Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిజమా లేక భ్రాంతా
#20
Have you Experienced any Paranormal activity in your life?

మీ జీవితంలో దెయ్యాన్ని కానీ అటువంటి వస్తువుని కానీ లేదా అటువంటి చర్యని కానీ చూశారా?!
మా డ్రైవర్ వాళ్ళు నల్లగొండ వాసులు; అక్కడ ఫ్లోరైడ్ పడటంతో వ్యవసాయం మానేసి ఇక్కడకు వచ్చాడు. అతని జీవితంలో జరిగిన విశేషాన్ని మాతో పంచుకున్నాడు.
వ్యవసాయం చేసే సమయంలో పొలంలో విత్తులు వేసిన తరువాత సాయంత్రమయిపోయింది. ఎడ్లను బావి దగ్గరకు తీసుకెళ్లి కడగటానికి తీసుకుని వచ్చాడు. అయితే అక్కడే ఒక తెల్లని దుస్తుల్లో ఒక అందమైన అమ్మాయి కనపడిందిట. 
ఎడ్ల కాడి వదిలించి, బావి దగ్గరకు తీసుకొచ్చాడు. వెంటనే ఆ ఆకారం వాటిని దూరంగా పెట్టు అంటూ అడిగిందిట. ఎవ్వరు నువ్వు అని అడిగాడు ఇతను. 
నేనెవరైతే నీకెందుకు అవి నా మీద రుసరుస మంటున్నాయి. పక్కకి తీసుకెళ్ళు అంటూ ఉరిమిందిట.
మా డ్రైవర్ "ఇవి బసవన్నలు వాటిని కడిగి తీస్కపోవాలి; రోజు నేను ఈడ్నే కడుక్కుంటా, మా బసవన్నలకు కూడా అలవాటే" అంటూ ససేమిరా అన్నాడు. 
అయినా వినలేదుట. వాటిని ఒక వంక చూస్తూనే ఇతనితో మాట్లాడుతోందిట., ఇతనికి అర్ధమయింది. ఇదేదో పారానార్మల్ ఆక్టివిటీ అని వెంటనే ఆ బసవన్నల్ని ఆమె మీదకు తీసుకొచ్చాడుట. వెంటనే ఒక పొగలా మారి గాల్లో కలిసిపోయిందిట
Like Reply


Messages In This Thread
RE:మీ జీవితంలో ఎదురైందా ఇలాంటి సంఘటన? - by kamal kishan - 04-03-2021, 10:55 PM



Users browsing this thread: 1 Guest(s)