Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అంటీ : బాబూ ....... మేడం మేడం అంటున్నావు , ముందే తెలుసా ...... ? .
తెలుసా ఏంటి అంటీ మా కాలేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ ....... ఎంత బాగా టీచ్ చేస్తారో తెలుసా ? , ఒక్కరోజుకే ఫ్యాన్ అయిపోయాను మా మేడం టీచింగ్ కు - మొన్నటివరకూ ఇంగ్లీష్ అంటే నాకు మహాభయం , నిన్న ఒక్కరోజులోనే ఇంగ్లీష్ మొత్తం నేర్చుకున్నంత ఫీల్ కలిగిందంటే నమ్మండి - ఇక ** , ** , ** మరియు ** TO ** వరకూ పిల్లలు అయితే చందమామ కథలు విన్నట్లుగా అదికూడా స్వర్గం నుండి దేవతే స్వయంగా దిగివచ్చి టీచ్ చేస్తుందా అన్నట్లు బుజ్జిబుజ్జినవ్వులతో వింటూ తెగ ఎంజాయ్ చెయ్యడం కళ్లారా చూసి నేనే ఆశ్చర్యపోయాను - నేను ** క్లాస్ ఉన్నప్పుడే మా మేడం గారు వచ్చి ఉంటే ఈపాటికి ఇప్పటివరకూ చెప్పినదంతా ఇంగ్లీష్ లో దడదడలాడించేవాడిని ప్చ్ ......, అయినా ఫీల్ అవ్వడం లేదు ఇంకా సగం year ఉందికదా ** క్లాస్ పూర్తవ్వడానికి ఈ సమయం చాలు ........ అని ఉబ్బితబ్బిబ్బవుతూ గర్వపడుతూ బదులిచ్చాను .
నా దేవత షాక్ చెంది పెదాలపై కోపం స్థానంలో చిరునవ్వులు పరిమళించాయి .
Yes yes ....... అంటూ లోలోపలే పులకించిపోతున్నాను .
అంటీ : మా పిల్లలు కూడా వాళ్ళ కాలేజ్లో ఇంగ్లీష్ టీచ్ చేసే టీచర్స్ సరిగ్గా లేదని రోజూ కంప్లైంట్ చేస్తున్నారు - ఇంతకీ ఏ కాలేజ్ బాబూ మీది ? .
******** కాలేజ్ అంటీ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోపాటు మాథ్స్ - సైన్స్ - సోషల్ ....... అన్నీ సబ్జెక్ట్స్ సూపర్ గా టీచ్ చేసే టీచర్స్ ఉన్నారు .
అంటీ : wow అంటూ ఆలోచనలో పడ్డారు .

మేడం : అబ్బాబ్బా ....... ఏమిచెప్పావు తమరెప్పుడైనా ఆ క్లాస్సెస్ కు అటెండ్ అయ్యారా సర్ ........
చిరునవ్వులు నవ్వుకుని , అటెండ్ అవ్వలేదు ఇకపై కూడా అటెండ్ కాబోను - ఫ్యూచర్ లో క్యాంపస్ ఇంటర్వూస్ లో సత్తా చాటాలంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి సో ఇంగ్లీష్ క్లాస్ తప్ప వేరే క్లాస్ అవసరమే లేదు .
మేడం : హలో హలో ....... మిగతా సబ్జెక్ట్స్ లో రాణించాడని తెలిసిన తరువాత చివరికి ఇంటర్వ్యూ లేకపోతే ఇంటర్వ్యూ గది బయటే ఆగిపోవాల్సివస్తుంది .
అయితే ఇంటర్వ్యూ కు కూడా అటెండ్ అవ్వను జాబ్ కూడా అవసరం లేదు - ఇంగ్లీష్ లో రాటుదేలి ఏకంగా ఒక కంపెనీనే ఏర్పరచి కేవలం ఇంగ్లీష్ చక్కగా మాట్లాడేవాళ్లకు మాత్రమే జాబ్స్ ఇస్తాను అని ఆ వయసులో పిల్లాడిలా మాట్లాడాను .
నా మాటలకు - కాన్ఫిడెన్స్ కు నా దేవత నోరుతెరిచి అలా చూస్తుండిపోయారు . 
మేడం మేడం ....... అంటూ తాకీతాకినట్లుగా స్పృశించి , షాక్ లతో నోరు ఆరిపోయినట్లుగా ఉన్నట్లుంది అనడం ఆలస్యం ........ 
బాటిల్ అందుకుని మిగిలిన సగం నీళ్లు గట గటా తాగేశారు .
నా ఎంగిలి నీళ్లు తాగినందుకు , ఎంజాయ్ చేస్తూ దేవతనే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .
నా సంతోషానికి కారణం తెలిసి అయ్యో ...... తాగేసానా అన్నట్లు మళ్లీ నాపై కోపపు బాణాల దండయాత్ర మొదలైంది - కోపంతో కొట్టబోయి చుట్టూ నా ఫాన్స్ అయిపోయారు కాబట్టి కంట్రోల్ చేసుకోవడం చూసి నవ్వుకున్నాను - బాటిల్ కూడా బయటకు విసరబోయి ఏదో గుర్తుకువచ్చినట్లు అమ్మో ....... అంటూ చెంపపై చేతినివేసుకుని రుద్దుకుంటున్నారు - మరొకచేతితో బాటిల్ ను జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగులో దాచుకున్నారు .
బాటిల్ కు - చెంపకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది కానీ ఏమిటో అర్థం కావడం లేదు - చూస్తున్నకొద్దీ నా బాటిల్ అన్న అనుమానమూ పెరుగుతోంది .

అంటీ : బాబూ ....... మేడం అంటే భయమా ? , దూరంగా పడిపోయేలా కూర్చున్నావు .
నో నో నో అంటీ రెస్పెక్ట్ అంటూ చెంపపై చేతినివేసుకున్నాను .
చెంపదెబ్బ గుర్తుచేసుకుని నా దేవత ఒక్కసారిగా నవ్వేశారు - కంట్రోల్ చేసుకోవడానికి చేతిని అడ్డుపెట్టుకున్నా వీలుకాక నవ్వుతూనే ఉన్నారు .
అంటీ : బాబూ ....... పడితే దెబ్బలు తగులుతాయి జరిగి సరిగ్గా కూర్చో .......
అలానే అంటీ అంటూ జరగబోయి , దేవత కోపంతో చూడటంతో నో నో నో అంటూ మళ్లీ చివరికి జరిగాను . అదేసమయానికి మళ్లీ బిగ్ టర్న్ రావడంతో పడిపోబోతే నా దేవత రెండుచేతులతో పడిపోకుండా పట్టుకున్నారు - దేవత స్పర్శకు ఆ క్షణం ఏదో తియ్యని ఫీల్ తో నన్ను నేను మరిచిపోయి అలాగే ఉండిపోయాను .
మేడం : మహేష్ ....... టర్న్ తిరిగింది కదా ఇక కూర్చోవచ్చు - చేతులు నొప్పివేస్తున్నాయి . 
Sorry థాంక్స్ థాంక్స్ మేడం అంటూ మళ్లీ చివరన కూర్చున్నాను . 
మేడం : ఈసారి పడితే బస్సులో ఉన్న నీ ఫ్యాన్స్ అందరూ నన్ను తిట్టినా తిడతారు కాస్త నావైపు జరిగి కూర్చో ........
( యాహూ ....... అంటూ మనసులో సంతోషపు కేకతో ) మేడం కు హత్తుకుని కూర్చుని wow ఈ ఫీల్ కోసం ఏమైనా .........
మేడం : మహేష్ ....... జరిగి కూర్చో అన్నాను నాపై నా ఒడిలో కూర్చోమనలేదు అంటూ చురచురా చూస్తూ , చెంపపై రుద్దుకుంటున్నారు .
Sorry sorry మేడం అంటూ ముసిముసినవ్వులతో దేవతను తాకకుండా కూర్చున్నాను .

మేడం మిమ్మల్ని ఒకటి అడుగవచ్చా ........ ? .
మేడం : నేను నో అన్నా వదులుతావా చెప్పు ........
నవ్వుకుని , మేడం ....... మీ బుగ్గపై చెంప దెబ్బనే కదా ....... ? .
మేడం : నీకెలా తెలిసింది అని నాలుక కరుచుకున్నాను . కాదు కాదు ....... అని బుగ్గపై రుద్దుకోబోయి ఆగి పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటున్నారు .
అయితే చెంప దెబ్బనే ....... , ఎవరు మేడం ....... దేవతలాంటి మిమ్మల్ని కొట్టినది - ఎవరో తెలిస్తే ఊరికే వదలను చెప్పండి మేడం , వాళ్ళ అంతు చూస్తాను .
మేడం : చెప్పను - కొట్టినవారు నా ప్రాణం కంటే ఎక్కువైనవారు సో ....... - అయినా నీకేందుకు చెబుతున్నాను - చెంపదెబ్బ కాదని చెప్పానుకదా - అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెబుతున్నావు ? .
ఎందుకంటే నిన్న మీరు కొట్టినప్పుడు కూడా ఇలానే ఎర్రగా కందిపోయింది - ఇంటికి వెళ్లేంతవరకూ రుద్దుకుంటూనే వెళ్లడం వలన నా ప్రాణమైన వారు కూడా చూసి బాధపడ్డారు .
మేడం : sorry మహేష్ ....... మీ పేరెంట్స్ బాధపడ్డారా ? .
నో నో నో మేడం నేను అందరూ ఉన్న అనాధను .
మేడం : అనాధను కొట్టానా అని ఫీల్ అవుతున్నారు కళ్ళల్లో చెమ్మతో .........
నో నో నో స్టాప్ స్టాప్ మేడం ....... చెప్పాను కదా పేరుకే అనాధను కానీ ఇద్దరు అవ్వలు - పెద్దమ్మ - బోలెడంత మంది తమ్ముళ్లూ చెల్లెళ్లు - ఫ్రెండ్స్ - కొత్తగా మరొక ప్రాణమైన బామ్మ కూడా నా జీవితంలోకి వచ్చారు - ఫుల్ హ్యాపీ ....... మరింత హ్యాపీ ఏమిటంటే ఇప్పుడు మీరు కూడా అని గుండెలపై చేతినివేసుకున్నాను - నిన్న కొట్టిన దెబ్బలాంటి దెబ్బలు ఈరోజు రెండైనా ఆస్వాదించి వస్తాను బామ్మా అని మాటిచ్చి వచ్చాను , సో ఎలాగైనా నా దెబ్బలు నాకు ఇచ్చేయ్యాలి మేడం లేకపోతే మా ప్రియమైన బామ్మ దగ్గర తలెత్తుకోలేను .
మేడం : నీపై కోప్పడాలో నవ్వాలో కూడా తెలియడం లేదు కాసేపు సైలెంట్ గా కూర్చో అని లోలోపలే నవ్వుకుంటున్నారు .
ఆఅహ్హ్ ....... దేవత సంతోషాలను చూస్తూ హృదయం పరవశించిపోతోంది - మేడం ....... please please ప్రస్తుతానికి కోప్పడండి కోప్పడండి నిన్నటి కంటే కోపంతో గట్టిగా కొట్టాలి అని చెంప రుద్దుకున్నాను .
మేడం : మహేష్ ...... నిజంగానే కోపం వస్తోంది ష్ ష్ ........
Yes yes ....... నాకు కావలసినది కూడా అదే మేడం - నా గురించి వదిలెయ్యండి , మీ చెంప దెబ్బ అదే అదే ప్రాణం కంటే ఎక్కువైన వారు ఎందుకు కొట్టారు .
మేడం : ప్చ్ ....... వదిలేలా లేవు - ఎందుకు కొట్టారో ఇప్పటికీ అర్థం కాలేదు వదిలెయ్యి ........
షేర్ చేసుకుంటే తెలుస్తుందేమో మీద ........
మేడం : మహేష్ ........ వదిలేలా లేవు - సరిగ్గా కాలేజ్ కు బయలుదేరేముందు ఈ బాటిల్ అందించి , బుజ్జితల్లీ ....... నాకు నీకంటే ప్రాణమైన వాడిని బాధపెట్టినందుకు గానూ అంటూ చెంప చెళ్లుమనిపించారు మా బామ్మ , బాటిల్ పోగొట్టుకున్నా - డ్యామేజ్ చేసినా మళ్లీ దెబ్బలుపడతాయి జాగ్రత్త ఇక వెళ్లు అని ప్రాణంలా ముద్దులుపెట్టి పంపించారు - నాకంటే నా బామ్మకు ప్రాణమైనవాళ్ళు ఎవరో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు - నేనెప్పుడు బాధపెట్టానో ఏమిటో ....... - నాకు ఊహ తెలిసినప్పటి నుండీ బామ్మ చెయ్యి చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం - కొట్టినందుకు బాధలేదు ఎందుకంటే బామ్మ దెబ్బ తియ్యగా ఉంది బామ్మే నాకు తల్లీ తండ్రి దైవం ...... - ఎందుకు కొట్టారు అన్నదే ........ ప్చ్ ప్చ్ .......
" బామ్మ - బాటిల్ - బుజ్జితల్లి ........ " అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయే అని ఆలోచిస్తుండగానే ........ 
******* కాలేజ్ బస్ స్టాప్ అని కండక్టర్ విజిల్ వెయ్యడంతో మేడం లేచి నన్ను దాటుకుని ఆలోచిస్తూ బస్సులోనే వెళ్లిపో మహేష్ అంటూ ముసిముసినవ్వులతో కిందకు దిగారు - అమ్మో నా దేవత అంటూ లేచి అంటీ వాళ్లకు బై చెప్పి వెనుకే కిందకు దిగి దేవతనే ఫాలో అయ్యాను .

నా దేవత నెమలి నడక వలన ప్రతీ అడుగుకూ బారెడు కంటే పొడవైన నా దేవత సౌందర్యమైన వాలుజడ నాట్యమాడుతున్నట్లు నడుముకు అటూ ఇటూ కదులుతుండటం ముచ్చటగా చూస్తూ వెనుకే నడుస్తున్నాను . 
నా చూపుల ఘాడత దేవత వీపును గుచ్చుకున్నట్లు సడెన్ గా వెనక్కుతిరిగిచూసారు . జడ వయ్యారాలకు అనుగుణంగా నా కళ్ళు అటూ ఇటూ కదులుతుండటం - పెదాలపై చిరునవ్వులు చూసి నేను మరేభాగమో చూస్తున్నట్లు భద్రకాళీ కోపంతో స్టూడెంట్ నా ముందు నడువు అని ఆర్డర్ వేశారు .
మీరు ఆర్డర్ వెయ్యడమూ నేను పాటించకపోవడమూనా ....... Yes మేడం అంటూ ముందుకు పరుగుతీసాను . మేడం వైపుకు తిరిగి వెనక్కు నడవసాగాను - వెనుక ఊగుతున్న జడను మేడం నడుముకు అటూ ఇటూ తల ఊపుతూ చూస్తున్నాను .
ఈసారి కూడా మరే భాగమో చూస్తున్నట్లు మరింత కోపంతో అటువైపుకు తిరుగు అని నడుముపై చీరను సరిచేసుకున్నారు - ఇంతకు ముందుకూడా నడుము చిన్న భాగం కూడా కనిపించనంతలానే ఉంది ....... నా దేవత satisfaction కోసం మళ్లీ సరిచేసుకున్నారు అంతే .........

మేడం ....... మీ బ్యూటిఫుల్ వాలుజడ నాకు తెగ నచ్చేసింది , చూడకుండా ఉండలేకపోతున్నాను - జడ చూడటం తప్పునా ....... ? .
మేడం : ( అంటే ఇంతవరకూ చూస్తున్నది జడనా ....... , అనవసరంగా అపార్థం చేసుకుని కోప్పడ్డాను , పాపం పిల్లాడు సైట్ కొట్టే వయసు ఇంకా రాలేదు కదా అని ఫీల్ అయ్యారు ) అధికాదు స్టూడెంట్ వాహనాలు వస్తున్నాయి - రాళ్లు ఉన్నాయి పడతావేమో .........
ఓహో ........ నేను పెడతానని నాకు దెబ్బలు తగులుతాయని ఫీల్ అవుతున్నారా ? , ఎంత అదృష్టవంతుడిని వెనుకా వద్దు ముందూ వద్దు మీ ప్రక్కనే నడుస్తాను మేడం అని పరుగున ప్రక్కకు చేరి వెనక్కు తొంగి తొంగి జడను చూస్తున్నాను.
మేడం : ముసిముసినవ్వులు నవ్వుకుని , స్టాప్ స్టూడెంట్ ....... ఇదేమైనా నీ జడనా అంతలా చూస్తున్నావు - నా అనుమతి లేకుండా చూడటం తప్పే ....... ఇక చాలు ఆపు .......
అయితే పర్మిషన్ ఇవ్వండి మేడం రోజంతా చూడాలని ఆశగా ఉంది please please ........
మేడం :  స్టూడెంట్ స్టూడెంట్ లా ఉండు నాకు అనవసరంగా కోపం తెప్పించకు కొడతాను అని నవ్వు - కోపం కలగలిసిన వార్నింగ్ ఇచ్చారు .
మేడం ........ ఎందుకో తెలియదు జడను చూసిన క్షణమే నా బుజ్జి హృదయం - జడతో కనెక్ట్ అయిపోయింది . జడ కదిలితేనే నా హృదయం కూడా కొట్టుకుంటాను అంటోంది లేకపోతే ఆగినా .......
మేడం : నో నో నో ....... అలా జరుగకూడదు - అయినా క్రేజీ స్టూడెంట్ మాటలు ఎలా నమ్ముతున్నాను ....... , వయసు వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి అని నా చెవిని పట్టుకుని పిండారు .
యాహూ ........ ఇందుకే ఇందుకే మేడం ఇప్పటివరకూ మిమ్మల్ని ఆటపట్టించినది ఉమ్మా ఉమ్మా అంటూ నా చెవికి ముద్దులుపెట్టుకున్నాను - నిన్న చెంప దెబ్బ ఈరోజు చెవి తిప్పడం అలాగే మరొక రెండు అంతకంటే ఎక్కువ దెబ్బలు కొడితే ఫుల్ హ్యాపీ ....... - నా ప్రాణమైన బామ్మ కూడా sooooo హ్యాపీ .......
మేడం : ఎంత అల్లరి స్టూడెంట్ వి , ఇక నిన్ను తాకనైనా తాకను - నీ మరియు నీ ప్రాణమైన బామ్మ కోరిక ఎలా తీరుతుందో చూద్దాము - నీ వల్ల కాలేజ్ కు ఆలస్యం అవుతోంది అదిగో ప్రేయర్ బెల్ కూడా మ్రోగింది అని కోపంతో వడివడిగా కాలేజ్ లోపలికి నడిచారు .
Wow ఆ వేగానికి నా దేవత వాలుజడ అంతే వేగంతో ఊగుతుండటం చూసి గుండెలపై చేతినివేసుకున్నాను - వెంటనే మొబైల్ తీసి మేడం కు తెలియకుండా వీడియో రికార్డ్ అయ్యేలా షర్ట్ జేబులో పెట్టుకుని వెనుకే వెళ్ళాను . 

ఆపాటికే పిల్లలందరూ డిసిప్లిన్ గా ప్రేయర్ కు నిలబడుతున్నారు . నా అదృష్టం కొద్దీ నా దేవత మా క్లాస్ వెనుకే నిలబడ్డారు అందరు టీచర్స్ లా .......
థాంక్స్ మేడం ........ చూసారా ప్రేయర్లో కూడా నా దైవం మీ జడను చూసే అదృష్టం కలిగించారు .
మేడం : అవునుకదా ...... , నిన్నూ ....... అంటూ కోపంతో నాకు దూరంగా వెళ్లి ** పిల్లల వెనుక నిలబడ్డారు .
పెదాలపై చిరునవ్వులతో వెళ్లి మేడం వెనుక నిలబడ్డాను జడను చూస్తూ ........
** పిల్లలు : hi అన్నయ్యా hi అన్నయ్యా ....... గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ బుజ్జి బుజ్జి చేతులను ఊపారు .
మేడం వెనుకకు చూసి అసహనంతో ప్చ్ ...... ఇంత క్రేజీ స్టూడెంట్ , నిన్నూ ...... వెళ్లు నీ క్లాస్మేట్స్ దగ్గరికి వెళ్లు ........
మేడం అంటూ నిరాశతో అడుగు వేసేంతలో ప్రేయర్ స్టార్ట్ అవ్వడంతో , స్టాప్ కదలకూడదు ఇక్కడే నిలబడు ........
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మేడం ....... , మీ మాటే నాకు శాసనం మీరెలా అంటే అలా - మీ వెనుక నిలబడమంటారా ముందు నిలబడమంటారా ........ ? .
మేడం : నిన్నూ ....... ష్ ష్ డిస్టర్బ్ చెయ్యకు - నీ వల్ల చిన్న పిల్లలు కూడా ప్రేయర్లో నవ్వుకుంటున్నారు చూడు ........
Sorry sorry మేడం ....... , కోపమొస్తే కొట్టొచ్చు కదా .........
మేడం : నో నో నో నెవర్ సైలెంట్ .........
వెనుకా వద్దు ముందూ వద్దు జడను చూస్తూ ప్రక్కనే నిలబడతాను . 
మేడం : నన్ను పట్టించుకోకుండా బుజ్జి పిల్లల అల్లరిని కంట్రోల్ చేస్తూ నవ్వుకుంటున్నారు . 

ప్రేయర్ పూర్తవగానే పిల్లలను వరుసలో లోపలికి పంపించి , ఇకనైనా మీ క్లాస్మేట్స్ తో క్లాస్ కు వెళ్లు స్టూడెంట్ ....... అని చెప్పారు మేడం .
బస్ దిగినప్పటి నుండీ చూస్తున్నాను మేడం ....... స్టూడెంట్ స్టూడెంట్ అని పిలుస్తున్నారు - ఎంచక్కా బస్ లో పిలిచినట్లుగా ప్రేమతో మహేష్ అని పిలవచ్చు కదా మేడం..........
మేడం : ప్రేమనా ........ , నువ్వేమైనా నా బంధువువా ? , నాకోసం ఏమైనా చేశావా ...... ? , అలాప్రేమతో పిలవడానికి అని వెక్కిరింతగా నవ్వుకున్నారు . వెళ్లు వెళ్లు కాలేజ్ స్టూడెంట్ వని తెలిసి పేరు పెట్టి పిలిచాను - స్టూడెంట్ అని పిలవడం నీకు ఇష్టం లేదా అయితే అలానే పిలుస్తాను . స్టూడెంట్ స్టూడెంట్ వెళ్లు నీ క్లాస్మేట్స్ తోపాటు నీక్లాస్ కు వెళ్లు ........ అని ఆర్డర్ వేశారు .
ఇష్టం లేదని ఎవరన్నారు మేడం - మీరెలా పిలిచినా నాకు ప్రేమగానే వినిపిస్తుంది నా ఫస్ట్ క్లాస్ మీదే - మీ వెనుకే నేను .........
మేడం : అదొక్కటి ఉంది కదా ....... , ఎలాగైనా క్లాస్ నుండి బయటకు పంపాలి ఎలా ? - ఐడియా ....... ఖచ్చితంగా అన్నీ క్లాస్సెస్ హోమ్ వర్క్ చేసి ఉండడు ఆ కారణంతో బయటకు పంపించి వెయ్యవచ్చు ........ అని లోలోపలే మాట్లాడుతున్నట్లు అనుకుని నాకు వినిపించేలా మాట్లాడి చిరునవ్వులతో స్టాఫ్ రూమ్ లోకి వెళ్లారు .
నేనూ లోపలికి అడుగుపెట్టేంతలో ........ , హలో ఓన్లీ ఫర్ స్టాఫ్ అని నా గుండెలపై చేతినివేసి ఆపారు .
ఆఅహ్హ్ ....... ఏమి నా అదృష్టం , బయటకు కొప్పుడుతూనే ఎప్పటికప్పుడు నన్ను తాకడానికి ఇష్టపడుతూనే ఉన్నారు థాంక్యూ sooooo మచ్ మేడం .......
అంతే సడెన్ గా చేతిని వెనక్కు తీసుకోవడమే కాకుండా చూడు అన్నట్లు సైగచేసి స్టాఫ్ రూమ్ లోని సింక్ లో ఏకంగా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుని ఒక చూపు చూసారు తిక్క కుదిరిందా అన్నట్లు .........
ప్చ్ ...... అంటూ దీనంగా మేడం వైపు చూసాను .
మేడం : yes అంటూ ఆనందించడం చూసి మరింత సంతోషం వేసి నవ్వుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 04-09-2021, 09:53 AM



Users browsing this thread: 34 Guest(s)