Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
సెక్యూరిటీ పెద్దయ్య మెయిన్ గేట్ పూర్తిగా తెరిచి నేరుగా లోపలికి వెళ్ళమని సెల్యూట్ చేశారు .
డ్రైవర్ ........ బయటే ఆపు అని చెప్పడంతో మా కారుని గేట్ బయటే స్టాప్ చేసాడు - అమ్మావాళ్ళ కారు లోపలికివెళ్లింది . పంకజం గారూ ....... బుజ్జిపాపాయిని తీసుకుని మీరు లోపలికి వెళ్ళండి అని అందించబోతే షర్ట్ ను గట్టిగా పట్టేసుకుంది .
పెదాలపై చిరునవ్వుతో లవ్ యు లవ్ యు ....... మేమెక్కడికి వెళతాము ఇక్కడే ఉంటాము - అమ్మ దగ్గరికివెళ్లి బుజ్జిపొట్టనిండా పాలు తాగి వచ్చెయ్యి అప్పుడు నా గుండెలపైననే పడుకోబెట్టుకుంటాను అని బుజ్జిపొట్టపై ముద్దుపెట్టి అందించాను .
పంకజం ఎత్తుకున్నా వెనక్కుతిరిగి బుజ్జిబుజ్జినవ్వులతో వాళ్ళ తాతయ్యతోపాటు మావైపు చూస్తూనే లోపలికి వెళ్లడం - లోపలినుండి బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా - బుజ్జాయిలూ బుజ్జితల్లులూ అంటూ సంతోషపు కేరింతలు వినిపించడంతో ఆనందం వేసింది - కిందకు దిగి పెద్దయ్యకు థాంక్స్ చెప్పాను .
పెద్దయ్య : మహేష్ సర్ ....... మా జీవితాలు మీకు అంకితం - లోపలికివెళ్లినా నా మనవరాలి చిరునవ్వులే చెబుతున్నాయి అని దండం పెట్టారు .

బుజ్జిపాపాయి లోపలికి వెళ్ళడానికి నిమిషం ముందు అమ్మావాళ్ళ కారు నేరుగా వెళ్లి మెయిన్ డోర్ దగ్గర ఆగగానే , అమ్మమ్మా ....... బుజ్జిఅమ్మ దగ్గరికి వెళతాము అని అమ్మ - చెల్లెమ్మల బుగ్గలపై ముద్దులుపెట్టి కార్ డోర్స్ తీసుకుని పూర్తిగా తెరిచిన మెయిన్ డోర్ ద్వారా పరుగున లోపలికివెళ్లారు . మ్మ్మ్ ...... ఆఅహ్హ్ వంట ఘుమఘుమలు ....... బుజ్జిఅమ్మా హిమ అమ్మా బుజ్జిఅమ్మా ........
వంట గదిలోనుండే బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ ........ అంటూ చేతితో గరిటె తోనే  హాల్ లోకివచ్చి చూసి గరిటెను ప్రక్కన ఉంచేసి పరుగున వచ్చి మోకాళ్లపై కూర్చుని ఆనందబాస్పాలతో బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ....... ఈ అమ్మను చూడటానికి వచ్చారా? , మాకు ముందే తెలుసు మా బుజ్జి ఏంజెల్స్ వస్తారని అందుకే మీకిష్టమైన చికెన్ బిరియానీ చేస్తున్నాము అని నలుగురినీ ప్రాణంలా కౌగిలించుకుని బుజ్జివీపులపై ప్రేమతో స్పృశిస్తూ మురిసిపోతున్నారు .
మేము వస్తామని మీకు ముందే ...... మీకు అంటే ఎవరెవరికి బుజ్జిఅమ్మా ........ wait wait ఇప్పుడే కాదు ముందు మా ప్రియాతిప్రియమైన బుజ్జిఅమ్మను తనివితీరా హత్తుకుని ఇష్టమైనన్ని ముద్దులు పెట్టుకోవాలి - ఎన్నిరోజులు తల్లీబిడ్డలం దూరంగా ఉన్నామో అన్ని ముద్దులు ఆహా ...... చాలవు వాటిని రెండింతలు మూడింతలు ముద్దులు అంటూనే బుగ్గలపై - నుదుటిపై నలుగురూ ముద్దులవర్షం కురిపిస్తూ , తమ బుజ్జిఅమ్మ ఆనందబాస్పాలను పరవసించిపోతుండటం చూసి బుగ్గలపై కొరికేశారు .
హిమ గారు స్స్స్ స్స్స్ ........ అంటూ తియ్యనైన కోపం - తియ్యనైన నవ్వులతో రుద్దుకోవటం చూసి బుజ్జాయిలు - బుజ్జితల్లులు నవ్వుకున్నారు . బుజ్జిఅమ్మా అమ్మా ........ ఏమిచెయ్యమంటారు ఇందూ అమ్మతో సమానమైన అందంతోపాటు అంతటి ప్రేమను పంచితే కొరుక్కుని తినేయాలనిపిస్తుంది మరి అంటూ నవ్వుకున్నారు ఉండండి మందు రాస్తాము అని పోటీపడుతూ ముద్దులుపెట్టారు .
హిమగారు : సిగ్గుపడి , బుజ్జితల్లులూ ....... మా ఆక్కయ్యలు దేవతలు .
బుజ్జితల్లులు : అయితే మా బుజ్జిఅమ్మ దేవతల ప్రియమైన దేవకన్య ........ , నిజం చెబుతున్నాము అమ్మా ....... మీ అందం సౌందర్యం అని మళ్ళీ కొరికేశారు . బుజ్జితల్లుల కళ్ళల్లో చెమ్మ ......... 
హిమగారు : ఏమైంది ఏమైంది బుజ్జితల్లులూ .........
బుజ్జితల్లులు : ( ఈ అందం మా డాడీ కి దక్కాల్సింది , హిమ - మహేష్ మేడ్ ఫర్ ఈచ్ అధర్ ) ఏమీ లేదు ఏమీ లేదు my dear బ్యూటిఫుల్ మమ్మీ ....... మేము మాత్రమే ముద్దులు పెడుతున్నాము .........
హిమ గారు : బాస్పాలను తుడుచుకుని ఒక తల్లికి అంతకంటే అదృష్టమా బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ........ ఎవరికి ముందుగా ముద్దులుపెట్టాలి అని ఒకటే ఆలోచన , ఇక ఆగలేను అంటూ నలుగురి బుగ్గలపై సున్నితంగా కొరికేశారు .
స్స్స్ స్స్స్ స్స్స్ స్స్స్ ........ లవ్ యు sooooo మచ్ అమ్మా .......
హిమ గారు : నొప్పివేస్తోందా ....... అని ప్రాణమైన ముద్దులుపెట్టారు .
బుజ్జితల్లులు : పో అమ్మా ....... ముద్దులకంటే నొప్పినే బాగుంది అని గుండెలపైకి చేరిపోయారు .
హిమగారు : ఆనందబాస్పాలతో sorry లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ప్రాణంలా కౌగిలించుకుని లవ్ యు అమ్మా - అక్కయ్యలూ ......... 

అమ్మ - చెలెమ్మలు ....... ఆ దృశ్యాలను చూసి ఆనందబాస్పాలతో , బుజ్జితల్లీ - బుజ్జిచెల్లీ ........ మేమైతే అటునుండి ఆటే టూర్ కు వెళ్లిపోయేవాళ్ళం . డాడీ ....... మా అమ్మలను కానీ - మా బుజ్జిఅమ్మను కానీ ఎవరినో ఒకరిని కలవనిదే బస్ ఎక్కము అని కోరికతో ఆర్డర్ వేశారు .
హిమగారు : అవునా బుజ్జాయిలూ ........ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి , నేనంటే ఇంత ప్రాణమా ఈ జన్మకు ఈ ఆనందం అంటూ పులకించిపోతున్నారు .

బుజ్జితల్లులు : మా అందమైన బుజ్జిఅమ్మా ....... ఇప్పుడు చెప్పండి , మీతోపాటు ఎవరెవరికి ముందే తెలుసు మేము వస్తున్నామని అంటూ బుగ్గలపై పెదాలను తాకించారు .
హిమగారు : అందమైన నవ్వులు నవ్వుకుని , ఇంకెవరు నా దేవతలు మీ ప్రాణమైన అమ్మలకు ........ , ఉదయమే కాల్ చేసి చెల్లీ ....... మన బుజ్జాయిలు - బుజ్జితల్లులు ....... మనల్ని కలవకుండా బస్ కూడా ఎక్కరు . కలవడానికి వీలు ఉన్నది మా చెల్లి ఇల్లే కాబట్టి ఖచ్చితంగా నీ దగ్గరకే వస్తారు రెడీగా ఉండు . ఆ క్షణం నుండీ ఇప్పటివరకూ వీడియో కాల్ లోనే మీరాక గురించి మాట్లాడుతూనే ఉన్నాము అని పల్లవి గారి చేతిలోని మొబైల్ అందుకున్నారు .
నలుగురూ : అమ్మలూ అమ్మలూ ....... ఉమ్మ ఉమ్మ ఉమ్మ ఉమ్మ అంటూ స్క్రీన్ పై ముద్దులవర్షం కురిపిస్తున్నారు .

వదినమ్మ : బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ ........ మాకు మా ప్రాణాలతో ఇలా వీడియో కాల్ లో మాత్రమే మాట్లాడటం ఇష్టం లేదు - అయినా ఇప్పుడు మీ ప్రేమ మొత్తం మా బుజ్జిచెల్లి హిమకే పంచాలి కాబట్టి మేము కేవలం చూసి ఎంజాయ్ చేస్తాము బై బై బై ........ ఉమ్మా ఉమ్మా లవ్ యు .
బుజ్జాయిలు : అమ్మలూ ....... టూర్ నుండి వచ్చాక ఆ కోరిక తప్పకుండా తీర్చాలని డాడీ కి ఇంతకుముందే ఆర్డర్ చేసాము - వారంలో ఇలానే బుజ్జిఅమ్మ గుండెలపైకి ఎలా చేరామో అలా మా అమ్మల ఒడిలోకి చేరి ఇంతటి సంతోషాన్ని పొందుతాము .
హిమగారు : ఇంతకంటే ఎక్కువ బుజ్జాయిలూ ....... , ఆ దృశ్యాలను చూసి దేవతలలాంటి అక్కయ్యలలానే ఆనందబాస్పాలతో ఎంజాయ్ చేస్తాను అని ముద్దులుపెట్టి హత్తుకున్నారు . బుజ్జితల్లులూ ....... మీ ప్రయాణం వరకూ నా కౌగిలిలోనే ఉంటారుకదూ please please please ....... ప్చ్ ప్చ్ ప్చ్ .....
నలుగురూ ....... అమ్మవైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . అమ్మమ్మా ........ ok కదా ? .
హిమగారు : బుజ్జితల్లులూ ....... ? .
బుజ్జితల్లులు : కాలేజ్లో కొద్దిసేపటి ముందు మీ అమ్మ కౌగిలిలోకి చేరిన క్షణమే మాట తీసేసుకున్నారు - ఆ క్షణం నుండీ టూర్ పూర్తయ్యేంతవరకూ నా కౌగిలిలోనే హత్తుకునే ఉండాలని - డాడీ కి ముద్దుపెట్టి వచ్చేస్తాము అన్నా వదల్లేదు అని నవ్వుకుంటున్నారు .
హిమ గారు : అయితే అమ్మ తరువాతనే మేము , బుజ్జాయిలూ ....... ముందే చెప్పొచ్చుకదా వెళ్ళండి అమ్మ దగ్గరకే వెళ్ళండి - ఆ ఆనందాలను చూసి మురుస్తాను .
అమ్మ : లేదు లేదు బుజ్జితల్లీ ....... , నాకంటే నా తల్లులకే ఎక్కువ ప్రేమ అని నాకు తెలియదా ....... , ప్రయాణం వరకూ అయితే ok అని చిలిపిగా నవ్వుకుని హిమగారి నుదుటిపై ముద్దుపెట్టి ప్రక్కనే సోఫాలో కూర్చున్నారు .
లవ్ యు soooooo మచ్ అమ్మా అని హిమగారు - వదినమ్మ వదిన బదులిచ్చారు.

బుజ్జాయిలు : ఉమ్మా ఉమ్మా అంటూ అమ్మకు - వదినమ్మకు - హిమగారికి ముద్దులుపెట్టి హిమగారిని చుట్టేశారు . మ్మ్మ్ .....ఆఅహ్హ్ ..... ఉమ్మ్ మా బుజ్జిఅమ్మ చేతి బిరియానీ రుచిచూడాలని నోరూరిపోతోంది .
నాకు కూడా అని అమ్మ ........
మాకుకూడా ........ మావల్ల కావడం లేదు మేము వంట గదిలోకివెళ్లి టేస్ట్ చేసేస్తాము అని చెల్లెమ్మలు ఏకంగా వంట గదిలోకివెళ్లారు .

హిమగారు : నవ్వుకుని లవ్ టు లవ్ టు అక్కయ్యలూ ........ , బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ ....... 
బిరియానీ చేసినది  నేను -  పల్లవి అక్కయ్యే కానీ  తయారీవిధానం నా దేవతలు  మీ అమ్మలు  చెప్పారు .
నలుగురు : యాహూ ........ అమ్మా అమ్మా తొందరగా తొందరగా వడ్డించుకునివచ్చి మీ చేతులతో తినిపించరూ ........ 
హిమగారు : కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ టు లవ్ టు బుజ్జాయిలూ ....... , అమ్మమ్మ దగ్గర ఉండండి అమ్మకు - నా ప్రియమైన బుజ్జితల్లులకు , పిల్లలకు క్షణంలో వడ్డించుకునివస్తాను అని లేవబోతే .........
బుజ్జాయిలు : ఊహూ ....... అంటూ గట్టిగా పట్టేసుకున్నారు . అమ్మమ్మా ....... ఎస్క్యూస్ చేశారు కదా మా అమ్మను వదలకూడదు అని , మీరు వెళ్లి వడ్డించుకునిరండి .
అమ్మ : నా బుజ్జితల్లికి - బుజ్జాయిలకు ........ అంతకంటే అదృష్టమా .......
అమ్మా అమ్మా ........ అంటూ చెల్లెమ్మలు ప్లేట్లలో వడ్డించుకునివచ్చి హిమగారికి ఒక ప్లేట్ - అమ్మకు ఒక ప్లేట్ - పిల్లలకు -  వేరువేరుగా అందించారు .

బుజ్జితల్లులు : చూస్తుంటేనే నోరూరిపోతోంది - జ్యుసీ ........
హిమగారు : థాంక్యూ థాంక్యూ ........ అక్కయ్యలూ లవ్ యు soooooo మచ్ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , బుజ్జాయిల నోటికి అందించారు.

బుజ్జితల్లులు : బుజ్జిఅమ్మా ........ దేవతలు చేసిన బిరియానీ అంటే డాడీ కి ప్రాణం . ఈ బిరియానీ మరింత ప్రత్యేకం దేవతలు తయారీ విధానం చెప్పడం - దేవకన్య చేతితో వండటం ........ ఇక చూసుకోండి ఎంత ప్రాణమో - డాడీ తినకుండా మేము తినగలమా చెప్పండి .
హిమగారి కళ్ళల్లో చెమ్మ - బుజ్జితల్లులు చూసేంతలో తలదించుకుని కన్నీళ్లను తుడుచుకుని ఫీల్ అవుతున్నారు .
చెల్లెమ్మలు : ఫస్ట్ మీ డాడీ - అంకుల్ వాళ్ళకే కే వడ్డించాము బుజ్జితల్లులూ స్పెషల్ బాక్సస్ లో అని చూయించారు .
బుజ్జితల్లి జాహ్నవి : లవ్ యు అమ్మలూ ........ అయితే నేను వెళ్లి ఇచ్చేసివస్తాను అని హిమగారి బుగ్గపై ముద్దుపెట్టింది .

అమ్మ : లేదు లేదు లేదు , మీరు ఉంటే మీ బుజ్జిఅమ్మ కౌగిలిలోనైనా ఉండాలి లేకపోతే నా దగ్గర ఉండాలి ........ మీ డాడీ దగ్గరికి వెళ్ళడానికి వీలులేదు అంతే , వెళితే వధులుతాడా చెప్పు ....... 
బుజ్జితల్లులు : మేమే వదిలి రాము , డాడీ కి తినిపిస్తూ ...... అని తియ్యదనంతో నవ్వుకున్నారు .
అమ్మ : బుజ్జితల్లీ బుజ్జితల్లీ ....... వదలకు వదలకు , బుజ్జితల్లీ ........
బుజ్జితల్లులు : అమ్మా అమ్మా ....... ఏమైంది కదలకుండా ఉండిపోయారు , కన్నీళ్లు కూడానూ ...... - లేదు లేదు మా అందమైన బుజ్జిఅమ్మను వదిలి డాడీ దగ్గరకు వెల్లములే లవ్ యు లవ్ యు అమ్మా అని చెరొకవైపు హత్తుకున్నారు .
హిమగారు : ఆహా ...... ఏమీలేదు ఏమీలేదు , మీ ఇష్టమే నా ఇష్టం ...... మీ డాడీ ....... ఇవి కన్నీళ్లు కాదు బుజ్జితల్లులూ అంటూ విశ్వమంత బాధను గుండెల్లోనే దాచుకుని ప్రాణంలా హత్తుకున్నారు .

చెల్లెమ్మ : బుజ్జితల్లులూ ....... మీ డాడీకి - మా ఆయనకు - పెద్దయ్యకు నేను ఇచ్చి వీలైతే తినిపిస్తాను .
బుజ్జితల్లులు బుజ్జాయిలు : లవ్ యు soooooo మచ్ అమ్మా ........ , అమ్మా ...... బిరియానీలో ధం లెగ్ పీస్ ఉందికదా - డాడీకి చాలా ఇష్టం ......
చెల్లెమ్మ : అది తెలిసే రెండు వేసాను అని నవ్వుతూ బయటకువచ్చి మా ముగ్గురికీ అందించి , అన్నయ్యా ........ టేస్ట్ చేసి ఎవరుచేసారో కనుక్కోవాలి - శ్రీవారూ కుమ్మేయ్యండి అని బుగ్గపై కొరికింది .
చెల్లెమ్మా ....... బిరియానీ wow వాసనే అదిరిపోతోంది . మనం ఇంత సంతోషంగా ఉన్నందుకు కారణమైన మేడం గారికి ముందుగా పార్సిల్ రెడీ చేశారుకదా ......... 
చెల్లెమ్మ : sorry sorry అన్నయ్యా ........
చెల్లెమ్మా ....... నా బాక్స్ ను మేడం కు అని క్లోజ్ చేసి ప్రక్కన ఉంచాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ........ లవ్ యు , క్షణంలో మీకు తీసుకొస్తాను అని పరుగుపెట్టింది .
చెల్లెమ్మా ....... మేడం గారి పిల్లలకు కూడా అని కేకవేశాను .

చెల్లెమ్మ లోపలికివెళ్లి అదేవిషయం చెప్పింది . 
బుజ్జితల్లులు : చూసారా అమ్మమ్మా ........ మమ్మల్ని మీ దగ్గరికి మరియు బుజ్జిఅమ్మ దగ్గరికి చేర్చిన హెడ్ మేడం గారిని మనం గుర్తుచేసుకున్నామా ....... thats my great dad లవ్ యు లవ్ యు soooooo మచ్ డాడీ ........ 
అమ్మ : అవును బుజ్జితల్లులూ ........ , తొలిప్రాధాన్యం మేడం కే ఇవ్వాలి ఎంతైనా నా కన్నయ్య బంగారుకొండ ........
బుజ్జితల్లులు : అమ్మమ్మా ........ దీనికైనా డాడీకి ఒకే ఒక ముద్దుపెట్టి వచ్చేస్తాము .
అమ్మ : బుజ్జితల్లీ ...... వన్ మినిట్ ok కదా .......
హిమగారు : మనసారా అమ్మా ........ అంటూ హృదయం పై చేతినివేసుకుని పెదాలపై మధురమైన చిరునవ్వులు పరిమళించాయి .
బుజ్జితల్లులు : తమ్ముడూ - చెల్లీ ....... మేము వచ్చేన్తవరకూ అమ్మ దగ్గరే ఉండండి - అమ్మ చేతి బిరియానీ ముద్దలు ఎంజాయ్ చెయ్యండి అని ముద్దులుపెట్టి , చెల్లెమ్మ చేతిలోని బాక్సస్ అందుకున్నారు .
చెల్లెమ్మ : బుజ్జితల్లులూ ....... ఒకటి మీ డాడీ కి మరొకటి మేడం పిల్లలైన మీ ఫ్రెండ్స్ కు ......... 
అలాగే అమ్మా ....... అని హిమగారి చేతితో ఒక్కొక్క ముద్ద తిని మ్మ్మ్ మ్మ్మ్ ...... అంటూ పరుగున బయటకువచ్చారు .

కృష్ణ : మహేష్ ........ ఇలాంటి అద్భుతమైన బిరియానీనీ నా జన్మలో రుచి చూడలేదంటే నమ్ము అని లెగ్ పీస్ నోటితో లాగేస్తూ కుంభకర్ణుడిలా తింటున్నాడు .
అవునా రా ........ అంటూ లొట్టలేస్తూ చూస్తున్నాను . బుజ్జితల్లుల ముసిముసినవ్వులు వినిపించడంతో కారులో కూర్చునే డోర్ వైపుకు తిరిగాను .
బుజ్జితల్లులిద్దరూ బుజ్జిబుజ్జిచేతులతో నాకు తినిపించి , అంకుల్ చెప్పినట్లుగా సూపర్ టేస్ట్ డాడీ ....... , ఎవరి చేతి వంటనో ఈపాటికి తెలిసిపోయి ఉండాలే .......
రుచికి మైమర్చిపోయినట్లు ఆ ఆ ....... అంటూ పెదాలను తడుముకుంటున్నాను .
బుజ్జితల్లులు నవ్వుకుని మళ్లీ ఇద్దరూ ఒకేసారి తినిపించి బుగ్గలపై ప్రాణంలా కొరికేశారు . 
తింటూనే ....... వదినమ్మ - వదినలు దేవతలు అంటూ మొబైల్ తీసి మల్లీశ్వరి మొబైల్ కు కాల్ చేసాను .
జాహ్నవి : డాడీ ....... మల్లీశ్వరి అంటీ మొబైల్ లోపల వీడియో కాల్ లో ఉంది బెటర్ కాల్ టు రేవతి అంటీ మొబైల్ ........
Ok ok అంటూ రేవతి - ప్రభావతి గార్లకు గ్రూప్ వీడియో కాల్ చేసాను . వదినమ్మా - వదినాలూ ....... మేము ఇక్కడకు వస్తామని ముందే తెలిసిందన్నమాట - బిరియానీ వండి పంపించారా ....... లవ్ యు లవ్ యు soooooo మచ్ - నా దేవతలను వదిలి వారం రోజులు ఎలా ఉండాలని అనుకున్నాను - బిరియానీతో సిక్సర్ లాంటి ఆనందాన్ని పంచారు - బిరియానీ గుర్తొచ్చినప్పుడల్లా ....... నా దేవతలు గుర్తుకొస్తారు .
దేవతలు : మాతో మాట్లాడకు బేబీ - మహేష్ ....... , మేము అలకచెందాము . మాకంటే నీకు మా బుజ్జితల్లులు - బుజ్జాయిలు అంటేనే ఎక్కువ ప్రాణం , మమ్మల్ని వదిలి వారం రోజులు వెళ్లిపోతున్నావు కదా వెళ్లు వెళ్లు ...... , భద్ర కాళీలలా మారిపోయేవాళ్ళము కానీ మా బుజ్జిచెల్లిని కలిసి వెళుతున్నారు చూడు అక్కడ పూర్తిగా కూల్ అయిపోయాము మాలో ఒక్కరిని కలిసినా అందరినీ కలిసినట్లే అంటూ తియ్యదనంతో నవ్వుతున్నారు - అయినా కాల్ చేసి మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు , మేము ......మా బుజ్జితల్లి ప్రాణంలా బుజ్జాయిలకు తినిపించడం చూస్తున్నాము బై బై లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెట్టి నవ్వుతున్నారు - బేబీ ...... బిరియానీ వండినది మా బుజ్జిచెల్లెలు హిమ , లవ్ యు అని చెప్పాలనుకుంటే మా బుజ్జిచెల్లికే నీ కొత్త దేవతకు చెప్పు ....... , మా బుజ్జిచెల్లి అంటే మా బేబీ కి దేవతే కదా ........
( హిమ ...... హిమగారు ఒక్క లవ్ యు అని కాదు దేవతలూ ....... జీవితాంతం ప్రేమను పంచాలని ఆశపడ్డాను ) కళ్ళల్లో చెమ్మ ....... బుజ్జితల్లులకు కనిపించకుండా అటువైపుకు తిరిగి తుడుచుకుని ఫీల్ అవుతున్నాను .

బుజ్జితల్లులు : డాడీ ....... వండినది బుజ్జిఅమ్మ - మనకు ఎలా చేస్తే ఇష్టమో తయారీవిధానం చెప్పినది మా అమ్మలు - పిన్నమ్మలు .......
కన్నీళ్లను తుడుచుకుని , అందుకే ఇంత రుచిగా ఉంది చూడండి మీ అంకుల్ బాక్స్ ను కూడా ఎలా నాకేస్తున్నాడో ........
బుజ్జితల్లులు నవ్వుకుని అంకుల్ ....... వడ్డించుకునివస్తాము కదా మనం రెండింతలు తింటామని పెద్ద పాత్రలో వండారు బుజ్జిఅమ్మ .
బుజ్జితల్లులూ ....... దేవతలు చెప్పినట్లుగా మీ బుజ్జిఅమ్మకు థాంక్స్ చెప్పండి .
దేవతమ్మ : థాంక్స్ ........ ? , బేబీ ....... థాంక్స్ లు ఎప్పటి నుండి ........
బుజ్జితల్లులు : అవును డాడీ ఓన్లీ లవ్ యు లు మాత్రమే .........
దేవతమ్మ : లవ్ యు బుజ్జితల్లులూ .........
అదే అదే థాం ...... ల ...... వ్ ...... యు , చాలారోజుల తరువాత హిమగారికి లవ్ యు చెప్పాను అని మనసు పులకించిపోయింది - నో నో నో ........ తప్పు తప్పు బుజ్జితల్లులు చెప్పినది థాంక్యూ లవ్ యు మాత్రమే ....... 
బుజ్జితల్లులు : ఉట్టి లవ్ యు మాత్రమేనా డాడీ ....... మనకోసం ప్రాణం పెట్టి వండిన బుజ్జిఅమ్మకు ముద్దుపెట్టి లవ్ యు చెప్పాలి yes yes .......
తాకీ తాకనట్లుగా బుజ్జితల్లుల బుగ్గలపై ముద్దుపెట్టాను . బుజ్జితల్లులూ ....... వెళ్ళండి వెళ్లి బుజ్జాయిలతోపాటు మీరూ తినండి అని బాక్స్ అందుకుని కన్నీళ్ళతో ఫీల్ అవుతూనే తిన్నాను .
కృష్ణ : మహేష్ ఏమైంది ? .
నథింగ్ నథింగ్ రా ........ అని కన్నీళ్లను తుడుచుకున్నాను .
కృష్ణ : తొందరలోనే అన్నీ సమస్యలూ తీరుతాయి మహేష్ ....... , దైర్యంగా ఉండు .
( దేవతలను చేరగలను కానీ నా హృదయంలో ఒకప్పుడు గూడు కట్టుకున్న దేవకన్య మహి ఈ జీవితంలో ........ ఈ జీవితానికి ఇంతేనేమో ) అని మనసులో అనుకున్నాను .

బుజ్జితల్లులు : కృష్ణమ్మా ........ అంకుల్ కు బిరియానీ - బాక్స్ మొత్తం ఎంత ఇష్టంతో తినేసారో తెలుసా అని నవ్వుతూ చెప్పారు - ఇవ్వండి ఇచ్చేసి వస్తాము అని కేకలువేస్తూ లోపలికివచ్చారు .
చెల్లెమ్మ : బుజ్జితల్లులూ ....... మీ బుజ్జిఅమ్మ చికెన్ గోరుముద్దలు తిని తినిపించండి . మొత్తం బుజ్జాయిలూ - అమ్మే తినేస్తున్నారు . మీ అంకుల్ కు నేను తీసుకెళతానులే .........
బుజ్జితల్లులు : లవ్ యు కృష్ణమ్మా ....... అంటూ వెళ్లి ఒకేసారి హిమగారి బుగ్గలపై చెరొకవైపున ముద్దులుపెట్టి ప్రక్కనే కూర్చున్నారు ఆ ఆ ........ అంటూ .......
హిమగారు : ఆఅహ్హ్ ఆఅహ్హ్హ్ ........ ముద్దులకు తియ్యనైన మత్తు ఆవహించి కళ్ళుమూతలుపడ్డట్లు అమ్మ భుజం పైకి వాలిపోయారు . బుజ్జితల్లులూ ....... ఈ ముద్దులలో ఏదో మాధుర్యం - మధురమైన మత్తు ....... - వొళ్ళంతా గాలిలో తెలిపోతున్నట్లుగా హాయిగా ఉంది - ఎంత ఆనందం కలుగుతోందో చెప్పలేను - ఇంతకుముందు ముద్దులలో ఈ మాధుర్యం తక్కువ .........
బుజ్జితల్లులు : ఎందుకంటే ఈ ముద్దులు మావి కాదు అమ్మా ........ , రుచికరమైన బిరియానీ తిన్నందుకు గానూ డాడీ ప్రేమతో లవ్ యు అనిచెప్పి ఇచ్చిన ముద్దులు - అక్కడ మాకు ఇవ్వడంతో నేరుగా వచ్చి మీకు ఇచ్చాము - డాడీ ప్రేమతో ప్రాణంలా ముద్దులుపెడితే ఇలానే హాయిగా ఉంటుంది - మేమైతే హాయిగా నిద్రపోయేవాళ్ళము .
హిమగారు : ఒకవైపు అంతులేని ఆనందంతో పులకించిపోతూనే మరొకవైపు ఈ జీవితానికి నా హృదయంలో గూడుకట్టుకున్న ప్రేమమందిరం ఎప్పుడో కూలిపోయింది అని కన్నీళ్ళతో లోలోపలే బాధపడుతున్నారు .

బుజ్జితల్లులు : ఇవి మా ముద్దులు , ఈ ముద్దులలో మాధుర్యం తక్కువకదా అమ్మా అని నవ్వుకున్నారు .
హిమగారు : లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ ........ , మీరు ప్రాణంలా ఇచ్చిన ముద్దులతో రాబోవు వారం రోజులు హాయిగా నిద్రపోతాను అని ముద్దులు - గోరుముద్దలను ప్రేమతో కడుపునిండా తినిపించారు . 

ప్రయాణ సమయం అయినప్పటికీ ఒక్కరి నోటి నుండీ వెళ్ళొస్తాము ఆNఈ చెప్పడానికి మాటలు రావడం లేదు . 
హిమగారు : ఈ అదృష్టం చాలు ........ , అమ్మా - అక్కయ్యలూ - బుజ్జితల్లులూ బుజ్జాయిలూ పిల్లలూ బుజ్జిపాపాయీ ........ సంతోషంగా టూర్ ఎంజాయ్ చేసిరండి అని బుజ్జాయిలను ప్రాణంలా హత్తుకుని చెప్పారు .
బుజ్జితల్లులు : బుజ్జికన్నీళ్ళతో బుజ్జిఅమ్మా ...... మీరూ రావచ్చుకదా ? అని బుజ్జాయిలతోపాటు హిమగారిని గట్టిగా చుట్టేశారు .
హిమగారు : అంతకంటే అదృష్టమా బుజ్జితల్లులూ ........ , కానీ ఈ జీవితానికి ఆ ఆనందాలు ఎప్పుడో నా మెడలో తాళి పడ్డప్పుడే కనుమరుగైపోయాయి .
వైష్ణవి : అమ్మా ....... తప్పుగా మాట్లాడితే క్షమించండి - మీ మెడలో తాళి లేదు కదమ్మా .........
అమ్మ : నా కడుపున చివరన పుట్టిన ఆ మూర్ఖుడికి మూడు ముళ్ళు కట్టే ఓపిక కూడా లేనట్లు తాగడానికి వెళ్ళిపోయాడు కదా బుజ్జితల్లులూ ఆ రోజున - ఇలా జరగడానికి కారణం లేకపోలేదు అని నా నమ్మకం - మన దైవమైన దుర్గమ్మ తల్లి మనసులో ఏముందో ఎవరికి తెలుసు .........
హిమగారు : అమ్మా - బుజ్జితల్లులూ ........ ఈ సంతోష సమయంలో అన్నీ మరిచిపోయి చాలారోజుల తరువాత కలిసిన " అమ్మమ్మా - మనవళ్లు " తనివితీరా ఎంజాయ్ చెయ్యాలి - ఆ దృశ్యాలను వీడియో కాల్స్ లో చూసి నేను - ఆక్కయ్యలు ఆనందించాలి సరేనా అని బుజ్జాయిలు - బుజ్జితల్లుల నుదుటిపై - బుగ్గలపై ముద్దులుపెట్టి మురిసిపోయారు - పల్లవి గారి నుండి తెప్పించిన చాక్లెట్ లను దేవతల తరుపున ఒక్కొక్కటి నలుగురికీ అందించారు .
బుజ్జితల్లులు : లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జిఅమ్మా ........ , టూర్ మొత్తం ఈ చాక్లెట్ లను మాదగ్గరే ఉంచుకుంటాము - వీటిని చూసిన తాకిన ప్రతీసారీ మా అమ్మలు - పిన్నమ్మలు మాతోనే ఉన్నట్లు అని ముద్దులవర్షం కురిపించారు .
హిమగారు : నవ్వుకుని , అంటే చాక్లెట్ లు తినరా ...... ? అని బుంగమూతిపెట్టుకుని ముద్దుగా అడిగారు .
బుజ్జితల్లులు : ప్చ్ ప్చ్ ....... అంటూ ఏకంగా పెదాలపై ముద్దుపెట్టడంతో , బుంగమూతి స్థానంలో తియ్యదనం పరిమళించింది . మా బుజ్జిఅమ్మ బుంగమూతితోనూ ముద్దుగా ఉంటుంది కానీ మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి అమ్మా - టూర్ నుండి వచ్చాక ఏ చాక్లెట్ ఏ దేవత - దేవకన్యలు ఇచ్చారో వారితో కలిసి తింటాము - మనతోపాటు కేవలం డాడీ మాత్రమే ఉంటారు అమ్మమ్మకు చెప్పకండి కుళ్ళుకుంటారు అని గుసగుసలాడి నవ్వుకున్నారు .
హిమగారు : అమ్మకూడా బుజ్జితల్లులూ ....... , ok నా టూర్ బాగా ఎంజాయ్ చెయ్యండి అమ్మతో - అక్కయ్యలతో - మీ మీ డా ....... డీతో అని బుజ్జాయిలను ఎత్తుకుని ముద్దుచేస్తూనే మెయిన్ డోర్ వరకూ వదిలారు . 
బుజ్జితల్లులు : ప్చ్ ప్చ్ ....... మా ముద్దుల బుజ్జిఅమ్మ ప్రాణమైన గిఫ్ట్స్ ఇచ్చారు - మేమే ....... ఏమీ ఇవ్వనేలేదు .
హిమగారు : నా బుజ్జాయిలు - బుజ్జితల్లులు - అక్కయ్యలూ - అమ్మ మరియు మరియు మీ మీ ....... ముద్దులకంటే మించిన గిఫ్ట్స్ ఏముంటాయి చెప్పండి అని కిందకు దించి చివరిసారిగా ప్రాణంలా చుట్టేసి ముద్దులుపెట్టి , అమ్మా ........ ఇక మీ గుండెలపైననే ఉంచుకుని ఆనందించండి అని అమ్మకు అందించారు .
బుజ్జాయిలు - బుజ్జితల్లులు : బుజ్జిఅమ్మా ....... వెళ్లిస్తాము , జాగ్రత్త అని ముద్దులుపెట్టి అమ్మ దగ్గరకు చేరారు .
హిమగారు : అమ్మ తోడుగా ఉంచిన పల్లవి అక్కయ్య ఉండగా భయమేల బుజ్జితల్లులూ ........ , నా గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎంజాయ్ చెయ్యండి అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అమ్మ : బుజ్జితల్లీ ........ పల్లవిని నీకు తోడుగా ఉంచింది నా కన్నయ్య , నా ప్రాణమైన బిడ్డలు బాధపడితే నాకంటే ఎక్కువ కన్నీళ్లను కారుస్తాడు , వెళ్ళొస్తాము అని కౌగిలించుకున్నారు . చెల్లెమ్మలు కూడా జాగ్రత్త అని ప్రేమతో హత్తుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 19-08-2021, 05:06 PM



Users browsing this thread: 193 Guest(s)