13-04-2019, 06:42 PM
(This post was last modified: 13-04-2019, 06:44 PM by ~rp. Edited 1 time in total. Edited 1 time in total.)
Vikatakavi02 Wrote:[Dt:15th April 2016]
కొత్త రచయితలు - ఒక ఆలోచన [Originally posted by Sarit]
ఈ PDF ఆర్టికల్ నాది కాదు . కాని ఇందులోని ఒక అంశము నాకు చాలా బాగా నచ్చింది , అలాగే కొత్త రచయితలకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అనే ఆలోచనతో దానిని యధాతధంగా ఇక్కడ పెడుతున్నాను.
(ఎవరికైనా అభ్యంతరముంటే చెప్పండి తీసి వేయగలను) .
మన సైట్ లో చాలా మంది కొత్తగా కథలు వ్రాయాలని ఉత్సాహము ఉన్నవారు ఉన్నారు. కాని , సంభాషణలు వ్రాసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారనిపించింది కొన్ని కథలు చదువుతున్నప్పుడు.
అఫ్కోర్స్ మొదటిసారే , గొప్పగా వ్రాయాలని నా ఉద్దేశ్యం కాదు కాని , ("అనగననగ రాగమతిశయిల్లుచు నుండు , తినగ తినగ వేము తియ్యనుండు” అన్నట్లు వ్రాస్తూ, వ్రాస్తూ ఉంటే అదే అబ్బుతుంది) వ్రాయాలి అనుకున్నవారు మెల్లిగా ఒక భాగం వ్రాసినాక తిరిగి ఒకసారి చదువుకుని ,వీలైతే వాళ్ళ ప్రియ మిత్రుడు లేదా సఖి కి చదవమని ఇచ్చి ఏమైనా మార్పు చేయాల్సినవి ఉంటే మళ్ళీ మార్పుచేసి , తరువాత భాగానికి వెళితే బాగుంటుంది అని నా అభిప్రాయం.
ఇక శైలి విషయానికి వస్తే , ఎవరి శైలి వారిదే , కొన్ని సార్లు వేరొకరిని అనుసరించవచ్చు , లేదా వారి వారి శైలి లోనే కథను నడిపించవవచ్చు.
నాకు నచ్చిన భాగాన్ని ఇక్కడ డైరెక్టుగా ఇక్కడ పెడుతున్నాను.
ఇంకో పెద్ద కష్టం ఉంది కొత్త కథకులకి. డైలాగ్స్ రాసే టప్పుడు. ఓ పెద్ద వాదమో, తర్క మో జరుగుతోందనుకోండి.
“……” అంది సుధ
“…..” అన్నాడు రాఘవ్
“……” అంది సుధ
“…..” అన్నాడు రాఘవ్
“……” అంది సుధ
“…..” అన్నాడు రాఘవ్
“……” అంది సుధ
“…..” అన్నాడు రాఘవ్
..
ఇలా రాసుకుంటూ పోతే చదివే వాడికి పిచ్చెక్కుతుంది. చిన్న విషయంలా తోస్తుంది గానీ, అనుభవంలో గానీ తెలీదు ఇలాంటి సీన్ రాయాలంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. చలం కథల్లో చాలా సంభాషణలు ఉంటాయి. కొన్ని పేజీ లకి పేజీలు. కానీ ఎక్కడా ఇలా ఎవరు మాట్లాడుతున్నారో చెప్పే అవసరం రాదు. పక్క గదిలో ఇద్దరు తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంటే ప్రతి డైలాగ్ ముందో చివరో “నేను సుధని మాట్లాడు తున్నా” అంటూ చేర్చక పోయినా ఎవరు మాట్లాడుతున్నారో తెలిసి పోతుంది… వాళ్ళ గొంతులు మనకి ముందే తెలుసు కాబట్టి. చలం లాంటి రచయిత చేతిలో పాత్రల గొంతు కూడా మనకి వినపడుతుంది. అదీ సాధించాల్సింది, ఈ సమస్యనించి బయట పడ్డానికి.
“ఏవిరా రంగా పనికిరాలా”
“చలిజెరం దొరా”
“నీకు వారానికో జబ్బొస్తుందేరా? నిజమే చెప్తున్నావా?”
“నిజమే చెప్తుండు దొరా… రాత్రి నేనే జెరం మాత్ర కొని తెచ్చి యేసిన ”
“నువ్వూ చేరావ్ వాడి వంత పాడ డానికి. తాగి ఇంటిక్కూడా రావట్లేదని ఏడుస్తున్నావని అడిగా…. ఇప్పుడు వాణ్ణి వెనకేసు కొస్తావేమే?”
“రాత్రి నిజ్జంగనే బుఖారొచ్చి ఇంట్ల పండిండు దొరా. క్రితం వారం చేతిల పైసలున్నప్పుడు మస్తు జల్సా జేసిండు, ఇప్పుడు మంచంల పడిండు”
“ఛల్ తీయ్! వారం నాటి ముచ్చట తీస్తవ్? గా మల్లేస్ గాడు కల్లు తాపిచ్చినడు తాగిన… సొంత పైసలు దొబ్బ పెట్టినానా… దీని మాటలు నమ్మొద్దు దొరా”
“ఇగ జాల్లే నా ముందరే కొట్లాటలా?… పని జూడండి”
(ఈ సంభాషణలో ఎక్కడా ఎవరు మాట్లాడుతున్నారో వాచ్యంగా చెప్పలేదు. మూడూ మూడు రకాల గొంతులు. వాటి మాండలికంలో తేడా ఉంది. ఒకళ్ళ నొకళ్ళు సంబోధించడంలో తేడా ఉంది. ఇంకా ఓ గొంతును గుర్తు పట్టడానికి చాలా మార్గాలు ఉంటాయి. పాత్రని సృష్టించే టప్పుడే ఆ గొంతుని కూడా పరిచయం చేస్తే, హాయిగా కథంతా ఇలాంటి సంభాషణలు రాయటం సులువయి పోతుంది.)