Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
నేను ఆలస్యం చెయ్యడంతో బామ్మగారు మళ్లీ లగేజీ లోపలికి తీసుకువెళ్లడం చూసి , sorry sorry బామ్మగారూ .......... చిన్న సమస్య - పరిష్కరించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యం అయ్యింది - అనుకున్నాను మీకు ....... నాపై నమ్మకం లేదని ...... - బామ్మగారూ ........ ఈ మహేష్ ఒక్కసారి మాటిచ్చాడంటే ప్రాణం పోయేదాకా మరిచిపోడు ( నా దైవమైన పెద్దమ్మ ఎలానో సహాయం చేస్తారు ) .
బామ్మ : ఆహా ........ అలాకాదు బాబూ , నా వంతు నేనూ సహాయం చేద్దామని బరువులేనివాటిని మాత్రమే లోపలికి తీసుకెళుతున్నాను , కావాలంటే చూడు ..... - ఈ గొప్ప మనసున్న పిల్లాడి పేరు మహేష్ అన్నమాట . మహేష్ బాబు రీల్ హీరో -  ఈ బుజ్జిమహేష్ రియల్ హీరో ........ - అందంలో ఈ బుజ్జిమహేష్ ........ ఆ మహేష్ బాబుతో పోటీపడుతున్నాడు very handsome .
థాంక్స్ బామ్మగారూ ........ అలా పొగడకండి నాకు సిగ్గేస్తోంది అని నవ్వుకున్నాను . ఒక్కొక్క బాక్స్ లోపలికి తీసుకెళ్లి బామ్మగారు చెప్పినట్లుగా వస్తువులను చక్కగా సర్దుతున్నాను . ఒక్కడినే అవడం వలన లగేజీ లోపలికి చేర్చడానికి గంట సమయమే పట్టింది - బామ్మగారూ ....... చివరి బాక్స్ అంటూ లోపలికి తీసుకువచ్చాను . 
బాక్స్ కింద ప్లాస్టర్ సరిగ్గా వెయ్యకపోవడం వలన , బరువుకు బాక్స్ తెరుచుకుని గుమ్మం దగ్గరే కుప్పలా నా పాదాలపై పడ్డాయి .
బామ్మ : బాబూ మహేష్ ....... దెబ్బతగిలిందా అంటూ లేచి రాబోతే ........
బామ్మగారూ ........ ఏమీకాలేదు మీరు అక్కడే కూర్చోండి అనిచెప్పి బాక్స్ ప్రక్కన ఉంచి ఒక్కొక్కటే తీసుకొచ్చి సర్దుతున్నాను . 
బామ్మ : మహేష్ ........ అవన్నీ గోడపై వ్రేలాడదీయాల్సిన ఫోటోలు మరియు ఆల్బమ్స్ ........ అదిగో ఆ టేబుల్ పై ఉంచు , గోడకు మేకులు కొట్టినా తరువాత తగిలిద్దాము . 
Ok ok ఫోటోలు ఇక్కడ ఉంచుతున్నాము , మీరు చెప్పినట్లుగా ఆల్బమ్ ఎక్కడ ....... కిందపడిన వాటిలో కింద ఉన్నట్లుగా ఉన్నాయి తీసుకొస్తాను బామ్మగారూ అని వెళ్లి పైన అడ్డుగా ఉన్నవి ప్రక్కన ఉంచాను . కిందకు పడే సమయంలో ఆల్బమ్ ఓపెన్ అయినట్లు ఒక ఫోటోవైపు అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను - వొళ్ళంతా ఒక తియ్యనైన పులకరింత  , పెదాలపై ఆగని నవ్వు , కనురెప్పవెయ్యడం తప్పు అన్నట్లు ఫొటోలో పరికిణీలో ఉన్న నా వయసున్న అమ్మాయిని జీవితాంతం చూస్తూ ఉండాలనిపించేంతలా నన్ను ఆనందపరుస్తోంది - ఆ అమ్మాయి చిరునవ్వుకే నా హృదయం పారవశ్యాన్ని పొందుతోంది - నేను యవ్వనాన్ని పొందాను అని ఈ బుజ్జి దేవకన్యను చూసాకే తెలిసిందేమో అన్నట్లు వొళ్ళంతా మధురమైన భావనలకు నన్ను నేను మైమరిచిపోతున్నాను - నాకు తెలియకుండానే ఆ ఫోటో నా ఒక చేతిలోకి , మరొక చెయ్యి నా గుండెలపైకి చేరింది - ప్రపంచాన్నే మరిచిపోయినట్లు , ప్రపంచమే కొత్తగా పూలవనంలా మారిపోయినట్లు , నాపై మన్మధ బాణాలు పూలవర్షం కురుస్తున్నట్లు ఇప్పటివరకూ కలగని మధురాతిమధురమైన ఫీల్ కలుగుతోంది . 

బాబూ మహేష్ బాబూ మహేష్ ........ ఏమైంది అలా కదలకుండా ఉండిపోయావు అని కుర్చీలోనుండే మాట్లాడారు బామ్మగారు .
ఆ కొత్తలోకంలోనుండి తేరుకుని ఏమీలేదు ఏమీలేదు బామ్మగారూ అంటూ బుజ్జిదేవకన్య ఫోటోను బామ్మగారికి తెలియకుండా దొంగతనంగా నా షర్ట్ జేబులో ఉంచుకుని , ఆల్బమ్ ను ఫోటోలు దగ్గర మిగతా వస్తువులను బామ్మగారు చెప్పినదగ్గర ఉంచేసి చుట్టూ చూసి చాలా బాగుంది బామ్మగారూ .........
బామ్మ : ఈ క్రెడిట్ మొత్తం ఈ బుజ్జిహీరోకే చెందాలి - నువ్వు లేకపోయుంటే ఇంత తొందరగా లగేజీ మొత్తం ఇలా అందంగా సెట్ చేసేవాళ్ళము కాదు - చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాము బాగా అలసిపోయాము ఎక్కడివక్కడే వదిలేసి నిద్రపోయేవాళ్ళము . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ - ఎందుకో తెలియదు ఈ బుజ్జిహీరోను ఆప్యాయంగా గుండెలపైకి తీసుకోవాలని ఉంది , నీకు ఇష్టమైతేనే ..........
బామ్మగారూ ......... నాకు తొలిసారి అమ్మ ప్రేమ తెలిసినదే నా ప్రాణమైన అవ్వల ఒడిలో ........ , మీ ( అవ్వలు - బామ్మల ) కౌగిలింతలో అమ్మ - అమ్మమ్మ - నానమ్మ ప్రేమ కలగలిసి ఉంటుంది , అలాంటి అనురాగాన్ని ఎవరు కాదనుకుంటారు చెప్పండి .
బామ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో వచ్చి ఆప్యాయంగా గుండెలపైకి తీసుకుని , నాకు మనవడు లేడు ఉండి ఉంటే ఇలాంటి ఆనందమే కలిగేదేమో ........ , ఆ మధురమైన అనుభూతిని కూడా ఈ బామ్మకు అందించినందుకు మళ్లీ థాంక్స్ థాంక్యూ soooooo మచ్ మహేష్ ........ , ఇంత చిన్నవయసులో ఎంత మంచి మనసు అని బుగ్గలను అందుకుని నా నుదుటిపై ముద్దుపెట్టారు .
నో నో నో బామ్మగారూ ........ , పనికోసం నా ప్రాణమైన అవ్వలను వదిలి ఇక్కడకు వచ్చాను - రెండు రోజులయ్యింది వారి ప్రేమను పొంది మీవలన ఆ అనుభూతిని పొందగలిగాను కాబట్టి నేనే ....... మీకు థాంక్స్ చెప్పాలి . 
బామ్మ : ఇంత చిన్నవయసులో ఇంటి బాధ్యతలు ........ అని కళ్ళల్లో చెమ్మతో అడిగారు .
లేదు లేదు బామ్మగారూ ........ ఇక్కడ సులభమైన పనే దొరికింది అని మొత్తం వివరించాను - ఫ్రెండ్స్ తోపాటు కాలేజ్ కు వెళ్లి వాళ్ళను జాగ్రత్తగా ఇంటికి చేర్చడమే , కాలేజ్ కు వెళ్ళవచ్చు మరియు నెల నెలా సాలరీ కూడా వస్తుంది అని సంతోషంతో చెప్పాను .
బామ్మ : అంటే నువ్వు .........
అనాధనైతే కాదు బామ్మ గారూ ........ అవ్వలు - తమ్ముళ్లూ - బుజ్జాయిలు చాలామంది ఉన్నారు . వారి సంతోషం కోసమే పనికోసం వెతుక్కుంటూ ఇక్కడకు చేరాను - నా దైవం ఒక పెద్దమ్మ వలన ఎంజాయ్ చేసే పని దొరికింది మరియు నా ప్రాణమైన వాళ్ళు ఎలా ఉండాలని ఆశపడ్డానో అంతకన్నా ఎక్కువగా సంతోషంగా ఉన్నారు . ఇప్పుడు వారంతా ఎక్కడ ఉన్నారో తెలుసా అని ఉదయం నుండీ వచ్చిన ఫోటోలను చూయించాను - ఫ్లైట్ లో వెళ్లి ఢిల్లీ ఆగ్రా లో ఎంజాయ్ చేస్తున్నారు ........ అని అంతులేని ఆనందంతో చెప్పాను .
బామ్మ : చూసి ఆనందించి , మరి ఈ బుజ్జిమహేష్ కూడా వెళ్ళవచ్చు కదా ........
ఇంతకుముందే చెప్పానుకదా బామ్మగారూ ....... ఒక్కసారి మాట ఇస్తే ప్రాణం పోయినా పూర్తిచేయ్యకుండా మధ్యలో వదలను అని - ఇక్కడ మేడం వాళ్లకు మాటిచ్చాను ....... అయినా నా ప్రాణమైన వాళ్ళ ఆనందం కంటే నాకింకేమి కావాలో చెప్పండి అని మొబైల్ లోని ఫోటోకు ముద్దుపెట్టాను .
బామ్మ : మహేష్ ........ మరింత అంటూ మళ్లీ గుండెలపైకి తీసుకుని బాస్పాలను తుడుచుకున్నారు .

బామ్మగారూ ........ ఒక చిన్న కోరిక కోరతాను తీరుస్తారా ? .
బామ్మ : అంతకంటే అదృష్టమా మహేష్ ........ చెప్పు .
బామ్మగారూ బామ్మగారూ ........ అదీ అదీ అవ్వల ప్రేమను పొందడానికి ప్రతీ వీకెండ్ వరకూ ఆగాలి - మీ కౌగిలిలో ........ అంతటి ప్రేమనే కలుగుతోంది కాబట్టి కాబట్టి ........
బామ్మ : కాబట్టి వీకెండ్ వచ్చేన్తవరకూ రోజుకు ఒక్కసారైనా మీ గుండెలపైకి చేరవచ్చా అని అడగబోతున్నావు కదూ ........
బామ్మగారూ ........ మీకెలా తెలిసింది .
బామ్మ : ఎందుకంటే నిన్ను కౌగిలించుకున్న రెండుసార్లూ ........ నాకు మనవడు లేని లోటు మాయమైపోయింది కాబట్టి - నువ్వే కాదు నేనూ కోరుకుంటున్నాను రోజుకు ఒక్కసారైనా ఈ బామ్మ ఒడిలోకి వస్తావా మహేష్ ........
సంతోషంగా బామ్మగారూ ......... అని మళ్ళీ కౌగిలిలోకి చేరి నవ్వుకున్నాము .
బామ్మ : మహేష్ ........ బామ్మగారు అనికాదు " బామ్మా " అని ఆప్యాయంగా పిలవవచ్చు కదా ........ please please ఎందుకంటే నా మనవరాలు కూడా అలానే ప్రాణంలా పిలుస్తుంది .
ఫోటోలోని బుజ్జిదేవకన్య అన్నమాట , అయితే మరింత ఇష్టం అని మనసులో అనుకుని , తియ్యనైన నవ్వులతో సరే బామ్మా ......... 
బామ్మా : మరొక్కసారి ..........
ఒక్కసారి ఏంటి బామ్మా ....... బుజ్జిదేవకన్య పిలుపు ఎన్ని సార్లైనా సంతోషంగా పిలుస్తాను బామ్మా బామ్మా బామ్మా ........ అని జేబుపై చేతినివేసుకున్నాను . 
బామ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో ........ అమ్మా దుర్గమ్మా ఇప్పటికి నా కోరిక తీర్చావా తల్లీ అంటూ కురులపై ముద్దులు కురిపించారు . 

బామ్మా ........ ప్చ్ ఇప్పటివరకూ మీతో ఒక నిజం దాచాను - ఇప్పుడు చెప్పినా బాధవేస్తుంది , చెప్పకపోయినా బాధవేస్తుంది . అదేమిటంటే అంటూ ప్రక్కనే ఉన్న భూత్ బంగ్లా గురించి వివరించాను - ఇప్పటివరకూ ఈ ఇంట్లోకి రావడానికి ఎవ్వరూ సాహసం చెయ్యనేలేదు .
బామ్మ : ఓహో ........ అందుకేనా ఇంత మంచి ఇల్లుని తక్కువ బాడుగకే ఒప్పుకున్నాడు బ్రోకర్ . దెయ్యాలు అంటే నాకూ మహా భయమే కానీ నా బుజ్జిమనవడిని వదిలి ఎక్కడికీ వెళ్ళేది లేదు - మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడానికి ఈ బుజ్జిహీరో ఉండనే ఉన్నాడు కదా ..........
హమ్మయ్యా ......... అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
బామ్మ : నిన్ను వదిలి వెళ్లిపోతామని కంగారుపడ్డావు కదూ ........ , మమ్మల్ని ఇంతగా అభిమానించే బుజ్జిహీరోని వదిలి ఎలా వెళతాము చెప్పు - అయినా ....... మళ్లీ తిరిగివెళ్లే ప్రసక్తే లేదు అని గుసగుసలాడుకున్నారు .
బామ్మా ........ ఇక వెళ్లరా ? ఎందుకు ? అడగడం మరిచిపోయాను చాలాదూరం నుండి వచ్చారన్నారు ఇంతకీ మీరు ఇక్కడ నుండి వచ్చారు ? .
బామ్మ : అదొక పెద్ద కథ బుజ్జిహీరో ........ , చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు మొదట ఈ మనవడికే చెబుతాను ఎందుకంటే ఇప్పటివరకూ నా మనవరాలికే తెలియదు - అపద్దo చెప్పి ఇక్కడకు తీసుకొచ్చేసాను .
మీ ఇష్టం బామ్మా ........ , మీరే స్వయంగా చెప్పేంతవరకూ మళ్లీ అడగను - మీకు ఎలాంటి అవసరం వచ్చినా నా నెంబర్ కు కాల్ చెయ్యండి మెరుపువేగంతో మీ ముందు వాలిపోతాను , నేను ఉండేది దగ్గరలోనే .........
బామ్మ : అప్పుడే వెళతావా ...... ? , నా మనవరాలు వచ్చేన్తవరకూ ...........
( అంతకంటే అదృష్టమా బామ్మా ....... , ఆ బుజ్జిదేవకన్యను చూడటం కంటే మహదానందం మరొకటి ఏమిటి అని ఊహల్లోకి వెళ్ళిపోయాను ) . మనవడూ మహేష్ మహేష్ ........ అన్న పిలువులకు తేరుకున్నాను - బామ్మ పెదాలపై ముసిముసినవ్వులు ........... , అలానే బామ్మా ...... మీ కోరిక ఎందుకు కాదనాలి మీ బుజ్జిమనవరాలు వచ్చాకే ఇక్కడ నుండి కదులుతాను అని చైర్లో కూర్చున్నాను. నేను పదే పదే జేబుపై చేతిని వేసుకున్న ప్రతీసారీ బామ్మ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు - కొంపదీసి ఫోటోను తీసుకోవడం బామ్మ చూడనైతే చూడలేదు కదా అని తలదించుకుని ఓర కంటితో చూస్తున్నాను . బామ్మ నవ్వులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి - పెద్దమ్మా ....... మీరే రక్షించాలి - బుజ్జిదేవకన్య దర్శనం ..........

అంతలో మొబైల్ మ్రోగడంతో చూస్తే మురళి ......... , మహేష్ ఎక్కడున్నావు గ్రౌండ్ లో వదిలిన కిట్స్ తీసుకుని తొందరగా రా ....... , బయటకువెళ్లి పానీపూరీ తినాలి .
వచ్చేస్తున్నాను మురళీ సర్ ( పెద్దమ్మా ........ నేను కోరుకున్నది బుజ్జిదేవకన్య దర్శనం కదా ప్చ్ ........ , ok ok నా దైవం ఏమిచేసినా కారణం ఉండే ఉంటుంది ) బామ్మా ........ డ్యూటీ వెళ్ళాలి అని ఫీల్ అవుతూ లేచాను . 
బామ్మ : ముసిముసినవ్వులు నవ్వుకుని , ( ఇక్కడే ఉంటావుకదా ఇప్పుడు కాకపోతే పానీపూరీ తినివచ్చాక కానీ లేకపోతే ఉదయం కానీ చూడవచ్చులే , తను ఎక్కడికి వెళుతుంది .........) 
బామ్మా ........ ఏమైనా మాట్లాడారా ? .
బామ్మ : లేదే అంటూ నవ్వుకున్నారు . 
బై బామ్మా ....... అవసరమైతే జస్ట్ అలా missed కాల్ ఇవ్వండి అని జేబుపై చేతినివేసుకుని ఫీల్ అవుతూ బయటకు అడుగులువేశాను . సరిగ్గా గుమ్మం దగ్గరకు చేరగానే ......
మనవడూ మహేష్ .........
దొరికిపోయాను . బామ్మా ......... 
బామ్మ : చిరునవ్వులు చిందిస్తూనే నాదగ్గరికివచ్చి , నా గుండెలపై చేతిని తీసేసి జేబులోని ఫోటోను తీసిచూసి , నా బంగారం అంటూ ఫొటోకు ముద్దుపెట్టారు .
భయంతో కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి .
బామ్మ : నా పరిస్థితిని చూసి నవ్వుకున్నారు . ఫొటోలో నా మనవరాలు బ్యూటిఫుల్ గా ఉందికదూ ....... , ఇది నా మనవరాలు 8th క్లాస్ లో పుష్పవతి అయినప్పటి ఫోటో ........ పరికిణీలోనే కాదు లంగా ఓణీ - చీర కూడా కట్టించి అంగరంగవైభవంగా ఫంక్షన్ జరిపించాను నా బంగారు తల్లికి ....... , నా బుజ్జితల్లిని చూస్తే ఎవ్వరైనా ముగ్ధురాలు అవ్వాల్సిందే ........ , అది ఈ మనవడు బుజ్జిహీరో బుజ్జిమహేష్ అవ్వడం నాకు సంతోషమే ........ , నా తరుపున ఈ మధురమైన కానుక అంటూ పరికిణీ ఫోటోను కూడా అప్పటికే ఫోటోలు ఉంచిన ఒక గిఫ్ట్ కవర్లో ఉంచి నా జేబులో ఉంచారు .
నాకంతా అయోమయంగా ఉంది - బామ్మ మాటల ఆంతర్యం అర్థం కావడం లేదు  . వణుకుతున్న చేతితోనే గిఫ్ట్ అందుకోబోతే ........ చేతిపై ఆప్యాయంగా దెబ్బవేసి నవ్వుకున్నారు . ఇప్పుడుకాదు బుజ్జిహీరో ........ డ్యూటీ పూర్తయ్యాక ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడాలి ok నా ప్రామిస్ చెయ్యి ........
ప్రామిస్ బామ్మా ....... అని ఒట్టు వేసి వెనక్కు తిరిగి చూడకుండా తుర్రుమన్నాను . నా వెనుక బామ్మ నవ్వులు వినిపించాయి .

ఆనందం - అయోమయం - కంగారు ......... కలగలిసిన అనుభూతులతో జేబుపై చేతినివేసుకుని ఎదురుగా ఉన్న మినీ గ్రౌండ్ దగ్గరకువెళ్లి కిట్స్ అందుకుని బామ్మ ఇంటివైపే తిరిగి తిరిగి చూస్తూ - ఇంటివైపే చూస్తూ వెనక్కు నడుస్తూ ఇంటికి చేరుకున్నాను . 
మురళి : మహేష్ ........ ఇంతసేపు అక్కడ ఏమిచేస్తున్నావు ? .
ఆ గలగలల సౌండ్ కు భయంతో పిచ్ పైననే స్పృహకోల్పోయాను మహేష్ సర్ ........ , మళ్లీ నీ కాల్ సౌండ్ కు మెలకువవచ్చింది - కిట్స్ అందుకుని ఒకటే పరుగు ..........
నావైపు చూసి మురళితోపాటు ఫ్రెండ్స్ అందరూ నవ్వుకున్నారు . మాకంటే ఎక్కువ భయం మహేష్ కు అని ఆటపట్టించారు .
మురళి : భయపడి పడిపోయావన్నమాట , నేనేమో ....... కొత్తగావచ్చినవారికి సహాయం చేయడానికి వెళ్లావేమో అని కోప్పడ్డాను sorry sorry అని నవ్వుతూనే ఉన్నాడు - ok ok ...... కిట్స్ ఆ మూలన ఉంచివెళ్లి రెడీ అవ్వు బయటకువెళదాము అని పంపించారు . 

అపద్దo చెప్పానుకాబట్టి సరిపోయింది లేకపోతే రచ్చ చేసేవాడు మురళి , నవ్వుకుంటే నవ్వుకోనివ్వు ......... బామ్మకు సహాయం చెయ్యడం వలన కలిగిన ఆనందం - బామ్మ కౌగిలి మాధుర్యం - బుజ్జిదేవకన్య ఫోటో దర్శనం ........ ఆఅహ్హ్ ....... చాలు చాలు అని పులకించిపోతూ ఔట్ హౌస్ చేరి జేబులోని గిఫ్ట్ కవర్ ను దైవంలా ప్రార్థించే పెద్దమ్మ ముందు ఉంచాను . పెద్దమ్మా ....... మీపై కొద్దిగా కోప్పడ్డాను sorry sorry మీరు ఏమిచేసినా నా మంచికోసమే అని తెలుసుకోలేని బుజ్జి మూర్ఖుడిని - ఫోటో చూసి కూడా బామ్మ కోప్పడలేదంటే మీ involvement ఉందని నాకు తెలియదా చెప్పండి అని గుంజీలు తీసాను . 
మెసేజ్ రావడంతో చూస్తే " నో గుంజీలు ....... బోలెడన్ని  స్మైలీ లు " ఉన్నాయి .
పెద్దమ్మా ....... ఇక్కడే ఉన్నారా అని చుట్టూ చూసి బయటకు వెళ్లబోయి ఆగాను . ప్రయోజనం ఉండదులే ....... పెద్దమ్మే స్వయంగా దర్శనం ఇచ్చేన్తవరకూ ఇబ్బంది పెట్టకూడదు అని మళ్ళీ పెదాలపై చిరునవ్వులతో గిఫ్ట్ కవర్ అందుకుని గుండెలపై హత్తుకున్నాను . బామ్మకు ఇచ్చిన మాట ప్రకారం డ్యూటీ పూర్తిచేసుకునివచ్చి పెద్దమ్మను తలుచుకుని చూస్తాను పరికిణీ ఫోటోతోపాటు ......... ఊహించడం వద్దు సర్ప్రైజ్ అంటూ పెద్దమ్మ అని రాసిన కాగితం ముందు ఉంచి బాత్రూమ్లోకి వెల్లి ఫ్రెష్ అయ్యి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 04-08-2021, 10:30 AM



Users browsing this thread: 35 Guest(s)