Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అవినాష్ ........ తమ్ముడు - చెల్లీ ఎలా ఉన్నారు .
అవినాష్ : మీవలన బెంగళూరులోనే టాప్ కాలేజ్ లో చదువుకుంటున్నారు - మొన్ననే కదా సర్ స్వయంగా ఇంటికి వచ్చి చూసినది - కలిసిన తరువాతి రోజునే అడుగుతారు .
ఏంటో అవినాష్ ....... వాళ్ళ చిరునవ్వులను మళ్లీ చూడాలనిపిస్తోంది .
అవినాష్ నవ్వుతున్నాడు .
ఎందుకు నవ్వుతున్నావు ? .
అవినాష్ : ఇంట్లో కూడా అమ్మ - చెల్లి కూడా ఇంటికి వెళ్లిన వెంటనే అడిగేది మీ గురించే ........ - చెల్లికి రోజూ ఒక గిఫ్ట్ ఇస్తారు తన ఆనందాలకు అవధులే లేవు .
భలే గుర్తుచేశావు అవినాష్ ....... వారం రోజులు దూరంగా వెళుతున్నానని నిన్ననే చెల్లికి గిఫ్ట్ తీసుకున్నాను అని వెనకున్న లగేజీ బ్యాగు అందుకోబోయి మరొక క్యారెజీ ఉండటం చూసాను - అవినాష్ అంటూ అందుకోవడం ఆలస్యం మసాలా ఘుమఘుమలు ......... , అవినాష్ ....... బిరియానీ కదూ నాకోసం 50km పైనే వెళ్లి తీసుకొచ్చావా ? .
అవినాష్ : మీకోసం ఎక్కడికైనా వెళతాను సర్ , అదీకాకుండా మీకోసం ప్రాణం పెట్టి వండారు అమ్మ , మీరు టేస్ట్ చెయ్యకపోతే మా ముగ్గురికీ కూడా వడ్డించదు - చెల్లి అయితే ఏకంగా కొట్టినా కొట్టేస్తుంది .
Wow ....... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ చెల్లీ - అమ్మా ...... , ఈ ఘుమఘుమలకే ఆగలేకపోతున్నాను - కానీ ఫ్లైట్ లో కూర్చుని ప్రశాంతంగా తింటాను - నా చుట్టూ కూర్చున్నవాళ్ళంతా ఫ్లైట్ ఫుడ్ తింటూ చూసి కుళ్ళుకోవడం చూసి ఎంజాయ్ చెయ్యాలి అని వెనుక ఉంచాను . అవినాష్ ...... తమ్ముడికి లాప్టాప్ అని లగేజీ ట్రాలీ నుండి అందించాను .
అవినాష్ : సర్ ....... apple ? - కాలేజ్ వయసుకే ........
నా తమ్ముడు కాలేజ్లో స్పెషల్ గా ఉండాలి .
అవినాష్ : మీరు ....... నా అన్న ప్రతీసారీ మా ఆనందానికి అవధులు ఉండవు అని మురిసిపోతున్నాడు .
ఇది చెల్లికి - ఇది అమ్మకు అని బాక్సస్ అందించాను .
అవినాష్ : సర్ ........ జ్యూవెలరీ ? .
మరి వారం రోజుల గిఫ్ట్ కదా అందుకే ఇష్టంతో ఇస్తున్నాను . స్వయంగా ఇవ్వలేకపోతున్నానని ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా ? .
అవినాష్ : ఉద్వేగానికి లోనై రెండు చేతులూ జోడించాడు .
నా బ్యాంక్ బాలన్స్ ఎంతగా పెరుగుతోందో నాకే తెలియదు అవినాష్ - మన చైర్మన్ గారు అయితే వద్దు అన్నా కంపెనీ లాభంలో సగం వేస్తారు . నేనెలాగో ఖర్చు చెయ్యను నా ఇష్టమైన వాళ్లకోసం ......... , అయినా నేను కారులో ఉండగా స్టీరింగ్ వదిలేశావని తెలిస్తే అమ్మా - చెల్లీ .........
అవినాష్ : అమ్మో ........ ఫుట్ బాల్ ఆడుకుంటారు సర్ అని నవ్వుకుంటూ పోనిచ్చాడు - సర్ ట్రాఫిక్ ఎక్కువగా ఫ్లైట్ టైం ఎంతకు ? .
అబ్బో ....... ఇంకా గంట ఉంది అవినాష్ , తీరికగా వెళ్లు ....... వద్దు వద్దులే తొందరగా వెళ్లు బిరియానీ రుచిచూడకుండా ఉండలేను - ఫ్లైట్ లోకి వెళ్ళగానే ఎవ్వరు ఏమన్నా అనుకోనీ ఫ్లైట్ మొత్తం బిరియానీ ఘుమఘుమలతో నిండిపోవాలి .

అంతలోనే మరొక ట్రాఫిక్ సిగ్నల్ పడినట్లు అప్పటికే చాలా వెహికల్స్ వరుసబెట్టి ఆగి ఉన్నాయి . సర్ ....... ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి మినిమం 10 నిమిషాలు పట్టేలా ఉంది అన్నాడు అవినాష్ .
లంచ్ టైం కదా తప్పదు మరి అంటూ సీట్ ను కాస్త వెనక్కు జరిపి వాలాను . 10 - 15 అడుగుల దూరంలో సిటీ బస్సు విండో నుండి వైట్ టెడ్డి బేర్ - దానిని పట్టుకున్న బుజ్జి చేతులు కనిపించడంతో పెదాలపై తియ్యదనంతో చూస్తూ కూర్చున్నాను . చూస్తున్నకొద్దీ ఎందుకో తెలియదు మనసుకు ఉల్లాసంగా అనిపిస్తోంది - చెయ్యి నాకు తెలియకుండానే హృదయం మీదకు చేరిపోయి అమితానందాన్ని పొందుతున్నాను . 
మా కారు ప్రక్కనే ఉన్న కొద్దిపాటి సందులో ఒక టిప్పర్ అడ్డుగా రాబోతే , నా ఫేస్ ఫీలింగ్స్ మారడం చూసిన అవినాష్ కోపంతో ఊగిపోతూ కన్నడలో తిడుతూ వెనక్కు పంపించేశాడు .
థాంక్స్ అవినాష్ .........
అవినాష్ : మీలో ఇంత ఆనందాన్ని ఇప్పటివరకూ చూడలేదు సర్ ........ , దానికి భంగం కలిగిస్తాడా మరి - ట్రాఫిక్ అని తెలియదా వాడికి ..........

నాకైతే అవినాష్ మాటలు కానీ - ట్రాఫిక్ సౌండ్స్ కానీ ........ ఏవీ ఏవీ వినిపించడం లేదు . అంత దూరంలో ఉన్నప్పటికీ టెడ్డి బేర్ పట్టుకున్న బుజ్జిచేతులకు ఉన్న గాజుల మరియు బుజ్జాయి బుజ్జినవ్వులు మాత్రం నా మనసుకు హాయిని కలిగిస్తున్నాయి .
దాదాపు 5 - 6 నిమిషాల తరువాత గ్రీన్ సిగ్నల్ పడటంతో నెమ్మదిగా వెహికల్స్ కదిలాయి .
నా ముఖంలో చిరుబాధను పసిగట్టి , సిటీ బస్సు దగ్గరికి చేరుకోవడానికి తెగ ప్రయత్నం చెస్తున్నా అందరికీ ఆతృతే కాబట్టి దగ్గరికి చేరుకోలేకపోతున్నాడు .

సరిగ్గా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జీబ్రా క్రాసింగ్ ముందున్న స్పీడ్ బ్రేకర్ ను బస్సు డ్రైవర్ చూసుకోకుండా కాస్త వేగంగా ఎక్కించినట్లు బస్సు కదలడంతో బుజ్జిచేతులలోని బుజ్జి టెడ్డి బేర్ రోడ్డు మీదకు పడిపోయింది .
అమ్మా అమ్మా ........ టింకు పడిపోయాడు అంటూ ఎంత ఇష్టమో ఏమో విండో నుండి తల బయటకుపెట్టి చూసి ఏడవడం మొదలెట్టింది . 
బుజ్జాయిని చూడగానే ప్రపంచం స్తంభించిపోయింది . బుజ్జితల్లీ బుజ్జితల్లీ నా బుజ్జి ఏంజెల్ .......... అవును ఆ బుజ్జి ఏంజెల్ మరెవరో కాదు - సంవత్సరాలుగా ప్రతీ రాత్రీ నా కలలో కనిపిస్తున్న నాప్రాణం కంటే ఎక్కువైన నా బుజ్జి ఏంజెల్ కీర్తి ....... - ఆసమయంలో నాకు కలిగిన ఆనందపు అనుభూతిని వర్ణించే శక్తి ఈ భువిపై లేనట్లు పులకించిపోతున్నాను .

అంతలో బస్సు సర్కిల్ దాటి అటువైపుకు వెళ్లిపోతోంది . 
అమ్మా అమ్మా ........ టింకు అంటూ బుజ్జి ఏడుపు - నా బుజ్జాయి బుజ్జిచేతులు మాత్రమే కనిపించాయి .
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కదులుతున్న కారు డోర్ తీసుకుని కిందకు దిగబోయాను .
అవినాష్ : సర్ వెహికల్స్ చాలా ఉన్నాయి డేంజర్ సర్ .........

ఆ టెడ్డి బేర్ కు ఏ చిన్న ........ జరిగినా నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తోంది అవినాష్ - నా జీవితం ప్రాణాలకు తెగించయినా టెడ్డి బేర్ ను బుజ్జి ఏంజెల్ దగ్గరికి సేఫ్ గా చేర్చాలి అని డోర్ తీసుకుని కిందకుదిగాను .
హడావిడి హడావిడిగా దాటుకుని వెళుతున్న వాహనాలను చేతిసైగలతో ఆపుతూ ముందుకువెళుతున్న నన్ను చూసి సర్ సర్ ....... జాగ్రత్త జాగ్రత్త అంటూ నావైపుకు తిప్పి వెనుకే మళ్లించాడు .
సూపర్ అవినాష్ అంటూ వేలితో చూయించి స్పీడ్ బ్రేకర్ దగ్గరకు పరుగుతీసాను .
అంతలో ఒక లగ్జరీ కారు కంటిన్యూ గా హార్న్ సౌండ్ చేస్తూనే రెండుప్రక్కలా నెమ్మదిగా ముందుకువెళుతున్న వాహనాలను స్క్రాచ్ చేసుకుంటూ మా కారుని సైతం కాస్త డ్యామేజీ చేసి నన్ను దాటుకుని ముందుకు వేగంగా వెళ్ళింది . అది సరిగ్గా టెడ్డి బేర్ ను తొక్కబోతోంది అని తెలిసి గుండె ఆగినంత పని అయ్యింది .
అవినాష్ ...... నాకంటే ముందుగా గమనించినట్లు నా ప్రక్కన ముందుకువెళ్లి సైడ్ నుండి ఆ వెహికల్ ను కాస్త బలంగానే గుద్దుకుంటూ వెనుక వచ్చే వెహికల్స్ కు ఇబ్బంది కలగకుండా ప్రక్కకు తీసుకెళ్లిపోయాడు .
థాంక్స్ అవినాష్ అంటూ మనసులో తలుచుకుని పరుగునవెళ్లి టెడ్డీ బేర్ ను అందుకుని గుండెలపై హత్తుకున్నాను . నా బుజ్జి ఏంజెల్ నే హత్తుకున్నానన్న ఫీల్ కలిగి సంతోషంతో రోడ్ మధ్యలో ఉన్నానన్న సంగతే మరిచిపోయాను .

అవినాష్ : హమ్మయ్యా ....... అనుకుని కిందకుదిగి లగ్జరీ కారు నడుపుతున్న వాడిని బయటకు లాగి చెంపలు వాయించాడు .
ఆ కేకలకు తేరుకుని , సిటీ బస్సు దూరం దూరంగా వెళుతుండటం చూసి , నా ప్రాణాలు వెళ్లిపోతున్నాయన్నంత పెయిన్ కలిగింది . బస్సు వైపు చూస్తూనే అవినాష్ ....... నువ్వు ok కదా అంటూ దగ్గరికి వెళ్ళాను .
అవినాష్ : సర్ సర్ ....... నాకేమీ కాలేదు , బస్సు , బస్సులోని పాప మిస్ అయితే మీరెంత బాధపడతారో మీ మాటల్లోనే తెలిసింది - కారు తెస్తున్నాను వెళదాము , అయ్యో సర్ ...... కారు చుట్టూ వెహికల్స్ ఉన్నాయి .......
అంతే దూరంలో అంతకంతకూ వేగం అందుకుంటున్న బస్సు వైపు పరుగులుతీసాను .

లగ్జరీ వెహికల్ వలన తమ తమ వెహికల్స్ డ్యామేజ్ అయిన వాళ్ళందరూ కూడా తలా ఒక దెబ్బ వేసారు వాడికి - ఫుల్ గా తాగి నడుపుతున్నట్లు స్మెల్ రావడంతో ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పగించాడు అవినాష్ - ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లు సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేయించాడు .

టెడ్డీ బేర్ ను ఒకచేతితో గుండెలపై హత్తుకుని మెయిన్ రోడ్డుపై రెండు నిమిషాలకు పైనే పరుగుతో ఆయాసం - చెమటతో చివరికి బస్సును చేరుకుని వెనుక నుండే స్టాప్ స్టాప్ స్టాప్ ........ అని గట్టిగా కేకలువేసినా బస్సుపై కొట్టినా ఆపకపోవడంతో , బుజ్జి ఏంజెల్ ను గుర్తుచేసుకుని మరింత వేగంతో పరుగుతీసి ఏకంగా బస్సునే దాటి అడ్డుగా నిలబడ్డాను . అంత ఎనర్జీ - ధైర్యం ఎక్కడ నుండి వచ్చిందో నాకే ఆశ్చర్యం వేసింది .
బస్సు డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వెయ్యడంతో సరిగ్గా వచ్చి  నా ముందు ఆగింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 16-09-2021, 10:15 AM



Users browsing this thread: 128 Guest(s)