23-01-2021, 10:42 AM
రోజులా గోవింద్ ఆఫీస్ కు వచ్చాడు
ఆఫిస్ అంటే పెద్ద ఆఫీసు ఏమీ కాదు ఆ గెటప్ అస్సలు లేదు..... ఒక 2 bhk ఇల్లు అది సిట్ అవుట్ ఏరియా లో వచ్చి పొయ్యే డ్రైవర్లకు కూర్చోడానికి 5,6 కుర్చీలు ఒక టీపాయ్ వేసి ఉన్నాయి ఆ తరువాత ఒక బెడ్ రూమ్ లో ఒక టేబులు 4 కుర్చీలు రెండు ఫోన్లు ఒకటి std..... ఒకటి లోకల్.... దానికే బాత్ అటాచ్ ఉన్నది ....
మరో రూమ్లో రెండు మంచాలు..... వెయిటింగ్లో ఉన్న డ్రైవర్లకు పడుకోడానికి ...... కిచన్లో టీ వగైరలు , చిన్న చిన్న పనులు చెయ్యడానికి ఓ పన్నెండు ఏళ్ళ కుర్రాడు ..... కామన్ బాత్ రూమ్ డ్రైవర్లు వాడుకోడానికి...
ఇది సెటప్..... వర్క్ మొత్తం ఫోన్ల పైనే అవుతుంది ..... పేపర్ వర్క్ చాలా తక్కవ.... ట్రాన్స్ పోర్టర్ c-form నింపడం తప్ప వేరే పని లేదు .
ఆ రోజు బయట వేడి బయంకరంగా ఉంది....
నమయం 11 కాలేదు ఆప్పుడే 39°లకు చేరుకుంది ఉష్ణోగ్రత అంత ఎండలో కూడా
ఒక బైక్ సత్ నామ ట్రాన్స్ పోర్ట్ ముందు ఆగింది
ఏదో కొరియర్ సర్వీస్ పేరు రాసుంది వాడి జాకెట్ పై తన బ్యాగ్ లో నుండి వెతికి ఓ కవర్ తీసి దాని పైన అడ్రస్ చెక్ చేసాడు ఒకసారి , ఆపై ఆఫిస్ బోర్డు వైపు చూసి తల ఫంకిస్తూ
ఆఫిస్ లోకినడిచాడు. ఆరోజు గోవింద్ అక్కడే ఉన్నాడు..... కవర్ అఁదుకొని పేరు చూసాడు తన పేరే ..... గోవింద్ సింగ్ , సత్ నామ్ ట్రాన్స్ పోర్ట్స్ రిసీవ్ కాపీ లో సంతకం కెలుకుతూ కవర్ తిప్పి చూసాడు ఫ్రమ్ అడ్రస్ కొరకు..... ఒక క్షణం మెదడు బ్లాంక్ అయ్యింది ఆ పేరు మెదడు లో రిజిస్టర్ కావడానికి 2..3 క్షణాలు తీసుకొంది....
అతని బృకిటి పై ముడుతలు పడ్డాయి
ఆ అడ్రసే అతన్ని కలవరపరిచింది...... మల్లీ ఫ్రమ్ అడ్రస్ లో పేరు చదివాడు...... తను ఏ పేరునైతే మాయం చెయ్యాలని అనుకొన్నాడో....ఆ పేరు మల్లీ తన
ముందు ప్రత్యక్షం అయ్యింది..... ఆ కవర్ ని టేబుల్ పై పెట్టి కళ్ళు మూసుకొని ఆలోచించసాగాడు ....ఈ కవర్ ఎక్కడ నుండి వచ్చింది ... ఎవరు పంపించారు....? ఇవే ప్రశ్నలు తలలో మల్లీ మల్లీ ఒకదాని తర్వాత ఒకటిగా తిరగడం మొదలుపెట్టాయి......
తన భాస్ సైఫుల్ల అభ్బాసి .....? ఉహు.... అభ్బాసి అయితే గోవింద్ అని మాత్రం రాసేవాడు.... అంతేకాదు ఫ్రమ్ అడ్రస్ తమ కోడ్ ప్రకారం ఉంటుంది..... సో...అభ్బాసి కాదు .... మరి ఎవరు....? మళ్ళీ అదే ప్రశ్న...... కళ్ళు తెరిచి టేబుల్ పైకి చూసాడు కళ్ళ ముందు కవర్ దానిపై అడ్రస్ .......
ఫజలూర్ రెహమాన్ , గురు నానక్ పురా,
బటిండా ( po) పంజాబ్.....
ఇంకా ముందుకు చదవలేదు బాకి అడ్రస్ కంఠోపాఠం తనకి ........అయినా అడ్రస్ కాదు కదా ప్రాబ్లం..... పేరు.... యా... పేరు..... గోవింద్ , సత్ నామ్ లా తాత, ముత్తాతల ఊరు..... ఈ అడ్రస్ రాయడం తో తను ఎవడు అనేది ....... తను చేసిన తిరిమరి ఏంటీ అని........ ఆ విషయం వాడికి తెలుసూ అని చెప్పుకనే చెప్పాడు..... ఫజలూర్ రెహమాన్ అనే పేరు.....తను భూస్థాపితం చేసిన పేరు....... మల్లీ పైకొచ్చింది...... ఎవడు తవ్వి తీసాడు....? ఎందుకు......?
కవర్ ఓపెన్ చెయ్యకుండా తన ప్రశ్నలకు జవాబు దొరకదు కాని అది తెరవడానికి జంకు...ఏదో భయం..... అయినా తెరువక తప్పదు.....
గోవింద్ కవర్ ఓపెన్ చేసి అందులో నుండి తెల్లటి కాగితాన్ని బయటకు లాగాడు నాలుగు మడతలు గా ఉన్న ఆ కాగితం తెరిచి చూస్తే నాలుగే నాలుగు లైన్లు రాసి ఉంది... అది చదవడం మొదలు పెట్టాడు.....
( దాని సారాంశం )
" కవర్ పై అడ్రస్ లు చూసాక అర్థం అయ్యుంటుంది నీగురించి నాకు ఎంత తెలుసు
అనేది....... నీ గురించి నీ దొంగ నోట్ల బిజినస్ గురించి సెక్యూరిటీ ఆఫీసర్లకు తెలువకూడదూ అని అనుకుంటే ఈ రోజు సాయంత్రం 7 గం లకు సంగం టాకిస్ ముందు ఉన్న కల్పనా టెలిఫోన్ బూత్ లో వేయిట్ చెయ్యి..... "
గోవింద్ కు ఎక్కువ టైం పట్టలేదు ఏం చేయాలి అని తీర్మానం తీసుకోడానికి.....
సాయంత్రం 6.30కే సంగం టాకిస్ ముందున్న టెలిఫోన్ బూత్ చేరుకున్నాడు గోవింద్.
సంగం టాకీస్ కు ఎదురుగా కల్పనా టెలిఫోన్ బూత్ అన్ని పెద్ద బోర్డ్ తో కనపడింది.....
అందులోకి నడిచాడు..... అది నిజానికి టెలిఫోన్ బూతా....? హోటలా.....? స్టేషనరి/ జనరల్ స్టోరా? చెప్పలేము కానీ వీటన్నిటినీ కలిపిన ఒక కలగూర గంప... ముందు ఒక వైపు టీ, సమోసాలు చెయ్యడానికి స్టౌ వగైరాలు, మరో వైపు పాన్ , సిగరెట్లు ,గుట్ఖా లు దాని వెనుక క్యాష్ కౌంటర్ దాని వెనుక ఉన్న సెల్ఫ్ లలో స్టేషనరీ / జనరల్ సామాన్లు ..... దువ్వెనలు, కొబ్బరి నూనె పాకెట్ లు ,షాంపూ పాకెట్లు , పెన్నులు ,పెన్సిల్లు, చీప్ లేడిస్ ఐటంలు , ఇవి మాత్రమే కాదు ఒక సెల్ఫ్ లో కామ సూత్ర, కోహినూర్, నిరోద్ పాకెట్ లు చూసి తనలో తాను నవ్వుకొంటూ చేతి వాచీ వైపు చూసాడు ఇంకా 10 ని. ఉంది 7 కు అక్కడే కాలిగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఛాయ్ కు ఆర్డర్ ఇచ్చాడు..... ఓ అయిదు నిమిషాల్లో టీ తెచ్చి పెడ్తూ....
" సాబ్, వేడి వేడి సమోసాలు "? అడిగాడు
" ఛాయ్ బస్...." గోవింద్
" జిలేబీ ...?" అడిగాడు వేటర్
చేత్తో వద్దన్నట్టుగా సైగా చేసాడు ఛాయ్ ఒక సిప్ తాగుతూ షాప్ లోపలివైపుకు దృష్టి సారించాడు వెనుక వైపు చిన్న చిన్న క్యాబిన్లు
ప్రైవసీ లో ఫోన్ చేసుకోడానికి...... ఇలాంటి షాపులు కొత్త కాదు హైవేపై ఇలాంటి దుకాణాలు మామూలే.... కాని ఈ షాప్ కాస్త స్పెషల్ గా ఉంది..... ముఖ్యంగా ప్రవాసి జనతా కొరకు తెరిచినట్టు ఉంది.... ముఖ్యంగా ఫోన్ బూత్.... క్యాష్ కౌంటర్ పై ఓ పక్కన 6,7 ఫోన్లు ఉన్నవి వాటిి extension ఫోన్లే క్యాబిన్ లలో ఫిట్ చేసారు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మీరు ఇక్కడ నుండి ఫోన్ చెయ్యడమే కాదు కాల్ రిసీవ్ కూడా చేసుకోవచ్చు..... నెల నెలా
ఒక చిన్న అమౌంట్ రెంట్ లా ఇస్తే మీకు ఆ ఉన్న 6,7 ఫొన్ నెంబర్ లలో ఒక నెంబర్ ఇవ్వబడుతుంది.... దాన్ని సొంత నెంబర్ లా వాడుకోవచ్చు.... ముఖ్యంగా వలసకూలీలు, కార్మికులు ఉన్న ఆ ఏరియాలో చాలా హిట్ అయ్యింది ఈ పద్దతి ........ ఇంటి నుండి అత్యవసర సందేశాలు అందుకోడానికి వీలుగా
గోవింద్ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఒక స్త్రీ శబ్దం కౌంటర్ వెనుకాల నుండి
" అరే పాండే ,నీ రూమ్ దగ్గరున్న మిశ్రాకు చెప్పు
వాడి ఇంటి నుండి ఫొన్ వచ్చింది మల్లి 9 గం . లకు కాల్ చేస్తామన్నారు....... రమ్మని చెప్పు" కౌంటర్ లో కూర్చున్న స్త్రీ ఒక కస్టమర్ తో చెప్పడం విన్నాడు అదే సమయం మరో కస్టమర్ తో "ఓయ్ లల్లన్ తెరా నంబర్ లాగా ...
తిస్రే నెంబర్ మే లేనా "
" జీ...." అంటూ ఒకతను లేచి వెనుక ఉన్న బూత్ ల వైపు వెల్లడం చూసాడు
గోవింద్ మళ్ళీ తన వాచ్ వైపు దృష్టి తిప్పాడు
సరిగ్గా 7 ......
అప్పుడే కౌంటర్ పైన ఉన్న ఫోన్ల లో రెండు ఫోన్లు ఒకే సారి మోగడం మొదలు పెట్టాయి
గోవింద్ కాస్త టెన్స్ అయ్యాడు ఆ స్త్రీ ఒక ఫోన్
హోల్డ్ లో పెట్టి మరో ఫోన్ లో మాట్లాడం మొదలు పెట్టింది .... కాసేపు విన్న తరువాత
" ఫజలుర్ రెహమాన్ ఉన్నాడా ఇక్కడ ...... ఫజలుర్ రెహమాన్.... " కస్టమర్ ల వైపు చూస్తూ అడిగింది
"ఆ.... ఇక్కడ....నేను ... అంటు లేచాడు గోవింద్
" వెనుక 4వ నెంబర్ లో " అంది
గోవింద్ గుండె దఢ పెరిగింది..... వెల్లి రిసీవర్
లేపి చెవి లో పెట్టాడు
" హాల్లో గోవింద్ ఉర్ఫ్ ఫజలుర్ రెహమాన్
నాకు తెలుసు నివ్వు వస్తావని..... అయినా రాక ఏం చేస్తావు......" అవతల నుండి వినపడింది
"ఎవరు మాట్లాడేది తెలుసుకోవచ్చా....? ఈ ప్రశ్నకు జవాబు దొరకదు అని తెలుసు అయినా అడిగాడు గోవింద్
" మ్మ్ ...మ్మ్ ....మ్మ్ ... ముందు నీ పేరు చెప్పు
ఏ పేరుతో పిలవాలి నిన్ను ..... చాలా చాలా కష్టపడ్డావు....... తిమ్మిని బమ్మి చేసావు..... ఫజలూర్ రెహమాన్ నుండి గోవింద్ అయ్యావు.... ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసావు.... అయినా ఎం లాభం ....... నీ ప్లాన్ మొత్తం నీల్ల పాలు అయ్యింది..... నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది ...." అవతలి వైపు నుండి మాట్లాడడం ఆపాడు
" ఎవరు నివ్వు.... ఏం కావాలి నీకు" అడిగాడు గోవింద్ మల్లీ
" వెరీ గుడ్...... మంచి ప్రశ్న.... నేను చెప్పేది జాగ్రతగా విను..... 5 లక్షలు ....అన్ని 100 రూ. నోట్లు ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేసి తీసుకొనిరా ... 3 రోజులు సమయం ఉంది నీ దగ్గర అంటే అర్థం......ఈ రోజు బుధవారం ....
ఉమ్... ఉమ్.... శని వారం ఈ టైం కు ఇక్కడే కలుద్దాం..."
" హలో....హలో.... ఈ మూడు రోజుల్లో 5 లక్షలు ఆరెంజ్ చెయ్యడం కష్టం అదికూడా.....100 రూ. నోట్లు అంటే కష్టం.... 500 ల నోట్లు అయితే....." గోవింద్ మధ్య లో ఆపాడు
" 500ల నోట్లు.... ఉమ్ .... నీ దొంగ నోట్లు నా తలకు అంట కట్టడానికా నీ ప్లాన్ ..... మరోసారి జాగ్రతగా విను శనివారం 7గం. లకి....5లక్షలు 100రూ. నోట్లలో.... ఇక్కడ..... ఏమైనా అటు ఇటు అయితే..... మరుసటి రోజు పేపర్లో పాకిస్తానీ టెర్రరిస్ట్ ఎన్ కౌంటర్ అనే వార్త చదివే భాగ్యం నీకు ఉండదు...."
" హాల్లో... హలో ..." గోవింద్ మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు కాని ఫోన్ కట్ అయ్యింది డయల్ టోన్ మాత్రం వినపడసాగింది
గోవింద్ కౌంటర్ లో డబ్బులు కట్టి అక్కడ నుండి బయట పడ్డాడు...... తల నిండా ఆలోచనలు
ఈ ఊబి లో నుండి ఎలా బయట పడాలి.... బ్లాక్ మెయిలర్ కు ఒక సారి తలవంచితే ఇంకా అంతే సంగతి..... జలగలా పట్టుకొంటారు.....
అందులో వీడు పోలిస్ వాడి లా ఉన్నాడు వాడి మాటల్లో ఆ అనుమానం వచ్చింది..... తను ఇంటి కి వెళ్లే లోపు ఒక తీర్మానానికి వచ్చాడు..... శని వారం 7 గం లకు డబ్బు ఇవ్వకపోతే ఆది వారం న్యూస్ లో ఎన్ కౌంటర్ వార్త ఉంటుందా లేక క్యాపిటల్ సిటీ లో బాంబ్ బ్లాస్ట్ అనే వార్త ఉంటుందా చూడాలి.....

mm గిరీశం