుకు రావడానికి, అస్సలు కనికరం లేకుండా నిన్ను ఆ ఊబి లో నుండి లాగేస్తా, అర్దం అయ్యిందా ? 
నేను : హ్మ్మ్ హ్మ్మ్ అర్దం అయ్యింది లే, అయినా అలాంటిది ఏమీ జరగదులే కానీ..
(రూప గుర్తొచ్చి) నాకో డౌట్ రా..
రమేష్ : ఎంటి ?
నేను : ఇప్పుడు నీ చెల్లి ఉందిగా,
రమేష్ : హా
నేను : ఒకవేల అది ఎవరినైనా లవ్ చేసిందే అనుకో..
(వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకుంటూ)
అప్పుడు ఏం చేస్తావ్ ? చెప్పు..
పెళ్లి చేస్తావా ? లేక విడగొడతావా ?
రమేష్ : రేయ్, మైండ్ దొబ్బిందా ? అయినా నా చెల్లి మీద పడ్డావ్ ఏంట్రా ? దానికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయితేనూ..
(ఇక్కడ ఇంకో విశయం చెప్పాలి, దేవేంద్ర, మా నాన్న ఇంకా రమణ ముగ్గురు మంచి స్నేహితులు. వాళ్ళు ఒకసారి ఫ్యామిలీ తో పిక్నిక్ కు  పోయి తిరిగి వచ్చే టప్పుడు దేవేంద్ర వద్దన్నా మందు తాగేసి డ్రైవ్ చేయడం మొదలు పెట్టాడు. అతను కంట్రోల్ లో లేడు మీరు నడపండి అని రమణ వైఫ్ చెప్పింది. రమణ కూడా అవును దేవేంద్ర నువ్వు కంట్రోల్ లో లేవు అని అంటూ దేవేంద్ర కు కార్ ఆపమని చెప్పాడు. అది విని ఎంటి నా కంట్రోల్ మీద మీకు డౌటు ఉందా అంటూ కార్ ఆపకుండా చూడండి నా డ్రైవింగ్ ఎలా చేస్తానో అని అంటూ కార్ ను ఇంకా ఫాస్ట్ గా పోనించాడు. వద్దన్నా అలాగే నడుపుతూ ఉన్న దేవేంద్ర కు చిన్నగా మత్తు కమ్ముకోసాగింది. అంతే రమణ వైఫ్ భయపడి నట్లుగానే ఆ మత్తు లో దేవేంద్ర ఆక్సిడెంట్ చేసాడు. చూస్తే రమణ వైఫ్ చనిపోయింది. అప్పుడు దేవేంద్ర గిల్టీ తో చాలా బాధ పడ్డాడు. రమణని చూడలేక తను చేసిన తప్పుకు ఏం చెప్పాలో తెలీక దేవేంద్ర చాలా మదన పడ్డాడు. రమణ కూడా ఫ్రెండ్ కాబట్టి దేవేంద్ర ను ఏం అనలేక పోయాడు. వాళ్లిద్దరూ అలా ఉండడం చూసి ఇలా అయితే కష్టం అని మా నాన్నే ఇద్దరినీ పిలిచి సర్ది చెప్తూ జరిగింది మార్చలేం ఇప్పుడు ఏం చేసినా తనని తీసుకు రాలేం, కాబట్టి జరగాల్సింది చూద్దాం అంటూ రూపను రమణ ఇంటి కోడలిగా చేసుకోమన్నాడు. అది విని దేవేంద్ర రమణ ఇద్దరూ సంతోషించారు. కానీ రమణ కొడుకు నేను సొంతంగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను అని టైం తీసుకున్నాడు. ఇంకో వన్ ఇయర్ లో వాడు తిరిగి రావొచ్చు ఫారిన్ నుండి. ఇలా రూప కు చాలా కాలం క్రితమే పెళ్లి నిర్చయం అయ్యింది) 
ఫోన్ లో రమేష్ మాట్లాడుతూ.. 
రమేష్ : కొంపదీసి అది ఎవరినైనా లవ్ చేస్తున్నట్లు గానీ  నీతో చెప్పిందా ఎంటి ?
నేను : ఛ ఛా, అలా ఏం లేదు లేరా, అందరి విశయాల్లో కోపంగా రియక్ట్ అవుతావ్ గా, అదే నీ చెల్లి విశయం లో ఎలా చేస్తావో అని డౌట్ వచ్చి అడిగా..
రమేష్ : నీ డౌటు తగలయ్య, ఒక్క క్షణం భయపెట్టేసావ్ కదరా, ముందే దానికి రమణ అంకుల్ కొడుకు కు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేశారు అంటూ నా ప్రశ్నకు సమాధానం చెప్తూ అయినా అది ఆణిముత్యం రా, దానికి నేను అన్నా, మా నాన్న అన్నా ప్రాణం, అలాంటిది నేను ఎంటో తెలిసి కూడా అది ఇలాంటి పనులు చేస్తుంది అనుకున్నావా ?
నేను : సరేసర్లే రా నీ ఆణిముత్యం గురించి తెలీక మాట్లాడా క్షమించు అంటూ మనసులో చిన్నగా నవ్వుకున్నా. పాపం వీడు ఏమో దాన్ని ఆణిముత్యం అంటున్నాడు అదేమో మొన్న వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పింది. అది తెలిస్తే వీడు ఏం అయిపోతాడో అని అనుకుంటూ సరే సరే లేరా కొంచెం పని ఉంది మళ్ళీ చెస్తాలే అన్నా. దానికి వాడు కూడా సరే సరేలే ఇక్కడ కూడా నాకు కొంచెం పని పడింది, ఇప్పుడే ఆ స్వప్న లవర్ గాడు లేచాడు ఇంకో రౌండ్ వేసి వస్తా బాయ్ అంటూ ఫోన్ పెట్టేసాడు. వాడలా పెట్టేయగానే రూప నాకు ఐ లవ్ యూ చెప్పింది అని తెలిస్తే వీడు నన్ను కూడా స్వప్న లవర్ ను తీసుకు పోయినట్లే గో డౌన్ కు తీసుకు పోతాడా ఏంటి ? అని అనుకున్నా. అలా అనుకుని అంతలోనే ఛ ఛా అలా జరగదు లే, అయినా నేను రూప ను ఆక్సెప్ట్ చేస్తే కదా అదంతా అని అనుకుంటూ సెల్ జోబిలో పెట్టుకున్నా.  
ఇంట్లో ఆ పని ఈ పని అంటూ కాసేపు టైం పాస్ చేశాక భోజనానికి రూప వాళ్ళ అమ్మ పిలిచింది. నేను వస్తున్నా అని చెప్పేసి హాండ్స్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అలా వెళ్తుంటే అప్పుడే కనిపించింది మెట్ల పై నుండి రూప కిందికి దిగుతూ. తనని పై నుండి కిందకు చూసా. ఘాగ్రా చోలి వేసుకుని స్టైల్ గా దిగుతూ వచ్చింది. నేను తననే దొంగ చూపులు చూస్తూ మళ్ళీ తను గమనిస్తే బాగోదు అనుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. తినే టైం లో ఒక ఐదారు సార్లు కోపంగా నా వంక చూసి చూసింది తను. కానీ నేనే పట్టించు కోకుండా మామూలుగా తినేసి చెయ్ కడుక్కుని లేచా. మా ఇద్దరి ప్రవర్తన చూస్తున్న మా అమ్మ ఏంటి ? రెండు జీవాలు మూగబోయి కూర్చున్నాయి ? మళ్ళీ గొడవా ? అంది నవ్వుతూ. అది విన్న రూప నా వంక చూసింది. నేను అమ్మతో అదేం లేదమ్మ అని చెప్తూ ఉండగా రూప వాళ్ళ అమ్మ వస్తూ ఏం లేదంటావ్ ఎంటి ? అది చూడు ఎలా చూస్తుందో అంటూ రూపను చూస్తూ అంది. (అంతవరకు నన్నే సూటిగా చూస్తున్న రూప వెంటనే తల దించుకుని తినడం మొదలెట్టింది) దాన్ని చూస్తుంటే అర్దం అవ్వట్లేదా, వీళ్ళు మళ్ళీ గొడవ పడ్డారు అని అంటూ అమ్మ వంక చూసి ఒకవేళ మామూలుగా ఉంటే ఇలా ఉంటారా ? చెవులు చిల్లులు పడేలా మాట్లాడుకుంటూనే ఉంటారు అంతే కదా అంది. మా అమ్మ నవ్వుతూ సరిగ్గా చెప్పావే అంది. నేను రూప ను ఒకసారి చూసి అక్కడ నుండి బయటకు వచ్చేశా. నిజానికి నేను రూప చాలా క్లోజ్, అది మా ఇంట్లో వాళ్ళింట్లో అందరికీ తెలుసు, ఒకవేళ తను నా ఏజ్ కంటే మూడేళ్లు పెద్దది కాక పోయి ఉంటే కచ్చితంగా మా ఇద్దరిని లవర్స్ అని అనేవాళ్ళు అలా ఉంటాం మేమిద్దరం క్లోజ్ గా. కానీ ఏజ్ గాప్ వళ్ళ మా ఇంట్లో కానీ తన ఇంట్లో కానీ ఎప్పుడూ మేము లవర్స్ లాగా ఉన్నాం అన్న టాపిక్ రాలేదు. పైగా వాళ్ళు మమ్మల్ని ఒక అక్కా తమ్ముడు లా చూస్తారు. కానీ వాళ్లకేం తెలుసు తననే నేను పెళ్లి చేసుకుంటాను ఫ్యూచర్ లో అని. 
సాయంత్రం కావడం తో చిన్నగా పార్టీ స్టార్ట్ అయ్యింది. ఇంటి పక్కనే ఉన్న గార్డెన్ లో పార్టీ పెట్టుకున్నాం. నేను అక్కడ ఏమేమి ఉండాలో దగ్గరుండి అన్నీ సెట్ చేయిస్తున్నా. నేను అలా పనిలో ఉండగా అంతలో ఎదో మెసేజ్ వచ్చింది. తీసి చూస్తే రూప నుండి వచ్చింది అది. నేను వెంటనే తలెత్తి బాల్కనీ వైపు చూసా. (తను ఎక్కువగా అక్కడే నిలబడి ఉంటుంది) తను అక్కడే నిలబడి ఉంది, చేతులు కట్టుకుని నన్నే సీరియస్ గా చూస్తూ ఉంది. తన చేతిలో సెల్ కూడా ఉంది. నేను వెంటనే తనని అలాగే చూస్తూ మెసేజ్ ఓపెన్ చేశా. తల దించి ఏం పంపించిందో చూసా. అక్కడ వదిలేసాననుకోకు అని ఉంది. అది చూసి వెంటనే తలెత్తి తన వంక చూసా. తను ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది. నేను ఉఫ్ అని అనుకున్నా. తరువాత మళ్ళీ పనులలో పడిపోయి బిజీ అయిపోయా. రాత్రి కావొస్తుండగా పార్టీకి అందరూ వచ్చేశారు. అందరూ రావడం తో రూప కూడా మంచిగా చీర కట్టుకుని బయటకు వచ్చింది. తను రాగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఆహ్వానించారు. తను ఆ చీరలో చాలా అందంగా ఉంది. 
 మీరు కానీ తనని ఇలా చూసి ఉంటే నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా గంట సేపు తిట్టేవారు. ఇంత ఏంజెల్ లాంటి ఫిగర్ ఐ లవ్ యూ చెప్తే నువ్వు వద్దంటావా అని.. 
 అలా ఉంటుంది తను. నిజమే తను చాలా బాగుంటుంది. కానీ ఎందుకో తనంటే నాకు ఆ ఫీలింగ్ లేదు. ఆ ఫీలింగ్ అంటే పెళ్లి చేసుకోవడం అని. తనతో ఉండడం తనతో అన్నీ షేర్ చేసుకోవడం తనతో గొడవ పడడం ఇవ్వన్నీ నాకు నచ్చుతాయి కానీ ఎందుకో పెళ్లి అంటేనే, అవసరమా అన్నట్లుగా అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం లేక పోలేదు. మొదటి కారణం వాళ్ళ నాన్న ఇచ్చిన మాట అయితే రెండో కారణం వాళ్ళ అన్న. ఇక మూడో కారణం చెప్పాలంటే  అసలు నాకు తన మీద ఆ ఫీలింగ్ ఏ లేదు. ఎందుకో తనని చూస్తే అరే నాకు తను అమ్మ లాగ కదా తనతో బెడ్ షేర్ చేసుకోవడం ఏంటి అని ఒక ఫీలింగ్ వస్తుంది.  నేను తనకు చాలా క్లోజే కానీ నాకు తన మీద అలాంటి ఫీలింగ్సే లేవు. ఎందుకు అంటే తను నన్నెప్పుడూ ఒక అమ్మలా కేర్ చేసేది. ఏదైనా తప్పు చేస్తే చాలు కోపంగా తిడుతుంది. కొన్ని సార్లు అయితే కొడుతుంది కూడా. తను అలా ఉండడమే నాకు బాగా నచ్చేది. పైగా తను నాకంటే పెద్ద, అదో కారణం కూడా  ఉంది. బహుశా తను పెద్ద అవ్వడం వల్లనే నేమో మేము చిన్నప్పటి నుండి ఎంత క్లోజ్ గా ఉన్నా ఎవ్వరూ కూడా (ఇంట్లో వాళ్ళు) మమ్మల్ని లవర్స్ లా చూడలేదు. తను కూడా ఎప్పుడూ అలా ప్రవర్తించేది కాదు. చనువుగా ఏం చేసినా నాలుగు గోడల మధ్యే ఉండేది. తను అలా పెద్దరికం తో నన్ను పిల్లాడిలా కేర్ చేయడం వల్ల నేమో తన మీద నాకు సెక్సువల్ ఫీలింగ్స్ కానీ పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్ కానీ రాలేదు, తను ఐ లవ్ యూ చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పాను తనకు. నాకు నిజంగా నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు, నువ్వు నాకు ఒక అక్క లాగా అని చెప్పా. అంతే అలా అన్నందుకు నా చెంప మీద ఒకటిచ్చి ఇంకోసారి అక్కా గిక్కా అన్నవంటే పళ్ళు రాలగొడతాను అని కోపంగా వెళ్ళిపోయింది. అప్పటి నుండి నేను కనిపిస్తే చాలు కోపంగా చూడడం, నేను ఏం చేయాలన్నా దానికి కావాలనే అడ్డు పడిపోవడం లాంటివి చేస్తూ వచ్చింది. నేను కూడా దేవేంద్ర అంకుల్ రమణ అంకుల్ కు ఇచ్చిన మాటను, వాళ్ళ అన్నయ్యను, ఇంకా ముఖ్యంగా నా ఫీలింగ్స్ ను దృష్ఠిలో పెట్టుకుని తనతో ఈ విశయం లో కాంప్రమైజ్ కాకుండా ఉండడం మంచిదని తనతో మాట్లాడకుండా ఉండడం  మొదలు పెట్టాను. అందుకే తను ఇందాక వోదిలేసాననుకోకు అని మెసేజ్ పెట్టింది. నాకు తెలుసు తను పట్టు పట్టింది అంటే అస్సలు వొదిలే రకం కాదు అని. కానీ ఎలా ప్రొసీడ్ అవుతుంది అనేదే డౌటు అంతే..
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply


Messages In This Thread
RE: పెళ్లి ముందు.. పెళ్లి తరువాత.. - by dom nic torrento - 30-08-2021, 04:31 PM



Users browsing this thread: 9 Guest(s)