24-03-2021, 06:50 PM
(16-12-2020, 05:04 PM)Joncena Wrote: ముందుగా నేను రాసిన ఈ కథను ఆదరించిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలూ అలాగే హృదయపూర్వక ధన్యవాదాలు.
గత కొన్ని రోజుల క్రితం చెప్పిన సంఘటన వల్ల నా మనసు అసలు సరిగా ఉండడంలేదు. ఎంత ప్రయత్నించినా కథను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నా. అందుకే ఇక కథని ఆపేస్తున్నాను. కథని ఆపటానికి మనసు రావటంలేదు కానీ తప్పటంలేదు. కథ ఇంకొక మూడు లేదా ఐదు అప్డేటులు ఇవ్వటంతో అయిపోతుంది, కానీ ఎందుకో ఎంత ప్రయత్నించినా ఒక్క ఆలోచన కూడా రావటంలేదు.
మిత్రుడు kummun చెప్పినట్టు నాకు కూడా అనిపించింది కానీ అలా ఎందుకు జరిగిందో అర్ధం కావటంలేదు. పైగా నేను ఇప్పుడు ఉన్న situationsలో ఇక site లోకి రాకపోవచ్చు. ఏమో కుదిరితే రచయితగా ఒక కొత్త కథతో వస్తాను లేదంటే ఎప్పటిలానే ఒక కథా చదువరిగా(reader) ఉండిపోతా. లేదంటే ఇక site లోకి మొత్తానికి రాకపోవటమే జరుగుతుంది.
ఇలా చేస్తున్నందుకు అందరూ నన్ను మన్నించమని మనవి.
బంధువులు అందరూ నా కుంటుంబంలోని అందరిని ఒక కార్నర్ చేసేసారు. వాళ్ళకు అవసరం పడినప్పుడు మాత్రమే మేము గుర్తుకు వస్తాం, అవసరంలేకపోతే మేము ఎందుకూ పనికిరాని వాళ్ళుగా కనిపిస్తాం వాళ్ళకు. ముఖ్యంగా నన్ను కార్నర్ చేసి నా జీవితంతో ఇంతకాలం వాళ్ళు ఆడుకున్నారు అని తెలియని స్థితిలో నేను ఉన్నా, ఎందుకంటే నేను అంతలా నమ్మాను వాళ్ళని. మొన్నీమధ్యన జరిగిన సన్నివేశాలు అన్నీ తలచుకుంటే వెనుకే ఉంటూ ఇంతా కుట్ర చేసారా అనిపించింది.
నన్నూ, నా కుటుంబంలోని అందరినీ ఒక కార్నర్ చేయటానికి కారణం మేము వాళ్ళు చేసిన తప్పుని తప్పూ అని చెప్పటమే. అంతే కాకుండా వాళ్ళు చేసిన, చేస్తున్న తప్పుని కప్పిపుచ్చకపోవటమే అందుకు కారణం. మా వల్ల ఒకడు ఎప్పుడూ నష్టపోకూడదు అన్న ఒక moral value మాకు ఉండడమే వీటికి కారణం అయ్యి ఉండవచ్చు.
మన చుట్టూ ఉన్న బంధువుల్లో గానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు గానీ చాలామంది ఈ క్రింద ఉన్న 5లో ఖచ్చితంగా ఉంటారు.
1. మనం బాగుపడకపోయినా పర్లేదు, మన పక్కన వాడు బాగుపడితే చాలు అనుకోవటం అతి మంచితనం లేదా ఒక విధంగా మూర్ఖత్వమే.
2. మనతో పాటూ మన పక్కన ఉన్నవాళ్ళు కూడా బాగుపడాలి అనుకోవడం మంచితనం.
3. మనం బాగుపడాలి, మన పక్కన వాడు నాశానం అవ్వాలి అనుకోవటం అవివేకం.
4. మనం బాగుపడకపోయినా పర్లేదు, మన పక్కన వాడు బాగుపడకూడదు అనుకోవటం మూర్ఖత్వం.
5. పక్కవాడిని తొక్కి అయినా మనం మాత్రమే బాగుపడాలి అనుకోవటం క్రూరత్వం.
పైన చెప్పిన వాటిలో మొదటి రెండు నేను, నా కుటుంబం ఉంటే మా బంధువులు అందరూ కూడా 5వ రకానికి చెందిన వారే. అలాగని బంధువుల్లో అందరు అలా లేరు. ఒక రెండు ఫ్యామిలీలు మాత్రమే ప్రస్తుతం మా వైపు నిలుచున్నారు. ఏమో ఏమన్నా చేసి వాళ్ళని కూడా వాళ్ళ వైపు తిప్పుకున్నా ఆశ్చర్యపోనవసరంలేదు.
పైన చెప్పిన 5 రకాల్లో 3,4 రకాలు ఎక్కువ ఉంటారు. 5వ రకంతో పోల్చుకుంటే అంత ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ అంతో ఇంతో ఉండొచ్చు. So, కొంచెం మీ చుట్టు ఉన్నవాళ్ళని కూడా కాస్త గమనిస్తూ జీవితంలో అందరూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ.
ఇక సెలవు,
మీ Joncena