Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery రివర్స్ గేర్.... by lotuseater
#4
                          నా మనవి
[size=undefined]
సిక శిఖామణులకు మీ లోటసీటర్ శతసహస్ర వందనాలు.
'లోటసీటర్' - ఇదేం పేరని మీరనుకుంటున్నారా?
అసలు నా పేరు ఇంగ్లీషులో 'లోటస్ ఈటర్' అని పెట్టుకున్నాను. 'వికటకవి' గారు ఆ పేరులోని రెండు భాగాలు కలిపేసి 'లోటసీటర్' అని కొత్తగా పిలిచేసరికి బావుందనుకున్నాను. 'వికటకవి' గారికి కృతజ్ఞతలు. 
వేల సంవత్సరాల క్రితం గ్రీకు వీరులు కొంతమంది యుధ్ధానికి వెళ్ళి అక్కడ ఒకానొక దేశంలో కొన్ని కలువపూలు తిని మత్తెక్కి అక్కడే పడుండిపోయారట! వాళ్ళే లోటసీటర్లు. 
ప్రసాద్ గారు 'రసిక రమణీయం' అనే దారం మన గాసిప్ ఫోరంస్ లో ప్రారంభించి పాత 'రమణి' పత్రికలు ఇవ్వనారంభించారు. అలాంటి ఫోరం కోసమే సంవత్సరాలుగా పడిగాపులు కాస్తున్నానేమో, ఒకసారి ఆ దారంలో ప్రవేశిస్తూనే లోటసీటర్ లాగే నేనూ అక్కడే పడుండిపోయాను. వాటిని పాత 'రమణి' పత్రికలనేకంటే ఎవర్ గ్రీన్ 'రమణి' పత్రికలంటేనే సబబుగా వుంటుంది.
అలా వుండగా అదే ఫోరంలో సిరిపురపుగారు పుంఖానుపుంఖాలుగా 'రమణి' కథలు స్కాన్ చేసి అందించనారంభించారు. సిరిపురపుగారూ నాలాగే 'రసిక రమణీయం' లో లోటసీటర్ గా పడున్నవారే అనుకుంటాను. లేకపోతే నాలాంటి వెర్రి వున్నవారి కోసం అంత ఆప్యాయంగా తాము సేకరించి పెట్టుకున్న ఎప్పటెప్పటివో కథలు కష్టపడి పోస్టు చేయ్యాల్సిన పనిలేదు. ప్రసాద్ గారూ అంతే. ఎప్పుడో కనుమరుగైపోయాయనుకున్న కథలు ఎవరో దేవత మళ్ళీ నాకోసం అంతరిక్షం నించి కలువ పూలకుమల్లే వర్షిస్తున్నట్టనిపించింది. ఆ కలువపూలు తింటూ 'రసిక రమణీయం' లోనే పడున్న నాకు సిరిపురపువారిని చూసి ఒక్కసారిగా ఉత్సాహం పెల్లుబికింది. మగతలోంచి తేరుకుని 'సరిత్' గారి వద్ద ట్యుటోరియల్స్ చెప్పించుకుని ఇప్పుడు 'రివర్స్ గేర్' అనే ఈ కథతో మీముందుకొస్తున్నాను. అందుకు ప్రసాద్ గారూ, సిరిపురపు గారూ, సరిత్ గారూ - ఈ ముగ్గురూ కారణం. ఆ త్రిమూర్తులకు నా నమస్కారం. వారి రుణం తీర్చుకోలేను.
ఇక 'రివర్స్ గేర్ ' కథ విషయానికొస్తే, నేను నాచర్ల సూర్యనారాయణగారి వీరాభిమానిని. నాలాగే వారి వీరాభిమానులు ఇంకా చాలామంది వున్నారని 'రసిక రమణీయం' లో ప్రవేశించాక అర్థమైంది. నాలాగే వారూ నాచర్ల నవలలు దొరక్క దిక్కులు చూస్తున్నారని తెలిసింది. వారితో ఆనాటి జ్ఞాపకాలు కొన్ని పంచుకుందామని 'రసిక రమణీయం' లోనే 'రసిక రమణీయం - పూర్వరంగం' అనే శీర్షిక ప్రారంభించాను. చాలామంది మిత్రులకు నచ్చింది. అయితే 'ప్రస్థానం' గారిలాంటి కొంతమంది మిత్రుల స్పందనలు చూశాక నాలో ఒకరకమైన వెలితి ప్రారంభమైంది. ఆ రోజుల్లో నాచర్ల నవలలూ, 'రమణి' 'రాధిక' వంటి కొన్ని పత్రికలు రూపాయి అద్దెకు దొరికేవి. కొని ఇంటికి తెస్తే వీపు విమానం మోత మోగడం ఖాయం కాబట్టి ఎక్కడో చదివి అక్కడే పడేసి వచ్చేవాళ్ళం. అందుకే అవి మాదగ్గర లేకుండా పోయాయి. ఇప్పుడు కావాలంటే దొరకవు. మిత్రులకోసం వాటిని సంపాయించి పెట్టలేను. ఈ ఇంటర్నెట్ యుగంలో, ఎప్పుడుపడితే అప్పుడు బ్లూఫిల్ములు సైతం దొరుకుతున్న ఈ రోజుల్లో అప్పటి ఆ అమాయకపు రోజులు తలుచుకుంటే నిజంగా నవ్వొస్తుంది. అప్పుడే నాకో ఆలోచన వచ్చింది. కొన్నేళ్ళ క్రితమే కొల్లాటిగారు నాచర్ల సూర్యనారాయణ క్లాసిక్ నవల 'జాయింట్ ఫరం' ని ఎంతో అభిమానంతో టైపు చేసి ఇంటర్నెట్లో అభిమానులతో పంచుకున్నారు. అప్పట్లో అది చూసి ఒక్కసారిగా త్రిల్లయిపోయాను. మళ్ళీ ఆ రోజులు తిరిగొచ్చినట్టనిపించింది. 'రసిక రమణీయం' దారం చూసినప్పుడూ అలాగే ప్రాణాలు లేచొచ్చాయి. కొల్లాటిగారి లాగా, ప్రసాద్ గారి లాగా, సిరిపురపువారిలాగా నేను కూడా మళ్ళీ ఆ రోజులు తిరిగి తీసుకొస్తే? కానీ ఎలా? నాచర్ల నవలలు నావద్ద లేవే! అలాంటప్పుడు నేనే అలాంటి కథ రాసి పాఠకులకు ఈ ఫోరంస్ లో సమర్పిస్తే? ఆలోచన వస్తూనే 'రివర్స్ గేర్ ' నవల రాయడం ప్రారంభించాను. నా పిచ్చిగానీ నేను నాచర్లలాగా రాయడం యేమిటీ? అయితే ఒకటి - నేను నాచర్ల కాలేనేమోగానీ నాచర్లని అనుకరించగలను కదా! మహానటులు అక్కినేని నాగేశ్వర రావు గారినీ, ఎన్.టీ. రామారావుగారినీ అనుకరించి కొంతమంది రికార్డు డాన్స్ చేసి ప్రేక్షకుల్ని మెప్పిస్తారు కదా! ప్రేక్షకులు నవ్వుతూనే అలాంటి ఆర్టిస్టుల్ని ప్రోత్సహిస్తారు. ఆపాటి చెయ్యకపోతానా అనిపించింది. కొంత భాగం రాశాక ఇదీ బాగానే వుందనిపించింది. ఆ ధైర్యంతోనే ఈ కథతో మీముందుకొస్తున్నాను. అద్దంలో నా మొహం నాకు బాగానే వుంటుంది. మీకు బావుందో లేదో మీరే చెప్పాలి. 
ఇది చదివితే 'రివర్స్ గేర్' కథ ఎలా వుండబోతుందో మీకు అర్థమయ్యే వుంటుంది. 'రసిక రమణీయం' లో ప్రసాద్ గారు ఒక చోట అతిగా బూతులు వాడితే మొహం మొత్తుతుంది అని సెలవిచ్చారు. నా అభిప్రాయం కూడా అదే. వొట్టి బండబూతు పదాలు కావలసిన వారికి ఈ దారంలో అవి దొరకవు. నా మరొక అభిప్రాయం యేమిటంటే ఎక్కువగా బండబూతు పదాలు వాడడం వల్లనేమో, మన రచయితలు చాలా మంది మధ్యలో కథ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి ప్రమాదం నా కథకు రాదనే నా నమ్మకం. ఏవో అవాంతరాలవల్ల మధ్యలో కొంత విరామం వచ్చినా మళ్ళీ అందుకోగలననే నమ్మకం నాకుంది. రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. రెగ్యులర్ అంటే వారానికి ఒక అప్డేట్ అనుకోండి. అదీ పెద్ద పెద్ద ఎపిసోడ్స్ గా ఇవ్వలేను. ఇవ్వగలంతలో మిమ్మల్ని అలరించేట్టుగానే రాసే ప్రయత్నం చేస్తాను. నాకు టైపింగ్ సమస్య వుండడం వల్ల ఇలా మనవి చేసుకోవాల్సి వస్తోంది. నిన్న మొన్నటివరకూ నాకు గాసిప్ ఫోరంలో రిప్లై ఇవ్వడం యెలాగో తెలీదు. అందుకే పెద్ద ఎపిసోడ్లు ఇవ్వలేననేది గమనించగలరు. 
ఏది ఏమైనా నా ప్రయత్నం ఫలిస్తుందనే నా నమ్మకం. 
మిత్రులు నా కథ ఎలా వుందో దయచేసి రిప్లైల ద్వారా తెలియజేయగలరు. 
ధన్యవాదాలు. 
-మీ లోటసీటర్
[/size]
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: రివర్స్ గేర్.... by lotuseater - by Milf rider - 17-04-2019, 12:07 PM



Users browsing this thread: 10 Guest(s)