17-04-2019, 07:26 PM
అయిపొయింది అంతా అయిపోయింది....జీవితాన్ని సంక నాకించేసాను అర్ధం పర్థం లేని సెంటిమెంట్స్ తో, అనవసరపు మొహమాటలతో, నలభై ఐదేళ్లు వ్యర్థం చేశాను. తిరిగి చూసుకుంటే నాకంటూ ఏమి లేదు, నా కోసమంటూ ఎవరు లేరు, నా కొరకు చెమ్మగిల్లే ఒక్క నయనమ్ము లేదు..అందరు వాళ్ళ వాళ్ళ అవసరాలకోసం నన్ను వాడుకున్నారు...వాళ్ళు వాడుకున్నారు అనే కంటే నేనే వాళ్లకు ఆ అవకాశమిచ్చాను...self pity తో బ్రతకడం వేస్ట్...ఎస్....i have to die ...ఇదే కరెక్ట్ ప్లేస్.....చుట్టూ పక్కల కూడా ఎవరు లేరు....come on ....కొంచెం దైర్యం చేయి....దూకేయి....భవ బంధాలన్నీ తెంచుకో....ఎంతమంది ఆత్మహత్య చేస్కోవడంలేదు....నువ్వు చేసుకుంటే మాత్రం ఎవడు పట్టించుకుంటాడు.....కానివ్వు..కానివ్వు.....నువ్వు వొచ్చింది ఎందుకు ఇక్కడికి, ఆత్మహత్య చేస్కోవడానికేకదా.అని మనసు గోల చేస్తుంటే కూర్చున్న చోట నుండి లేచి, సూసైడ్ పాయింట్ దెగ్గరకు వెళ్లి, చివరి సారి ఆకాశం వైపు చూసి, దూకబోయేంతలో......ఒక చేయి వొచ్చి చటుక్కున పట్టుకుంది. అనుకోని అవాంతరానికి, చప్పున వెను తిరిగి చూసాడు విగ్నేష్. ఒక అందమైన అమ్మాయి, తన చేయి పట్టుకొని ఉంది...ముఖంలో ఎలాంటి ఫీలింగ్ లేదు...చనిపోతున్నవాడిని ఆపానన్న కనీస excitement కూడా లేదు. చేయి విదిలించపోయాడు విగ్నేష్. ఆ అమ్మయి వొదలలేదు సరికదా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అటు ఇటు చూసాడు. చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా లేడు..ప్రకృతి చేస్తున్న గాలి తాలూకు రోదన తప్ప. బలవంతంగా మాట పెగల్చుకొని "హెయి ...ఎందుకు నా చేయి పట్టుకొని ఆపావు... నన్ను వొదిలేయి....
i deserve to die ..."అంటూ చేయి విదిల్చాడు. ఐన కూడా ఆ అమ్మాయి, ఏమి మాట్లాడకుండా విగ్నేష్ వైపే చూస్తుంది అదే నిర్లిప్త మైన చూపుతో.
"ఓయి...నీకేమి కావలి.....ఓహో...డబ్బులు కావాలా...ఇంద తీస్కో...ఈ పర్సు తీస్కొని నీ దారిలో నువ్వు వెళ్ళిపో...ఇందులో బోలెడు డబ్బు ఉంది...ఇంద తీస్కో..."అంటూ ఇంకో చేతితో ప్యాంటు జేబులో ఉన్న పర్సు తీసి ఇవ్వబోతుంటే, నిర్లప్తమైన చిరునవ్వు నవ్వుతు విగ్నేష్ కళ్ళలోకి చూసింది, "ఇవి సరిపోకపోతే చెప్ప్పు....ఈ పర్సు లో ఎటిఎం కార్డు కూడా ఉంది...పిన్ నెంబర్ చెప్తాను....బోలెడు డబ్బులు ఉన్నాయి....తీస్కొని ఎంజాయ్ చేస్కో...నిన్ను అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు....ప్లీజ్ నన్ను వొదులు...."అంటూ ప్రాధేయపడ్డాడు విగ్నేష్. ఆ అమ్మాయి, పట్టుని కొంచెం సడలించింది. డబ్బు ఆశ చూపెడితే లొంగని వాళ్ళు ఎవరు, అన్న ఆలోచన రాగానే ఒక చిరునవ్వు పెదవి మీద మెరిసింది విగ్నేష్ కి . ఆ అమ్మాయికి ఆ చిరునవ్వు వెనక ఉన్న భావం అర్ధం అయ్యిందో ఏమో కానీ చుర్రున చూసింది విగ్నేష్ ని ఒకింత కోపంగా మల్లి చేతి మీద పట్టు బిగిస్తూ."ఓయి....ఏమైంది మల్లి...డబ్బులు వొద్దా...మరేం కావలి నీకు...."అంటూ ఒకింత అసహనంగా కదిలాడు విగ్నేష్.
ఆ అమ్మాయి మొదటిసారి నోరు విప్పింది "కాసేపు నీతో మాట్లాడాలి....తర్వాత మీ ఇష్టం....మీరు కావాలంటే ఆత్మహత్య చేస్కోవచ్చు...."నాకేమి ప్రాబ్లెమ్ లేదు అన్నట్టుగా చూసింది విగ్నేష్ వైపు. విగ్నేష్ కళ్ళతోనే సరే అన్నట్టుగా చూసాడు నిట్టూర్చుతూ. ఆ అమ్మాయి చేయి వొదిలి, ముందుకు కదిలింది బెంచ్ ఉన్న వైపు. నొప్పి పెడుతున్న చేయిని నలుపుకుంటూ ఆమెను అనుసరించాడు విగ్నేష్.
బెంచ్ మీద కూర్చుంటూ ఆ అమ్మాయిని తెరిపార చూసాడు. చూడడానికి చాల బాగుంది, చూస్తూ ఉండి పోవాలి అనిపించేంత అందగత్తె. రమారమి ఇరవై లేదా ఇరవైఒక్క ఏళ్ళు ఉండి ఉండొచ్చు. ఆ అమ్మయి నిర్లక్ష్యంగా బెంచ్ మీద కూర్చుంది, బహుశా జీవితం మీద నిర్లక్యం కావచ్చు, మనుషుల మీద నిర్లక్ష్యం కావొచ్చు. అసలు ఈ అమ్మాయి ఎందుకు ఈ suicide పాయింట్ కి వచ్చింది అనే ఆలోచన రాగానే, ఆ అమ్మాయి వైపు చూసి "చుట్టుపక్కల మనుషులు కూడా ఎవరు లేరు...అసలు నువ్వెందుకు వొచ్చావు ఇక్కడకి...."అంటూ ప్రశ్నించాడు విగ్నేష్. "ఇలాంటి చోటికి...అందరు ఎందుకొస్తారు....నేను అందుకే వొచ్చాను...." అదే నిర్లక్ష్యంతో అంది. "అంటే..అంటే...నువ్వు కూడా....."అంటూ ఆచ్యర్యంగా, ఒకింత నమ్మలేనట్టుగా ఆ అమ్మాయి వైపు చూసాడు. "హా...నేను కూడా సూసైడ్ చేసుకోవడానికే వొచ్చాను...."అంది స్థిరంగా ఆ అమ్మాయి. "చూడడానికి చాల చక్కగా, చదువుకున్నదానిలా ఉన్నావు ....సూసైడ్ చేస్కునే ఖర్మ నీకెందుకు... సూసైడ్ చేస్కునే వయసు కూడా కాదు నీది..."అన్నాడు అనునయంగా విగ్నేష్. "మీరు బానే ఉన్నారు కదా..మీరెందుకు చేసుకుంటున్నారు మరి...."అంది అతని కళ్ళలోకి చూస్తూ. అంత straight గా అడిగేసరికి ఎం చెప్పాలో అర్ధం కాక కాసేపు మౌనం గా ఉన్నాడు. కొంచెం సేపు ఆగి "నీ పేరేంటి...."అన్నాడు ఆ అమ్మాయి వైపు చూసి. "కాసేపట్లో చనిపోయే వాళ్ళ పేరు తెలుసుకొని మాత్రం ఎం చేస్తారు..."అంది నిర్జీవమైన నవ్వుతో. ఇంకా ఏమనాలో విగ్నేష్ కి కూడా అర్ధం కాలేదు. "మీరెందుకు చనిపోవాలి అనుకుంటున్నారు....."అంది ఆ అమ్మాయి. "జీవితం మీద విరక్తి...."అన్నాడు కూల్ గా విగ్నేష్. "సరే ఎలాగూ....చనిపోతున్నాము కదా..మీ స్టోరీ చెప్పండి...సూసైడ్ చేసుకోవాలి అనుకునేట్టుగా చేసిన పరిస్థితులు చెప్పండి...."అంది సూటిగా విగ్నేష్ కళ్ళలోకి చూస్తూ. పెద్దగా నవ్వాడు విగ్నేష్. "ఎందుకు నవ్వుతున్నారు....నేనేమి జోక్ చెప్పలేదు కదా...."అంటూ అసహనంగా కదిలింది ఆ అమ్మాయి. "ఇప్పుడే అన్నావు కదా...కాసేపట్లో చనిపోయే వాళ్ళ పేరు తెలుసుకొని ఎం చేస్తానని...కాసేపట్లో చనిపోయే నా స్టోరీ తెలుసుకొని మాత్రం ఎం చేస్తావు...లే... ఇంక పద ఇప్పటికే చాల టైం అవుతుంది...ఇద్దరం కలిసే చనిపోదాము...."అంటూ బెంచ్ మీద నుండి లేచాడు. ఆ అమ్మాయి కూడా లేచి నిల్చుంది
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు