Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిజమా లేక భ్రాంతా
#1
ఒక చోట నలుగురు గుమ్మి గూడి ఉన్నారు. అక్కడ చలి మంట వేసుకుని కూర్చున్నారు. ఆ పక్కనే ఒక వ్యక్తి పరిగెడుతూ వెళ్తున్నాడు. అతను జాగింగ్ చేస్తున్నాడు. వెళ్తున్నవాడు కాస్తా ఎందుకో ఆ చలి మంట చూసి ఆగిపోయాడు. ఆ చలి కాచుకు కూర్చున్నవారు., అతను ఆగిపోవడంతో ఏంటా అని చూశారు. అతను ఆగి ఆ మంటల్లో తేడాని గమనించాడు. అక్కడ కృష్ణ సర్పం ఒకటి తగలబడుతోంది. వీళ్ళెవరికీ అది తెలియలేదు.
ఈ పెద్దమనిషి అది గమనించి ఆ సర్పాన్ని చేతుల్లో తీసుకున్నాడు. తల కాల్లేదు చాలా వరకూ శరీరం కాలుతోంది. ఆ సర్పాన్ని చేతుల్లో తీసుకున్నాడు. అది అనుకోకుండా కదిలింది.
అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. తాను కనే కల ఆ సర్పం అప్పటికే అతణ్ణి కాటేసింది. అతను చనిపోయాడు. ఆ పాము కూడా కాలిపోయింది అనుకోండి అది తరువాత విషయం.
ఇక్కడ మనసులో మెదులుతున్న విషయం ఏంటంటే ఆ పెద్దమనిషికి తనకు వచ్చే కలలన్నీ ముఖ్యంగా తాను ఆ కలల్లో ఉండగా జరుగుతున్నవన్నీ నిజమవుతున్నాయి. కానీ ఇది అతనికి రూఢీగా తెలియదు. అది అతని భ్రాంతి అనుకున్నాడు. ఇప్పుడు నిజం అయ్యింది. 
ఈ విషయాన్ని ముందే నమ్మి ఉంటె ఆ పాముని పట్టుకునే వాడు కాదేమో? ప్రారబ్దం అంటే ఇదేనేమో?!.

మహాభారతంలో అనుకుంటాను.(సరిగా జ్ఞాపకం లేదు) రాజగురువు తన తపస్సుతో రాజుని రక్షిస్తాను. అని 
రాజు గెలవకపోతే తాను ప్రాయోపవేశం చేస్తాను అని శపధం చేశాడు. 
వెంటనే మృత్యువు అతని ఇంట నిలబడింది. ఎందుకంటే రాజు గెలవడం అనే అవకాశం లేదు కాబట్టి.

ఒక మిత్రుని ఫేట్ మారుద్దామనుకున్నాడు. అతనికి ఒక లక్కీ స్టోన్ పెడదామనుకున్నాడు. కానీ అనుకోకుండా ఇతని జాతకం మారిపోయింది. అంతా తలక్రిందులు అయ్యింది మిత్రునికి ఉంగరం పెట్టి లక్కీ స్టోన్ పెడదామనుకున్న అతని పరిస్థితి తలక్రిందులయింది.
ఆ పై ఆ మిత్రుడు పడుతున్న అష్ట కష్టాలు చూడటం మినహా ఏమీ చెయ్యలేకపోయాడు.

శ్రీ కృష్ణుడు స్వయంగా ఈశ్వరుడు, ఆయన మూడో గుప్పిట కూడా అటుకులు త్రిని ఉంటే......?!!!!!
ఆ పైన మన ఊహకు అందదు.
[+] 1 user Likes kamal kishan's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
నిజమా లేక భ్రాంతా - by kamal kishan - 31-01-2021, 05:12 PM



Users browsing this thread: 1 Guest(s)