Thread Rating:
  • 16 Vote(s) - 3.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అన్ని మాట్లాడుకుందాము
ఈ దారంలో జరిగిన చర్చ నేపధ్యంలో ఖమ్మం జిల్ల సంఘటన

చెల్లెలిని ఇద్దరు అన్నలు అత్యాతారం చేసారు. దీనిని ఆ అన్నల తల్లిదండ్రులు ఆమోదించి ఇందులో ఆ అమ్మాయి ఇష్టంతో పనిలేదు అని చెప్పేరు. ఆ అమ్మాయి సెక్యూరిటీ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వగానే ఒక ఆన్న ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇక్కడ మన సమాజంలో ఉన్న జబ్బు ఏమిటంటే ఆడవాళ్ళకి వొళ్ళే తప్ప మెదడు/ మనసు ఉండదన్న బలుపులో మొగపిల్లలు పెరుగుతారు. 

అందికే తన ప్రేమ కాదన్న బయట అమ్మాయి మీద ఏసిడ్ పోల్సినట్టే, ఇంట్లో ఉన్న నిస్సహాయ చెల్లిమీద వీళ్ళిద్దరూ ఈ ధారుణం చేసెరు.

మొదటి వాడు (సొంత అన్న) మీద ఈ అమ్మాయి తల్లి కి చెప్పినా, మనమే సర్దుకోవాలి అన్నట్టు కూతురికి చెప్పింది. అంటె ఆతల్లి ఇలాంటివి చాలా కుటుంబాల్లొ చుసి ఉండొచ్చు. 

అంటే ఇష్టంగానో అయిష్టంగానో అన్న దమ్ములిని భరిస్తున్న నిస్సహాయ ఆడపిల్లలిని చూసి కూతురికి కూడా అలాగే సర్దుకుపొమ్మని చెప్పింది.

అల్లరి చిల్లరగా తిరిగే సొంత అన్న, తననే సర్దుకొమ్మని చెప్పే తల్లి నుంచి తప్పించుకుందికి ఈ అమ్మాయి, పెదనాన్న పెద్దమ్మ ఇంటికి వెళితే అక్కడ ఇంగ్లండులో సాఫ్టివేరు ఉద్యోగం చేసే అన్న (పెద్దమ్మ ఒడుకు) ఇదే చేసాడు. పెద్దమ్మా పెదనాన్నా కూడా ఇవి కామన్ విషయాలు అన్నారు,తప్ప ఈ పిల్లని రక్షించలేదు. 

ఇక్కడ బేవార్సు గా తిరిగే సొంత అన్న, చక్కటి కెరీర్ లో కుదురుకున్న అన్న ఇద్దరిదీ ఒకటే బలుపు. తమ చెల్లికి శరీరమే కానీ మనసు లేదు, అని నమ్మేరు. పెద్దవాళ్ళు (తల్లులు కూడా) ఇదే నమ్మేరు. 

ఈ బలుపు లేకుండా మనసుకి ప్రాధాన్యం ఇచ్చిన సంబంధాలు ఆరోగ్యకరమే (శ్రీనివాసపద్మజ తల్లీ-మేనమామ లాగా). 

అన్ని సమస్యలకీ మొగపిల్లల బలుపు, పెద్దవాళ్ళ ఉదాసీనతే కారణం. 

ఆత్మహత్య చేసుకున్న వాడి తల్లిదండ్రులు ఈ పిల్లది తప్పు అనుకుంటే వాళ్ళు (కొన్ని లక్షల తల్లిదండ్రులు లాగే) దృతరాష్ట్రులు. వాళ్ళు "ఈపిల్ల వీధిన పడి బంగారం లాంటి మా కొడుకుని ఆత్మహత్య చేసుకొనేళా చెసింది అనుకొనే అవ్కాసాలే ఎక్కువ, కానీ, కళ్ళు మూసుకుపోయిన కొడుకు, తన ఆత్మహత్యకి తానేకారణం అని గాని, కొడుకుని మందలించి ఉంటే వాడు దక్కేవాదు అన్న ఆత్మవిమర్స గాని చేసుకొనే అవకాసం తక్కువే. ఇది నా ఉహ.

ఈ ఊహతో ఇబ్బంది పడితే చెప్పండి, ఈ పొస్టు దిలీట్ చేష్టాను. (ఎడినిస్త్రేతర్ సరిత్ గారు దిలీత్ చేసినా ఏమీ అనుకోను)
[+] 2 users Like kamaraju50's post
Like Reply


Messages In This Thread
RE: అన్ని మాట్లాడుకుందాము - by kamaraju50 - 09-04-2021, 04:43 AM



Users browsing this thread: 2 Guest(s)