12-06-2021, 01:28 AM
ఏమైంది బంగారం నిద్రొస్తోందా?, ఊ... , డిన్నర్ చేసావా?, ఊ... , టాబ్లెట్ వేసుకున్నావా? ఊ... , సరే పడుకోమరి రేపు మాట్లాడుకుందాం అన్నాడు కిషోర్. మావయ్య..మరి అత్తయ్య వాళ్ళిద్దరిని కొట్టిందంటగా, ఎలా ఉన్నారు ఇప్పుడు అని అడిగింది అలేఖ్య. దాని ధైర్యానికి ఆశ్చర్యపోతూ, వాళ్లకేం దున్నపోతుల్లా బాగానే ఉన్నారు అన్నాడు కిషోర్. అలేఖ్య కళ్ళుమూసుకుని హిహిహి అని నవ్వుతూ, వాళ్ళని చూడాలని ఉంది మావయ్య అంది. నువ్వు ముందు పూర్తిగా రికవర్ అవ్వు అప్పుడు చూడొచ్చు అన్నాడు కిషోర్. మరీ? మా ముగ్గురిని కలవనివ్వరా ఇంక ?అంది అలేఖ్య. అంటే అన్నాడు అర్థంకాక కిషోర్. అంటే మరీ? మా ముగ్గురిని విడదీస్తారా అంది అలేఖ్య. అలేఖ్య మాటలకి కిషోర్ కి కోపం రాకపోగా నవ్వొస్తోంది. చ చ ఆలా ఏం లేదు అన్నాడు కిషోర్. అలేఖ్య అడిగే ఒక్కొక్క క్వశ్చన్ కి కిషోర్ కి మైండ్ బ్లాంక్ అవుతోంది. మరి మా ముగ్గురికి పెళ్లి చేస్తావా? అంది అలేఖ్య కళ్ళుమూసుకొని. ఓహ్ మై గాడ్ అనుకోని డోర్ వైపు చూసాడు, పూర్ణ వీల్లద్దరి మాటలు వింటూ నించుని ఉంది. కిషోర్ పూర్ణ వైపు చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ... ష్ అని వేలు చూపించాడు పూర్ణ వైపు. చెప్పు మావయ్య అంది అలేఖ్య మళ్ళి. చేస్తానమ్మా ఎందుకు చెయ్యను నువ్వు నా బంగారు కొండవీ నువ్వు ఎలా కావాలంటే ఆలా చేస్తాను, ముందు నువ్వు బాగా చదువుకోని మంచి జాబ్ సంపాదిం చి మా అందరికి మంచి పేరు తెచ్చిపెట్టు అప్పుడు ఇద్దర్ని ఇచ్చి చేస్తా సరేనా అన్నాడు కిషోర్. థాంక్స్ మామయ్యా అంది అలేఖ్య. సరే ఇంక నిద్రపో అని అలేక్యని ఎత్తుకొని మంచంమీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి గుడ్నైట్ బంగారం అన్నాడు. అలేఖ్య గుడ్ నైట్ కూడా చెప్పకుండా నిద్రలోకి జారుకుంది. కిషోర్ బేడ్ లైట్ వేసి మెయిన్ లైట్ ఆపేసి, తన్నుకొస్తున్న నవ్వుని ఆపుకుంటూ డోర్ వేసి హాల్ లోకి వచ్చి సోఫామీద పడి పగలబడి నవ్వుతున్నాడు కిషోర్.
స్రవంతి బెడ్ రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి పిల్లలిద్దర్నీ డిన్నర్ కి పిలిచింది. విరాట్, శంకరులు ఇద్దరు డిన్నర్ చేస్తుండగా. సరే డిన్నర్ చేసి కాసేపు చదువుకొని పాలు తాగి పడుకోండి. నేను అలేఖ్య ని చూసి వస్తాను అని డోర్ వైపు వెళ్ళింది. విరాట్ వెనకనుంచి పిలిచాడు స్రవంతిని. ఆ ఏంట్రా అంది స్రవంతి. అసలు అలేఖ్యకి ఏమైంది, సుజి ఆంటీ ఎందుకొచ్చింది, అలేఖ్యకి వొంట్లో బాగోలేదా, ఇప్పడేలాఉంది అని వరసబెట్టి అడిగాడు విరాట్ భయపడుతూనే. స్రవంతి ఇద్దరివైపు ఒకసారి కోపంగా చూసి, అలేఖ్య కి టు డేస్ నుంచి వంట్లో బాగోలేదు, ఇప్పడు పరవాలేదు, ఎక్కువ ఆలోచించకుండా చదువుకొని పడుకోండి అంది. దాంతో ఇద్దరు సైలెంట్ గ తల దించి మొఖం ప్లేటులో పెట్టారు. శ్రవంతి డోర్ వేసి శ్రీధర్ వాళ్ళ ఫ్లాట్ లోకి వెళ్ళింది. ఏమై ఉంటదిర అన్నాడు శంకర్ విరాట్ని. ఏముంది అమ్మ మనల్ని ఉతికినట్టు దాన్ని కూడా బండకేసి బాదినట్టున్నారు అన్నాడు విరాట్.