Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మా - చెల్లెమ్మ - పిల్లలు ......... హిమగారి ఇంట్లోని ఎంటర్ అయ్యే సమయానికి నేను షాపింగ్ బ్యాగ్స్ తో వదినమ్మ ఇంటిగోడ ఎక్కి నిచ్చెన ద్వారా కిందకుదిగి తెరచిన బ్యాక్ డోర్ ద్వారా లోపలికివెళ్ళాను .
బేబీ - బేబీ ....... అంటూ వదినమ్మ - చిన్నవదిన కన్నీళ్ళతో నా గుండెలపైకి చేరారు - బేబీ ....... అమ్మకు ఎలా ఉంది చెల్లికి ఏమీకాలేదు కదా , ఈ దుర్మార్గులు ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారు , పాపాలు పండే సమయం దగ్గరపడింది .
దేవతలూ ....... ఎలా తెలిసింది ? .
దేవతలు : స్టే తీసుకోవడం వలన ఇక కొన్నినెలలపాటు ఇంటిని టచ్ చేయలేము - ఆ సేట్ వాళ్ళ డబ్బు ఖర్చయిపోయింది తిరిగి ఇవ్వాల్సిందేనా అని కుట్రలు పన్నడం మల్లీశ్వరి విన్నది .
దేవతలూ ........ వాళ్ళు ఇక ఏమీ చేయలేరు - అమ్మ - చెల్లికి ఏమీ కాలేదు మెడపై వొత్తుకుంది అంతే , అంటీ ట్రీట్ చేశారుకదా - ఇక అలా జరగకుండా చూసుకుంటాను ప్రామిస్ ........ , మీరు బాధపడకూడదనే అమ్మ వీడియో కాల్ లో మాట్లాడలేదు అని కన్నీళ్లను తుడిచి సోఫాలో కూర్చోబెట్టాను . ఈ కుట్రలన్నింటికీ చెక్ పెట్టడం కోసమే రేపు మన కంపెనీ ప్రారంభించబోతున్నాను - మీరు ఇక్కడ నుండే చాలా వర్క్ చెయ్యాల్సిఉంటుంది .
దేవతలు : రెడీ బేబీ లవ్ టు లవ్ టు ....... " JIMK ఇండస్ట్రీస్ " ఉన్నత స్థాయికి చేర్చేవరకూ మా బేబీ కింద సంతోషంతో కష్టపడతాము . 
లవ్ యు దేవతలూ ........ , ప్రారంభోత్సవం కోసం నా దేవతలకు - మల్లీశ్వరి వాళ్లకు మీ చెల్లి సెలెక్ట్ చేసిన చీరలు .
దేవతలు : అందుకుని లవ్ యు చెల్లీ అంటూ గుండెలపై హత్తుకున్నారు . బేబీ ...... పాపాయి ఎలా ఉంది .
నాదేవతల్లా అందమైన నవ్వులు నవ్వుతోంది .
దేవతలు : చాలా చాలా ఆనందం వేసింది బేబీ ....... లవ్ యు sooooo మచ్ అని బుగ్గలపై ముద్దులుపెట్టారు . 
లవ్ యు దేవతలూ ........ , కంపెనీ మొదటి పనిని నా దేవతలకు అప్పగించబోతున్నాను . ఇదిగో లాప్టాప్ ....... ఇది ఈ మూర్ఖులు తీసేసిన వర్కర్స్ - ఆఫీసర్స్ లిస్ట్ ....... రేపు ఉదయం ప్రారంభోత్సవ సమయానికి ఈ అడ్రస్ ఆఫీస్ కు రావాలని మెసేజెస్ పంపించాలి JIMK ఇండస్ట్రీస్ తరుపున ......... 
దేవతలు : లవ్ టు లవ్ టు అంటూ లాప్టాప్ అందుకున్నారు .
అమ్మా - వదినా ....... నెమ్మదిగా పని పూర్తిచేయ్యవచ్చు ముందు డిన్నర్ ఆకలేస్తోంది , అక్కడ మీ బుజ్జితల్లులు బుజ్జాయిలు కూడా వేచిచూస్తుంటారు .
దేవతలు : నవ్వుకున్నారు . నా బుగ్గలపై ముద్దులుపెట్టి వడ్డించుకునివచ్చి తినిపించి తిన్నారు .
దేవతలూ ........ మొత్తం మీరే తినిపించేస్తారా ఏమిటి అక్కడ బుజ్జి అణు బాంబులు పేలుతాయని మీకు తెలియదా ఏమిటి ? .
దేవతలు ఆపకుండా నవ్వడం చూసి ముచ్చటేసింది . నీళ్లుతాగి మళ్లీ రేపు కలుద్దాము అని నుదుటిపై ముద్దులుపెట్టాను .
దేవతలు : బేబీ ..... రేపు తెల్లవారుఘామునే లేచి రెడీ అయ్యి ఈ చీరలు కట్టుకుని పూజ చేసి వీడియో కాల్ కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటాము .
లవ్ యు దేవతలూ ........ బై , గోడను జంప్ చేసి నేరుగా వదినల ఇంటిలో అడుగుపెట్టాను .

అక్కడ కూడా మాన్స్టర్స్ కుట్రలు పన్నడం తెలిసినట్లు మహేష్ మహేష్ అంటూ నా కౌగిలిలోకి చేరి బాధపడుతున్నారు .
ఓదార్చి , దేవతలకు చీరలను - బుజ్జితల్లులకు బుజ్జాయిలకు డ్రెస్సెస్ ఇచ్చి భోజనం చేస్తుండగా గ్రూప్ వీడియో కాల్ వచ్చింది .
వరలక్ష్మీ : మేడం ....... పెద్ద మోసం అని దేవతలకు అందించారు .
ఇక్కడ ఇద్దరు దేవతలూ , వదినమ్మ , చిన్న వదిన అందరూ ఒకేసారి అమ్మా - చెల్లెళ్ళూ ........ ఒకదగ్గర అని అంతులేని ఆనందంతో ముద్దులవర్షం కురిపించి ఆ వెంటనే తియ్యనికోపాలతో దేవతలు - బుజ్జాయిలు నాపై యుద్ధం ప్రకటించినట్లు కొడుతూ గిళ్లడం చూసి అమ్మ - చెల్లెమ్మ - హిమగారు నవ్వుతున్నారు .
వదినమ్మ - చిన్నవదిన : బుజ్జితల్లులూ ....... బేబీ కి మా దెబ్బలు కూడా కలిపివెయ్యండి .
అమ్మా ....... నీ ప్లానే కదా ? .
అమ్మ : మరి ....... షాపింగ్ మాల్లో విషయం చెప్పకుండా కొద్దిసేపు బాధపెట్టావుకదా  , ఇప్పుడు బాగా ఎంజాయ్ చెయ్యి . 
దేవతలు : అమ్మా , కృష్ణా ........ మేము కోరుకున్నది కూడా ఇదే , చెల్లీ హిమా ...... హ్యాపీ కదా ....... ? .
హిమ గారు : ఆనందబాస్పాలు , చెమ్మతో ........ సగం అక్కయ్యలూ .
దేవతలు : చెల్లీ ....... మిగతా సగం సంతోషాన్ని కూడా బేబీ - మహేష్ మనకు అందించే బృహత్కార్యాన్ని రేపు మొదలుపెట్టబోతున్నాడు కదా అని ఆనందించారు .
తప్పకుండా దేవతలూ ..........

దేవతలూ ....... రేపు ఆన్లైన్ రిబ్బన్ కటింగ్ లో కలుద్దాము అని ముద్దులుపెట్టాను .
అమ్మ : కన్నయ్యా ....... ఇక్కడికి నా హిమ తల్లి ఇంటిదగ్గరికి వచ్చేయ్ - ఇక్కడి నుండే ఫుడ్ తీసుకుని హాస్పిటల్ కు వెళదాము .
అమ్మా ....... నేను నేరుగా హాస్పిటల్ కు వెళ్లిపోతాను .
అమ్మ : తల్లీహిమా చెప్పానుకదా ఇదీవరస ఇక్కడికి రమ్మంటే చాలు ఇలానే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు కన్నయ్య ఎందుకో ఏమిటో .......? .
( అక్కడకువస్తే - హిమగారి మెడలో మంగళ సూత్రాన్ని చూసి ఈ హృదయం తట్టుకోలేదమ్మా ) .
అమ్మ : కన్నయ్యా ....... ఇప్పుడుమాత్రం ఇక్కడకు రావాల్సిందే , లేకపోతే ఆ వెధవ వచ్చేవరకూ ఇక్కడే ఉండిపోతాము .
వస్తాను అమ్మా ....... బయటే ఉంటాను వచ్చెయ్యండి అని బుజ్జాయిలను డోర్ వరకూ ఎత్తుకునివచ్చి వదిలి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే చేరుకున్నాను . 
పెద్దయ్య సెల్యూట్ చేస్తూ వచ్చి బాబూ లోపలికివెళ్లండి అని గేట్ తెరిచాడు .
పెద్దయ్యా ....... మీ డ్యూటీ అయిపోతే మీ బుజ్జిపాపాయి దగ్గరకు వెళదాము .
పెద్దయ్య : ఇంకా ఇక్కడ ఉన్నానంటే కేవలం మీకు ఇలా సహాయం చెయ్యడం కోసమే బాబూ ........ డ్యూటీ పూర్తిచేసుకుని హాస్పిటల్ కు వెళతాను మీరు వెళ్లి పలకరించండి - మీరు ఇంకా రాలేదని అలకతో నా కోడలిని కూడా ఎత్తుకోనివ్వడం లేదట ........
పెద్దయ్యా ........ ఏడుస్తోందా ? .
పెద్దయ్య : లేదు లేదు బాబూ ........ , బుజ్జినవ్వులు అలక మాత్రమే .........
సంతోషం పెద్దయ్యా ....... ఇప్పుడే వెళతాము . అంతలో అమ్మావాళ్ళు బయటకువచ్చి - మావయ్యా మావయ్యా ........ అంటూ పరుగునవచ్చి నా పైకి చేరారు . 
పిల్లలు : మావయ్యా మావయ్యా ........ హిమ అమ్మ ఎంత అందంగా ఉన్నారో తెలుసా ? - మీరు లోపలికివచ్చి చూడమంటే చూడరు . 
పైన కిటికీ వెనక నుండి ఎవరో చూస్తున్నట్లు అనిపించి అటువైపుకు చూస్తే నీడ ప్రక్కకు వెళ్ళిపోయింది .
పిల్లల మాటలకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలియక కృష్ణగాడి వెనుక హాస్పిటల్ కు చేరుకున్నాము .

పిల్లలను ఎత్తుకుని ICU లోపలికి అడుగుపెట్టగానే , బుజ్జి ఊయలలో ఉన్న పాపాయి హుషారుగా కాళ్ళూ చేతులూ ఆడించడం చూసి , మావయ్యా మావయ్యా ........ పాప మనల్ని పిలుస్తోంది .
చెల్లి : ఇప్పటివరకూ బుజ్జి బుంగమూతిపెట్టుకుని ఉంది అన్నయ్యా - మిమ్మల్ని చూడగానే ఉత్సాహం వచ్చేసినట్లుంది అని ఆనందబాస్పాలతో పాపాయి ప్రక్కకు చేరి ఎత్తుకోవడానికి try చేస్తే మరొకవైపుకు తిరిగింది . ఇదీ వరుస అన్నయ్యా - అమ్మా ........ మీరే ఎత్తుకోండి .
పిల్లలను బెడ్ పై కూర్చోబెట్టి , dear స్వీటీ అంటూ చేతులు చాపగానే బుజ్జిబుజ్జినవ్వులతో నా వేళ్ళను గట్టిగా పట్టుకుంది . లవ్ యు స్వీటీ అంటూ సున్నితంగా గుండెలపైకి తీసుకున్నాను .
చెల్లి : ఎత్తుకోవడానికి ఎంత try చేసాను - పాలు ఇవ్వబోతే కూడా వద్దు అన్నావు - మా అన్నయ్య గుండెలపైకి చేరిపోయావు అని చిరునవ్వులు చిందిస్తూనే కొట్టడానికి వచ్చి బుగ్గపై చేతితో ముద్దుపెట్టి మురిసిపోతోంది .

చెల్లీ ........ మేము పాపాయిని చూసుకుంటాము - దైర్యంగా మీరు వెళ్లి భోజనం చెయ్యండి . 
చెల్లి : పాలకోసం కాకపోతే అమ్మ అవసరమే లేదు అన్నయ్యా ...... ఈ బుజ్జిపాపాయికి - మీతోనే ఉండమంటే హ్యాపీగా నన్ను వదిలి వచ్చేస్తుంది - ధైర్యమా ........ మీతో ఉంటే దేవుడితో ఉన్నట్లే కదా అని తియ్యనికోపంతో పాపాయిని సున్నితంగా గిల్లేసింది .
చెల్లీ ....... ఇంకొక్కసారి గిల్లితే దెబ్బలుపడతాయి అని నవ్వుకున్నాము . లేదు లేదులే స్వీటీ అని బుగ్గపై ముద్దుపెట్టి ఆడించాను . స్వీటీ ....... నీకు ఆకలివెయ్యడం లేదా మీ అమ్మ దగ్గరకే వెళ్లడం లేదట అని పిల్లలతోపాటు బెడ్ పై కూర్చుని ఆడించాము . 
అంటీ నవ్వుకుని రౌండ్స్ కు వెళ్లారు .

కొద్దిసేపటి తరువాత , అదిగో అమ్మకూడా తినేసింది - మేమూ మీ బుజ్జి అన్నయ్యలు కూడా తినేశారు ఇక మిగిలింది నువ్వే , మళ్లీ రేపు కలుద్దాము కదా అని ముద్దుపెట్టి చెల్లికి అందించాను .
చెల్లి : తన దేవుడితో ఆడుకుంది కదా కడుపునిండా పాలుతాగి హాయిగా నిద్రపోతుంది అన్నయ్యా ........
అమ్మ - చెల్లెమ్మ వచ్చి తల్లీ ....... రేపు మీ అన్నయ్య కొత్త కంపెనీ ప్రారంభించబోతున్నారు - పాపాయితోపాటు రావాలి అని పట్టుచీరను అందించి ఆహ్వానించారు .
చెల్లి : దేవుడు - దేవతల దగ్గరికి రమ్మంటే పరుగునవస్తాము . అమ్మో ....... సితార విన్నట్లుంది చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో .......
అన్నయ్యా ........ పెద్దయ్యను కూడా పిలుచుకుని ఈ అడ్రస్ కు వద్దులే ఇంటికి వచ్చెయ్యండి అమ్మలతోపాటు కలిసి రావచ్చు అని ఆహ్వానించి బయటకువచ్చాము . 
అమ్మా ......... మీరు అంటీ ఇంటికి వెళ్లి ఆహ్వానించి ఇంటికి వెళ్ళండి అని కీస్ ఇచ్చాను . మేము బిల్డింగ్ దగ్గర పనులు చూసుకుని వచ్చేస్తాము .

బిల్డింగ్ చేరుకుని దాదాపుగా పనులన్నీ పూర్తవ్వడం చూసి కృష్ణగాడిని కౌగిలించుకున్నాను . అర్ధరాత్రివరకూ అక్కడే ఉండి డెకరేషన్ తో సహా మొత్తం పూర్తయిన తరువాత , కృషికి తగ్గ అమౌంట్ వారికి అందించి లాక్ చేసుకుని సంతృప్తిగా ఇంటికి చేరుకున్నాము . 
అమ్మ గదిలోనే చెల్లెమ్మ - ఇద్దరినీ హత్తుకుని పడుకున్న పిల్లలను చూసి సౌండ్ చెయ్యకుండా రూమ్ డోర్ వేసి కృష్ణగాడివైపు చూసాను .
కృష్ణ ప్చ్ ....... ఈరోజుకూడా పస్తులే అన్నమాట అని పెదాలను తడుముకోవడం చూసి నవ్వుకున్నాను - రేయ్ సూర్యోదయం లోపు వెళ్ళాలి గుడ్ నైట్ అంటూ వాడి గదిలోకి తోసేసి , నా గదిలోకివెళ్లి అలారం పెట్టుకుని బెడ్ పైకి జంప్ చెయ్యగానే నిద్రపట్టేసింది .

అలారం సౌండ్ కు 5 గంటలకు లేచి తలంటు స్నానం చేసి కొత్తబట్టలు వేసుకుని నా పర్సనల్ లాప్టాప్ అందుకుని కిందకువచ్చాను - అదేసమయానికి కృష్ణ కూడా రెడీ అయ్యి వచ్చాడు .
హారతి సౌండ్ వినిపించడంతో పూజ గదిలోకి వెళ్ళిచూస్తే ఆశ్చర్యం అమ్మ - చెల్లెమ్మ - పిల్లలు - పంకజం గారు పట్టువస్త్రాలలో పూజకూడా పూర్తిచేశారు .
పిల్లలు : మావయ్యా మావయ్యా ....... మేము రెడీ ? .
లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఏ ఆటంకాలూ రాకూడదని భక్తితో ప్రార్థించాను . 
కృష్ణ : అంటీ ......... ఆఫీస్ బిల్డింగ్ డెకరేషన్ చూడలేదు కదూ అని మొబైల్ అందించాడు . అంటీ - శ్రీమతిగారూ ........ ఇది డెకరేషన్ ముందు నెక్స్ట్ yes ఇది ..........
అమ్మ - చెల్లెమ్మ : డెకరేషన్ తరువాత wow బ్యూటిఫుల్ - మేము ఊహించినదానికి రెట్టింపు అద్భుతంగా తీర్చిదిద్దారు . సూపర్ కృష్ణా - లవ్ యు కన్నయ్యా ........
క్రెడిట్ మొత్తం వాడికే చెందుతుంది అమ్మా ........
అమ్మ : తల్లీ ........ చాలా బాగుంది కదా , నాకైతే వెంటనే చూసేయ్యాలని ఉంది .
పిల్లలు : అమ్మమ్మా అమ్మమ్మా ........ మాకూ చూయించండి అని ఎగురుతున్నారు చూడటానికి .
అమ్మా ........ పూజాసామాగ్రి తీసుకుని సమయానికి వచ్చెయ్యండి - మేము వెళ్లి అన్నీ ఏర్పాట్లూ చూసుకుంటాము అని ఇద్దరమూ కొత్త ఆఫీస్ చేరుకున్నాము . 
కారుదిగిచూస్తే షాక్ ........ కొన్నిగంటలముందు పూలతో - విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించబడిన బిల్డింగ్ మొత్తం చెల్లాచెదురు పూలహారాలతో - గోడలపై పేడ కొట్టినట్లు ఇక సీరియల్ సెట్టింగ్స్ అయితే ఎక్కడికక్కడ కట్ చేసి లాగేసి , కాంపౌండ్ లో చెత్తపడేసినట్లు ..........
కృష్ణా ...... పెనుగాలులు అనుకుందామన్నా రాత్రి పిల్ల గాలులు కూడా వీచనేలేదు .
కృష్ణ : మహేష్ ........ ఇలా ఎవరు చేసిఉంటారో నీకూ తెలుసు - ఖచ్చితంగా వాళ్లే , నువ్వు బాధపడతావని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను లేకపోతే నా నోటి నుండి .........
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 25-07-2021, 10:51 AM



Users browsing this thread: 190 Guest(s)