Poll: తెలుగు స్టొరీస్ ఫోరం కి లాగిన్ కంపల్సరీ చెయ్యాలా? లేక వద్దా?
You do not have permission to vote in this poll.
లాగిన్ కంపల్సరీ చెయ్యండి
70.93%
61 70.93%
మార్పులేమీ లేకుండా ప్రస్తుతం ఉన్నటే ఉంచండి
29.07%
25 29.07%
Total 86 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 5 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు స్టోరీస్ ఫోరం వరకూ లాగిన్ కంపల్సరీ చెయ్యాలా వద్దా?
#28
రచయితలారా! పాఠకులారా! ఇది నా స్వంత ఆలోచన కాదు.  పని వత్తిడిలో బిజీగా ఉన్న ఒక మిత్రుడు నన్ను అడిగితే అతని తరఫున ఈ పోల్ మొదలు పెట్టాను.

ఈ పోల్ ని  రెండు వారాల టైముతో మొదలు పెట్టడం జరిగింది.  

మన తెలుగు ఫోరం సభ్యులకు ఉన్న అడిషినల్ అడ్వాంటేజ్ ఏంటీ అంటే అడ్మిన్స్/ మాడరేటర్స్లో చాలమంది మన తెలుగువారవ్వడం.  వారు ఏంతో ఓపికతో మన సాధకబాధకాలని అర్థంచేసుకుంటూ మన సమస్యలకి పరిష్కారం ఇస్తూ వస్తున్నారు. మన సైటుకి ఏది మంచో అదే చేస్తారు అడ్మిన్స్/మాడరేటర్స్. కనుక మీరెటువంటి సందేహాలూ పెట్టుకోవద్దు.

మిత్రులు చాలా మంది లాగిన్ అవసరం లేదు, ఎట్లా ఉందో అట్లా ఉంచండి అంటున్నారు.  అదే సమయంలో రచయితల పట్ల తమ సహానుభూతి వ్యక్తం చేస్తున్నారు.  ఆ వ్యక్తం చేసేదేదో ఆయా రచయితల కథల థ్రెడ్లలో ఒక చిన్న పోస్ట్ వేసినా, ఒక లైక్ కొట్టినా లేక ఒక రేటింగు ఇచ్చినా రచయిత మహదానందపడిపోతాడు.  ఆ రచయితకి మరింత నూతన ఉత్సాహం వచ్చి, నెక్స్ట్ అప్డేట్ త్వరగా ఇవ్వడానికి కృషి చేస్తాడు.  

కానీ ఇదంతా జరగాలి అంటే పాఠకుడికి కథ నచ్చిన క్షణంలో అతనికి లైకో, రేటో లేక రిప్లైయో ఇవ్వగలిగే అవకాశం ఉండాలి.  ఇప్పుడు లాగిన్ అవ్వలేము కదా, తర్వాత లాగిన్ అయ్యి ఇద్దాంలే అని అనుకుంటే, తర్వాత తర్వాతే అయిపోతుంది.  ఆ క్షణంలో ఉన్న పాఠకుడి మైండు ఇంటెన్సిటీ మరల రాకపోవచ్చు.  ఇది నేను జనరల్ గా లాగిన్ అవ్వకుండా చదువుతున్న మిత్రుల గురించి చెబుతున్నది.  కొంత మంది పాఠకులు, వీరు మహారాజపోషకులు.  వీరి ప్రోత్సాహమూ, ప్రత్యుత్తరాలవల్లే ఈమాత్రమైనా సైటులో రచయితలు తమ రచనలు కొనసాగిస్తున్నారు.    

గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పండి ఎంతమంది ఏదైనా కథ చదివి అది నచ్చి, తర్వాత లైక్ కొడదాం, లేదా తర్వాత మెచ్చుకుందాం లేదా తర్వాత రేటింగు ఇద్దాం అనుకుని మర్చిపోయారు ?  ఏ క్షణంలో జరగాల్సింది ఆ క్షణంలోనే జరిగిపోతే బావుంటుంది.

అదే లాగిన్ కంపల్సరీ అయితే, పాఠకుడు తనకు నచ్చిన కథకి ఆ క్షణంలోనే తన సంతోషాన్ని పంచుకోగలడు.  అట్లానే ఎక్కడైనా రచయిత వ్రాసింది నచ్చకపోతే ఆ క్షణమే తన అభిప్రాయాన్ని వ్యక్తపరచగలడు.  

నా సోదరుడూ, మిత్రుడు నన్ను అడిగినా కూడా నాకు తోచిన ఈ ఒక్క కారణం తోనే అతని మాటమేరకు ఈ పోల్ పెట్టడం జరిగింది.  
-మీ సోంబేరిసుబ్బన్న
జసుజల్లి - జమజచ్చ(Part 188 updated-26 Jun 2024)
Like Reply


Messages In This Thread
RE: తెలుగు స్టోరీస్ ఫోరం వరకూ లాగిన్ కంపల్సరీ చెయ్యాలా వద్దా? - by సోంబేరిసుబ్బన్న - 27-03-2021, 09:32 AM



Users browsing this thread: 1 Guest(s)