Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రహస్యం BY రేఖా కృష్ణ
#2
                                                రహస్యం
                                                రేఖా కృష్ణ
 "ఇదండి మీ పోర్షన్ ఆద్దె విషయం చెప్పానుగా? ఇది వరకైతే ముఁదు గదొక్కదాన్నే అద్దెకిచ్చేము. వెనక మేమే వాడుకునేవారం. ఈ మధ్య మా అబ్బాయి ఉద్యోగరీత్యా యింకో చోటకి వెళ్ళేసరికి ఇంత యిల్లు అనవసరమని మొత్తం అద్దెకిస్తున్నాం ."
ఆయన తిరిగి ఆ కధంతా ఎక్కడ వినిపిస్తాడోనని భయపడి "అలాగేనండి.... నేను రేపువచ్చి చేరిపోతాను .... సామాను  కూడా పెద్దగా ఏమీ లేదు, మా ఆవిడింకా కాపురానికి రాలేదు. చెప్పానుగా ఆషాడమాసం తర్వాత పంపుతారని...." . . “అలాగే బాబూ! రేపు మంచిదే. వచ్చి చేరు.... మొన్ననే ఆ గదిలో వున్నతన్ని ఖాళీ చేయించాను... కడిగిస్తాను."
"అలాగేనండి. వస్తాను." . మరునాడు ఆ పోర్షన్లో చేరుతూ పరిమళకి  ఉత్తరం వ్రాసాను . యిల్లు తీసుకున్నానని ఇక తాను రావడమే ఆలశ్యమని, ఈ ఆషాడ మాసం అడ్డువల్ల నేనెంత బాధ   పడుతుంది రాత్రిళ్ళు  తను  గుర్తొచ్చి, నిద్రపట్టక , బుజ్జిగాడు చెసే  అల్లరిని వర్ణిస్తూ తననూ  ఉత్తరంవ్రాయమని వ్రాసాను.
రోజులు గడిచిపోతున్నాయి మెల్లిగా.
ఆ రోజు ఆదివారం. సాయంత్రం ఏమీ తోచక అలమరా తెరిచాము. ఆలమారాలో పాత పత్రిక లున్నాయి. అవి నావికావు. ఇంటివారివీ  అయివుండవు. బహుశా  యింతకుముందు అద్దెకున్న తనివై వుండాలి. కాలక్షేపానికి పనికొస్తాయని తీసేయలేదు. చేతికి వచ్చి నన్ని పత్రికలు పట్టుకుని బయటికి తీస్తుంటే మధ్యలోంచి ఏదో జారి  కిందపడింది.
చూసాను.
ఉత్తరాల కట్ట.
చాలా వున్నాయి, . . అన్నీ కవర్లే. అన్నిటికి కలిపి రబ్బరు బాండ్ తొడిగివుంది. అవేమిటా అనే క్యూరియాసిటీతో పత్రికలు అలమార్లో పడేసి ఆ కట్ట చేతికి తీసుకుని చూచాను. మాధవరావ్ ని అడ్రస్ చేసున్నాయి. అన్నీ 'కుమారి' అనే వెండన్స్ అడ్రసునుంచే, ఒకరి ఉత్తరాలు చదవకూడదనే విషయం తెలిసినా కోరికను చంపుకోలేక బెడ్ మీద చేరి కవర్స్ లోంచి కాగితాలను తీసి చూచాను . ...
అన్ని లెటర్స్ పచ్చటి కాగితాలమీద బ్లాక్ ఇంక్ తో ఆందమ్ గా వ్రాసినవే!
 చదువకుండా వుండలేక పోయాను.
[+] 3 users Like sweet1guy's post
Like Reply


Messages In This Thread
RE: రహస్యం BY రేఖా కృష్ణ - by sweet1guy - 27-06-2021, 09:06 PM



Users browsing this thread: 1 Guest(s)