14-07-2021, 09:13 PM
(14-07-2021, 03:46 PM)VikrAnth! Wrote: మిత్రమా మీ కామెంట్ చదివాకా మంచి ఎనర్జీ వచ్చింది. నాకు వచ్చిన రీతిలో నేను రాస్తున్న కానీ మీరు ఆదరిస్తున్న తీరు మాత్రం అమోఘం.
మంచి స్కాచ్ బాటిల్ రెడీగా పెట్టండి మేము కూడా జాయిన్ అవుతాము.
చాలా కథలు చదవడానికి బాగుంటాయి కానీ కామెంట్ పెట్టడానికి బద్దకం.. కానీ మీ కథకు కామెంట్ పెట్టకపోతే ఒక అద్భుతమైన కథనం ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేసి కొంత, మీ కథ మేము కూడా చదువుతున్నాం మాస్టారూ.. కాస్త త్వరగా అప్డేట్ పెట్టండి అని చెప్పడానికి కొంత, రైటర్ కామెంట్స్ లేక కొంతకాలం పక్కన పెడితే అంతవరకు అందులో ఉన్న లయ, సహజత్వం లోపించి నిరాశాజనకంగా సాగుతుంది కథ.. దానిని నివారించడానికి కొంత, శృంగార కథల ఫోరమ్ అయినా సరే దాన్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పాలనే రైటర్ సరైన ప్రోత్సాహం లేక విరమించుకోకుండా కొంత..
ఇలా అన్నీ కలగలిపి కామెంట్ చేసాను. ప్రస్తుత అప్డేట్ విషయానికి వస్తే ఇప్పటివరకు క్యారెక్టర్స్ తీరుతెన్నులు, వాటి ప్రవర్తనా విధానం, మెయిన్ కథలోకి వెళ్ళడానికి అవసరమైన బేస్ వివరించారు. ఇక్కడనుంచి కథనం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడనుంచి మాకు థ్రిల్ కలిగే విధంగా ముందుకు తీసుకుపోండి.
ఇక స్కాచ్ అంటే మద్యపానం జీవితానికి హానికరం. కానీ మా ఆంధ్రాలో జీతానికి హానికరం.
కానీ ఏం చేస్తాం మీరు అడిగాక.. మీరు కథ పూర్తి చేసేయ్యండి. ఈ లోపు యానాం వెళ్ళి అయినా స్కాచ్ తీసుకొచ్చేస్తా?