17-04-2019, 07:31 PM
కొంచెం దూరం నడిచాక, "ఒక్క నిమిషం...."అంది ఆ అమ్మాయి. వెనుతిరిగి ఏంటి అన్నట్టుగా చూసాడు విగ్నేష్ ఆ అమ్మాయివైపు. "ఎలాగూ ...చనిపోదాము అని డిసైడ్ అయ్యాము కదా....ఇప్పుడు చనిపోయినా..ఇంకో గంట తర్వాత చనిపోయినా కూడా పోయేది ఏమిలేదు కదా..."అంటూ అతని వైపు చూసి ఆపింది. అయితే ఏంటి అన్నట్టుగా చూసాడు విగ్నేష్. "అపరిచితులుగా చనిపోవడం కంటే..ఒకరిగురించి మరొకరం తెలుసుకొని చనిపోతే ...atleast కొంచెం satisfaction ఐన ఉంటుంది కదా..."అంది కొంచెం నవ్వుతు. తాను కలిసాక మొదటిసారి ఆ అమ్మాయి కొంచెం నవ్వడం చూసి, ముచ్చటేసి, సరే అన్నట్టుగా చూసాడు. "నా పేరు....స్నిగ్ద..."మరీ మీ పేరు అన్నట్టుగా చూసింది విగ్నేష్ వైపు. "నీ పేరు చాలా బాగుంది...ఐ ఆమ్ విగ్నేష్.....విగ్నేష్ చంద్ర...."అంటూ చేతిని ముందుకు చాపాడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. విగ్నేష్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి "థాంక్ యు...అండ్ nice to meet u .."అంది నవ్వుతు స్నిగ్ద.
ఇద్దరు వొచ్చి మళ్ళి బెంచ్ మీద కూర్చున్నారు.
"సో......ఇప్పుడు చెప్పు..నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు...."అన్నాడు స్ట్రెయిట్ గా విషయానికి వొస్తు విగ్నేష్. "ముందు మీరు చెప్పండి...."అంది స్నిగ్ద. "నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమిలేదు...ఒక మాములు మనిషిని..."అన్నాడు కొంచెం నిర్వేదంగా విగ్నేష్. అతన్ని ఒకసారి తెరిపార చూసి "మీ వయసు..ఒక ముప్పై ఐదు ఉంటుందా.."అంది అతని వయసుని అంచనా వేస్తున్నట్టుగా చూస్తూ. "నలభై ఐదు...ఐన ఇప్పుడు నా వయసు తో ఎం పని..."అన్నాడు కొంచెం అసహనంగా విగ్నేష్. అదేమీ పట్టించుకోకుండా "అవునా...మీరు చూడడానికి అలా లేరు.. "అంది నవ్వుతు స్నిగ్ద. వయసు తక్కువ లా కన్పిస్తున్నావంటే ఆడవాళ్లకే కాదు మగవాళ్లకు కూడా హ్యాపీ గానే ఉంటుంది. "ఐన పెళ్లి అయి పిల్లలు ఉండి..ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అని అనుకుంటున్నారు.."అంది స్నిగ్ద. "నేను నీకు, నాకు పెళ్లి అయ్యిందని చెప్పానా....."అన్నాడు. "అంటే...అంటే...నలభై ఐదు అన్నారు కదా...అయ్యిఉంటుందేమో అని...."అంటూ నసిగింది స్నిగ్ద. "అది సరే...నీకు పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు...చనిపోవాలి అని ఎందుకు అన్పిస్తుంది."అన్నాడు. "నా గురించి తర్వాత చెప్తాను...ముందు మీ గురించి చెప్పండి...ఎక్కువ టైం లేదు మనకి...."అంది మళ్ళి ముఖం మీద నుండి నవ్వు మాయం అవుతుంటె. సరే అంటూ స్నిగ్ద వైపు చూసి తన గురించి చెప్పబోతుంటే, "ఆగండాగండి .....ఎలాగూ కాసేపట్లో చనిపోబోతున్నాము కదా ....అన్ని నిజాలే చెప్పండి....ఎంత పచ్చి నిజాలు ఐన కూడా పర్లేదు...ప్రామిస్ చేయండి..నిజాలే చెప్తాను అంటూ...నా చేతి మీద చేతి పెట్టి..."అంటూ చేయి ముందుకు చేసింది స్నిగ్ద. గట్టిగ నవ్వాడు విగ్నేష్. అతను ఎందుకు నవ్వు తున్నాడో అర్ధం కాక ఆలాగే చూస్తూ ఉండిపోయింది. విగ్నేష్ నవ్వు ఆపి " కాసేపట్లో చనిపోబోయేముందు కూడా ఈ ఓట్లు ఏంటి ...నువ్వు చనిపోవడానికి వచ్చినట్టుగా లేదు....నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వొచ్చినట్టుగా ఉంది..."అన్నాడు. ఆ మాటలకి సిగ్గుపడుతూ "అది కాదండి...ఎదో అలవాటు చొప్పున...అలా అడిగాను..."అంది సిన్సియర్ గా స్నిగ్ద. ఆ అమ్మాయి వైపు కాసేపు చూసి "ఇవన్నీ కాదు స్నిగ్ద....నీకు చనిపోవాల్సిన అవసరం లేదు..నా మాట విను....నీకు మంచి ఫ్యూచర్ ఉంది...హాయిగా ఇంటికి వెళ్ళిపో..."అన్నాడు విగ్నేష్ సిన్సియర్ గా.
"అంటే....నేను వెళ్ళిపోతే ...మీరు ఒంటరిగా చనిపోదామనే...అలాంటిది ఏమి కుదరదు....నేను కూడా మీతో పాటే...."అంది అంతే సిన్సియర్ గా స్నిగ్ద. "హెయి....నీకేమైనా పిచ్చా....ఎవరైనా కలిసి బ్రతకాలి అనుకుంటారు...కలిసి చావాలి అనుకోరు....ఐన నీకు ఇప్పుడప్పుడే చావల్సినంత కష్టాలు ఉన్నాయి అని నాకు అనిపించడం లేదు..."అన్నాడు విగ్నేష్ కొంచెం సీరియస్ గానే. "మరీ మీకు ఉన్నాయా...ఇప్పుడప్పుడే చనిపోయినంత కస్టాలు....నాకు కూడా అనిపించడంలేదు....మిమ్మల్ని ఆపినపుడు మీరు చెప్పినదాన్ని బట్టి...డబ్బుకి కూడా కొదవలేదు మీకు...చాలా మంది అప్పుల వాళ్ళ బాధతోనో....లేకపోతె ఇంట్లో వాళ్ళు పెట్టె టార్చర్ తట్టుకోలేకపోతేనో చావాలి అనుకుంటారు...మీకు పెళ్లి కూడా కాలేదు అంటున్నారు సో ఆ ప్రాబ్లెమ్ కూడా లేదు..."నిలదీసినట్టుగా అడిగింది స్నిగ్ద. అలా అడిగేసరికి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు కాసేపు విగ్నేష్ కి. ఒకటి మాత్రం బాగా అర్ధం అయ్యింది విగ్నేష్ కి.అమ్మాయి చాలా తెలివైనదని. ఇంత తెలివైన అమ్మాయి, చావాలనుకుంటుంది అనే విషయం మళ్ళి గుర్తొచ్చి కొంచెం అనునయంగా " చూడు స్నిగ్ద...నా సమస్య వేరు.. మన పరిచయం ఐన ఈ కొద్ది కాలం చనువుతో చెప్తున్నాను....ఇంటికి వెళ్ళిపో..నీకు చావల్సిన అవసరం ..ఏ కోశానా లేదు...నా మాట విను....ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు...అసలే రోజులు బాగోలేవు....తొందరగా ఇంటికి .వెళ్ళిపో...నా చావు నన్ను ప్రశాంతంగా చావనివ్వు...."అన్నాడు స్నిగ్ద వైపు ప్లీజ్ అన్నట్టుగా చూస్తూ.
"ఇవన్నీ కాదు కానీ....నా గురించి నీకు, నీ గురించి నాకు తెలియాల్సిన అవసరం ఏమిలేదు...పద..లేవండి..వెళ్లి ఇద్దరం కలిసే చనిపోదాము...."అంది లేచి నిల్చుంటు సీరియస్ గా స్నిగ్ద. "హే...నీకేమైనా లూసా...ఇంటికి వెళ్ళిపో ..అంటే కలిసి చద్దాము అంటున్నావు .."అన్నాడు కాస్త కోపంగా విగ్నేష్. నవ్వుతు విగ్నేష్ వైపు చూసింది స్నిగ్ద. "ఏంటి నేను సీరియస్ గా చెప్తుంటే ..నీకు నవ్వులాటగా ఉందా...."అన్నాడు విగ్నేష్. "లేకపోతె ....మరేంటి...మాస్టారు ...ఇక్కడికి వొచ్చింది చచ్చిపోవడానికే....మళ్ళి ఇంటికి వెళ్లిపోవడానికి కాదు...మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు....మీరు చాలా మంచి వారు..వాస్తవానికి మీకు చావల్సిన అవసరం ఏ కోశానా లేదు గాక లేదు....మీరే ఇంటికి వెళ్లిపోండి....నా చావు నన్ను చావనివ్వండి...." అతని లాగే అనేసరికి నవ్వకుండా ఉండలేకపోయాడు విగ్నేష్. కాసేపు ఇద్దరు మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు.
మల్లి బెంచ్ మీద కూర్చుంటూ "సో.....ఇప్పుడేంటి...మన స్టోరీస్ ఒకరికొకరం చెప్పుకుంటేనే కానీ....చావలేమంటావు...అంతేగా.."అన్నాడు సీరియస్ గా విగ్నేష్. చప్పున బెంచి మీద కూర్చుంటూ "అవును...మాస్టారు...అప్పుడు ప్రశాంతంగా చనిపోవొచ్చు....గారంటీ నాది...."అంది భరోసా ఇస్తున్నట్టుగా పేస్ పెడుతూ స్నిగ్ద. "హ..హ..హ....వాడెవడో యాడ్స్ లో నున్నగా గుండు కొట్టుకొని...గారంటీ నాది అంటాడు చూడు...అలా ఉంది నువ్వు చెప్తుంటే...."అన్నాడు నవ్వుతూనే విగ్నేష్. స్నిగ్ద బుంగ మూతి పెట్టుకొని "వాళ్లంటే....వాళ్ళ బిజినెస్ కోసం అంటారు...."అంది. "సరే ..సరే...అవన్నీ వొదిలెయి....మన విషయానికి వొద్దాము..."అంటూ స్నిగ్ద వైపు చూసాడు నవ్వుతు విగ్నేష్. అది బెటర్ అన్నట్టుగా చూసింది స్నిగ్ద. గొంతు సవరించుకొని "నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు చెప్తాను....క్లుప్తంగా...."అంటూ తన గురించి చెప్పడం మొదలెట్టేసాడు విగ్నేష్.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు