Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిజమా లేక భ్రాంతా
#6
నిన్న ఒక మిత్రుడు కనపడ్డాడు; అతడు నన్ను నృసింహ క్షేత్రానికి తీసుకు వెళ్ళాడు. నాకు చాలా సంతోషం వేసింది.
ఆ మిత్రుడు మళ్ళీ కనపడలేదు.
సరేలే మన రోజూ తిరిగే ఫ్రెండ్ గాడు ఉన్నాడుగా వానితో పాటూ వెళదాం. అబ్బా ఇదేంటి నేను వాగుతూనే ఉన్నాను. నాకు నేనే నచ్చట్లేదు.
వీడేంటి నీది గవర్నమెంట్ జాబ్, పొద్దున్న కూర్చుంటే నీ పనులు అన్నీ నెరవేరుతాయి. అన్ని సౌకర్యాలూ నీకు ఉంటాయి. వీడి ఏడుపు ఏంటి?
వీడికి మాటకి మాట చెపుదామని ఉంది. మాటకి మాట చెబుతూనే ఉన్నాను. ఎందుకో .......మనసు మనసులో ఉండటం లేదు. మంచి అందమైన అమ్మాయిని చూసినప్పుడల్లా....మనసుకి హ్యాపీ గా ఉంటుంది. అసూయతో వీడు బాధపడుతూ..నేనూ మాటేరియలిస్టిక్ గా తయారవుతానా?!

ఎంత మాటేరియలిస్ట్ గా మారాలి. 
ఏమో?! ఎంత అంటే అంత మాటేరియలిస్ట్ గా మారుతాను.
నా నవ్వు కూడా కృత్రికమైంది.
శాడిస్ట్ గా మారాను.
నర రూప రాక్షసుడిగా మారాను.
రాక్షుడినా? రక్కసుడినా? రాక్షసమా?!
అమ్మవారు చెప్పినట్లు నా ధ్యానంలో నాకు కలిగిన ప్రకంపనలు నా శిరస్సుకి చేరి, బ్రహ్మ రంధ్రాన్ని చేరలేక నా ముఖం మీద దోబూచులాడుతూ....నా ముఖ వర్చస్సు పెంచుతున్నాయి. అంటే నేను సిద్ది సాదించినట్లేనా?
మరి నా ముఖం మాత్రం ఎందుకు వర్చస్సు పొందింది. నా బ్రహ్మ రంధ్రం ఎందుకు తెరుచుకోలేదు.

శివుడు యోగ పురుషుడై ఆయన తప్పస్సు బ్రహ్మ రంధ్రముద్వారా బయటికి రాగలుగుతోంది. ఆ తపస్సు అనలము అందుకే ఆ గంగమ్మ శిరస్సుపై కొలువై ఆయనకు చల్లని చల్లదనాన్ని, అలానే అమృత ప్రాయుడైన చంద్రుడు చల్లతనాన్ని ఇస్తున్నాడు. 
మరి అమృతంతో శివుని కంఠంలో హాలాహలం అమృతంగా మారుతుందా?!

ఆజ్ఞయా చక్రం  తెరుచుకుని శివుడు  త్రినేత్రుడయ్యాడా? తపస్సు ఆయనను ఆజ్ఞాచక్రం తెరుచుకునేలా చేసిందా?

ఇంకొక మాట: 
నా చేతులతో ఏది తాకినా జీవం పొందుతోంది ఎందుకు?
నేను అడుగుపెట్టినప్పుడు అక్కడ అంటా హరియాలీ ఉంటోంది; కానీ అది నావల్లే ఎందుకు అవుతోంది. 
నేను తాకితే జీవం పొందిందో లేక జీవి నాకే అమృతత్వాన్ని ఇస్తోందో....

ఎలాగంటే పక్షులు కొన్ని మన చేతికి గాయమైతే అవి చేతి మీద పురుగులు మాత్రమే తింటాయి. అలాగ అవి మనకి అమృతాన్ని చేకూరుస్తున్నాయి.

ప్రకృతి తనకు తానే మనల్ని ఎంచుకుంటుంది. అది రాముడైనా.., కృష్ణుడైనా ఆయా పనులకి ఎంచుకుంటుంది. ఆ ప్రకృతికి నీవు ఒక సాధనం మాత్రమే.
నేను కేవలం ఒక సాధనాన్ని మాత్రమే సాధించేది ప్రకృతి., ఆ ప్రకృతికి ఒకే ఒక్క లక్ష్యం శివ అనే రెండు అక్షరాలు;
ఆ రెండు అక్షరాలకు ఒక నమస్సు అనగా నమ: శివాయ.
శివునికి ఒక లక్ష్యము ఈశత్వము, సత్యము.

మనం అందరం ప్రకృతిలో ఒక భాగమే....సత్యాన్ని నీవు అనుకరించబోయినా సత్యమే నిన్ను తనలో భాగంగా చేసుకుంటుంది.
మనకు మంచి అందమైన అమ్మాయిని చూడగానే కలిగే కోరికని తీర్చడానికి మనలో కోరికలను రేకెత్తిస్తుంది. అందుకు మన భోజనాదులు కారణం.
ఈ భోజనాదులు అన్న పానీయాలు అనుకుంటే., ఆకలికి కారణం పింగళ నాది అందువల్ల తిన్న ఆహారం శరీరాదులలో. 
ప్రాణ, అపాన, వాయు, ఉదాన, సమాన అను ఐదు పదార్ధములుగా కావడానికి కారణం ఇడ నాది 
ఇవి అనుసంధానించి ఆ జ్ఞానేన్ద్రియములను పోషిస్తూ సరస్వతీ నది అంతర్వాహినివలే ప్రహింపచేసేది సుషుమ్న నాడి.
ఈ సుషుమ్న నాటికి ఆధారములు షడ్రుచులు ఇవి అన్నిటికీ అతీతమైనది ఆత్మ.

ధ్యానంలో నీకు ఏమీ కనపడకేపోతే నువ్వు సమాధి స్థితిలో ఉన్నావు అని అర్ధం. 
సమాధిలో ఉన్నవారికి ఏమైనా కనపడితే ప్రకృతే మనల్ని ఆదేశిస్తోంది అని అందువల్ల మనం కర్తవ్యంలోకి మారవలసినదని అర్ధం. 
అలాంటి వారు శ్రీ వివేకానందులు.
నిద్రాణమై ఉన్నవారు. అనగా ధ్యాన స్థితిలో శివుని చూడగలిగిన వారు శ్రీ రామకృష్ణులు. శివ శివానీ భవ భవానీ ఈశ ఈశ్వరి
నీ శ్వాస మాత్రమే నీకు జీవమును అందించగలదు. 
Like Reply


Messages In This Thread
RE: నిజమా లేక భ్రాంతా - by kamal kishan - 31-01-2021, 07:56 PM



Users browsing this thread: 1 Guest(s)