29-03-2019, 01:18 PM
Quote:జొరమొస్తే లంఖణం తర్వాత తినిపించేది చారే ...శ్రీరాముడు తులసి ఆకులతో చారుని పుచ్చుకున్నాడని 'గణపతి' లో చమత్కారం
Quote:శ్రీరఘురామ చారు తులసీదళదామ, శమక్షమాది శృం
గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
త్తారకరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
Quote:శ్రీరాముడు ఒకసారి చారు కావాలనుకున్నాడట.
అయోధ్య లో కరివేపాకు దొరకకపోవటం వల్ల బదులుగా తులసి ఆకులని వాడారట.
అట్టి ఘనమైన చారు తాగడంతో శ్రీరాముడికి "సమక్షమాది శృంగార గుణాలు" కలిగి,
అన్ని లోకాలను జయించే "శౌర్య రమాలలాముడై",
"దాశరధి కరుణాపయోనిధియై" ... వెలుగొందాడట.