25-07-2021, 01:50 PM
(18-07-2021, 06:38 PM)naresh2706 Wrote: విక్రాంత్ గారూ కథ ఏ మలుపు తీసుకోకుండానే అప్డేట్ ముగియడం కాస్త నిరాశపరిచింది. కానీ నాకు తెలుసు నాలుగు పేరాలు రాయాలంటే ఎంత సమయం తింటుందో. అది కూడా ఒక స్టోరీ చూచాయగా మనసులో ఉంటే పర్లేదు కానీ అప్పటికప్పుడు అల్లడం అంటే పెను సవాలే. శృంగారం అయితే చొప్పించొచ్చు కానీ భావోద్వేగాలతో కథ అల్లడం కాస్త కష్టమే.
దయచేసి మరికాస్త సమయం తీసుకుని అప్డేట్ నిడివి కొంచెం పెంచి పోస్ట్ చేయగలరని మనవి. స్వాతి వీక్లీలో వచ్చినట్టు ఒక 10నిముషాలు కాకపోయినా ఒక 7 నిముషాలు అయినా చదువుకోగలిగితే తృప్తిగా అనిపిస్తుంది.
ఇక ప్రోత్సాహం అంటారా? నేనిచ్చే ఎనర్జీ ఎలర్జీ కానంతవరకు ప్రోత్సహిస్తాను.
ఇక మీరు రెగ్యులర్ గా పెద్ద అప్డేట్లు ఇస్తే కూలికి నలుగురు మనుషుల్ని పెట్టి మరీ ప్రోత్సహిస్తాను.
All the best and waiting for your update
మీ కామెంట్ ఎపుడు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది.. కథని మరియు రైటర్ ని అర్ధం చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు మిత్రమా.. నాకు ఉన్న టైంలో రాస్తున్నాను.. ఇక నుంచి కథ యొక్క నిడివి పెంచి రాసె ప్రయత్నం చేస్తాను.
ధన్యవాదాలు..