08-03-2021, 08:07 AM
ఆమె ఆలోచన.. ఒక మేల్కొలుపు.
ఆమె ఆచరణ.. ఒక ఆదర్శం.
ఆమె అనుభవం.. ఒక విజయం.
మొత్తంగా, సమాజానికి ఒక వెలుగు ఆమె .
ఆ కాంతిని నింపుకోవడానికి ముందు, యుగాలకు యుగాలు చీకట్లోనే మగ్గింది.
వెనుకటి అనుభవాలు నేర్పిన పాఠాలతో, ఆ చీకటితోనే పోరాడి గెలిచింది.
అర్హత లేదన్న చోటే, అగ్రస్థానాన్ని అందుకుంది.
పనికిరావన్న దగ్గరే పట్టాభిషేకం చేయించుకుంది.
చేతకాదని చులకన చేసినవారితోనే చేతులెత్తి మొక్కించుకుంది.
నాయకత్వం తెలియదని నవ్వినవారే పాలనా ప్రతిభకు ప్రణామాలు చేస్తున్నారు.
ఆకాశంలో సగమనో..భూమిలో పావు వంతనో..బేరాలుపేట్టే బేలతనాన్ని ఎప్పుడో దాటేసిందామె! ఇప్పుడు.. ఏ రంగమైనా..ఆమెకు కదనరంగమే!
ఆత్మవిశ్వాసమే అక్షౌహిణుల సైన్యం. మనోబలమే మర ఫిరంగులు.
ఆ జైత్రయాత్రకు.. పురుషాధిక్య ప్రపంచమూ జయజయ ధ్వానాలు చేయకతప్పని పరిస్థితి.
ఒంటరి ప్రయాణం నుంచి.. ఒకటో స్థానం వరకూ ఆ యాత్ర
స్ఫూర్తిదాయక కథనాల అక్షయపాత్ర!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం


![[Image: 1-1615057361.jpg]](https://i.ibb.co/N9R844w/1-1615057361.jpg)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)