Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
థాంక్ గాడ్ అనుకుని బస్సు డోర్ దగ్గరికి వెళ్ళాను .
డ్రైవర్ కోపంతో డోర్ తెరిచి కన్నడలో మాట్లాడుతున్నాడు " ఏనో ప్రాణాల మేలే ఆశ ఇల్లా , నన్న బస్సే దొరికైతా నినిగే సావైకే ( ప్రాణాల మీద ఆశ లేదా - చావడానికి ఈ బస్సే దొరికిందా ) " అంటూ ఊగిపోతున్నాడు .
ఈ బస్సు మిస్ అయిఉంటే అలానే జరిగేదేమో బ్రదర్ అని మనసులో అనుకుంటూ బస్సు ఎక్కి బుజ్జి ఏంజెల్ కోసం చూస్తూనే పర్సులోనుండి 2000/- అతడి జేబులో పెట్టాను .
అంతే సర్ అంటూ సెల్యూట్ కొట్టి ఎల్లిగే ఓగుబేకు సర్ , రిటర్న్ తగాండాబెకా ........ నీవు ఎంగే అంద్రె అంగే ( ఎక్కడికీ వెళ్ళాలి సర్ , రిటర్న్ తీసుకెళ్లమంటారా బస్సు తిప్పేస్తాను మీరెలా అంటే అలా ) .........
నో నో నో ........ బస్సు ఎల్లిగే వోద్రే అల్లిగే ఓడిస్రి ( వద్దు ...... బస్సు ఎక్కడికైతే వెళుతోందో అక్కడికే పోనివ్వండి ) .
డ్రైవర్ : Have a seat సర్ ........ అంటూ మొదటి వరుసలో కూర్చున్న వ్యక్తిని లేపాడు .
నో నో నో ....... అంటూ బుజ్జి ఏంజెల్ కోసం కళ్ళు ఆతృతగా సెర్చ్ చేస్తూ వెనుకకు వెళ్ళాను .

చివర నుండి మూడవ వరుసలో బుజ్జి బుజ్జి కన్నీళ్లు తుడుచుకుంటున్న నా బుజ్జి ఏంజెల్ ను చూశాక గానీ నా మనసు శాంతించలేదు , ఆయాసం - చెమట క్షణంలో ఆవిరైపోయి ఉల్లాసంగా అనిపించింది . అంతలో బిగ్గెస్ట్ షాక్ ఆఫ్ మై లైఫ్ ....... బుజ్జితల్లిని గుండెలపై ఎత్తుకుని ఓదారుస్తున్నది ముద్దులుపెడుతున్నది ఎవరో కాదు రోజూ నా కలలో నన్ను ఆనందపరుస్తున్న నా స్వప్న సుందరి దేవత ప్రపంచం స్తంభించినట్లు దేవత బుజ్జి ఏంజెల్ తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు - అయినా నా తుంటరితనం కానీ బుజ్జితల్లిని కన్న దేవత కాకుండా మరొకరు ఎలా how how అని పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు .
 నా జీవితం కళ్లెదురుగా కనిపిస్తుండటం , అంతలోనే బస్సు కదలడంతో ముందుకు పడబోయి రాడ్ సపోర్ట్ తో సేఫ్ గా నిలబడ్డాను .

బుజ్జి ఏంజెల్ బుజ్జి కన్నీళ్లను తుడుచుకుని మమ్మీ మమ్మీ ...... అంటూ తల్లి అనగా దేవత కన్నీళ్లను తుడవడం చూసి ముచ్చటేస్తోంది - సీట్లో ప్రక్కనే ఎవ్వరూ లేకపోవడం , ఒకవేళ దేవత భర్త ఉన్నాసరే అతడికి crores ఆఫ్ మనీ ఇచ్చయినా సరే దేవత మరియు పాపను ....... నా దేవత నా బుజ్జి ఏంజెల్ చేసుకోవాలి , తప్పో ఒప్పో నాకు తెలియదు నా జీవితం ఆ ఇద్దరే వారు లేని నా జీవితం శూన్యం ........
బుజ్జి ఏంజెల్ ........ ఇకనుండీ నా బుజ్జి ఏంజెల్ కదా అని నాలో నేనే తియ్యనైన నవ్వులతో పరవశించిపోతున్నాను . నా బుజ్జి ఏంజెల్ బుజ్జి మనసు కాదు కాదు గొప్ప మనసు తల్లి కన్నీళ్లను తుడిచి ఓదారుస్తోంది . ఉమ్మా ఉమ్మా ........ అంటూ ఇద్దరినే కనులారా వీక్షిస్తూ వెళ్లి ఖాళీగా ఉన్న వెనుక సీట్లో కూర్చున్నాను .

దేవత : బాధపడుతూనే నా లవ్లీ బుజ్జి ఏంజెల్ ....... టింకు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు అయినా .........
దేవతకూడా ........ బుజ్జి ఏంజెల్ అని ప్రాణంలా పిలుస్తోంది అని మురిసిపోతున్నాను .
బుజ్జి ఏంజెల్ : నేనే స్వయంగా పోగొట్టుకున్నాను కదా మమ్మీ , పోగొట్టుకున్న టింకు కోసం నేను ఏడ్చి మా బ్యూటిఫుల్ మంచి మమ్మీని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అని ముద్దుముద్దుగా బుజ్జిబుజ్జిగా మాట్లాడుతూ బుగ్గలపై ముద్దులుపెట్టింది .
Wow ........ నా బుజ్జి ఏంజెల్ మనసు గొప్పదే కాదు అంతకుమించి , ఉన్నపాటుగా బుజ్జి ఏంజెల్ ను గుండెలపై హత్తుకుని ముద్దులవర్షం కురిపించాలన్న కోరికను నావల్ల కాకపోయినా కంట్రోల్ చేసుకుంటున్నాను .

బుజ్జి ఏంజెల్ : ఒక్కటే బాధగా ఉంది మమ్మీ ........ , చూడగానే ఇష్టమైన టింకు గాడిని కొనిచ్చినది అమ్మమ్మా - తాతయ్య , టింకు గాడిలో ఇద్దరినీ చూసుకునేదానిని - ఎలాగో వాళ్ళ దగ్గరకే వెళుతున్నాము కదా తొందరగా రైల్వే స్టేషన్ కు వెళ్లి ట్రైన్ లో అంత తొందరగా మన ఊరికి వెళ్లి అమ్మమ్మ గుండెలపై వాలిపోవాలి - ఎన్నిరోజులయ్యింది చూసి మావయ్య పెళ్లి కాబట్టి పంపించాడు లేకపోతే అంటూ మళ్లీ బుజ్జి కన్నీళ్లను కారుస్తోంది . మమ్మీ ........ టింకు అంటూ గట్టిగా హత్తుకుంది .
టింకు అయినా ఉండి ఉంటే నా బుజ్జి ఏంజెల్ ను ఓదార్చేదానిని అంటూ విండో వైపు ఆశతో చూస్తున్న దేవత నా దేవతను చూసి బాధవేసింది . 

అయినా టింకు నా చేతిలోనే ఉన్నాడు కదా ఇక నా బుజ్జి ఏంజెల్ కళ్ళల్లోనుండి ఒక్క కన్నీటి చుక్కను కూడా రానివ్వను అంటూ " నువ్వొస్తానంటే నేనొద్దంటానా " మూవీలో చిన్నప్పటి శ్రీహరి తన చెల్లెలికోసం టాయ్ హార్స్ ను చూయించినట్లుగా " టింకు టెడ్డి బేర్ " ను నా బుజ్జి ఏంజెల్ ముందు చూయించాను .
అంతే టింకు అంటూ సంతోషం పట్టనట్లు నా చేతులలోనుండి అందుకుని ముద్దులవర్షం కురిపించి బుజ్జి గుండెలపై హత్తుకుంది బుజ్జితల్లి - మమ్మీ మమ్మీ ..... టింకు టింకు అంటూ మురిసిపోతున్న బుజ్జి ఏంజెల్ ను చూసి దేవత నా స్వప్న దేవత కన్నీళ్లను తుడుచుకుని ఆనందంతో ఎలా వచ్చింది బుజ్జితల్లీ ........ ? అంటూ ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెడుతున్నారు .

ఇద్దరి సంతోషాలను చూసి , ఆ సంతోషాలకు కారణం నేనని తెలిసి ఏకంగా ఎవరెస్టు శిఖరం చేరినంత అనుభూతికి లోనౌతున్నాను - దేవత ఎలా అయితే బుజ్జి ఏంజెల్ మరియు టింకు ను హత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తున్నదో అలానే నేను ఏకంగా ముగ్గురినీ మనసారా నా కౌగిలిలోకి తీసుకుని ముద్దులు ........ రేయ్ అప్పుడే ఎక్కడిదాకా వెళ్లిపోయావురా అని సిగ్గుపడ్డాను . ఎందుకు కాదు నా జీవితమైన ఇద్దరినీ కిడ్నప్ చేసైనా సరే నా సొంతం చేసుకునేదాకా ఇక నా ప్రయాణం ఆగదు - ఇకనుండీ నా ఏకైక లక్ష్యం నా బుజ్జి ఏంజెల్ నా దేవతను చేరడమే ........ అంతవరకూ నో వర్క్ నో ఫుడ్ నో స్లీప్ ...... thats it - పాతికేళ్ల తరువాత నా గమ్యం ఏమిటో నాకు తెలిసింది నాకు కనిపించింది ఇక వదులుతానా ? , ఎవ్వరు ఏమనుకున్నా ప్రపంచం స్తంభించినా నా గమ్యం చేరుకోవడమే నా లక్ష్యం అంటూ ఫిక్స్ అయిపోయాను .

బుజ్జి ఏంజెల్ : మమ్మీ ....... ఇప్పుడే బస్ ఎక్కిన ఈ అంకుల్ తీసుకొచ్చారు - థాంక్యూ థాంక్యూ sooooo అంకుల్ , టింకు గాడు అంటే నాకు చాలా చాలా ఇష్టం - మిస్ అయి ఉంటే గుర్తుకొచ్చిన ప్రతీసారీ నేను ఏడుస్తూనే ఉండేదాన్ని - నన్ను చూసి మమ్మీ ........ ఏడుస్తూనే ఉండేది - పాపం మమ్మీ ....... డాడీ కాదు కాదు వాడి వలన రోజూ ఏడుస్తూనే ........
దేవత : బుజ్జితల్లీ ....... అంటూ బుజ్జి పెదాలపై ముద్దుపెట్టి ఆపి , వెనక్కు తిరిగి నావైపు కన్నెత్తైనా చూడకుండా థాంక్యూ sooooo మచ్ , మీవల్లనే ఈ చిరు సంతోషం మీకు మంచి జరగాలి అని బుజ్జి ఏంజెల్ ను హత్తుకుని అటువైపుకు తిరిగారు .

దేవత ....... నా దేవత ....... నాకు థాంక్స్ చెప్పింది నాతో మాట్లాడింది అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయెహూన్నాను . నిమిషంలో నా దేవత - బుజ్జి ఏంజెల్ గురించి చాలా విషయాలే తెలిశాయి .
మొదటిది తెలుగువాళ్ళని ...... నేను బస్సు ఎక్కినప్పటి నుండీ తెలుగులోనే మాట్లాడుతున్నారు . అంటే నాకు దగ్గరైన వాళ్లనే అర్థం ఇక తెలుసుకోవాల్సినది ఏ ఊరు అని మాత్రమే ....... వదులుతానా నా బుజ్జి ఏంజెల్ తో ప్రయాణం మొదలుపెట్టేసాను కదా ........
రెండవది బుజ్జి ఏంజెల్ మాటలు - రోజూ మమ్మీ ఏడుస్తూనే ...... ఎవరి వల్ల దేవత భర్త వలన అంటే ఏదో ప్రాబ్లమ్ ఉంది తెలుసుకుని ....... తరువాత ఏమిచ్చేయ్యాలో అధిచేసి మేము ఏకమవ్వడమే ......... , దేవత - బుజ్జి ఏంజెల్ పై ఉన్న ప్రేమ ప్రాణం వలన ఏదేదో ఫీల్ అవుతున్నానా ? , పర్లేదు నా జీవితం వీళ్ళిద్దరే ........ తప్పు చేసైనా సరే ఇద్దరినీ చేరడమే నా గమ్యం అంతే అది ఎలాగైనా సరే - అసలు నా ఊహల్లో దర్శనమిచ్చిన వారు నిజ జీవితంలో సాక్షాత్కరించారు అంటే పైవాడు ఏదో ఇలా ప్లాన్ వేసినట్లే కదా ....... థాంక్యూ థాంక్యూ గాడ్ ఈ జీవితానికి ఈ ఒక్క కోరిక చాలు - ఈ అనాథ కోరిక మీరే తీర్చాలి - అనాథ అనాథ అని పదే పదే గుర్తుచేస్తేనే మంచిది ఫీల్ అయ్యి తొందరగా కోరిక తీరుస్తారు అని నవ్వుకున్నాను .
మూడవది బుజ్జి ఏంజెల్ మావయ్య పెళ్ళికొసం ఎక్కడికో జర్నీ చేస్తున్నారు కాబట్టి ఆ ఊరు కూడా తెలిసిపోతుంది - ఆంధ్రా or తెలంగాణ కాబట్టి కనీసం కనీసం కొన్ని గంటలయినా కలిసి ప్రయాణించబోయే అవకాశం లభిస్తోంది అంతకంటే అదృష్టమా ........ ఈ గ్యాప్ లో మొత్తం సమాచారం సేకరించాలి .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 16-09-2021, 10:16 AM



Users browsing this thread: 26 Guest(s)