Poll: Did you vote for the elections??
You do not have permission to vote in this poll.
Yes
66.67%
2 66.67%
No
33.33%
1 33.33%
Total 3 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Did you vote for the election?? Yes/No
#2
how about you ?

we should include our own choice when we start a poll or when we ask for opinions ...

Eenaadu Wrote:114ఏళ్ల అమ్మ.. 90ఏళ్ల కూతురు ఓటేశారు
జోధ్‌పూర్‌: ‘ఓటు అంటే హక్కు మాత్రమే కాదు బాధ్యత’ వందేళ్లయినా ఆ బాధ్యతను మాత్రం మర్చిపోమని నిరూపిస్తున్నారు బామ్మ-తాతలు.
నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ సహాయకులతో వచ్చి ఓటు వేస్తూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో
114ఏళ్ల అవ్వ.. 90ఏళ్ల కూతురితో వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.


[Image: 0450180712BRRKK118A.JPG]

బర్కత్‌ఉల్లాఖాన్‌ స్టేడియంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో 114ఏళ్ల డాఖాదేవి, కుమార్తె బిర్మీదేవితో వచ్చి ఓటు వేశారు. నడిచే పరిస్థితిలో
లేని వీరిని వాలెంటీర్లు చేతులపై ఎత్తుకుని పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చారు. అనంతరం వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరే కాదు..
బర్మేల్‌లో 101ఏళ్ల పాలిదేవి నడుచుకుంటూ వచ్చి ఓటేశారు.
బుండీ జిల్లాలో 102ఏళ్ల కిస్నీబాయి కర్ర సాయంతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మైళ్లకు మైళ్లు నడుచుకుంటూ వచ్చి..
ఇక రాజస్థాన్‌లోని సరిహద్దు జిల్లాలైన బర్మేర్‌, జైసల్మేర్‌లలో ప్రజలు మైళ్లకు మైళ్లు ఎడారి ప్రాంతం గుండా నడుచుకుంటూ వచ్చి ఓటుహక్కు
వినియోగించుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఎడారిలో ఓ నడవాల్సిందే.
అయినా సరే ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటు వేస్తున్నారు.


[Image: 0450130712BRRKK118B.JPG]

హైదరాబాద్‌: ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్‌ మహానగరంలో చదువుకుంటున్న యువత, పలువురు ఉద్యోగస్తులు
సొంత ఊళ్లకు పయనమైన సంగతి తెలిసిందే. కాగా, తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఏకంగా అమెరికా
నుంచి నగరానికి వచ్చారు. సీతాఫల్‌మండికి చెందిన సత్య ప్రకాష్ వృత్తిరీత్యా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సొంత రాష్ట్రం
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయాలని సంకల్పంతో అమెరికా నుంచి వచ్చి తన విలువైన ఓటును వినియోగించుకున్నారు.

అలాగే సరితగౌడ్ అనే యువతి కూడా దక్షిణాఫ్రికా నుంచి సికింద్రాబాద్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేయడం కోసమే నగరానికి వచ్చిన వీరి గురించి పోలింగ్‌ కేంద్రాల వద్ద తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


[Image: 032134BRK-NRI1.JPG]

నాలుగు తరాల చైతన్యం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ నియోజకవర్గం పరిధిలోని పద్మశాలినగర్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నాలుగు
తరాల కుటుంబం సిద్ధమైంది. వరం రాములమ్మ(88), ఆమె కుమార్తె బొల్లా వెంకటమ్మ(67), మనుమరాలు నవనీత(44),
మునిమనుమరాలు లావణ్య (23) ఓటు వేయనున్నారు.


[Image: 6hyd-state6a.jpg]
Like Reply


Messages In This Thread
RE: Did you vote for the election?? Yes/No - by ~rp - 08-12-2018, 10:20 AM



Users browsing this thread: 1 Guest(s)