18-05-2021, 11:11 PM
సాయంత్రం 3 గంటలు అయ్యింది. స్రవంతి పెద్దోడా అని శంకర్ ని పిలించింది. ఆ అంటూ శంకర్ బెడ్ రూమ్ లోంచి వచ్చాడు. బాషు వాళ్ళ షాప్ కి వెళ్లి ఒక కిలో ఖీమా, ఒక కిలో బోన్స్ తీసుకురా అని చెప్పింది స్రవంతి. సరే అని రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు, వెనకాలే విరాట్ కూడా వచ్చి, అమ్మ నేను కూడా వెళ్ళొస్తా అన్నాడు. నువ్వెందుకు ఏమి అవసరం లేదు వాడు వెళ్ళొస్తాడు లే అంది స్రవంతి. అమ్మ ప్లీజ్ అమ్మ ఇంట్లో ఉండి ఉండి పిచ్చేక్కుతుంది. మూడు రోజుల్నుంచి ఆ మెయిన్ డోర్ వైపు చూస్తే ఏదో పాకిస్థాన్ బోర్డర్ లాగ కనపడుతుంది. కనీసం కింద గ్రౌండ్ కి వెళ్ళొస్తా అన్నాడు. సరే పో అంది స్రవంతి. ఈ వెధవలు ఇలాంటి డైలాగులు కొట్టి అమ్మాయిలని పడేస్తారనుకుంటా అనుకుంది విరాట్ చెప్పిన పోలిక కి నవ్వుకుంటూ. బయటకి వచ్చి శ్రీధర్ వాళ్ళ ఫ్లాట్ బెల్ కొట్టాడు శంకర్. పూర్ణ వచ్చి తలుపు తీసింది. ఆంటీ అంకుల్ బైక్ కీస్ కావాలి అన్నాడు శంకర్. పూర్ణ లోపలికెళ్లింది కీస్ కోసం. విరాట్, శంకర్ లు లోపలికి తొంగి చూసారు అలేఖ్య కనపడుతుందేమో అని, కానీ అలేఖ్య కనపడలేదు, ఇంతలో పూర్ణ వచ్చి కీ ఇచ్చింది. ఉసూరుమంటూ ఇద్దరు కిందకి వెళ్లారు. పెద్దోడా నన్నుపక్కనున్న మాల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు కాసేపు ఆలా మాల్ లో తిరుగుతాను అన్నాడు విరాట్. సరే అని విరాట్ ని మాల్ దగ్గర దించి శంకర్ బాషు వాళ్ళ షాప్ వైపు వెళ్ళాడు.