06-04-2021, 01:32 PM
(06-04-2021, 01:27 PM)pvsraju Wrote: కథలకు పాఠకుల నుండి రెస్పాన్స్ రాకపోతే కథ చెప్పేవాడిగా నేను విఫలం అయినట్టే అనిపిస్తోంది. అందుకే ఇకముందు కథ రాయాలన్న ఆశక్తి తగ్గిపోతుంది. కథను చూసి చదివి వెళ్ళేవారు ఎక్కువగానే కనిపిస్తున్నా LIKE లు RATE లు ఇచ్చేవారు కరువయ్యారు. ప్రొత్సాహం లేకపోతే అంత శ్రమపడి వ్రాయడం వృదా అనిపిస్తోంది. ఇక్కడ కథ వ్రాయడం వలన ఏ ఒక్క రచయితకి ఒక్క పైసా ఉపయోగం కూడా లేదు. అయినా కథలు వ్రాస్తున్నారు అంటే అందరికీ ఆనందం పంచడం కోసమే అని పాఠకులు ఎందుకు అర్ధం చేసుకోవడం లేదో నాకు అర్ధం కావడం లేదు. కథ చదివిన తరువాత ఒక కమెంట్ పెట్టటానికి మీకు సమయం లేకపోవడం శోచనీయం. పోనీ కనీసం ఒక LIKE, RATE బటన్ నొక్కడానికి మీకు పట్టే కాలం 5 సెకండ్లు . అది కూడా చెయ్యలేకపోతే ఇక మేము కథలు వ్రాసి ఏం ఉపయోగం. అప్డేట్ ఇచ్చిన ప్రతిసారి LIKE లు కొట్టండిరా బాబు , RATE ఇవ్వండిరా బాబు అని అడుక్కోవడం నావల్ల కాదు. ఇకమీద నేను వ్రాస్తున్న కథలు కొనసాగాలన్నా కొత్త కథలు వ్రాయాలన్నా అది పాఠకుల ప్రోత్సాహం లేకపోతే కష్టమే. నిర్ణయం పాఠకుల చేతుల్లోనే ఉంది. మీ PVSRAJU.