Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిజమా లేక భ్రాంతా
#15
ఓం శ్రీ గురుభ్యోనమః 
ఉపాసనలో ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. వారి ఉపాసన ఎంత గొప్పదంటే సాక్షాత్ విశ్వరూపుడైన భగవంతుడే ఆ ఉపాసన దాతగా ప్రత్యక్షం అవుతాడు. 
ఉదాహరణకి శ్రీ శంకర భగవత్పాదులను కాపాలికుడు ఒకడు బలి ఇవ్వడానికి ఆయనను తీసుకుని వెళ్ళాడు. అప్పుడు అది తెలిసి ఆ కాపాలికుడిని ఎదుర్కొనడానికి శంకరుల శిష్యుడు శ్రీ నృసింహస్వామిని ఆవాహన చేసుకొన్నాడు. అంతే భక్తుల ఆవేదనకు శ్రీ మహావిష్ణువు ఉపాసన దేవతగా అనగా నృసింహ స్వామిగా అవతరించారు. ఆ కాపాలికుని సంహరించారు.
ఆ కాపాలికుని సంహరించిన తరువాత నృసింహుని ఉగ్రత్వం తగ్గడానికి శ్రీ శంకరులు శ్రీ నృసింహ స్తుతి చేశారు. 

అంతటి గురువుకు ఎంతటి శిష్యుడు లభించాడో చూడండి.
 
భక్త తుకారాం జీవితంలో జరిగిన సంఘటన ఇక్కడ ఒకటి చూద్దాం.

భక్త తుకారాం భగవత్ భక్తుడు ఆయన అభంగాలను వినడానికి విఠోభా తుకారాం ఎక్కడ ఉంటె అక్కడకు వెళ్ళేవాడుట., ఒకసారి ఇలానే భగవానుడు తుకారాం అభంగాలను వింటూ మైమరచిపోయాడుట.
అప్పుడు అక్కడ ఒక దీపం నూనె ఎగజిమ్మి చూరు అంటుకుందిట. 
అక్కడికి దాపున ఉన్న ఊరిలో ఒక భక్తుడు ప్రార్ధన చేసుకుంటున్నాడు ఆభక్తునికి ఈ దృశ్యం అంటే పక్క ఊరిలో చూరు అంటుకున్న దృశ్యం కనపడింది ఈ భక్తుడు వెంటనే నీళ్ళు చల్లాడుట....అది ఆరిపోయింది. 
ఇది దారిన పోతున్న ఒక వ్యక్తి ఇతనేంటి గాల్లో నీళ్ళు చల్లుతున్నాడు అనుకోని అడిగాడు. జరిగిన విషయం అంతా చెప్పాడు ఈ భక్తుడు. ఆశ్చర్యపోయిన ఈ దారిన పోతున్న దానయ్య వెళ్ళి చెక్ చేసుకున్నాడు. 

ఇవన్నీ నమ్మాలా?!
సరే నమ్మవద్దు. 
కానీ నా జీవితంలో జరిగాయి. కావున నేను నమ్ముతాను.
Like Reply


Messages In This Thread
RE: నిజమా లేక భ్రాంతా - by kamal kishan - 07-02-2021, 03:24 PM



Users browsing this thread: 1 Guest(s)