Thread Rating:
  • 31 Vote(s) - 2.77 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
ఫ్రెండ్స్ అందరూ ఇంకా నవ్వుతూనే ఉన్నారు - మురళి వెక్కిరింతల నవ్వును చూడటం నావల్లకావడం లేదు . 
గోవర్ధన్ : దెయ్యాలంటే మాకు మాత్రమే భయమనుకున్నాను . అంతమంది బస్తీ పిల్లలను దైర్యంగా అడ్డుకున్న మహేష్ కు దెయ్యాలంటే మాకంటే ఎక్కువ భయం అన్నమాట .
ఇలానే మెయింటైన్ చెయ్యడం మన మంచికేలే అప్పుడప్పుడూ ఈ వంకతో బామ్మను కలిసే అదృష్టం దొరకవచ్చు అని లోలోపలే ఆనందించాను . అవును ఫ్రెండ్స్ ........ చిన్నప్పటినుండీ దెయ్యాలంటే మహా భయం - మీరూ ఉన్నారన్న దైర్యంతోనే మినీ గ్రౌండ్ దగ్గరకు వస్తున్నాను లేకపోతే అడుగుకూడా పెట్టేవాడిని కాదు .
వినయ్ : అవునా ....... , అయితే sorry మహేష్ ఈ విషయం తెలియక నిన్ను వదిలి వచ్చేసాము - ఇందుకుగానూ నువ్వు కోరిన చాట్స్ మేమే ఇప్పిస్తాము అని రెండు కార్లలో బయలుదేరాము .
మురళి : మనమెందుకు ఇవ్వాలి , సాలరీ ఇస్తాముకదా ఆ డబ్బుతో తింటాడులేరా వినయ్ ......... , బస్తీ పిల్లల నుండి సేవ్ చేసినట్లుగానే దెయ్యం నుండి కూడా సేవ్ చెయ్యకుండా భయంతో పడిపోయాడు కాబట్టి తప్పు మహేష్ గాడిదే , ఎవరైనా వాడు తిన్నది పే చేశారో అంకుల్ వాళ్లకు చెబుతాను .
Sorry sorry మహేష్ అని పెదాలను కదిలించారు వినయ్ - గోవర్ధన్ ........

బామ్మ ఇంటిముందు ఆటో ఉండటం చూసి హమ్మయ్యా ........ బుజ్జిదేవకన్య వచ్చేసినట్లుంది - ఇక దైర్యంగా ఉండవచ్చు - ప్చ్ ........ కనులారా తిలకించలేకపోయాను - అయ్యో ....... బరువైన సిలిండర్ ను బుజ్జిదేవకన్య సున్నితమైన చేతులతో ........ అవసరమైనప్పుడు ఉండలేకపోయాను అని బాధపడుతూనే చాట్ సెంటర్ కు చేరుకున్నాము . 
మహేష్ ....... మాకు పిజ్జా తినాలని ఉంది మాతోపాటు రా - మహేష్ ....... మాకు కేక్ ఐస్ క్రీమ్ తినాలని ఉంది బేకరీకి మాతోపాటు రా - రేయ్ మహేష్ ....... మనం వచ్చినది చాట్స్ తినాలని నాతోపాటు రా అని నన్ను ఏకంగా లాక్కునివెళ్లాడు . 
అమ్మో ........ ఒంటరిగా వెళ్ళడానికి మాకు భయం , ఇష్టం లేకపోయినా మురళికి ఇష్టమైనవే తింటాము .
వినయ్ - గోవర్ధన్ - ఫ్రెండ్స్ ........ ఇంతదూరం వచ్చి ఇష్టమైనవి తినకుండా వెళితే ఎలా , మీతోపాటు డ్రైవర్ అన్నయ్యలు వస్తారులే అన్నలూ ........
డ్రైవర్స్ : oh yes తమ్ముడూ ......... , పిల్లలూ ........ మీకిష్టమైన వాటి దగ్గరకే పదండి తోడుగా మేముంటాము .
ఫ్రెండ్స్ : థాంక్స్ మహేష్ ......... 

మురళి : కోపంతో చూసి చాట్ కార్నర్ దగ్గరికివెళ్లి ఎన్నిరకాల ఐటమ్స్ ఉంటే అన్నింటినీ ఆర్డర్ చేసి ఒక టేబుల్లో కూర్చున్నాడు - మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ ఇష్టమైనవి ఆర్డర్ చేసి మురళికి ఎదురుగా కూర్చున్నారు . మురళి ప్రక్కన మరొక చైర్ ఎంప్టీ గా ఉండటం చూసి మురళీ సర్ కూర్చోవచ్చా అని అడిగాను .
ఫ్రెండ్స్ : దానికి కూడా అడగాలా మహేష్ కూర్చో ........
మురళి : నో నో నో నా ప్రక్కన నెవర్ ........ , రేయ్ మహేష్ అక్కడ చివరి టేబుల్ ఖాళీగానే ఉంది వెళ్లి కూర్చుని , నేను ఆర్డర్ చేసినవి కాకుండా వేరేవి ఆర్డర్ చెయ్యి - నువ్వు తినే చీప్ నేను తినడం ఏమిటి ? .
సైలెంట్ గా వెళ్లి కూర్చుని మెనూ అందుకున్నాను . మెనూపై ఒక చాట్ పిక్ ను చూడగానే నోరూరిపోయింది కానీ ప్రక్కనే ప్రైస్ చూసి తక్కువ రేటుది ఆర్డర్ చేసాను .
మురళి : గుడ్ మహేష్ , నువ్వు తినాల్సినది అదే ........

10 నిమిషాలలో ఫ్రెండ్స్ ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసాయి . మురళి కుమ్మేస్తూ ...... నావైపుకు చూసి రేయ్ మహేష్ ....... నువ్వు ఆర్డర్ చేసినది చీప్ కదా అందుకే ఇక్కడున్నవారందరి తరువాత నీకు - నువ్వు ఆర్డర్ చేసినది చూడటం కూడా నాకు ఇష్టం లేదు - ఆలస్యమైతే మేము వెళ్లిపోతాము నువ్వు బస్ లో రావాల్సిందే అని నవ్వుతూ అటువైపుకు తిరిగి తింటున్నాడు .
అంతలో మెనూలో చూసి నోరూరించిన చాట్ ఎవరో ఆర్డర్ చేసినట్లు నావైపు తీసుకొస్తున్నాడు సర్వర్ ....... , చూస్తే మరింత నోరూరిపోవడంతో వెంటనే తలదించుకున్నాను - కంట్రోల్ చేసుకోవడమైతే నావల్ల కావడం లేదు . 
ఆశ్చర్యంగా నా ముందే ఉంచి బాబూ ....... ఎంజాయ్ మా షాప్ లోనే బెస్ట్ చాట్ అనిచెప్పి వెళ్లిపోతున్నాడు సర్వర్ .......
అన్నా ....... నేను ఆర్డర్ చెయ్యలేదు ఈ చాట్ ....... - నేను ఆర్డర్ చేసినది ఇది అని మెనూలో కింద ఉన్నది చూయించాను .
సర్వర్ : మహేష్ నువ్వే కదా ? .
అవును ........
సర్వర్ : అయితే నీకే .........
మహేష్ ....... నాపేరు ఎలా తెలిసింది ? , అన్నా ....... నేను అంత డబ్బు తెచ్చుకోలేదు నాదగ్గర ఇప్పుడు ఉన్నది 300 మాత్రమే , వేరెవరో ఆర్డర్ చేసి ఉంటారు తీసుకెళ్లండి .
సర్వర్ : పేరు మాత్రమే కాదు నీవైపు చూయించారు కూడా మేడం - బిల్ కూడా పే చేసారు .
మేడం ........ అంటే నా దైవం పెద్దమ్మ అని బయటకు పరుగుతీసాను . రెండువైపులా చూస్తే జాడ లేదు - ప్చ్ ....... నిరాశతోనే లోపలికివచ్చి అన్నా ..... పెద్దమ్మ అదే అదే మేడం గారిని చూసారా ? - మళ్లీ చూస్తే గుర్తుపడతారా ? .
సర్వర్ : కరోనా టైం కదా బాబూ ....... మాస్క్ వేసుకున్నారు కష్టమే ...... , చల్లారేంతలో తినాలి సూపర్ గా ఉంటుంది చాట్ ఎంజాయ్ అనిచెప్పి వెళ్ళిపోయాడు .
చాట్ వైపు చూస్తూ పెదాలను తడుముకుని కూర్చున్నాను . థాంక్యూ soooooo మచ్ పెద్దమ్మా ........ మ్మ్మ్ టేస్టీ అంటూ కుమ్మేస్తున్నాను - ఇదిగనుక మురళి చూస్తే కుళ్ళుకుని రాత్రంతా నిద్రకూడా పోడేమో , పెద్దమ్మా ........ మురళి చూడనేకూడదు అని ప్రార్థించి తృప్తిగా తిని బయటకు వెళ్ళాను .
మురళి వచ్చి ఏంటి మహేష్ ...... నీ చీప్ చాట్ బాగా తిన్నట్లున్నావు - అంత టేస్టీ గా ఉందా మురిసిపోతున్నావు .
Yes మురళీ సర్ , అలాంటి చాట్ నేను ఇప్పటివరకూ తిననేలేదు అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .

మురళి : నాకు పిజ్జా కూడా తినాలని ఉంది రండి వెళదాము అని వినయ్ వాళ్ళు వెళ్లిన పిజ్జాహట్ కు తీసుకెళ్లాడు . చాట్స్ తోనే కడుపు నిండిపోయింది ఇంటికి వెళ్ళాక తింటాను అని 999/- పిజ్జా ను పార్సిల్ ఆర్డర్ చేసాడు . 
పెద్దమ్మ వలన 300/- లో ఒక్కరూపాయీ ఖర్చు కాలేదు . ఈ డబ్బుతో బామ్మకు - బుజ్జిదేవకన్యకు ఒక పిజ్జా తీసుకెళితే బాగుంటుంది . మురళీ సర్ ....... నేను కూడా ఒక పిజ్జా ........
మురళి : నీ డబ్బు నీ ఇష్టం - నేను ఆర్డర్ చేసినది తప్ప మరేదైనా ఆర్డర్ చేసుకో ......... అయినా అంత డబ్బు నీ దగ్గర ఉంటే కదా అని నవ్వుకున్నాడు .
మెనూ అందుకుని చూస్తే అన్నీ వేలల్లో ఉన్నాయి ప్చ్ ...... నాతో ఉన్న డబ్బు అంతా తెచ్చుకుని ఉంటే బాగుండేది - చివరన మాత్రం 299/- అని స్మాల్ ప్లేన్ పిజ్జా ఉండటం చూసి మనసొప్పకపోయినా దానినే ఆర్డర్ చేసాను .
అందరూ తినడం పూర్తవ్వడం - అంతలో పార్సిల్స్ రావడంతో అమౌంట్ పే చేసి బయలుదేరాము .
రేపటి నుండి మళ్లీ స్కూల్ కు వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ మెయిన్ గేట్ - బామ్మ ఇంటివైపు చూస్తూ ఇంటికి చేరుకున్నాము . 

ఉత్సాహంతో కిందకుదిగి బామ్మ ఇంటివైపు పరుగుపెట్టేంతలో ..........
మురళి : ఫ్రెండ్స్ - రేయ్ మహేష్ ....... రెండు రోజులూ ఎంజాయ్ చెయ్యడమే సరిపోయింది - హోమ్ వర్క్ చేసుకోకుండా వెళితే క్లాస్ టీచర్ కొడతాడు కాబట్టి తొందరగా తిని వచ్చెయ్యండి .
ఫ్రెండ్స్ : ఇప్పటికే కడుపు నిండిపోయింది , ఇంకేమీ తింటాము ఇంటికివెళ్లి బ్యాగ్స్ తీసుకొస్తాము హోమ్ వర్క్ ఫినిష్ చేసేద్దాము అని వెళ్లారు .
మురళి : అయితే ok , రేయ్ మహేష్ ....... ఇంకా ఇక్కడే నిలబడ్డావే వెళ్లు వెళ్లి నీ చీప్ పిజ్జా తినేసి నిమిషాలలో ఉండాలి .
నేను కదిలేంతవరకూ మురళి లోపలికి వెల్లనేలేదు . ఇప్పుడెలా ....... ఐడియా డ్రైవర్ అన్న దగ్గరికివెళ్లి అన్నా ...... ఈ పిజ్జా ను కొత్తగా దిగిన ఇంట్లో ఇవ్వగలవా .......... , నేను వెళితే మురళి కోప్పడతాడు .
డ్రైవర్ : ఎందుకు ఏమిటీ అని అడగకుండా ఆర్డర్ వెయ్యి తమ్ముడూ అని అందుకున్నాడు - నీ వలన రేపు పిల్లల స్కూల్ ఫీజ్ మొత్తం పే చెయ్యబోతున్నాము.
థాంక్స్ అన్నా ....... ఇంట్లో బామ్మ గారు ఉంటారు వారికి ఇవ్వండి .
డ్రైవర్ : ok అంటూ వెళ్ళాడు .
పిజ్జా ........ బామ్మ ను చేరడం ముఖ్యం ఎవరు ఇస్తే ఏమిటి అని లోపలికివెళ్లి బ్యాగ్ అందుకోబోతూ గిఫ్ట్ చూసి పెదాలపై చిరునవ్వులతో హోమ్ వర్క్ పూర్తిచేసుకుని వచ్చేస్తాను please please ....... బామ్మకు మాటిచ్చాను ప్రశాంతంగా ఉన్నప్పుడు ఓపెన్ చేస్తాను అని .
బయటకు వెళ్ళిచూస్తే ఫ్రెండ్స్ అందరూ కాంపౌండ్ లో లైట్స్ కింద కూర్చుని డిస్కస్ చేస్తూ రాసుకుంటున్నారు . తొందరగా ఫినిష్ చెయ్యాలి అని వెళ్లి కూర్చున్నాను .

నా ఒకే ఒక హోమ్ వర్క్ ఇంగ్లీష్ మొదలుపెట్టేంతలో జేబులోని మొబైల్ రింగ్ అయ్యింది . డిస్టర్బ్ అయినట్లు ఫ్రెండ్స్ అందరూ నావైపు చూడటం - కొత్త నెంబర్ ను చూసి కట్ చేసేసాను . 
ఆ వెంటనే మెసేజ్ ....... " బుజ్జిమహేష్ ....... నేను బామ్మను " 
( అవునా sorry sorry బామ్మా ........ ) , మురళీ సర్ ....... నీళ్లు తాగొస్తాను అని ఔట్ హౌస్ చేరుకుని , అదే నెంబర్ కు కాల్ చేసాను .
హలో బుజ్జి హీరో ....... నేను బామ్మను .......
Sorry sorry బామ్మా ....... స్కూల్ హోమ్ వర్క్ చేసుకుంటున్నామా అందుకే కట్ చేసాను - ఇప్పుడు ఫ్రీ ........
బామ్మ : అయ్యో ....... డిస్టర్బ్ చేశానన్నమాట sorry బుజ్జిహీరో .......
లేదు లేదు బామ్మా ........ ఇలా ఎప్పుడూ ఫీల్ అవ్వకండి , మీరు ఎప్పుడైనా కాల్ చెయ్యవచ్చు , కాల్ చేశారు విషయం ఏమిటి ? రమ్మంటారా ....... క్షణంలో అక్కడ ఉంటాను .
బామ్మ : లేదు లేదు బుజ్జిహీరో ........ , అసలు ఏమి జరిగింది అంటే నా బుజ్జితల్లి కూరగాయలు - సరుకులతోపాటు గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిందే కానీ స్టవ్ కు సెట్ చెయ్యడానికి ఇద్దరికీ కాలేదు , అలానే గంట గడిచిపోయింది - ప్రయాణం వలన బాగా ఆకలి అలసిపోవడం వలన ఈ సమయంలో బయటకు వెళ్లే ఓపిక కూడా లేదు బుజ్జిహీరో , ఏమిచెయ్యాలి ఇక రాత్రికి ఆకలితోనే నిద్రపోవాలని అనుకున్నాము - అంతలోనే కాలింగ్ బెల్ ....... డోర్ ఓపెన్ చేస్తే బుజ్జిహీరో పంపించిన పిజ్జా ....... ఎంత ఆనందం కలిగిందో తెలుసా - ఆనందాన్ని పంచుకోవాలని కాల్ చేస్తే కట్ చేసేసావు .........
Sorry చెప్పాను కదా బామ్మా ........ , నాకైతే ....... మీకంటే ఎక్కువ ఆనందం కలుగుతోంది - ప్చ్ ........ చిన్న పిజ్జా పంపించాను ఇద్దరి ఆకలి తీరిందో లేదో .......
బామ్మ : ఇంతపెద్ద స్పెషల్ పిజ్జా పంపించి చిన్నది అంటావా ....... ?  , దీనిపైన కాస్ట్ 1999/- ఉంది , నేను - నా బుజ్జితల్లి కడుపునిండా తిన్నా కూడా ఇంకా సగం మిగిలింది తెలుసా ........ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ బుజ్జిహీరో ....... - కలిసింది కొద్దిసేపటి ముందైనా మా గురించి ఎంతలా ఆలోచించావు , అందుకే బుజ్జిహీరోవి నువ్వు ........
1999/- పెద్ద స్పెషల్ పిజ్జా ....... ? , నేను పంపించింది 399/- స్మాల్ ప్లేన్ పిజ్జా కదా ........ 
బామ్మ : బుజ్జిహీరో బుజ్జిహీరో .........
ఎదురుగా పెద్దమ్మ పేరు కనిపించడంతో కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందబాస్పాలు ......... థాంక్యూ థాంక్యూ soooooo మచ్ పెద్దమ్మా ....... - ఆ ఆ అవును బామ్మా  పెద్ద స్పెషల్ పిజ్జా మీకోసమే ప్రేమతో పంపించాను . ఇద్దరూ తిన్నారుకదా .........
బామ్మ : ఎవరిని అడుగుతున్నావో నాకు తెలుసులే ......... , నీ పేరు తలుచుకుని మరీ తిన్నది నా బుజ్జితల్లి - అంతకంటే ముందు చక్కగా సర్దిన ఇంటిని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది - బుజ్జిమనవడు అని జరిగినదంతా వివరించడంతో ఎప్పుడెప్పుడు నిన్ను కలిసి కృతజ్ఞతలు తెలుపుదామా అని ఇప్పటివరకూ తలుచుకుంటూనే ఉంది - బామ్మా ....... మనం సెట్ చేసినా ఇంత అందంగా ఉండేది కాదేమో అని ఇల్లు అంతా సెల్ఫీలు తీసుకుంది - ఇప్పుడుకూడా ........ నువ్వు ప్రేమతో పంపించిన పిజ్జా తినగా ఎక్కువ అయినది వృధా చెయ్యడం ఇష్టం లేక ఏమిచెయ్యాలో అని సోఫాలో కూర్చుని ఆలోచిస్తోంది .
నాకైతే సంతోషంతో నవ్వు ఆగడం లేదు - గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది .
బామ్మ : బుజ్జిహీరో ఆనందిస్తున్నట్లుగా ఉన్నాడు - నా బుజ్జితల్లితో మాట్లాడతావా ........ ? .
లవ్ టు లవ్ టు ........ అదే అదే ఖచ్చితంగా బామ్మా ....... 
మహేష్ మహేష్ ....... ఎంతసేపు ........ అని ఫ్రెండ్స్ పిలుపు .....
ప్చ్ ప్చ్ ....... sorry బామ్మా ...... ఫ్రెండ్స్ హోమ్ వర్క్ చేసుకోవడానికి పిలుస్తున్నారు - రేపు స్వయంగా వచ్చి కలుస్తాను .
బామ్మ : అయితే ఇంకా గిఫ్ట్స్ ఓపెన్ చెయ్యలేదు అన్నమాట , చూసి ఉంటే క్షణం కూడా ఆగేవాడివి కాదు . హోమ్ వర్క్ బాగా చేసుకో ...... - పూర్తయిన తరువాత గిఫ్ట్ ఎంజాయ్ చెయ్యి - నాకు తెలిసి రాత్రంతా డ్రీమ్స్ లోకి వెళ్లిపోతావులే , ఉదయం స్కూల్ సమయానికైనా లేస్తావో లేదో ..........
మహేష్ మహేష్ .........
బామ్మ : ఫ్రెండ్స్ పిలుస్తున్నట్లున్నారు ఇక డిస్టర్బ్ చెయ్యను వెళ్లు వెళ్లు బుజ్జిహీరో గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ....... ముసిముసినవ్వులతో కట్ చేసారు .
గిఫ్ట్ వైపు చూస్తూనే , బామ్మ మాటల ఆంతర్యం ఏమిటి అని తల గోక్కుంటూ వెళ్లి హోమ్ వర్క్ పూర్తిచేసాను .

నా హోమ్ వర్క్ పూర్తయ్యింది గుడ్ నైట్ ఫ్రెండ్స్ అంటూ పైకిలేచాను .
మురళి : ఎక్కడికి వెళుతున్నావు మహేష్ ....... , మా హోమ్ వర్క్ కూడా పూర్తయ్యేంతవరకూ కదలడానికి వీలులేదు కూర్చో ........
ఔట్ హౌస్ వైపు ఆశతో చూస్తూనే కూర్చున్నాను . మురళీ సర్ ....... ఇంకా ఎన్ని ఉన్నాయి ? .
మురళి : ఈ ఇంగ్లీష్ తో కలుపుకుని మూడు ఉన్నాయి .......
మూడా ........ అంటూ సడెన్ గా అరిచాను . అందరూ నావైపు చూడటంతో sorry sorry చెప్పాను .
ఫ్రెండ్స్ : నావి కూడా మూడు - నావిక రెండు - నాది ఇక ఒక్కటే ........ అని చెప్పారు .
అంటే మురళివి పూర్తయ్యేంతవరకూ నన్ను వెళ్ళనివ్వడు అన్నమాట అని గుటకలు మింగుతూ ఔట్ హౌస్ వైపు చూసాను - ఇప్పుడెలా మురళీ సర్ ....... నన్ను హెల్ప్ చెయ్యమంటారా అందరికంటే మీవే ముందుగా పూర్తవుతాయి అని చెవిలో గుసగుసలాడాను .
మురళి : పెదాలపై చిరునవ్వులు ....... , వద్దులేరా మహేష్ ....... మన టీచర్స్ హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టి డబల్ హోమ్ వర్క్ ఇచ్చినా ఇస్తారు .
అది నాకు వదిలెయ్యి మురళీ సర్ ........ ఏమాత్రం తేడా రాదు , పూర్తయ్యాక చూడండి , అనుమానం వస్తే పేపర్స్ చింపేయ్యొచ్చు ఏమంటావు ........
మురళి : ok కానీ ఎవ్వరికీ తెలియకూడదు అని సగం పూర్తిచేసిన ఇంగ్లీష్ ఇచ్చాడు .
నో నో నో మురళీ సర్ ....... ఇంగ్లీష్ మనవళ్ల కాదు .........
మురళి నవ్వుకుని మాథ్స్ హోమ్ వర్క్ ఇచ్చాడు .

అందుకుని పెద్దమ్మా ....... నేను చేయబోతున్నది తప్పే కానీ తప్పడం లేదు please please help me ........ నేను ఎలా రాసినా మురళి హ్యాండ్ రైటింగ్ లా మారిపోవాలి - మంచైనా చెడైనా మీరే కదా నా దైవం ....... ఇప్పటికే ఆలస్యం అయ్యింది - గిఫ్ట్ చూడకుండా ఉండలేకపోతున్నాను అని ప్రార్థించి 10 నిమిషాలలో హోమ్ వర్క్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాను . చూస్తే ఇద్దరి హ్యాండ్ రైటింగ్స్ చాలా తేడాగా ఉన్నాయి - అయిపోయాను మరింత ఆలస్యo అయ్యేలా ఉంది అని కంగారుపడుతూనే మురళికి అందించాను .
నిద్ర మత్తులో ఏమి చూశాడో ఏమో ....... ok అంటూ బ్యాగులో ఉంచేసి , చివరి హోమ్ వర్క్ బుక్ కూడా ఇచ్చాడు .
హమ్మయ్యా ........ కనిపెట్టడం సంగతి స్కూల్లో చూసుకుందాములే అని ఫిసిక్స్ కూడా చకచకా పూర్తిచేసి ఇచ్చాను . 
అదే సమయానికి ఇంగ్లీష్ హోమ్ వర్క్ కూడా పూర్తయినట్లు , నా హోమ్ వర్క్ finished ఫ్రెండ్స్ అంటూనే బుక్స్ బ్యాగులో ఉంచుకుని గుడ్ నైట్ చెప్పి లోపలికివెళ్లిపోయాడు . 
ఫ్రెండ్స్ : అంతలో ఎలా పూర్తిచేశాడు వీడు మాకు డౌటే ........ , ఉదయం నుండీ ఆడి ఆడి నిద్రవస్తోంది మేమూ వెళ్లిపోతాము గుడ్ నైట్ మహేష్ .......
గుడ్ నైట్ ఫ్రెండ్స్ అనిచెప్పి బ్యాగు అందుకుని క్షణంలో ఔట్ హౌస్ చేరుకుని డోర్ లాక్ చేసేసాను . పెద్దమ్మకు మొక్కి గిఫ్ట్ అందుకుని బెడ్ పైకి చేరాను .

ఆతృతతో చేతులు వణుకుతున్నాయి - సంతోషం ఎక్కువై గుండె వేగంగా కొట్టుకుంటోంది - పెదాలపై చిరునవ్వులు పెరుగుతూనే ఉన్నాయి . అతి నెమ్మదిగా సున్నితంగా గిఫ్ట్ కవర్ ఓపెన్ చేసి చూస్తే లోపల మూడు ఫోటోలు ఉన్నాయి . 
మొదటి ఫోటో ....... బామ్మ ఇంటిలోనే చూసిన బుజ్జిదేవకన్య పరికిణీలోని ఫోటో - అక్కడ ఎలా అయితే మాధుర్యం కలిగింది మళ్లీ అలాంటి ఫీల్ కలిగి తియ్యని జలదరింపుకు లోనయ్యాను - బెడ్ పైన చేతులతో శుభ్రం చేసి ఫోటో ఉంచాను .
గిఫ్ట్ కవర్ నుండి సెకండ్ ఫోటో - ఆఅహ్హ్ ....... నాకు తెలియకుండానే కుడిచెయ్యి నా గుండెలపైకి చేరింది - లంగా ఓణీలో నా బుజ్జిదేవకన్య ....... మొదటి ఫోటో మాధుర్యం కంటే రెట్టింపు తియ్యదనం ....... వొళ్ళంతా కంటిన్యూ గా వైబ్రేషన్స్ ......... నిజంగా స్వర్గం నుండి దిగివచ్చిన బుజ్జిదేవకన్యనే అని పరికిణీ ఫోటో ప్రక్కనే ఉంచి ఏ ఫోటో చూడాలా అని కళ్ళు పోటీపడుతున్నాయి .
మూడవ ఫోటో ఖచ్చితంగా బామ్మ చెప్పినట్లుగా చీరలో అంటూ గిఫ్ట్ కవర్ నుండి తీసి చూసాను . రెడ్ కలర్ పట్టుచీరలో బుజ్జిదేవకన్య అంటూ ఫ్లాట్ అయిపోయినట్లు బెడ్ పైన సైడ్ కు వాలిపోయాను . నా చేతిలోని ఫోటో సరిగ్గా నా గుండెలపైకి చేరగానే కలిగిన ఫీల్ ఏదైతే ఉందో ఆ ఫీల్ కోసం యుద్ధాలే చెయ్యవచ్చు అవసరమైతే ప్రాణాలనైనా వదిలెయ్యవచ్చు . తనివితీరా ఆ మాధుర్యాన్ని ఆస్వాదించి మూడు ఫోటోలనూ బెడ్ పై ప్రక్కప్రక్కనే ఉంచి బోర్లా పడుకుని కన్నార్పకుండా వరుసగా మళ్లీ మళ్లీ చూస్తూ తొలి ప్రేమలోని ( ఫస్ట్ లవ్ ) ఫీల్ లో గాలిలో తేలిపోతున్నాను - ఎలా అయినా ఈ సౌందర్యరాశి బుజ్జిదేవకన్యను వెంటనే చూడాలి , బామ్మ చెప్పినట్లుగానే ఫోటోలు చూశాక నేరుగా బుజ్జిదేవకన్యను చూడకుండా ఉండలేకపోతున్నాను అని ఫోటోలను అందుకుని పైకిలేచాను - గడియారంలో 10 గంటలు అవ్వడం చూసి నో నో నో బుజ్జిదేవకన్య ప్రయాణం వలన అలసిపోయి హాయిగా నిద్రపోతూ ఉంటుంది డిస్టర్బ్ చేసి ఇబ్బందిపెట్టకూడదు అని నిరాశతో మళ్లీ బెడ్ పై బోర్లా పడుకుని ప్రక్కప్రక్కనే ఫోటోలను ఉంచి చూస్తూ పులకించిపోతున్నాను .
అవునూ బామ్మ ఏమో ఈ ఫోటోలు 8th క్లాస్ లో ఉన్నప్పటివి అని చెప్పారు . ఇప్పుడు ఈ బుజ్జిదేవకన్య వయసు ........ నాకు తెలిసి 10th లేక ఇంటర్ అయి ఉండవచ్చు . 10th అయితే సేమ్ ఏజ్ కాబట్టి పర్లేదు అదే ఇంటర్ అయితే ....... అయినా పర్లేదు ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని చాలా సినిమాల్లో - నిజ జీవితంలో కూడా చూసాము కదా అని నవ్వుకున్నాను . ఈ బుజ్జిదేవకన్యను ...... నాకు తెలిసి బామ్మ ప్రాణంలా జోకొడుతూ నిద్రపుచ్చి ఉంటుంది - అయినా ఈ వయసులోనే మార్కెట్ కు వెళ్లి ఇంటికి కావాల్సిన వస్తువులన్నింటినీ తీసుకొచ్చింది అంటే చాలా ధైర్యం ఉండాలి - I like that ........ బ్యూటీ తోపాటు రుద్రమదేవి - ఘాన్సీ లా ధైర్యవంతురాలు ........ అర్థమయ్యేలా చెప్పాలంటే బాహుబలిలో అవంతిక లా ........ నిజమే లంగా ఓణీ - చీరలలో బుజ్జిదేవకన్య నడుము ఒంపు అచ్చు తమన్నా నడుము ఒంపు సొందర్యమే ........ తప్పు తప్పు బుజ్జిదేవకన్య ముఖం తప్ప ఏమీ చూడకూడదు - పెద్దమ్మా ......... sorry sorry అని లెంపలేసుకుని సిగ్గుపడ్డాను .
మెసేజ్ సౌండ్ ........ " తప్పు లేదు నాన్నా మహేష్ " 
అవునా పెద్దమ్మా ........ కళ్ళు నెమ్మదిగా బుజ్జిదేవకన్య కళ్ళ దగ్గర నుండి పెదాలు - మెడ ........ నో నో నో తప్పే అంటూ మళ్లీ కళ్ళ దగ్గరే చేరిపోయాను . 
మెసేజ్ : హ హ హ ......... స్మైలీ లు .
బామ్మ అనుమతి లేకుండా మాత్రం తప్పే ........ అంటూ ఫోటోలను మార్చి మార్చి చూస్తూ ఊహల్లో తేలిపోతూ ప్రక్కనే వాలిపోయి నిద్రలోకిజారుకున్నాను . నిద్రలో కూడా బుజ్జిదేవకన్య కళ్ళ సౌందర్యమే ............
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 04-08-2021, 10:31 AM



Users browsing this thread: 12 Guest(s)